ఎండా, వాన ఏదో ఒకటి ఎక్కువలో ఎక్కువై, ఎలా తలదాచుకోవాలో తెలీనప్పుడు
మనకోసమని నేలతల్లి తెరిచి ఉంచిన పచ్చని గొడుగులే చుట్టూ ఉన్న చెట్లన్నీ!
తరతరాల జ్ఞాపకాలనీ, అనుభవాలనీ మొదట్లో దాచేసుకుని గలగలమంటూ ఆకులూ,
పువ్వులూ, పళ్ళతో పలకరిస్తుంటుంది.. కురవకుండా మారాం చేసే మబ్బుల్ని
బుజ్జగించడానికన్నట్టు గాలి తెరలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంటాయి!
రోజూ వచ్చి వెళ్ళే దారిలో మరెన్నో నేస్తాలయి కూర్చుంటాయి.. దగ్గరకి
వెళ్ళీ వెళ్ళగానే కొన్ని భళ్ళున నవ్వుకుంటూ, ఇంకొన్ని చిరునవ్వులతోనూ పూలో
ఆకులో జల్లుతాయి.
ఏదో పనిమీద బయట ఊరికెళ్ళి, తిరిగొచ్చినప్పుడు వీధి మొదట్లోనో, గేటు ఎదురుగానో ఉండే చెట్టు కనిపించకపోతే!?!?
కాల్చేసే ఎండల్నీ, కొరికి నమిలేసే చలినీ, ఈదురుగాలుల్నీ గుంభనంగా
భరించి, మనకి మాత్రం విరామం, శాంతి మాత్రమే చూపించే చెట్లు మనిషి ముందు
పూర్తిగా తలవంచుతాయి.. ఎదుర్కోలేని నిస్సహాయతతో స్థాణువై మిగిలిపోతాయి!
ఎప్పటికప్పుడు ఆకుల్ని, పువ్వుల్నీ నేలతల్లికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నా నిలువ నీడ ఇవ్వనందుకు విస్తుపోతుంటాయి.
ఎక్కడో చదివాను, ప్రముఖ నగరంలో ప్రముఖ ప్రభుత్వాధికారి చెప్పిన మాటలు… ‘ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటండి ‘ అని!
చెట్లూ, చేమలూ నరికి నగరాలు నిర్మించి… ఇప్పుడు చెట్లు నాటడానికి స్థలం వెదకడం…… ఐరానిక్ కదా!!
పచ్చని క్షణాలు
అలసిపోయిన తెల్లని గద్ద కిందకి దిగుతూ
కొండలకి చెప్తూ ఉంటుంది
ఒకనాటి చెట్లకి సంబంధించిన గడచిపోయిన కొన్ని కధలని!
అక్కడొక పొడవాటి దేవదారు చెట్టు ఉండేది, ఒకప్పుడు
అది మబ్బులని చుట్టి ఆకులకి తలపాగా పెట్టేది
లేదంటే వాటిని శాలువాలా చుట్టూ కప్పుకునేది
గాలిని పట్టి ఆపి,
అప్పుడప్పుడూ ఊగుతూ, ఆ తెరలతో చెప్పేది,
‘నా కాళ్ళు వేళ్ళల్లో బంధించబడి ఉండకపోతే, నేనూ నీతోనే వచ్చేసేదాన్ని!’
ఆపక్కన కీకర్ చెట్టుకి అవతలే రోజ్‌వుడ్ చెట్టు ఉండేది
ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉండేవి ఆ రెండూనూ!
ఆసలు సంగతేంటంటే.. కీకర్ కి ఈర్ష్య, రోజ్‌వుడ్ పొడవు చూసి!
రోజ్‌వుడ్ ఆకులగుండా గాలి ఈలలు వేసినప్పుడల్లా
కొమ్మలమీద కూర్చున్న పక్షులన్నీ అనుకరించేవి!
అక్కడ ఒక మామిడి చెట్టు కూడా ఉండేది
దాని దగ్గరకి ఒక కోయిల ఎన్నాళ్ళనించో వస్తూ ఉండేది,
మామిడిపూత కాలం వస్తూనే!
