నువ్వొదిలెళ్ళిన క్షణాలు...
సావకాశపు సాయంత్రపు నీడల నాటివి
కాసిని గుల్‌మొహర్ చెట్టు కిందా...
ఇంకాసిని మోటబావికెళ్ళే రోడ్డు పొడవునా
ఇప్పటికీ తారట్లాడుతూనే ఉంటాయి..
పాతబడవూ.. పరిమళం వదలవూనూ!ఇప్పటికీ తారట్లాడుతూనే ఉంటాయి..
తడి వెంట్రుకల్లో చిక్కుకుపోయిన
గుసగుసలూ..
చెవి వెనుకే అంటుకుపోయిన
వేలికొసల కంపనలూ..
రహస్య బహుమతులెన్నెన్నో!వేలికొసల కంపనలూ..
ఆకాశం మోయలేక
జారవిడచిన నల్లమబ్బొకటి
గుమ్మం బయట నర్తిస్తుంటే...
మారిన ఋతువుల రాగాలేవో
సరిచూసుకుంటూ
జ్ఞాపకాల జుగల్బందీ మొదలవుతుంది!పదం పదం పొందికగా కూర్చి
అప్పటికప్పుడు నీకేదో రాద్దామనుకుంటాను..
మనసైన ఏకాంతాలన్నీ
కదిలీ.. మెదిలీ.. దిగ్గున చెదిరెళ్ళిపోయీ
వేసవి మధ్యాహ్నపు వీధిలాంటి
మనోఫలకాన్ని మిగుల్చుతాయి..
అనుకున్నదంతా చెప్పగలిగే
అక్షరాలన్నీ అదృశ్యమౌతాయి!
చివరి చుక్క వరకూ చేరుకోని అభావ వాక్యమొకటి
బెంగగా రాలిపడుతుంది!
అక్షరాలన్నీ అదృశ్యమౌతాయి!
చివరి చుక్క వరకూ చేరుకోని అభావ వాక్యమొకటి
బెంగగా రాలిపడుతుంది!
అసలంటూ ఏవీ లేకుండా కాదులే...
కళ్ళ కొలకుల జారుతున్న బిందువుల సాంద్రతనైనాకొలిచి పంపిస్తాను!!
ఈ నెల కౌముదిలో...
24 comments:
బాగుంది చాలా :)
Very touching, beautiful Nishi gaaru.
Sree
Beautiful :)
Nice :-)
జ్ఞాపకాల జుగల్బందీ... నాకెంతో ఇష్టమయిన ఫ్రేజ్.
ఇంతకుముందెప్పుడో చెప్పినట్టు, నీ అక్షరాల్లో నా అరచిత భావాల్ని వెదుక్కుంటూ ఉంటాను. ఇలా చెప్పలేని నా అశక్తతకి, నీ అక్షరాల ఆధారమిస్తున్నందుకు సింపుల్గా థాంక్స్ చెపితే సరిపోతుందా???
చెప్పడం మర్చిపోయాను.
కొన్నిసార్లు మనని తాకుతూ వెళ్ళిపోయే సందె పవనాల్లోని వెచ్చదనమూ, వెన్నెల చల్లదనమూ, యే జన్మలోనో మనకి బాగా చిరపరిచితమైనవి అన్న భావాన్ని దిగులునీ కలిగించి, మనిషినీ మనసునీ కూడా ఒంటరిని చేస్తాయి. అదుగో అచ్చం అలాంటి భావాన్నే నీ రాతలు కలుగచేసి ఏకాంత శిబిరాల్లోకి వలస పంపిస్తాయి.
bhale andamga rasavoy :)
Radhi.
ఖాళీ ఉత్తరంలో కూడా మీకిన్ని సంగతులు ఎలా కనపడ్డాయండీ బాబూ :) కానీ చిన్ని చిన్ని పదాలతో మీరు చేసే మంత్రాలు మాత్రం అద్భుతం.
