Pages

Wednesday, November 16, 2011

One hell of a ‘Raa…’ party! -- II


అవ్విధంబుగా ముగ్గురం మొదలుపెట్టిన ఈవెంట్‌లో ఇద్దరమే మిగిలినా చకచకా ప్లానింగ్ చేస్తూ వస్తున్నామే కానీ చివరికి వచ్చేసరికి రాత్రిపూట నిద్ర పట్టని పరిస్థితి.. దానికి కారణం, కనబడ్డ ప్రతివాళ్ళూ "we can't wait for your event" అని రెస్ట్‌రూం లో కూడా వదలకుండా చెప్పడం! ఆ పైన అబ్బాయిలు వచ్చి "ఏం చేస్తారో ఏమిటో, టికెట్లు మాత్రం బోల్డన్ని అమ్మేశారు!" అని ఒకటే ఆటపట్టించడం!!
ఆఖరి వారంలో నాకో ఆలోచన వచ్చి నా పార్ట్‌నర్, డార్లీన్ కి చెప్పాను.. తనకి కూడా ఆ ఆలోచన నచ్చి తలూపడంతో ఆ అరేంజ్‌మెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టాం.. అదేమిటంటే మొత్తం దృష్టంతా ఫుడ్ మీద కేంద్రీకరించకుండా ఇంకా ఏమన్నా సరదా అంశాలు పెట్టాలని! అందులో భాగంగా..

·         ఇండియన్ డ్రెస్‌లు వేసుకోవడానికి ఎంకరేజ్ చేయడం
·         ఆర్ట్ పీసెస్, వస్తువుల్లాంటివి డిస్ప్లే చేయడం
·         ప్రొజెక్టర్ తో స్క్రీన్ మీద మన బాలీవుడ్ (నాట్ ఐటెమ్) సాంగ్స్ ప్లే చేస్తూ మధ్య మధ్య trivia quiz  పెట్టడం
·         చివర్లో, raffle ప్లే చేసి డోర్ ప్రైజెస్ ఇవ్వడం
వీటికి తర్వాత అనుకోకుండా చేరిన అంశాలు --
      ·        మా పెద్ద బాసిణి saree draping demonstration కి అంగీకరించడం
        ·         ఒక లోకల్ ఇండియన్ షెఫ్ వచ్చి ఇండియన్ కుకింగ్ మీద చిన్న లెక్చర్ ఇవ్వడం

ఇక ఈవెంట్ రోజునైతే ఇద్దరమల్లా ఇరవైమందిమయ్యాం!! అందరూ తలా ఒక చెయ్యీ వేయడం మొదలుపెట్టి రూం డెకరేట్ చేశారు.. అసలైన సందడి ఏమిటంటే, అమ్మాయిలందరూ చుడీదార్లు వేసుకుని మ్యాచింగ్ బొట్లు, గాజులు, చున్నీల కోసం ఒక ఆఫీసు నించి ఇంకో ఆఫీసు రూంకి పరుగులు పెడుతుంటే అచ్చు మన పెళ్ళి ఇల్లే గుర్తుకువచ్చింది!! వాళ్ళని చూస్తూ అబ్బాయిల చెణుకులూ.. అసలు ఎంత కళకళలాడిపోయారో! కాకుంటే అబ్బాయిల్లో ఒకరికే మన కుర్తా పైజమా సెట్ అయింది.. అయినా గోపికల మధ్య కన్నయ్యలా తను కూడా పొద్దున్నించీ సాయంత్రం వరకూ చక్కగా వెలిగిపోయాడు :-)

Italian guy with a Columbian girl... serving Indian Mango Lassi :-)


