మనం ఎక్కిన రైలో బస్సో ఇంకోటో మధ్యలో ఏవో
తెలీని అవాంతరాల వల్ల దారి తప్పి, ఊరు కాని ఊళ్ళన్నీ దాటుకుంటూ, మనం
వెళ్ళాల్సిన ఊరి నించి మాత్రం దూరంగా.. బహుదూరంగా వెళ్ళి ఆగిపోతే!
అక్కడ నించి మనం కొన్ని పగళ్ళూ, ఇంకొన్ని సాయంత్రాలూ, మరికొన్ని చీకట్లనీ తోడు తీసుకుని ఇంకొంచెం తప్పిపోతే!
అక్కడ నించి మనం కొన్ని పగళ్ళూ, ఇంకొన్ని సాయంత్రాలూ, మరికొన్ని చీకట్లనీ తోడు తీసుకుని ఇంకొంచెం తప్పిపోతే!
నీతోనో, తనతోనో లేక మరెవరితోనో కాదు నాతో కలిసి నేను వెళ్ళిపోగలిగితే!
ఆమధ్యెప్పుడో వారాల తరబడి ప్లాన్ చేసి వెళ్లిన పిక్నిక్‌లో, రోజూల
తరబడి వేసిన బడ్జెట్ డబ్బులతో కొన్న హెల్తీ స్నాక్స్ తింటూ, గోముగా
పలకరిస్తున్న తేమ గాలిని విసుక్కుంటూ, వెల్ మేడ్ హెయిర్ కి అదెంత హానికరమో
నొక్కి వక్కాణిస్తూ అందరూ తమ తమ జీవితాల్లో బాగా ఎంజాయ్ చేసిన
సమయాల గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు…
తెలీకుండానే ఉత్సాహంగా ముందుకు వంగి, బుగ్గ కింద చేయి పెట్టుకుని వింటున్నానా..
పరిగెత్తిన మారధాన్‌లూ, వెళ్ళిన లాంగ్ డ్రైవ్ లూ, ఇంకాస్త
వెనక్కెళ్ళి చిన్నప్పుడు కొట్టేసిన పెన్నులూ, పట్టేసిన ఫస్ట్‌డే ఫస్ట్ షో
టికెట్‌లూ!
సంతోషానికి డెఫినిషన్లు మారుతుంటాయి! తెల్సిన విషయమే మళ్ళీ కొత్తగా గుర్తొచ్చింది!!
సమయాన్ని గంటల్లో కాదు మైళ్ళల్లో కొలుచుకుంటానని హఠాత్తుగా
ఉద్యోగానికి రిజైన్ చేసి, మూడునెలల పాటు హైకింగ్ చేయడానికి వెళ్ళిన ఒక
స్నేహితుడు గురొచ్చాడు… కావాలని అడవుల్లో తప్పిపోయిన ‘వనవాసి ‘ రాహుల్
సాంకృత్యన్ కూడా మనసులో మెదిలాడు! అఫ్‌కోర్స్, చిన్నవాళ్ళే.. ఏ బాధ్యతలూ
లేనివాళ్ళే! కానీ ముందు ముందు జీవితంలో ఇలాంటి ఎన్నెన్ని పిక్నిక్‌ల్లోనో,
బాన్‌పైర్ చుట్టూనో వాళ్ళు వాళ్ళ కోసం గడిపిన సమయాలకి జీవం వస్తుంది..
అనుభవాలు కధలుగా మారతాయి!
ప్రతీ ఉదయం మనకి పాకెట్ మనీగా ఒక ఖాళీ దినాన్ని ఇస్తుంది సరే..
బ్రతుకు చక్రానికి పాజ్ ఇచ్చి, ఒకింత నిర్లక్ష్యంగా.. బోల్డంత ఇష్టంగా కుకీ
కటర్ జీవితం నించి పారిపోగలిగిన ధైర్యాన్ని కూడా కొసరుగా
ఇవ్వగలిగితేనో………..
చేతి ఖర్చు
మొత్తం పగలంతా నాకు చేతి ఖర్చుగా ప్రతిరోజూ దొరుకుతుంది
కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని చేజిక్కించుకుంటారు..
నానించి దూరంగా లాక్కెళ్ళిపోతారు!
ఒక్కోసారి జేబులోంచి అది పడిపోతుంది..
జారిపడిన శబ్దమైనా నాకు వినిపించకుండానే!
ఎప్పుడైనా ఒక మంచిరోజు పలకరించినా సరే
మరపుతో అదొక చెడు దినమే అనేసుకుంటాను.
ఇంకొన్నిసార్లు అయితే..
కొంతమంది చొక్కా పట్టుకుని మరీ ఆరోజుని కైవశం చేసుకుంటారు
‘తరతరాలకి సొంతమైన బకాయి ఇది..
నీ వంతు వాయిదాలు చెల్లించక తప్పదంటారు!’
మరికొందరేమో
బలవంతంగా తాకట్టు పెట్టుకుంటూ దయగా చెప్తారు,
‘కాసిన్ని క్షణాలు వాడుకో
కానీ మిగిలినదంతా తర్వాత జీవితానికి జమ వేయక తప్పదు..
అవసరమైనప్పుడల్లా ఖాతా లెక్కలు సరిచూడక తప్పదు!’
నాకొక ప్రగాఢ వాంఛ
ఒక మొత్తం పగలుని కేవలం నాకోసమే ఉంచేసుకోవాలని
ఆసాంతంగా నీతోనే ఖర్చు చేయాలని!
కేవలం అదొక్కటే నా నిజమైన కోరిక!
మూలం:
Kharchii
Kharchii
Mujhe kharchi mein pura din, har roz milta hai
Magar har roz koi cheen leta hai, jhapat leta hai, anti se!
Kabhi khise se gir padhta hai toh girne ki aahat bhi nahi hoti,
Khare din ko bhi mein khota samajh ke bhool jata hu!
Gireban se pakad ke mangane wale bhi milte hai!
‘Teri guzhri hui pushto ka karza hai,
Tujhe kiste chukani hai~’
Zabardast koi girvi bhi rakh leta hai, yeh keh kar,
Abhi do-char lamhe karch karne ke liye rakh le,
Bakaya umr ke khate mein likh dete hai,
Jab hoga, hisaab hoga
Badi hasrat hai pura ek din ek baar mein apne liye rakh lu,
Tumhare saath pura ek din bas kharch karne ki tamanna hai!
మొదటి ప్రచురణ సారంగలో...
Magar har roz koi cheen leta hai, jhapat leta hai, anti se!
Kabhi khise se gir padhta hai toh girne ki aahat bhi nahi hoti,
Khare din ko bhi mein khota samajh ke bhool jata hu!
Gireban se pakad ke mangane wale bhi milte hai!
‘Teri guzhri hui pushto ka karza hai,
Tujhe kiste chukani hai~’
Zabardast koi girvi bhi rakh leta hai, yeh keh kar,
Abhi do-char lamhe karch karne ke liye rakh le,
Bakaya umr ke khate mein likh dete hai,
Jab hoga, hisaab hoga
Badi hasrat hai pura ek din ek baar mein apne liye rakh lu,
Tumhare saath pura ek din bas kharch karne ki tamanna hai!
మొదటి ప్రచురణ సారంగలో...
No comments:
Post a Comment