మనం ఒక విషయాన్ని మనస్పూర్తిగా నమ్ముతాం.. ఆ నమ్మకం మీదే మన
జీవితంలో చాలా ముఖ్యమైన పనులవ్వనీ, మన ఆలోచనలవ్వనీ తెలీకుండానే
ఆధారపడిఉంటాయి.. అది దేవుడవ్వచ్చు.. స్నేహమవ్వచ్చు.. ఇంకేదైనా అవ్వొచ్చు..
ఉన్నట్టుండి, ఏదో సంఘటన జరుగుతుంది! ఆ నమ్మకానికి చిన్న బీట పడుతుంది.. ఇక
రాత్రీ పగలూ.. ఏ పని చేస్తున్నా చేయకున్నా మనసు అదే ఆలోచిస్తూ ఉంటుంది..
'అసలు ఆ విషయాన్ని ఇంతలా నమ్మకుండా ఉండాల్సిందేమో! దానివల్ల చివరికి నాకు
మిగిలేది బాధేనేమో' అనే సందిగ్ధమో.. ఆందోళనో.. కుదురుగా ఉండనివ్వదు!
అలాంటిదే నాకు మొన్న శంకర్ గారి హఠాన్మరణంతో అనుభవమైంది! ఈ ఆన్లైన్
స్నేహాలు, ఆప్యాయతలూ ఏదో ఒకరోజుకి దుఃఖాన్ని మాత్రం మిగిలుస్తాయేమో అనే
భయం.. అంటే, ఎప్పుడూ ఇలా దురదృష్టకరమైన సంఘటనలే జరుగుతాయని కాదు.. కొంతమంది
అనుకోకుండా ఏవేవో వ్యక్తిగత కారణాల వల్ల కూడా కనబడటం మానేస్తారు..
ప్రతిరోజూ వాళ్ళ ఐడిలో ముఖాల్నీ, అక్షరాల్లో వాళ్ళ ముఖకవళికల్ని చూసీ..
చూసీ అలవాటైపోయి.. ఒకట్రెండు రోజులు కనబడకపోతేనే అదోలాంటి బెంగ
వచ్చేస్తుంది! అలాంటిది, ఇంకెప్పటికీ కనబడరంటే!!
నాకిది రెండో అనుభవం.. మొదటి వ్యక్తి విషయంలో అయితే ఇప్పటికీ అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు... అంతకుముందు రోజు సాయంత్రం వరకూ పాటలు పాడి, అల్లరి చేసిన మనిషి మరుసటిరోజు నించీ కంప్లీట్‌గా అదృశ్యం! ఐడి తప్ప ఏమీ తెలియని పరిస్థితిలో 'క్షేమంగా ఉంటే చాలు, భగవంతుడా!' అని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయస్థితి! ముఖ్యంగా, శంకర్ గారి 'పర్వాలేదు.. అస్సలు మొహమాట పడకండి.. ఏవేం పుస్తకాలు కావాలో చెప్పండి ' అన్న చివరి మాటలు తల్చుకుంటే ఇంకా బాధ.. ఇంకెవరు అడుగుతారు ఇలా అని! ఈ పరిచయాలు కలిగించే చిన్న చిన్న రోజువారీ సంతోషాల కంటే, అవి మిగిల్చే దీర్ఘకాలపు బాధని తలచుకుని కొంచెం దూరం జరగాలనిపించింది!
కానీ, ఆ బీటలు వారిన నమ్మకాన్ని అతికించే చిన్న సంఘటన...