ఫుడ్ సర్వ్ చేయడం, క్విజ్, raffle నిర్వహించడం ఇలాంటి పనులన్నీ అడగకుండానే అలా చేతుల్లోకి తీసుకుని నిర్వహించారు! మామూలుగా అయితే ఈ ఈవెంట్స్ లో టికెట్ చూపించి తమకి రావాల్సిన ఫుడ్ ప్లేట్ తీసేసుకుని వెళ్ళిపోతారు.. కానీ ఇక్కడ మాత్రం వచ్చినవాళ్ళెవరూ బయటకి అడుగుపెట్టలేదు.. ఫుడ్ గురించి వివరంగా తెల్సుకుంటూ, డిస్ప్లేలో ఉన్న వస్తువుల్ని పరీక్షగా, ఆసక్తిగా చూస్తూ, స్క్రీన్ మీద వస్తున్న పాటలకి డ్యాన్స్ చేస్తూ (చాలామందికి షారుఖ్ బాగా నచ్చేశాడు, వింటున్నారా మంచు గారూ? :-) ) అసలు కదల్లేదు..

Mixing Bhel Puri chat...



Awesome models.... :-)



మేము సరిగ్గా అంచనా వేయక చిన్న రూం బుక్ చేయడంతో చాలా మంది కాసేపు వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు :-) చాలా డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు మేము ప్రతి ఫ్లోర్‌లో పెట్టిన ఫ్లైయర్స్‌ని పెద్దగా పట్టించుకోకున్నా, మా చుడీదార్ భామలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్‌కి తమ డ్రెస్ చూపించడానికి అన్ని ఫ్లోర్స్ చుట్టేస్తుండటంతో వాళ్ళకీ ఉత్సాహం కలిగి అప్పటికప్పుడు వచ్చి టికెట్స్ కొనడం మొదలుపెట్టారు.. టికెట్స్ ప్రింట్ చేయడం మన చేతుల్లో ఉన్న పని కాబట్టి బోల్డన్ని ఎక్స్‌ట్రా ఉన్నాయి.. సమస్య అది కాదుగా! మేము 100 మందికి అనుకుని, ఎందుకైనా మంచిదని 120మందికని చేసుకొచ్చిన స్నాక్స్ సరిపోయేట్లు లేవు! ఏదైతే అది అయిందని వచ్చినవాళ్ళకి వచ్చినట్లు సర్వ్ చేస్తూనే ఉన్నాం :-)
డిస్ప్లే లో పెట్టిన కొన్ని బొమ్మలు...


ఈవెంట్ మొదలైన గంటన్నరకి బయటనించి వచ్చిన ఇండియన్ షెఫ్ మన భారతీయ ఆహారపు అలవాట్లూ, ఉత్తర దక్షిణాల్లో ఉండే వివిధ రకాల ఆహారదినుసుల వాడకం గురించి చాలా బాగా చెప్పారు.. ఆవిడ మనం వాడే పోపులపెట్టె, కరివేపాకు, పసుపు కొమ్ముల్లాంటివి కూడా వెంట తెచ్చి, అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడతారో చక్కగా వివరించారు! తను వివరిస్తున్నంతసేపూ అందరూ నిశ్శబ్దంగా భలే విన్నారు!

Chef Ayesha.....


ఆ తర్వాత అసలైన్ ఫన్ పార్ట్ -- చీరకట్టు గురించి చెప్పి, ఎలా కట్టుకుంటారో చూపించడం.. చాలామందికి 'శారీ' అంటే ఏదో కొద్దిగా అవగాహన ఉంది కానీ అది ఎంత పొడవు ఉంటుంది అనేది నేను చీరని పూర్తిగా మడతలు విప్పి చూపించగానే నిజంగానే అవాక్కయ్యారు :-) ఇంత పొడవున్న ఫ్యాబ్రిక్ ని ఎలా కట్టుకుంటారు, కట్టుకున్నాక ఎలా నడుస్తారు అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యార్ధకంగా అనిపించింది! కట్టుకుని నడవడమేమిటి, మా దేశంలో పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ సర్వకాల వ్యవస్థల్లోనూ చీరనే ధరిస్తారు అని చెప్పి వాళ్ళ నోళ్ళు ఇంకాస్త తెరిచేలా చేసి, మా బాసిణి గారికి మొత్తానికి చీరకట్టి, చక్కగా పూలూ, బొట్టూ, నగలూ.. అన్నిటితో అలంకరింపజేశాం.. నిజం చెప్పాలంటే ఆవిడతో మాట్లాడాలంటేనే మాకు భయం... ఆవిడ అడిగిన ప్రశ్నకి 'యెస్ ' అన్నా 'నో' అన్నా అందులోనే తప్పు చూపించే రకం.. చాలా స్త్రిక్ట్ AVP (associate vice president) అని పేరు.. అలాంటిది ఆవిడ ఆరోజు చాలా సరదాగా మామధ్య తిరిగారు :-)
గోపాల కృష్ణుడు, బాసిణి....