Super Nishi!!! As usual :)
చాలా బాగుంది నిషీ... కాస్త అటూఇటుగా పద్మవల్లిగారి కామెంట్ నే నాకామెంట్ గా మళ్ళీ చదువుకో :-)
రాధిక(నాని) గారు, శ్రీ గారు, ఫ్రవీణ గారు, శ్రావ్య, పద్మ, రాధీ, క్రాంతి గారు, మెహక్ గారు, వేణు... అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. :-)
ఆలశ్యానికి క్షమించగలరు.
పద్మా, నీ ప్రతిస్పందనకి హార్ట్‌ఫెల్ట్ థాంక్స్ చెప్పడం తప్ప ఇంకేమీ మాట్లాడే సాహసం చేయలేను! Loved it!
మీ "ఖాళీ ఉత్తరం" లో లెక్క లేనన్ని భావాలు ఉన్నాయి..మనసైన ఏకాంతాలన్నీ
కదిలీ.. మెదిలీ.. దిగ్గున చెదిరెళ్ళిపోయీ వేసవి మధ్యాహ్నపు వీధిలాంటి మనోఫలకాన్ని మిగుల్చుతాయి.ఈ లైన్స్ బాగున్నాయి..
ఎప్పట్లాగే.. చాలా బాగుంది, కమ్మని పరిమళాలు చుట్టూ ప్రవహింప జేస్తూ
anubhoothi kavityam lo ismail,asaa raju la tharuvaatha nishigandha [naaku thelisi].chadivina tharuvaatha feelings ni bharinchadam kastanga vundhi.
ధన్యవాదాలు - నవజీవన్ గారు, సుజాత, రామ్ గారు :-)
రామ్ గారు, మీ కామెంట్ చూసినప్పుడు యాధృచ్చికంగా 'చెట్టు నా ఆదర్శం' చదువుతున్నాను :-)
Simply adbhutah..
benga gA rAli paDtundi... amazing vAkya nirmANAlu..kudos to u.
Simply adbhutah..
benga gA rAli paDtundi... amazing vAkya nirmANAlu..kudos to u.
బిందువుల సాంద్రత కొలచిస్తారా. అదిరిపోయిందండి
అక్షరక్షరం...
పదపదం...
ఎప్పటికీ తారట్లాడుతూనే ఉంటాయి..
పాతబడవూ.. పరిమళం వదలవూనూ!
నిజంగా ఎంత సొగసుగా...
మగతగా వ్రాశారు...
మీలాగా ఒకటైనా...
కనీసం ఒక్కటైనా...
వ్రాయగలనా...
ఇప్పుడే కాదు...
ఎప్పటికైనా...
ఆశలొదులుకున్నాను...
ఆకాశం వంక చూశాను...
పై జన్మలో చూద్దాంలే అన్నాడాయన...
రహస్య బహుమతులివ్వలేను గానీ...
అందుకోండి అనురాగపు అభినందనలు...
అనుకున్నదంతా చెప్పుదామనుకుంటే
అక్షరాలన్నీ అదృశ్య మైనాయి!
చివరి ముక్క వరకు
మరింత వివరంగా చెప్పలేని...
అశక్తతతో...
బెంగతో...
అభివందనం...
ప్రతీ జ్ఞాపకం అద్భుతం. ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా.. అనిపిస్తోంది.. మీ కవిత ఆసాంత పదేపదే చదివితే. బృందావని వీధిలో గోపికా హృది నర్తించే విరహ వేదనా రవళికి... మురళీ గానంలా మీ కవిత... నిజంగా మది నుంచి చెరగని ఓ జ్ఞాపకమే.
Thank you vennelarajyam gaaru, Nmrao Bandi gaaru, and సతీష్ కొత్తూరి గారు. :-)
Manasa veena gaaru, really superb.
mee blog ippude chusanu.mee posts anni chaalaa bagunnaayi:-):-)
ధన్యవాదాలు ఎగిసే అలలు గారు :-)
Post a Comment