నిన్న ఇంటికెళ్ళేసరికి, మా ఇంటాయన గారు ఒకింత ఆదుర్దానో, బాధో తెలీని ఒక మిక్స్డ్ ఎక్స్ప్రెషన్తో "నీకు మీ ఫ్రెండ్ నించి పుస్తకాలు వచ్చాయన్నారు!" ఆయన ఉద్దేశ్యంలో అవి శంకర్ గారు పంపారని.. ఎందుకంటే తనకి తెలిసీ నేను రీసెంట్గా పుస్తకాల గురించి మాట్లాడింది శంకర్ గారితోనే! అది అసంభవం అని మనసుకి తెలుస్తున్నా గభాల్న వెళ్ళి లేబుల్ చూశాను...ఎదురుగా, Sravya V. అని కనబడుతోంది! అసలు ఆ అమ్మాయే కళ్ళముందు నించున్నట్టు అనిపించేసి ఆ ప్యాకేజ్ నే హగ్ చేశేసుకున్నా.. అబ్బే, ఇది అతి అస్సలు కానే కాదు.. ఇలాంటి ఎక్సైట్మెంట్ అనుభవించిన వాళ్లకే నేను చెప్పేది అర్ధం అవుతుంది!! కలలో, ఇలలో, ఏ లోకాలలోనూ ఊహించలేదు ఇలా అడగకుండానే నాకెంతో ఇష్టమైన బహుమతిని, అదీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు బహుమతుల్ని ఇచ్చేవాళ్ళు ఉంటారని.. ఎగైన్, అ..డ..గ..కుం..డా..నే!!!!!!!!!
నీలాకాశాన్ని
కప్పేసినందుకు కారుమబ్బుల్ని తిట్టుకుంటుంటే గుత్తులు గుత్తులుగా మోదుగపూలు
ఫక్కున నవ్వినట్టు...
ఒక రంగు మాయమైతేనేం! ఇంకో రంగు మనసుని తడుముతోంది!!
ఈఅమ్మాయితో నా ములాఖాత్ సాయంకాలం నీరెండ లాంటిది! కలిసేది కాసేపే... కానీ ఆ కాస్తంతసేపూ నులివెచ్చని, మెత్తని స్పర్శ.. తన మాటల రూపంలో పలకరిస్తుంది.. ఆ కొద్దిసేపూ అల్లరీ..మెచ్చికోళ్ళూ.. పెద్దంతరం మీదేసేసుకుని జాగ్రత్తలూ.. దీవెనలూనూ! మాట్లాడిన ప్రతిసారీ, 'ఈ వయసులోనే ఎంత మెచ్యూరిటీ!' అని అనుకోకుండా ఉండలేను...
శ్రావ్యా, నా కళ్ళు తడి చేయడం సాధ్యమే.. అంత కష్టం కాదు.. కానీ.... నాతో నిన్న తీన్మార్ వేయించావు చూడూ... చాలా తక్కువ మందికి సాధ్యం అది! నీ అభిమానానికి ప్రతిగా ఏమి చెబుదామన్నా తేలిపోతోంది.. ఏ పదానికి సరైన అర్ధం గోచరించడం లేదు! ఇంత దూరం నుంచి ప్రస్తుతం ఒట్టి థాంక్యూ తప్ప ఏమీ చెప్పలేకున్నాను.. THANK YOU SO MUCH FOR YOUR LOVE AND AFFECTION! MAY GOD BLESS YOU WITH ALL THE HAPPINESS, Dear!
బాధ.. సంతోషం.. పక్కపక్కనే ఉంటాయి.. పరిస్థితిని బట్టి ఒకదాని నుంచి ఇంకోదానికి గ్రేస్‌ఫుల్‌గా మారుతుండటమే మనం చేయాల్సింది! ఈ చిన్న విషయాన్ని నీ ద్వారా తెలుసుకున్నాను, శ్రావ్యా! Love you!
----------------------
ఎలాగో పుస్తకాలు.. స్నేహితులూ గురించి మాట్లాడుతున్నా కాబట్టి.....నా పుస్తకదాతలందరినీ ఒకసారి తలచుకోవాలనుంది..........