ఈ ఫొటో తీస్తున్నప్పుడే అనుకోకుండా మా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి పూర్తిగా సర్‌ప్రైజ్ చేశారు.. ఆయన ఆఫీస్ మా ఫ్లోర్‌లోనే అయినా ఎప్పుడూ ఉండరు.. అలాంటిది అనుకోకుండా వచ్చి అందర్నీ అభినందించి వెళ్ళారు! ఇక తర్వాత నించీ ఫుడ్ ట్రేలన్నీ ఖాళీ అయ్యేవరకూ అందరూ చాలా ఎంజాయ్ చేశారు.. చివర గంటలో టికెట్ కొన్నవాళ్ళకి పాపం అన్ని ఐటెంస్ లేకపోయినా "నో ప్రోబ్లెం.. నో ప్రోబ్లెం" అని పెద్దమనసు చేశేసుకుని పెట్టినవాటినే ఆరగించారు!
మా గ్యాంగ్ ఈవెంట్ అంతా అయిపోయాక సర్దడంలో కూడా బోల్డంత హెల్ప్ చేసి, అలసిపోయి గుంపుగా కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టారు -- వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా చేయాలో, ఇంకా ఏమేమి సరదా సంగతులు కలపొచ్చో అని నన్నూ, డార్లీన్ నీ అడుగుతూ -- "ఈసారి అందరం చీరలు కట్టుకుందాం" అని డిక్లేర్ చేశేశారు.. మా ఇద్దరికీ నవ్వూ, సంతోషం రెండూ ఆగలేదు :))
ఆ రోజు పొద్దుటినించీ రెండు కప్పుల కాఫీ తప్ప ఇంకో పదార్ధం లోపలికి వెళ్ళకపోయినా చివరికి అంతా పూర్తయ్యి డెస్క్ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఉత్తేజభరితంగా అనిపించిందో! 6:30 దాటింది, ఇక ఇంటికి బయలుదేరుదామని ఎందుకో ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేశేసరికి వరుసగా 20కి పైగా ఈమెయిల్స్, ఈవెంట్ సక్సెఫుల్ గా జరిగినందుకు అభినందిస్తూ!! ఎక్కువగా ఆశ్చ్ర్యమూ ఆనందమూ కలిగించింది మా VP రాసిన ఈమెయిల్.. అందులో 'రా ' అని చూడగానే నాకు నవ్వు పొంగుకొచ్చింది.. యా.. యా.. మీకు చెప్తానన్న పిట్టకధ విషయం గుర్తుంది.. :-)

ముందు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పొగిడేశారో మీకు వినిపించేసీ... JJ
--------------------
It was one hell of a Raa party. Great job, you both! ------ from our VP
 
Congratulations and thank you for a great event for United Way! ---- -- from our AVP (బాసిణి)

It was a classy, interesting, dynamic and fun party.  Good food, too.  Really good. I know that you got some help from folks, but you two were the engines. ----- from my boss
Your Diwali celebration was awesome!  The food, music and decorations… WOW! I was thrilled to see you had such a great turnout.  Hopefully it’s the start of a new UM tradition! ----- from an employee outside our dept.

