చాలాసార్లే కూర్చుంటాను రాయాలని.. సమయాన్నే కాదు, చిందరవందర ఆలోచనల్లేని మనసునీ కూడా తోడు పెట్టుకుని.. కుదరదు.. రెండు మూడు పదాల కంటే ముందుకి జరగదు!
సంతోషమో.. బాధో.. కోల్పోయినతనమో.. గుండె అంచుల్నిండి రాలినప్పుడూ… సరైన పదాలు వాటిని పట్టుకోగలిగినప్పుడే కవిత్వం అనేదేదో నాకు రాయడానికి వస్తుంది!
అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే!? సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు..
సమూహంలో అప్పుడప్పుడూ అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!
మొదటి ప్రచురణ వాకిలిలో -- కవిత్వం నాకేమిస్తుంది?
3 comments:
ఏదో ఇస్తుందని రాస్తామా ఏంటి....అదో త్నుత్తి అంతే :-)
నిజమేనండీ! :)
"చిందరవందర ఆలోచనల్లేని మనసునీ కూడా తోడు పెట్టుకుని.. కుదరదు.. రెండు మూడు పదాల కంటే ముందుకి జరగదు!" ...
అవునండీ అక్షరాలా నిజం. మనలో ఏదో ఆ తెలియని కదలిక కలిగినపుడే వ్రాయగలుగుతాం. నేనొక మూడు చరణాలు గల పాటకు ఒక రెండు చరణాలను అప్పుడెప్పుడో వ్రాశాను. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ మూడో చరణం ఇప్పటికీ వ్రాయలేకపోతున్నాను. ప్చ్...
"సంతోషమో.. బాధో.. కోల్పోయినతనమో.. గుండె అంచుల్నిండి రాలినప్పుడూ… సరైన పదాలు వాటిని పట్టుకోగలిగినప్పుడే కవిత్వం అనేదేదో నాకు రాయడానికి వస్తుంది!" ...
ఒకరి గుర్తింపుకి ఒక అవార్డు వచ్చినప్పుడో, లేక ఏదొక ప్రత్యెక సందర్భం గానో, ఆ ఆనందం లోనో, లేక ఎవరైనా మరణించి నప్పుడు, ఆ బాధ లోనో, లేక ఆ సందర్భం కలిగించిన కదలికతోనో, అప్పటికప్పుడు తోచినది/వి రాస్తాం. అప్పటికప్పుడు అవి రాయలేకపోతే మరెప్పటికీ రాయలేం కూడా. ఈ విషయం వ్రాసే వాళ్లకి అనుభవైకమే. ఒక ట్రిబ్యూట్ లా అలా పంచుకున్న విషయాలు కొన్ని కొన్ని సార్లు ప్రచార ప్రాభవం కోసం రాసినట్లుగా కూడా కొందరు అపోహ పడిన సందర్భాలు కూడా కొన్నిసార్లు తారస పడతాయి.
ప్చ్... పద్మార్పిత గారన్నట్లు " ఏదో ఇస్తుందని రాస్తామా ఏంటి....అదో త్నుత్తి అంతే :-) " ... అంతే ...
Post a Comment