దగ్గర్లోనే కొన్ని గుల్మొహర్ చెట్లు కూడా ఉండేవి, వాటిలో ఒక్కటే ఇప్పుడు మిగిలింది
అది తన శరీరంపైన చెక్కబడిన పేరుల బాధని సహిస్తూ నించుని ఉంటుంది!
అక్కడే ఉండేది వేపచెట్టు కూడా
వెన్నెలతో అసాంతం ప్రేమలో మునిగి..
అ మత్తులో దాని ఆకులన్నీ నీలమై మిగిలేవి!
కాస్తంత దూరం వెళ్ళగానే, ఆ పక్క కొండ మీద
బోల్డన్ని పొదలు ఉండేవి, బరువాటి గుసగుసల శ్వాస తీసుకుంటూ
కానీ, ఇప్పుడొక్కటి కూడా కనిపించండం లేదు, ఆ కొండ మీద!
ఎప్పుడూ చూడలేదు కానీ, అందరూ చెప్పుకుంటుంటారు,ఆ లోయ ఆత్మీయతని అంటిపెట్టుకుని
పెద్ద మర్రిచెట్టుని మించిన చంపా చెట్టు ఒకటి ఉండేది
పెద్ద మర్రిచెట్టుని మించిన చంపా చెట్టు ఒకటి ఉండేది
ఎక్కడ గాటు పెట్టినా, అక్కడనించి పాలవంటిది ఏదో స్రవిస్తూ వుండేది
ఎన్నో ముక్కలుగా మారిపోయి పాపం అది ఆ అడవినించి తరలిపోయింది!
ఆ తెల్లటి గద్ద మోడై మిగిలిన చెట్టు మీద కూర్చుని
కొండలకి చెప్తూ ఉంటుంది
ఒకనాటి చెట్లకి సంబంధించిన గడచిపోయిన కొన్ని కధలని!
ఈ తెలివితక్కువ మనిషి
నరికి, కూల్చి, ముక్కలుగా మార్చి, కాల్చి వేసిన చెట్ల గురించి చెప్తూ ఉంటుంది!
Sabz Lamhe
Safedi cheel jab thak kar kabhi niche utarti hain
Pahado ko sunati hai
Purani dastaan pichle pedo ki!
Wahan deodar ka ek unche kad ka, pedh tha pehle
Woh badal baandh leta tha kabhi pagdhi ki surat apne patto par
Kabhi doshale ki surat usi ko ordh leta tha~
Hawa ki tham ke bahe~
Kabhi jab jhumta tha, use kehta tha,
Mere pao agar jakrhe nahi hote, mein tere saath hi chalta!
Udhar sheesham tha, kikar se kuch aage
Bahut larhte the woh dono~
Magar sach hai ki kikar uske uche kad se jalta tha~
Surili sitiyan bajti thai jab sheesham ke patto mein,
Parinde beth kar shaakhon pe, uski nakle karte the
Wahan ek aam bhi tha,
Jis par ek koyal kahi barso tak aati rahi~
Jab bor aata tha.
Udhar do teen the jo gulmohar, ab tak baki hai,
Woh apne jism par khode hue namo ko hi sehlata rehta hai
Udhar ek neem tha
Jo chandini se ishq karta tha
Nashe mein nili padh jati thi saari pattiyan uski.
Zara aur us taraf parli pahadi par,
Bahut se jhadh the jo lambi-lambi saanse lete the,
Magar ab ek bhi dikhta nahi hai, us pahadhi par.
Kabhi dekha nahin, sunte hai, us waadi ke daman mein,
Bade barghad ke ghere se badi ek champa rehti thi,
Jahan se kaat le koyi, wahi se dudh behta tha,
Kayi tukdho mein bechari gayi thi apne jungle se!
Safeda cheel ek sukhe huye se pedh par bethi
Pahadho ko sunati hai purani dastane unche pedho ki
Jinhe in past-kand insaan ne kaanta hai, giraya hai,
Kai tukde kiye hai aur jalaya hai!
మొదటి ప్రచురణ సారంగలో...
1 comment:
Nice website...
gallery
Post a Comment