---------------------------------

యునైటెడ్ వే ఫండ్ రైజింగ్లో మా యూనివర్సిటీ వరుసగా నాలుగు సంవత్సరాల నించి $1 మిలియన్ (cash wise)మార్క్ దాటుతూ వస్తోంది.. అందులో మేము పోగుచేసినవి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే! అయినా, 'మేము సైతం' అన్న సంతృప్తి అణువణువునా నిండిపోయింది.. భావన ఇచ్చే/ఇస్తున్న ecstasy ని వర్ణించడానికి నాకు సరైన పదాలు దొరకడంలేదు.. just feeling great!
ఇంతకీ మేము ఎన్నుకున్న అంశం -- Healthcare for kids. J
వడ్డించిన పదార్ధాలు -----
       ·         సమోసా
       ·         వెజ్ పకోడీలు
       ·         భేల్ పూరీ
       ·         గులాబ్ జామూన్
       ·         బాదుషా
       ·         మ్యాంగో లస్సీ

ఈ కార్యక్రమంలో చాలానే లోటుపాట్లు దొర్లాయి -- రూమ్ చిన్నది కావడం, ఫుడ్ చివర్లో అందరికీ సమానంగా అందకపోవడం, డెకరేషన్ సంతృప్తికరంగా చేయలేకపోవడం.. etc.. etc.. ఇవి మేము సమీక్షించుకుంటే అనిపించిన లోపాలు కానీ ఎవ్వరూ కనీసం మాటమాత్రమైనా ప్రస్తావించలేదు.. అలానే అంతా ముగిసాక, ఆ మరుసటి 2,3 రోజులూ కనిపించినవాళ్ళల్లా నన్నూ, డార్లీన్ ని పొగిడారు కానీ, it was such a team work! అందరూ ఉత్సాహం పాల్గొనడంవల్ల దివాలీ అనే విదేశీ అంశానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది.. ఇక్కడ చాలా ఊళ్ళల్లో భారతీయ జనాభా ఎక్కువ ఉండటం వల్ల వేరే సంస్కృతుల వారికి మన పండగలు, అలవాట్ల మీద చాలానే అవగాహన ఉంటుంది!

కానీ మా వర్క్ ప్లేస్‌లో మన వాళ్ళు బహుతక్కువ ఉండటంవల్ల భారతీయత అంటే పూర్తిగా విదేశీ సంస్కృతే! కాబట్టి, అమ్మాయిలు పెట్టుకునే బొట్టుబిళ్ళల దగ్గర్నుంచీ, మనం అన్నం చేత్తో తినే విషయం వరకూ అన్నీ వింతలే.. ఆసక్తి కలిగించేవే! అందుకే ఒక కొత్త కాన్సెప్ట్ కావడంవల్ల ఈ ఈవెంట్ కి రావాల్సినదానికన్నా ఎక్కువ గుర్తింపు వచ్చిందనిపించింది!

ఆ రోజు నాకు బజ్‌లో, ఈమెయిల్లోనూ విషెస్ చెప్పిన స్నేహితులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.. 

అలానే మీ అందరి నించీ చిన్న సహాయం కావాలి.. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ ఈవెంట్ నిర్వహించడానికి మా కోవర్కర్స్ అందరూ ఇప్పటినించే సిద్ధమైపోతున్నారని చెప్పాను కదా.. కాబట్టి ఈసారి మన సంస్కృతి తగ్గ సరదా ఐటెమ్‌స్ ఏమైనా మీకు తోస్తే షేర్ చేసుకోండి, ప్లీజ్ :-)
ఆల్రెడీ మా వాళ్ళనించే వచ్చిన ఒక సూచన, సమోసాలు ఎలా చేయాలో demonstrate చేయడం..
ఇంకొక సూచన, అబ్బాయిలు ఒక షారుఖ్ పాటకి డ్యాన్స్ చేయడం...
ఆపైన, నిన్న కుమార్ గారి బజ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ చూశాక నాకొచ్చిన ఆలోచన Koffee with Kumar అనే ఆక్షన్ నిర్వహించడం.. ఇందులో మా వర్క్ ఫ్రెండ్సే కాదు మన బ్లాగరు/బజ్జ్ ఫ్రెండ్స్ కూడా పాల్గొనవచ్చు :)))))


