(చిన్న విన్నపం - మానసవీణ బ్లాగు.. ఆపైన శతాబ్దాల తర్వాత రాసిన టపా! కాబట్టి ఇందులో మేఘాలూ.. మైదానాలూ.. హృదయపు లోతులూ... గుండె గాధలూ లాంటి పదార్ధాలేమైనా ఆశించివస్తే మీకు తీవ్రమైన ఆశాభంగం తప్పదు.. మన 'స్నేహమా' రాధి నాకోసారి చెప్పినట్లు స్వప్న జగత్తులోనే కాదు అప్పుడప్పుడూ దైనందిన జీవితంలోకూడా జీవిస్తూ ఉండాలి! :)) )
లేచిన దగ్గర్నించీ ఒకటే పరుగు.. ఒక నెమ్మది లేదు.. ఒక ప్రశాంతత లేదు.. ఎంతో పగడ్బందీగా అల్లిన వ్యూహాల్లాంటి ట్రాఫిక్ జామ్స్ ని అధిగమించి అఫీసుకి చేరుకోవడం, లాంగ్ మీటింగ్స్, షార్ట్ డెడ్ లైన్స్ ఇలా మొనాటనీతో సాగిపోతున్న వర్క్ లైఫ్ లో పోయినవారం (9th నవంబరు) మేము చేసిన ఒక చిన్న, సహాయ కార్యక్రమ విశేషాలు మీరిప్పుడు చదవబోతున్నారు.. ఎప్పటిలానే నా కధలన్నీ/స్వగతాలన్నీ చైనా గోడలా దరీదాపూ కనిపించకుండా ఉంటాయి కాబట్టి, కాస్త ఓపిక చేసుకుని 'వినుడు వినుడు ఈ సరదా గాధా.. వినుడీ మహజనులారా......'ఏ హంగులూ లేని అదోలాంటి నిరాడంబరత్వంతో వేసవీ వర్షా కాలాల కలయికతో మూడునాలుగు నెలలు గడిచి, అక్టోబర్ రాగానే మా ఊళ్ళో కొత్త ఉత్సాహమేదో అందరి మనసుల్లోకి పుట్టినట్లుంటుంది.. అందుకు కారణం అప్పుడప్పుడే తగ్గుముఖం పడుతున్న ఎండలు కాగా, ఇంకో ముఖ్యమైన విషయం మేము మా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరమూ చేసే United Way Fundraising! ఈ యునైటేడ్ వే అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్... హెల్త్, ఎడ్యుకేషన్ అవసరాల మీద వాళ్ళ సహాయకార్యక్రమాలు ఉంటాయి.. ప్రతి సంవత్సరమూ అక్టోబరు నించీ నవంబరు రెండో వారం వరకూ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళూ ఏదో ఒక రీతిలో సేల్స్ ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బుల్ని స్కాలర్షిప్ ఫండ్కో లేక మెడికల్ రీసెర్చ్కో డొనేట్ చేస్తారు..
అక్టోబరు వస్తుందంటేనే ఒక్కొక్క డెపార్ట్మెంట్ వాళ్ళూ ఒక్కో ఐడియాతో రెడీగా ఉంటారు.. బేక్ సేల్, క్యూబన్ కాఫీ & టోస్ట్ సేల్, ఐస్క్రీం ఫియెస్టా, గ్రాబ్ యువర్ వింగ్ (లంచ్)... ఇలాంటి తిండికి సంబంధించిన సేల్సే కాకుండా; వేర్ యువర్ హెయిర్ (మనకిష్టమైన విగ్గుతో వర్క్ కి రావచ్చు), వేర్ యువర్ ఫేవరెట్ జీన్స్.. అంటూ వస్త్రధారణకి సంబంధించి కూడా సరదా ఈవెంట్స్ ఉంటాయి.. అంటే ఆ టికెట్ కొంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనౌన్స్ చేసిన రోజు అలా తయారై రావొచ్చన్నమాట!