ఆ మధ్యనెప్పుడో నా ప్రాణస్నేహితురాలు శ్వేత, "నీ దగ్గర ఏమన్నా పాత నవల్స్ ఉంటే చారిటీగా డొనేట్ చేస్తావా, మా ఊళ్ళో తెలుగు లైబ్రరీకి" అని అడిగితే నేను సెకనులో సగం కూడా ఆలోచించకుండా "అబ్బే, అలాంటి పనులు నేను చేయను, కావాలంటే డబ్బులిస్తా" అన్నా.. అసలు తన దగ్గరికి మూణ్ణెల్లకోసారి వెళ్ళినప్పుడల్లా లడ్డూలు, మురుకులు, వడియాలు..etc etc అచ్చు అమ్మ దగ్గర్నించి ఎలా తెచ్చుకుంటామో అలానే మూటలు మూటలు తెచ్చుకుంటా!! అలాంటిది తను నోరు తెరిచి అడగ్గానే నేను ఖరాఖండిగా "నో" చెప్పేశాను.. ఎంత చిరిగి శిధిలావస్థలో ఉన్నా, అవి ఎలాంటి రచయిత(త్రు)లవైనా నా పుస్తకాలంటే నాకు ప్రాణం.. పైగా ఇలా దూరాభారాన ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు టకీమని కొనుక్కునే అవకాశం లేకపోవడం వల్ల ఈ పుస్తకాల పీనాసితనం బాగా హైట్స్ లోకి వెళ్ళిపోయింది.. కానీ, నేను ఆడగకుండానే/అడగ్గానే కాదనకుండా... అదీ ఇక అచ్చులో దొరకని పుస్తకాలని నాకు పోస్ట్ లో పంపి మరీ నన్ను ఆనందాశ్చర్యాలకు గురిచేశేసారు కొందరు స్నేహితులు!!
రెండు సంవత్సరాల క్రితం నేను గొల్లపూడి గారి 'ఎర్రసీత ' గురించి విని, ఆ పుస్తకం కోసం అన్ని రకాలా ప్రయత్నించి, విసిగి ఇక ఆశ వదిలేసుకున్నప్పుడు అప్పటికి నాతో ఏమాత్రం పరిచయం లేని స్నేహితురాలు సుధ, కౌముది కాంతి గారి ద్వారా నా ప్రయాసని విని రెండు రోజుల్లో 'ఎర్రసీత ' ని నాకు పంపించారు! నాకైతే కృతజ్ఞతలు చెప్పడానిక్కూడా నోరు పెగలని పరిస్థితి!!
అప్పటికే రెండు మూడు అరుదైన పుస్తకాలని అచ్చంగా ఇచ్చేసి... నేను
స్వప్నరాగలీనని తెగ తలుస్తూ, తనని పరిచయంచేసుకునే వీలు నాకు లేదని
వాపోతుంటే "ఎన్నాళ్ళు చదువుతావో నీ ఇష్టం" అని 'అనుక్షణికం' దానం చేసిన కొత్తపాళీ గారి ధైర్యాన్ని
తల్చుకుంటే నాకు ఇప్పటికీ భలే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ప్రింట్ లో లేని ఆ నవలని ఏ నమ్మకంతో నాకు పంపించారా అని!!
ఆ తర్వాత, తన బ్లాగులో జానపద నవల గురించి చెప్తూ, మనసులో మాట సుజాత, "ఎవరికైనా కావాలంటే...." అని ఇంకా వాక్యం పూర్తి చేయనేలేదు నేను బెంచీ ఎక్కి మరీ చేతులెత్తినంతపని చేశాను.. తను వెంటనే దానితో పాటు ఇంకో రెండు మంచి పుస్తకాలు కూడా వచ్చాయనీ అవికూడా పంపిస్తాననీ ఈమెయిల్ ఇచ్చింది.. ఆ జానపద నవల రాకున్నా ఇంకా బోల్డంత ఇష్టమైన 'మిధునం' మాత్రం పదిలంగా పంపింది.. అసలు తనంటేనే పుస్తకాల అక్షయపాత్ర అని నా నమ్మకం!
అప్పట్లో బజ్జులోకి ప్రవేశించి హాయ్, హల్లో అంటూ నెమ్మదిగా మొహమాటంగా తిరుగుతుంటే ఎక్కడ్నించి వచ్చిందో గానీ ఈ అమ్మాయి పద్మ ఉండవల్లి, చెయ్యి పట్టుకుని గబగబా మొత్తం బజ్జులన్నీ తిప్పేసింది.. మరుసటిరోజు కుప్పిలి పద్మా, శీతవేళ రానీయకు అంటూ ఏదో బజ్ రాసింది.. "రచయిత్రి పేరు సరే ఈ పుస్తకమెప్పుడూ చదివినట్లు లేదు " అని అన్నానో లేక అనుకున్నానో తెలీదు కానీ మళ్ళీ నాలుగు రోజుల్లో ఆ పుస్తకం మా మెయిల్ బాక్స్ లో ఉంది! అసలు అప్పటికి తనకి నా పేరు తప్ప పింక్ చుడీదార్ ఫేసూ, బ్లూ స్వెటర్ నవ్వూ, మా టైం జోనూ ఇవేవీ తెలీవు..