ఒక చిన్న ఈవెంట్ గురించి ఇంత సుదీర్ఘంగా ప్రసంగించాక, అందర్నీ ఇక వదిలేద్దామని బలంగా అనిపిస్తున్నా, నేను మొదట్లోనే మీకు గట్టిగా ఒట్టు పెట్టి చెప్తానన్న పిట్టకధ గురించి చెప్పకపోతే మళ్ళీ నా మనసు చిన్నబుచ్చుకుంటుంది.. సో, ఆ కధ క్లుప్తంగా....

నేను వర్క్‌లో ఉన్నప్పుడు, కొలీగ్స్ మధ్య ఉన్నప్పుడు ఫోన్ మోగుతుంది... పిక్ చేసి నేను "ఆ చెప్పరా.. లేదు రా.. అబ్బా, అలా కాదురా.. నిజం చెప్తున్నాను రా.. నమ్మ రా.. బై రా" ఈ లెవల్లో మాట్లాడి పెట్టేస్తాను.. కొన్ని రోజులు వదిలేసినా ఒక 3 ఇయర్స్ నించి మాత్రం నా ఫోన్ మోగడం ఆలశ్యం నా డెస్క్ చుట్టుపక్కలనించి "హా.....య్ రా...." అని ఒక 3,4 గొంతులు వినబడతాయి.. ఆ పైన "బ్లా బ్లా బ్లా రా".. అనో లేకపోతే "యాడ యాడ యాడ రా" అనో ఇంకొక్కళ్ళు కంటిన్యూ చేస్తారు (మా బాస్ తో సహా!).. దాంతో నేను నా ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టేసుకున్నాను.. ఆ సమస్య అలా సాల్వ్ అయిపోయినా ఎప్పుడన్నా బయటకి లంచ్ కో ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు ఎవరన్నా మన ఇండియన్ ఫీచర్స్ తో కనిపిస్తే చాలు టక్కున నా పక్కకొచ్చి "Is he/she a Raa?" అని అడుగుతారు.. అప్పటికి వాళ్ళందరికీ చిలక్కి చెప్పిన్నట్టు చెప్పాను, 'రా అనేది జస్ట్ ఒక స్లాంగ్ లాంటిదని.. ఇండియాలో అందరూ వాడరని ' అయినా అబ్బే! అబ్బాయిలు కదా పట్టిన కుందేలు కాళ్ళ లెక్క తప్పనివ్వరు కదా.. అలా అలా మా వాళ్ళసలు ఇండియన్ అనే పదాన్ని 'రా..' అనే పదంతో రిప్లేస్ చేశేశారు... మా బాస్ తను వెళ్ళిన మీటింగ్స్ అన్నిట్లో మా ఈవెంట్ గురించ్ చెప్పాడని అన్నాను కదా, అలా మా VP కి కూడా చెప్పాడు.. ఆయన కూడా ఇదో 'రా' పార్టీ అనేసుకున్నారు.. మరి ఆయనకి 'రా ఏంటి.. రా కీ దివాలీకీ సంబంధం ఏంటీ..' అని అడిగే తీరికా ఓపికా రెండూ లేవయ్యే!! So, ఆయన ఈమెయిల్ కూడా one hell of a Raa party అని ఇచ్చారు..:)))

(ఇక్కడ పెట్టిన ఫోటోలు కేవలం అనుమతి ఇచ్చినవాళ్ళవే!)

27 comments:

teresa said...

The mango lassi did it huh !! Add sambar next year and it'll be rave :)
Congrats Nishi!

నిషిగంధ said...

