ప్రపంచానికి సంబంధించి సమయం మాత్రం
నిరంతరం కదిలెళ్ళిపోతూ ఉంటుంది. మనమే సంవత్సరాల తరబడీ ఒకేచోట ఆగిపోతాం!
మరచిపోయో, అనుకోకుండానో కాదు.. కావాలనే ఒకే దారి గుండా పదే పదే
వెళ్తుంటాం.
ఏదో ఒక రోజు అధాటుగా తల ఎత్తగానే ఎదురుగా తను చూస్తుంటుందని, మనల్ని చూసిన సంతోషంతో ఎప్పట్లానే ఒక్కసారి రెప్పలార్పి, నవ్వుతో పలకరిస్తుందని… సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత, తడి పెదవుల గుండా వచ్చే ఆ నాలుగైదు మాటల కోసం ఎటూ వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ అదే దారిలో వెళ్తుంటాం!
ఒకటే ఆశ… ఆ దారిలో ఉన్న ఎర్రపూల చెట్టుకీ, గోపి రంగు డాబా ఇంటి అరుగులకీ, వీధి పేరున్న బోర్డుకీ, ఇంకా ఈ కవితలో చెప్పినట్టు దీపం స్థంభానికీ తన రాకపోకల సమయాలు, క్షేమ సమాచారాలు ఖచ్చితంగా తెలిసే ఉంటాయని! వేల నిరీక్షణల తర్వాత అయినా కాస్తంత దయ తలచి అవి తన గురించి చెప్పేస్తాయనే ఆశ!!
ఇది అతి మామూలుగా చెప్పబడిన కవిత… కానీ, ఆఖరి లైన్ పూర్తి చేస్తూనే హఠాత్తుగా ఒక ముల్లు కాలిలో చివుక్కున దిగబడిన బాధ… ఆపైన కాస్త నిస్సత్తువ… ఒక సుదీర్ఘ నిట్టూర్పు.. అన్నీ కలిపి మనల్ని కూడా మనం వదిలేసిన, వదిలేయాలనుకున్న దారుల్లోకి లాక్కెళ్తాయి!
ఆ కనీకనిపించనట్టుండే వీధి,
ఇంకా అక్కడ మలుపులో ఆవులిస్తున్నట్టుండే
ఒక పాత దీప స్తంభం,
దాని కిందనే ఒక రాత్రంతా తన కోసం ఎదురుచూసీ చూసీ
తన ఊరిని వదిలి వచ్చేశాను!
చాలా వెలవెలబోతున్న కాంతి ఊతాన్ని ఆనుకుని,
ఆ దీపస్థంభం ఇంకా అక్కడే ఉంది!
అదొక పిచ్చితనమే, కానీ నేను ఆ స్థంభం దగ్గరికి వెళ్ళి,
ఆ వీధిలో వాళ్ళ చూపుల్నించి తప్పించుకుంటూ
అడిగాను, ఇవ్వాళ కూడా, ఏమంటే..
‘తను నే వెళ్ళిపోయాక కానీ రాలేదు కదా!?
చెప్పు, వచ్చిందా తను?’
మూలం:
Vahii gali thi
Main rozgaar ke silsile mein,
kabhi kabhi uske shaher jata hoon to guzarta hu us gali se
Wo neem-tariq si gali,
Aur usi ke nukkad pe uundhtaa-saa
purana sa ik roshanii ka khambha,
usii ke niiche tamam shab intezaar karke,
main chod aaya tha shaher uska!
Bahut hi khastha-sii roshni ko teke,
wo khambha aaj bhi wahi khada hai!
fatuur hai yah, magar main khambhe ke paas jaa kar,
nazar bachaake mohalle walon kii,
puuch letaa hoon aaj bhi ye –
wo mere jaane k bad bhii, aayi to nahi thi?
wo aayi thi kyaa?
మొదటి ప్రచురణ సారంగలో

అదే వీధి
నా వ్యాపారపు పనుల మీద అప్పుడప్పుడూ తన ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆ వీధి గుండా వెళ్తుంటానుఆ కనీకనిపించనట్టుండే వీధి,
ఇంకా అక్కడ మలుపులో ఆవులిస్తున్నట్టుండే
ఒక పాత దీప స్తంభం,
దాని కిందనే ఒక రాత్రంతా తన కోసం ఎదురుచూసీ చూసీ
తన ఊరిని వదిలి వచ్చేశాను!
చాలా వెలవెలబోతున్న కాంతి ఊతాన్ని ఆనుకుని,
ఆ దీపస్థంభం ఇంకా అక్కడే ఉంది!
అదొక పిచ్చితనమే, కానీ నేను ఆ స్థంభం దగ్గరికి వెళ్ళి,
ఆ వీధిలో వాళ్ళ చూపుల్నించి తప్పించుకుంటూ
అడిగాను, ఇవ్వాళ కూడా, ఏమంటే..
‘తను నే వెళ్ళిపోయాక కానీ రాలేదు కదా!?
చెప్పు, వచ్చిందా తను?’
మూలం:
Vahii gali thi
Main rozgaar ke silsile mein,
kabhi kabhi uske shaher jata hoon to guzarta hu us gali se
Wo neem-tariq si gali,
Aur usi ke nukkad pe uundhtaa-saa
purana sa ik roshanii ka khambha,
usii ke niiche tamam shab intezaar karke,
main chod aaya tha shaher uska!
Bahut hi khastha-sii roshni ko teke,
wo khambha aaj bhi wahi khada hai!
fatuur hai yah, magar main khambhe ke paas jaa kar,
nazar bachaake mohalle walon kii,
puuch letaa hoon aaj bhi ye –
wo mere jaane k bad bhii, aayi to nahi thi?
wo aayi thi kyaa?
మొదటి ప్రచురణ సారంగలో
No comments:
Post a Comment