ఆ తర్వాత, తన బ్లాగులో జానపద నవల గురించి చెప్తూ, మనసులో మాట సుజాత, "ఎవరికైనా కావాలంటే...." అని ఇంకా వాక్యం పూర్తి చేయనేలేదు నేను బెంచీ ఎక్కి మరీ చేతులెత్తినంతపని చేశాను.. తను వెంటనే దానితో పాటు ఇంకో రెండు మంచి పుస్తకాలు కూడా వచ్చాయనీ అవికూడా పంపిస్తాననీ ఈమెయిల్ ఇచ్చింది.. ఆ జానపద నవల రాకున్నా ఇంకా బోల్డంత ఇష్టమైన 'మిధునం' మాత్రం పదిలంగా పంపింది.. అసలు తనంటేనే పుస్తకాల అక్షయపాత్ర అని నా నమ్మకం!
అప్పట్లో బజ్జులోకి ప్రవేశించి హాయ్, హల్లో అంటూ నెమ్మదిగా మొహమాటంగా తిరుగుతుంటే ఎక్కడ్నించి వచ్చిందో గానీ ఈ అమ్మాయి పద్మ ఉండవల్లి, చెయ్యి పట్టుకుని గబగబా మొత్తం బజ్జులన్నీ తిప్పేసింది.. మరుసటిరోజు కుప్పిలి పద్మా, శీతవేళ రానీయకు అంటూ ఏదో బజ్ రాసింది.. "రచయిత్రి పేరు సరే ఈ పుస్తకమెప్పుడూ చదివినట్లు లేదు " అని అన్నానో లేక అనుకున్నానో తెలీదు కానీ మళ్ళీ నాలుగు రోజుల్లో ఆ పుస్తకం మా మెయిల్ బాక్స్ లో ఉంది! అసలు అప్పటికి తనకి నా పేరు తప్ప పింక్ చుడీదార్ ఫేసూ, బ్లూ స్వెటర్ నవ్వూ, మా టైం జోనూ ఇవేవీ తెలీవు..
e-copy లు పంచుకోవడానికి కంప్యూటర్ మెమరీ కాస్త ఎక్కువ ఉంటే
సరిపోతుంది కానీ ఇలా పుస్తకాలంటే ఇష్టం ఉండీ వాటిని వేరేవాళ్ళతో
పంచుకోవాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలో కదా అనిపిస్తుంది... అదీ ఒకే ఊరిలో
ఉండి పుస్తకాలు పంచుకోవడం వేరు.. కాస్తో కూస్తో భరోసా ఉంటుంది. దూరాల్లో
ఉన్న స్నేహితులకి పుస్తకాలు పంపాలంటే మాత్రం ఎంత నమ్మకం ఉండాలో!! మణులేలా
మాణిక్యాలేలా ఇలాంటి స్నేహితులు నలుగురైదుగురు ఉంటే చాలదా అనిపించకమానదు!
'శీతవేళ రానీయకు ' లో చదివిన కింది నాలుగు పంక్తులు అటూ ఇటూగా ఇలానే చెప్పాయి..