థాంక్యూ సో మచ్ అక్కా! sooooo nice to see your comment! యా, నెక్స్ట్ ఇయర్ ఇక లంచ్ కే ప్లాన్.. అఫ్కోర్స్ సాంబార్ తప్పక ఉంటుంది.. అసలు ఈసారే బ్రంచ్ పెట్టి ఇడ్లీ సాంబార్ అనుకున్నాం కానీ ఆ రోజు లంచ్ కి వేరే వాళ్ళ ఈవెంట్ ఉంది.. అందుకే అది వర్కౌట్ కాలేదు :)))
btw, will call you soon, promise! :-)

శేఖర్ (Sekhar) said...

ఈవెంట్ బాగా జరిగినందుకు క్లాప్స్...ఉదయం లెగిస్తే మన చుట్టూ జరిగే లైఫ్ లో ఏమి negative ఉందా అని ఫస్ట్ అందరు వెతుకుతారు....ఎందుకో పాజిటివ్ ని అందరం మిస్ ఐపోతున్నాం ......మీ ఈవెంట్ గురించి అందరు మంచి గా పొగడటం నిజం గా appreciate చేయాల్సిన విషయం...
:))

One hell of a "Raa.." writing...

సిరిసిరిమువ్వ said...

చాలా బాగా చేసావు’రా’ నిషీ..మీ టీము ఇద్దరే అయినా అందరూ భలే సాయం చేసినట్లున్నారు ’రా’. వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా ..మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి లోటుపాట్లు కనపడకుండా చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను’రా’.

బై.’రా’.

Sravya V said...

వావ్ సూపర్బ్ ! మీకు , ఇంకా మీ గ్యాంగ్ అందరికి అభినందనలు !
మీరు నెక్స్ట్ ఇయర్ చేబోయే "రా " ఈవెంట్ ఇంకా సూపర్బ్ గా హిట్ కావాలి అని కోరుకుంటున్నాను !

మురళి said...

అరె.. వెంటనే రాసేశారు!! పబ్లిక్ డిమాండ్ కదా :)) బోల్డన్ని అభినందనలు.. మీ టీం కీ, టీం హెడ్ కీ.. (అనగా మీకే!!)

కౌటిల్య said...

నిషిగంధ గారూ! ఈసారి మాంఛి ఆవకాయ అన్నం పెట్టండి, కమ్మటి నెయ్యేసి..;)

జ్యోతిర్మయి said...

బావుంది బావుంది రా పార్టీ...అభినందనలు నిషి గారూ

ఆ.సౌమ్య said...
This comment has been removed by the author.
ఆ.సౌమ్య said...

wow excellent.....హహహ్హా Raa పార్టీ అంటే ఇదా....చచ్చాను నవ్వలేక :)

మీ బాసిణి మాత్రం అదిరింది చీరలో.....congratulations my dear Nishi...good job!

మధురవాణి said...

సూపర్ నిషీ.. వెల్ డన్! మీ excitement మేం కూడా ఫీలయ్యేలా ముచ్చటగా చెప్పావు. పిట్ట కథ సూపర్ అసలు.. :))) That really is one hell of a Raa party.

Korivi Deyyam said...

hammayya...poortigaa chadivesaanu...gud one raa...:)

Korivi Deyyam said...

ee saari naa vantu saayam gaa...mee next year event ki...gavvalu cheyatam elaago nerpinchi pampistaa :P

పద్మ said...

చాలా బావుంది 'రా'. ;) 'రా' కథ వింటుంటే మన తెలుగు ఫర్ డమ్మీస్ కథ గుర్తొచ్చింది. :)))))) నీ ఎక్సైట్మెంట్ నాకు బ్రహ్మాండంగా అర్థమైంది. ఒక మంచి పని కోసం అంత కష్టపడినందుకు, ఆ ఈవెంట్ అంత సక్సెస్ అయినందుకు (కరెక్ట్‌గా చెప్పాలంటే సక్సెస్ చేసినందుకు :) ), hearty congratulations to you and Darleen. ఇంతకీ చాయ్ లిస్ట్‌లో లేదేంటి?

కొత్త పాళీ said...

very nice.
For moment I thought you hosted a party to watch Raaaaa-von! :)

KumarN said...