ఇవే కాకుండా పెన్నీ వార్ అని ఇంకో యుద్ధం సైడ్లో జరుగుతూ ఉంటుంది.. ప్రతి డిపార్ట్మెంట్ రిసెప్షన్ ఏరియాలో ఓ పేద్ద ప్లాస్టిక్ డబ్బా పెడతారు (మామూలుగా ఖాళీ వాటర్ కేన్స్ వాడతారు).. ఇక్కడ ఉన్నవాళ్ళు పెన్నీలని అంత పట్టించుకోరు కనుక అవి ఆ డబ్బాలోకి వేసేస్తారన్నమాట.. ఈ కాంపెయిన్ చివర్లో ఎవరి డిపార్ట్మెంట్ ఎక్కువ పెన్నీలని కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్ అయినట్లు.. అంటే విన్నర్స్ కి పేద్ద బహుమతేదీ ఇవ్వకపోయినా అసలు ఆ 'విన్నర్ ' పదంలో ఉన్న కిక్ తెలియనిదెవరికీ!! అందుకే ఆ డబ్బాలు త్వరత్వరగా ఫిల్ అయిపోతాయి :-)
“మీరు కేకులతో కొడతారా! మేం చూడు లంచ్ సాండ్విచ్ లతో వచ్చాం!!” అని ఒక డిపార్ట్మెంట్ అంటే “అసలు ఐస్క్రీం కి నో అనగలిగే ప్రాణి ఈ బిల్డింగ్ లో ఉందా!?” అని ఇంకొకరు సవాలు విసురుతారు.. రోజూ ఇలా ప్రచ్చన్న యుద్దాల మీద యుద్దాలు జరుగుతుండగా ఒకరోజు లంచ్ రూంలో కూర్చుని యధావిధిగా ఆకులు అలములూ నములుతూ, కొన్ని రోజుల్లో మా ఇంట్లో జరగబోయే దీపావళి పార్టీ గురించి మా కోవర్కర్స్ కి చెప్తుంటే వేంఠనే డార్లీన్ అనే అమ్మాయి "దివాలి పేరుతో యునైటెడ్ వే కి ఏదన్నా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఎలా ఉంటుందీ" అని అన్నది! ఆ ఆలోచన వినగానే ఉత్సాహం వేసి 'వై నాట్.. ష్యూర్.. ష్యూర్ ' అనేసినా ఆ తర్వాత నిమిషం నించీ మనసులో సందేహాల మీద సందేహాలు.. ఆ తర్వాత 'ఇది సాధ్యమయ్యే పని కాదులే' అనిపించింది!
ఇక ఫ్లైయర్స్, టికెట్స్ డిజైన్ చేసి ప్రింట్ చేసి వాటిని అమ్మడం మొదలుపెట్టాక గానీ అసలు కష్టం కళ్ళముందు నిల్చోలేదు!! వంద టికెట్లు కనీసం అమ్మాలి! మేం ముగ్గురమూ ఒకటి కొనమంటే మూడు కొనే రకాలం కానీ అమ్మమంటే 'పరుల సొమ్ము పాము వంటిది ' అని పక్కకి తప్పుకుని బిత్తరచూపులు చూసేవాళ్ళమే! కాకపోతే మా బాసులు (ముగ్గురం వేరే వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తాం) పాపం వాళ్ళు వెళ్ళిన మీటింగ్స్ లో మా తరుపున ప్రచారం చేశారు.. మా పెద్దాయన అయితే కనబడిన ప్రతివాళ్ళకీ "there is a 'raa' party on so and so date.. make
sure to buy a ticket" అని అందర్నీ ఊదరగొట్టేశారు! (ఈ 'రా' వెనక చిన్న పిట్ట కధ.. చివర్లో :-) )
అలా ఏవో తంటాలు పడి టికెట్లయితే అమ్మేస్తున్నాం గానీ అసలు అరేంజ్మెంట్స్ దగ్గరికొచ్చేస్రికి మళ్ళీ టెన్షన్ -- అంతమందికి ఫుడ్ సరిగ్గా ఏర్పాటు చేయగలమా లేదా అని కొంతా, సరైన రూం దొరక్క మరి కొంతాను.. ముగ్గురం ఏమేం చేసుకురావాలో నిర్ణయించుకున్నాక మాలో ఒకమ్మాయికి కాస్త అర్జెంట్ పని వచ్చి తను పూర్తిగా దొరక్కుండా పోయింది.. ఇక మిగిలింది ఇద్దరమే!
మరి మేమిద్దరమే ఈ పనిని పూర్తి చేయగలిగామా!?!? లేదా.. వేచి చూడండి, వివరాల కోసం.. ఒక్కరోజు మాత్రమే!
:-)
17 comments:
Nishigandha garoo...Welcome back. I am so thrilled.
సక్సెస్ అని తెలుసు కాబట్టి పెద్దగా టెన్షన్ లేదు కానీ (రేపటి వరకూ) కథా క్రమం మాత్రం ఊపిరి బిగపట్టి చదివించిందండీ.. చైనా గోడ ఇంత చిన్నదని నాకు అస్సలు తెలీదు సుమా :-) :-)
Waiting waiting :))))
గుడ్ :)
ఆపకుండా చదివించేశావు. :) Can't wait for the next part.
ఆకులూ అలములూ నములుతూ ......
------------------------
మనం తింటున్నప్పుడు అలాంటి మాటలనుకోకూడదమ్మాయ్. కృతకం కాకుండా ప్రకృతి సహజవనరులని ఆస్వాదిస్తున్నాం అనుకోవాలి. లేకపోతే రెండోసారి నోట్లోకి వెళ్ళటానికి మొరాయిస్తాయి. :(
వంద టికెట్లు కనీసం అమ్మాలి!
------------------------
ఎక్కడీ కుమార్జీ?