".......మన వెలుపల మనలాంటి మనుష్యుల కోసం, మన మనుష్యుల కోసం మనమెప్పుడూ వెతుకుతూ ఉంటాం.. మన భాష అర్ధమయ్యేవాళ్ళూ, మనతో మాట్లాడగలిగేవాళ్ళూ, మనం చెప్పకుండానే మనల్ని చదివేవాళ్ళూ, మనం చెప్పుకోగలిగేవాళ్ళూ, ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక స్పర్శతో మనకు ఉత్సాహం, ఉద్రేకం, ఉపశమనం పుట్టించేవాళ్ళు మనకెప్పుడూ కావాలి.. మనల్ని వాళ్ళలా మార్చుకోకుండా మనల్ని తమలోకి తీసుకోగలిగేవాళ్ళు, మనల్ని మనలా ఇష్టపడేవాళ్ళు కావాలి.. నిప్పుల వర్షంలో నడుస్తున్నప్పుడు కూడా ఎవరి స్ఫురణ మనల్ని చల్లగా చూస్తుందో వారి స్నేహం కావాలి.. అటుమటి మనుషులు మనకెంతగా కావాలంటే -- వాళ్ళు లేని మనం అరసున్నాలా అర్ధరహితంగా మిగిలిపోతాం....... "
'శీతవేళ రానీయకు ' లో చదివిన కింది నాలుగు పంక్తులు అటూ ఇటూగా ఇలానే చెప్పాయి..
".......మన వెలుపల మనలాంటి మనుష్యుల కోసం, మన మనుష్యుల కోసం మనమెప్పుడూ వెతుకుతూ ఉంటాం.. మన భాష అర్ధమయ్యేవాళ్ళూ, మనతో మాట్లాడగలిగేవాళ్ళూ, మనం చెప్పకుండానే మనల్ని చదివేవాళ్ళూ, మనం చెప్పుకోగలిగేవాళ్ళూ, ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక స్పర్శతో మనకు ఉత్సాహం, ఉద్రేకం, ఉపశమనం పుట్టించేవాళ్ళు మనకెప్పుడూ కావాలి.. మనల్ని వాళ్ళలా మార్చుకోకుండా మనల్ని తమలోకి తీసుకోగలిగేవాళ్ళు, మనల్ని మనలా ఇష్టపడేవాళ్ళు కావాలి.. నిప్పుల వర్షంలో నడుస్తున్నప్పుడు కూడా ఎవరి స్ఫురణ మనల్ని చల్లగా చూస్తుందో వారి స్నేహం కావాలి.. అటుమటి మనుషులు మనకెంతగా కావాలంటే -- వాళ్ళు లేని మనం అరసున్నాలా అర్ధరహితంగా మిగిలిపోతాం....... "
Thank you all.. Thank you so much!!
పుస్తక దాతా సుఖీభవ!!!
18 comments:
Nishi gaaru,
I'am a regular reader of your posts. I know you ( thru your writings) since long time from telugupeople days. Sometimes I get so lost in your poetry. your poetry and every word of yours is very amazing.words can not express the feeling I have after reading your poems. I have read each of your kavithalu many many times.
Sorry for irrelevant comment but your post made me write this.Even I felt the same when I heard about Shankar garu. though I'am regular reader of many blogs I hardly put a comment and now I'am thinking that I should express my feelings if I like the posts. Atleast, for few moments I can make others feel happy.
Thx
Surabhi
ఇలాంటప్పుడే అనిపిస్తుంది "మనం ఇంతకి నోచుకున్నామా" అని!
ఏం చెప్పమంటావ్ నిషీ? అసలు శంకర్ గారి విషయం జరగటానికి కొద్ది రోజుల ముందే, ఎందుకో అనిపించింది ఎవరి గురించీ ఏ చెడు వార్తలూ వినకముందే, ఇలా ఇక్కడ వేలాడే కన్నాఅందరినీ ఇలా వదిలేసి వెళిపోతే మంచిదేమో అని. కానీ మరీ ఇలా కలలో కూడా అనుకోనివి, జరుగుతాయని వింటామనీ ఊహించలేదు. నిజమే అలా ఎప్పుడో ఏదో జరుగుతుందని ఉన్న స్నేహబంధాలు వదిలించుకుపోలేము. జీవితం...
శ్రావ్యా, తన అభిమానం గురించి చెప్పడానికి, అందులో తడిసి మునకలేస్తున్న దాన్ని, నాకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది. :-) లవ్ యు శ్రావ్యా!
@@అసలు అప్పటికి తనకి నా పేరు తప్ప పింక్ చుడీదార్ ఫేసూ, బ్లూ స్వెటర్ నవ్వూ, మా టైం జోనూ ఇవేవీ తెలీవు..