Great Job Nishigandha. Speaks for itself.

btw: ఆ Koffee with Kumar లో గెస్ట్ లని, ఓన్లీ అమ్మాయిలనే పిలవ ప్రార్థన. And certainly not RG, please :-)

నేస్తం said...

అబ్బా నిషి కళ్ళకు కట్టినట్లు రాసావు.. పిట్ట కధ ఇంకా సూపర్..

శ్రీనివాస్ పప్పు said...

అభినందనలు,పైన అందరూ రాసిన కామెంట్లూ ఇంకోసారి నా పేరుమీద చదివేసుకోమని సెప్తున్నాను "రా"

నిషిగంధ said...

శేఖర్ గారు, ధన్యవాదాలు.. నిజమేనండీ, నాకూ అదే అనిపించింది.. మామూలుగా ఏదన్నా పని చేస్తే చుట్టుపక్కల వాళ్ళు అందులో దొర్లిన లోటుపాట్ల గురించే ఎక్కువగా మాట్లాడతారు.. అలాంటిది అందరూ ప్రోత్సాహకరంగా మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చింది :)

వరూధిని గారూ :)))) మీక్కుడా నా రా ని ఇవ్వాలనుందండీ.. ధన్యవాదాలు, వరూధిని గారు రా.. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చెయ్యాలనే ప్లానండి రా.. అప్పుడు ఏమైనా సలహాలు కావాలంటే మిమ్మల్ని తప్పక అడుగుతానండి రా.. (ఏమైనా బావుందాండీ?? :)) )

శ్రావ్యా, థాంక్యూ... మరి అప్పుడూ ఇండియన్ క్లాసిక మ్యూజిక్ గురించి నీతో కాన్‌ఫరెన్‌స్ కాల్ కలపమంటావా? :))

ధన్యవాదాలు, మురళీ.. పబ్లిక్ డిమాండ్ కొంతాన్నూ, వర్క్ కూడా కాస్త ఎక్కువుండటంతో ముందే రెండూ రాసేసి పెట్టుకున్నానండీ :-)

నిషిగంధ said...

కౌటిల్యా :)) మీ బ్లాగ్ తప్పక రిఫరెన్స్ గా పెట్టుకుంటాను.. కాకపోతే ఆవకాయ ఘాటు తట్టుకోలేరని నా అనుమానం.. మొన్న పకోడీల్లో ఎక్కడోఓఓ కాస్త పచ్చిమిరప కారం తగిలిందని ఒకమ్మాయి వచ్చి చెవిలో చెప్పి వెళ్ళింది.. కాకపోతే హాట్ స్పైసీ ఫుడ్ తినేవాళ్ళకి స్పెషల్ అని పెట్టొచ్చు :-)

ధన్యవాదాలు, జ్యోతిర్మయీ.. ప్లీజ్ గారు తీసేయండీ :)

సౌమ్యా, థాంక్స్ రా.. మరి ఈసారి సున్నుండలేసేద్దామని ప్లాన్ :))

నిషిగంధ said...

థాంక్స్ మధురా... మరి నువ్వు కూడా మీ ల్యాబ్ లో రా పార్టీ ఎప్పుడు చేస్తున్నావ్? :))

థాంక్స్ రా, సఖీ.. :)) అంతా నీ ఆశీర్వాద బలమే కదా! చెప్పాగా గవ్వల పేరు సెర్చింగ్ గురించి.. అసలు అవి మధ్యలో డ్రాప్ అయిన అమ్మాయి తెస్తానంది.. పాపం కుదర్లేదు :-)

పద్దూస్, థాంక్స్ రా.. అవును కదా ఆ రోజు రాత్రి నేను తెగ హడావిడి పడ్డా.. కాకపోతే నీతో మాట్లాడుతూనే బోల్డంత పని కంప్లీట్ చేశాను :-)

ధన్యవాదాలు, కొత్తపాళీ గారూ.. షారుఖ్ మూవీ కోసం పార్టీనా... అంత కళాపోషణ మాత్రం లేదండీ :))))

నిషిగంధ said...

