మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!
కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..
జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!
పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు
ఉండుండి వీచేగాలికి
వళ్ళు విరుచుకుంటుంటే..
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!
ఉండుండి వీచేగాలికి
వళ్ళు విరుచుకుంటుంటే..
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!
మనస్థాపాల మసకతెరలని తప్పించి
అతన్ని ఐదునిమిషాలన్నా
చుంబించాలి…
ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!
అతన్ని ఐదునిమిషాలన్నా
చుంబించాలి…
ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!
వీచే నింగి కింద
గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…
అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…
ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..
ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!
గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…
అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…
ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..
ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!
గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!
-------
NATS వారి సాహిత్య పోటీలలో రెండవ బహుమతి పొందిన కవిత, మొదటి ప్రచురణ వాకిలిలో...
English Translation by NS Murty gaaru...
English Translation by NS Murty gaaru...
8 comments:
చాలా బాగుంది
Nishigandha gaaru,
Madhuravaani gaari 'My San Francisco Diary-2' lo 'ఊసులాడే ఒక జాబిలట' gurinchi chusanu.
Novel lo flow chaala baaga vundi.It was completely interesting.Office lo vunnapudu chadavadam start chesanu.Intiki raagane night 12 varaku chadivi complete chesanu.Inthaku mundu eppudu nenu ila continuous ga inni hours chadavaledu.Oka poet and follower madya letter communication superb ga vundi.Great to know that it's a true story of Kiran prabha gaaru.Ee novel ni cinemala theesthe ela vuntundi ani anipinchindi.Naaku novel chadivinattu ledu oka movie chustunattu anipinchindi.Antha baagaraasaru meeru.I was completely into the novel.Hoping to see many more interesting novels from you.
Karthika ki cancer lekunda happy life vunte baagundedi.
చిన్ని గారూ, థాంక్యూ.. థాంక్యూ :)
బోల్డన్ని ధన్యవాదాలు, ప్రవీణ గారు. మీ వల్ల మళ్ళీ కార్తీకని నేను కూడా పలకరించివచ్చాను.
అవునండీ, తను మనమధ్య ఇంకా ఉండి ఉంటే బావుండుననుకునే క్షణం లేకుండా ఉండదు! :(
గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!
ఎక్కడ దొరుకుతాయండీ మీకు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్?
థాంక్స్, మురళీ.. అతి స్వల్పంగా దొరికే కొన్ని నిరామయ సమయాల్లో ఇలాంటి భావాలు పుడతాయనుకుంటా! ప్రత్యేకంగా ఆలోచిస్తే ఒక్కటంటే ఒక్కటీ తోచదు, పాటల్లో లిరిక్స్ గుర్తురావడం తప్ప! :))
ప్రత్యేకంగా ఆలోచిస్తే ఒక్కటంటే ఒక్కటీ తోచదు, పాటల్లో లిరిక్స్ గుర్తురావడం తప్ప! :))
అనేకసార్లు అనుభవమైన విషయం నాకు కూడా...
యెంత చక్కగా వ్రాస్తున్నారు...
భావాల రాశిని విడగొట్టి - మాలలుగా కట్టి
తురుముతున్నారు కవితా సుందరి జడన...
సరే...
మళ్ళీ ఒక అభినందన మందార మాల...
రెండో వీరతాడు...
(మాయా బజార్ లో లాగా...)
ప్రత్యేకంగా ఆలోచిస్తే ఒక్కటంటే ఒక్కటీ తోచదు, పాటల్లో లిరిక్స్ గుర్తురావడం తప్ప! :))
అనేకసార్లు అనుభవమైన విషయం నాకు కూడా...
యెంత చక్కగా వ్రాస్తున్నారు...
భావాల రాశిని విడగొట్టి - మాలలుగా కట్టి
తురుముతున్నారు కవితా సుందరి జడన...
సరే...
మళ్ళీ ఒక అభినందన మందార మాల...
రెండో వీరతాడు...
(మాయా బజార్ లో లాగా...)
Post a Comment