అదొక్కటే చాలదూ? ఇంకేం తెలియాలేం? నీ పేరే నీ identity.
@@ మనలాంటి మనుష్యుల కోసం, మన మనుష్యుల కోసం మనమెప్పుడూ వెతుకుతూ ఉంటాం..
అది ఎప్పటికీ తీరని దాహం. ఒక నిరంతర అన్వేషణ. అలాంటివాళ్ళు దొరికిన కొద్దీ, ఆశతో ఆ దాహం ఇంకా పెరుతూనే ఉంటుంది కానీ తగ్గేది కాదు.
అబ్బ ఈ మాటలతో కట్టిపదేయటం ఎలాగో మీ దగ్గరే నేర్చుకోవాలి నిషి :-))
నాకు మీ సంతోషం చూస్తుంటే ఇంకా బోలెడు పుస్తకాలు పంపాలి అనిపిస్తుంది . నిజానికి మీరు చూపించే అభిమానం ముందు ఇలాంటి ఎన్ని గిఫ్ట్‌లు అయినా చిన్న బోవాల్సిందే తెలుసా ? పైగా మీరు గ్లూమీ మూడ్ లో ఉన్నప్పుడు దాని నుంచి బయట పడటానికి ఈ పుస్తకాలు హెల్ప్ చేసినందుకు నాకు మరింత సంతోషం గా ఉంది . తీన్ మార్ చేస్తున్న మిమ్మల్ని ఊహించుకుంటున్నాను లే :P
మీరు ఎప్పటికీ ఇలా బోలెడంత మంది అభిమానం లో మునిగి పోవాలని కోరుకుంటున్నాను .
Nice! enjoy! :)
>>అది అసంభవం అని మనసుకి తెలుస్తున్నా<< నా విషయంలో సంభవం అయ్యింది నిషీ. :) :(
Sankar's untimely death is a shock to every one in the telugu blog-world, may his soul rest in peace.
Am jealous of you for having a friend like sravya.
I cannot give books heartily to anybody. Despite I lend books to friends forcing them to read. And they did never returned. Thus I lost so many valuable books. :(
I can take books, of any kind, though no body gave me till date. Once again, :(
Aaa naadu nuvvu anna "NO" inkaa gurtundi cheleee... ee saari vahinappudu no murukulu inka..only pies and pizza's ihi pampistaa :P
Shwetha...the bussss busss bussssssssssssss
ఇంతచక్కని అనుబంధాన్ని పంచుకుంటున్నందుకు మీకూ మీ మిత్రులకు అభినందనలు నిషీ :) వాళ్ళు మీకు అందించిన ఆనందాన్ని అంతే చక్కనైన మాటలతో మీరు మాకు తెలియచేశారు.. టపా చాలాబాగా రాశారు. హ్యాపీ ఫర్ యూ :)
నాకు నిశ్శబ్దం గా కమెంట్ పెట్టాలని ఉందండీ....
చాలావి చెప్పాలని ఉందిగానీ
ఒక్కోసారి మౌనమే ఎక్కువ చెప్తుందేమో....
@శ్రావ్య గారూ.. నాకో?
నాకు నిశ్శబ్దం గా కమెంట్ పెట్టాలని ఉందండీ....
చాలావి చెప్పాలని ఉందిగానీ
ఒక్కోసారి మౌనమే ఎక్కువ చెప్తుందేమో...." nishi gaaru, raj ni copy kottaa .yendukantey, naa feeling koodaa idey..
ఇంత మంది ఆత్మీయతను చుసిన మీరు అలంటి ఆత్మీయతను ఇలా తెలియచేయటం కూడా చాల బాగుంది...
It's great to get such friends...
మంచి పుస్తకమే మంచి ఫ్రెండ్ అంటారు. అలాంటిది మంచి ఫ్రెండే మంచి పుస్తకం పంపిస్తే ఇక ఆ ఆనందానికి హద్దేమి వుంటుంది.
శ్రావ్య గారి లాంటి మంచి స్నేహితురాలు వున్నందుకు, వారి నుంచి మంచి పుస్తకాలు బహుమతిగా పొందినందుకు అభినందనలు నిషి గారు!