ధన్యవాదాలు, కుమార్ గారు.. అఫ్కోర్స్ అమ్మాయిలనే పిలుస్తామండీ.. కాకపోతే with no set criteria! :)))

థాంక్యూ నేస్తం.. నువ్వు సూపరంటే ఇక తిరుగులేనట్టే! :-)

పప్పు గారూ.. థాంక్సండోయ్.. మీరు కూడా పైనున్న వాటికి డబల్ ధన్యవాదాలు మీ బ్యాగులో వేసేసుకోవాల్సిందిగా విన్నపం :)))

sunita said...

Congrats raa Nishi :))

sarita said...

good job
mythili

నవజీవన్ said...

నిషిగంధ గారు ..బాగుంది అంది మీ టపా .మొత్తానికి ఈ "రా" పార్టీ మొత్తానికి విదేశీయులకు మన సంస్కృతి ని చూపించారన్న మాట.అయితే మీరు ఈ టపా రాసారు కాబట్టి దీనికి రిఫరెన్స్ గా నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను.నిజంగా ఎం.ఎన్.సి కంపెనీలలో పని చేస్తునప్పుడు వారికీ మన సంస్కృతి గురించి చెప్పే సమయం లో మనం కొంచెం తికమక పడటం సహజమే.నేను కూడా ఒక బహుళ జాతీయ సంస్థ లోనే పని చేస్తున్నాను.ఒకసారి మాకు ఇలాంటి సందర్భమే వచ్చింది. ఒక సమావేశానికి దక్షిణ భారత సంప్రదాయానికి సంబంధించిన అంశం పై ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఒక డెలిగేట్ కు లోకల్ "గృహ ప్రియ" వారి వంటకాలైన బూరెలు, కజ్జికాయలు,అరిసెలు టేస్ట్ చూపించము.అతనికి నిజంగానే అవి బాగా నచ్చాయి. అలాగే ఒకసారి వైజాగ్ లో భారతీయ సంప్రదాయానికి సంబంధించిన ఒక నృత్య రూపకానికి లండన్ నుంచి వచ్చిన మా చీఫ్ ను తీసుకెళ్తే అయన చాలా ఆశ్చర్యపోయారు.అతనికి ఆ ప్రోగ్రాం చాలా నచ్చింది.అలా మీరు ఈ టపా లో చెప్పినట్లు మన తెలుగు జీవన విధానం లో ఉన్న సంప్రదాయాలు చాలా వాటిని పాశ్చాత్యులకు మనం మీ "రా" ప్రోగ్రాం లాంటి వాటిల్లో రుచి చూపించవచ్చు. మనకు అవి రొటీన్ అయిన అవి వారికి చాల ప్రత్యేకతను కలుగజేస్తాయి.
చాలా పెద్ద కామెంట్ పెట్టినందుకు క్షమించండి.మీ టపా చదివాకా ఎందుకో నా మనసులో ఉన్న భావాలను మీతో పంచుకోవాలనిపించింది.

కొత్తావకాయ said...

ఇంత ఆలస్యంగానా చదవడం అని కత్తి దూయకండేం. నేను జనజీవన స్రవంతిలో కలిసింది ఇప్పుడేగా. :)

మొదటి భాగం చదివినప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారిలా హెల్దీ ఫుడ్ పెట్టి "రా పార్టీ" చేసుకున్నారేమో అనుకున్నాను. ఇదా "రా పార్టీ" అంటే. హ్హహ్హహా.. సరిపోయింది.

అంత పెద్ద పార్టీని అందంగా, రంగురంగులుగా, రుచిగా జరిపించేసారన్నమాట. గుడ్ గుడ్. కంగ్రాట్స్.. చాలా ఆలస్యంగా. :)

Ennela said...

raa paartee baagundandee....yee saari cheera kattukovadam potee pettandi..(non-indians maatrame arhulu)