సూపర్ నిషీ.. అమ్మాయీమణి వారి విజయగాథని పూర్తిగా వినడం కోసం ఎదురు చూస్తూ ఉంటా రేపటిదాకా..
పోనీలే ఇలా అయినా ఇటువైపు వచ్చావు :)
మిగతా కథ కోసం రేపటి దాకా ఎదురు చూడాలన్నమాట!
Good going! :)
Waiting for tomorrow:)
నిషీ, టెన్షన్ అంతా కళ్ళకి కట్టినట్టు చూపించావు కదా. :-)
రెండో పార్ట్ కోసం ఎదురు చూస్తుంటా..
అన్నట్టు, రెండేళ్ళ క్రితం వరకు ఈ టైములో యునైటేడ్ వే హడావిడితో వూపిరి ఆడకుండా ఉండేదాన్ని. ఆ రోజులు గుర్తుకు తెచ్చావు. అక్టోబర్ లో యునైటేడ్ వే, చిస్త్మాస్ దగ్గరకొచ్చేసరికి సెయింట్ జూడ్ ఫండ్ రైజింగ్,మార్చ్ వచ్చే సరికి మార్చ్ అఫ్ డైమ్స్.... హ్మ్మ్..
బాగుంది నిషీ :-) తరువాయి భాగం కోసం వెయిటింగ్ :-)
జ్యోతిర్మయి గారూ, థాంక్సండీ... మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా చాలా సంతోషంగా ఉందండీ :-)
నిజమే కదా, మురళీ! ఏ మాత్రం సస్పెన్స్ లేని కధని మధ్యలో ఆపాను కదా :))))) మరే, ఆ చేత్తో ఒక పోస్టూ ఈ చేత్తో ఒక పోస్టూ రాసే మీకు ఇది చిన్నగానే అనిపించడంలో అస్సలు తప్పు లేదు :p
మీకు బోల్డన్ని కృతజ్ఞతలు :-)
శ్రావ్యా :))) అసలు రచయిత్రిని ప్రోత్సహించడమంటే ఇదీ.. ఎండింగ్ తెలిసిపోయినా బోల్డంత కుతూహలం చూపించడం :)))))))) So sweet..
శేఖర్ గారు, ధన్యవాదాలు :-)
థాంక్స్ పద్దూస్... అంతే అంతే, going green అనుకుంటూ తినేయాలి కదా :-)
ఇంతకీ వందకీ, కుమార్ గారికీ ఏమా అవినాభావ సంబంధం?
థాంక్స్, మధురా.. అసలు మీ అందరూ వచ్చే ఆవులింతలు ఆపుకుంటూ నిద్దర్లు పోకుండా ఆ రెండో భాగం కోసం వెయిట్ చూస్తుంటారని తెలుసు మధురా.. తెలుసు.. అందుకే నేను కూడా పని ని పక్కకి తోసేసి మరీ అది పోస్ట్ చేశాను :)))
వరూధిని గారూ, అయ్యో మీరు కూడా నిద్దర మానేసుకున్నారా :p అవునండీ, చాలా రోజులై పోయింది చెయ్యి కదిలి.. ఏదో బజ్జ్ పుణ్యమా అని మళ్ళీ వచ్చేశాను :-)
అక్కా, థాంక్యూ థాంక్యూ :-)
పద్మార్పిత గారూ, ధన్యవాదాలు :-)
పద్మా, థాంక్స్ రా.. అవునా! మీరూ చేశేవాళ్ళా! మరైతే నీ అనుభవాలు కూడా అల్లెయ్ అమ్మాయ్ :)
మేము మార్చ్ ఆఫ్ డైంస్ చేయం కానీ సెయింట్ జూడ్ చేస్తాం.. కాకపోతే అది మెడికల్ క్యాంపస్లో జోరుగా జరుగుతుంది..
వేణూ, ధన్యవాదాలు.. పోస్ట్ చేశేశాను :-)
Waiting Nishi!
Cheleee....nuvvu migitaadi post chestaavaa tondaragaa....lekapote nannu finish cheyamantaavaa?/ :P
Manmadhudu cinemaa enni saarlu choosina bore kottanattu...anni telisinaa nee ee tapaa chadavatam....thriller novel chadivina feeling ichindi ...migitaadi tondaragaa postoooo :)
థాంక్యూ సునీతా :-)
సఖీ, మన్మధుడి మూవీకి, ఈ పోస్ట్ కీ పోలికా! అదీ ఈ ఈవెంట్ గురించి చూచాయగా అనుకున్న రోజునించీ నీ చెవిలో మోగుతూనే ఉన్నా కూడా :))) థాంక్స్ రా :-)
ఎప్పటిలానే నా కధలన్నీ/స్వగతాలన్నీ చైనా గోడలా దరీదాపూ కనిపించకుండా ఉంటాయి.....
ఇది మాత్రం నిజమేనండి.
Post a Comment