సురభి గారు, మీ అభిమానానికి హృదయపూర్వక అభినందనలు.. మీ కామెంట్ చాలాసార్లు చదువుకున్నాను.. రాయడం విసుగు, బద్దకం అన్న దశల్లో ఉన్నప్పుడు మీలాంటివారి ప్రోత్సాహం చాలా సహాయం చేస్తుంది.. థాంక్స్ ఎగైన్!
అవినేని భాస్కర్ - హమ్మ్.. నిజం! ఒక్కోసారి మనకే నమ్మశక్యం కాదు! థాంక్యూ..
పద్మవల్లి - అవును, ఇలాంటప్పుడే ఉన్న బంధాలని ఇంకాస్త దగ్గరకు పొదవుకోవాలనిపిస్తుంది! ఆ వైరాగ్య క్షణాలను దాటగానే మళ్ళీ మనవాళ్ళ కోసమే చుట్టూ వెదుక్కుంటాం!
నిరంతర అన్వేషణ - ఇది మాత్రం చాలా బాగా చెప్పావ్!
శ్రావ్యా - కట్టి పడేసే శక్తే ఉంటే నిన్ను ఇక్కడికి మా ఊరికి తెప్పించేసుకునేదాన్ని.. అక్కడెక్కడో భూమికవతల ఎందుకున్నావసలు! :( :-)
యా, నా డ్యాన్స్ జస్ట్ అలా ఊహించుకో.. చూడాలని మాత్రం కోరుకోకు :)))
థాంక్యూ సోసోసోసో మచ్ ఎగైన్... :-)
ఆ.సౌమ్య - నిజమా! నీకు వచ్చాయా, పుస్తకాలు.. లక్కీ యూ!
థాంక్యూ..
puranapandaphani గారు - నాకూ అయిందండి ఆ అనుభవం, ఇచ్చిన పుస్తకాలు వెనక్కి రాకపోవడం! చాలా సంవత్సరాల క్రితం నా శరత్ నవలల కలెక్షన్ పోగొట్టుకున్నాను! :((
శ్వేత - నువ్వొకదానివి! ఎన్నిసార్లు చెప్పాను ఏవి మర్చిపోవాలో ఏవి గుర్తుపెట్టుకోవాలో అన్న విషయాన్ని! ప్చ్.. మర్చిపో.. నేను నో అన్న విషయాన్ని మర్చిపో.. :)))
వేణూ శ్రీకాంత్ - థాంక్యూ వేణూ.. ఆలసించిన ఆశాభంగము.. కావాలంటే మీమీద కూడ ఒకటి రాస్తాను, ఆలోచించుకోండి మరి :))))
రాజ్ కుమార్ - నిజమే మౌనమే చాలా సందర్భాలలో అత్యుత్తమ సాధనం.. కానీ ఎక్కువసేపు అయితే మంచిది కాదు.. ఇప్పటికే మీ రివ్యూల్లేకుండా సినిమాలు ఒకట్రెండు వారాలు దాటేస్తున్నాయని చాలా బాధగా ఉంది! :-)
శ్రావ్యకి వినబడిందో లేదో ఇంకాస్త గట్టిగా అరవండి ;-)
Ennela గారు - థాంక్యూ :-)
శేఖర్ గారు - నిజమే మనచుట్టూ ఎంతోమంది మంచి స్నేహితులున్నారు! ధన్యవాదాలు! :-)
నిరంతరమూ వసంతములే గారు - 'మంచి ఫ్రెండే మంచి పుస్తకం పంపిస్తే!' నా టపా సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారండీ! ధన్యవాదాలు :-)
నేను అలిగానేమో అని అనుమానంగా ఉంది.
అందుకే ఖండించాలా వద్దా అని ఆగా :)
నిజం గా మన లాంటి మనుషుల కోసం మనసులు ఆత్ర పడతాయా? నిజం గా నిజమా మీ పోస్ట్ లు చూస్తూంటీ వెన్నెల్లో ముగ్గులు వేసే ఆ పాత జ్ఞాపకాలు తట్టి లెపాయి.. చాలా సంతోషం నా మెయిల్ JHANSI.JGD@GMAIL.COM
Post a Comment