అవ్విధంబుగా ముగ్గురం మొదలుపెట్టిన ఈవెంట్‌లో ఇద్దరమే మిగిలినా చకచకా ప్లానింగ్ చేస్తూ వస్తున్నామే కానీ చివరికి వచ్చేసరికి రాత్రిపూట నిద్ర పట్టని పరిస్థితి.. దానికి కారణం, కనబడ్డ ప్రతివాళ్ళూ "we can't wait for your event" అని రెస్ట్‌రూం లో కూడా వదలకుండా చెప్పడం! ఆ పైన అబ్బాయిలు వచ్చి "ఏం చేస్తారో ఏమిటో, టికెట్లు మాత్రం బోల్డన్ని అమ్మేశారు!" అని ఒకటే ఆటపట్టించడం!!
ఆఖరి వారంలో నాకో ఆలోచన వచ్చి నా పార్ట్‌నర్, డార్లీన్ కి చెప్పాను.. తనకి కూడా ఆ ఆలోచన నచ్చి తలూపడంతో ఆ అరేంజ్‌మెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టాం.. అదేమిటంటే మొత్తం దృష్టంతా ఫుడ్ మీద కేంద్రీకరించకుండా ఇంకా ఏమన్నా సరదా అంశాలు పెట్టాలని! అందులో భాగంగా..· ఇండియన్ డ్రెస్‌లు వేసుకోవడానికి ఎంకరేజ్ చేయడం
· ఆర్ట్ పీసెస్, వస్తువుల్లాంటివి డిస్ప్లే చేయడం
· ప్రొజెక్టర్ తో స్క్రీన్ మీద మన బాలీవుడ్ (నాట్ ఐటెమ్) సాంగ్స్ ప్లే చేస్తూ మధ్య మధ్య trivia quiz పెట్టడం
· చివర్లో, raffle ప్లే చేసి డోర్ ప్రైజెస్ ఇవ్వడం
వీటికి తర్వాత అనుకోకుండా చేరిన అంశాలు --· మా పెద్ద బాసిణి saree draping demonstration కి అంగీకరించడం
· ఒక లోకల్ ఇండియన్ షెఫ్ వచ్చి ఇండియన్ కుకింగ్ మీద చిన్న లెక్చర్ ఇవ్వడం
ఇక ఈవెంట్ రోజునైతే ఇద్దరమల్లా ఇరవైమందిమయ్యాం!! అందరూ తలా ఒక చెయ్యీ వేయడం మొదలుపెట్టి రూం డెకరేట్ చేశారు.. అసలైన సందడి ఏమిటంటే, అమ్మాయిలందరూ చుడీదార్లు వేసుకుని మ్యాచింగ్ బొట్లు, గాజులు, చున్నీల కోసం ఒక ఆఫీసు నించి ఇంకో ఆఫీసు రూంకి పరుగులు పెడుతుంటే అచ్చు మన పెళ్ళి ఇల్లే గుర్తుకువచ్చింది!! వాళ్ళని చూస్తూ అబ్బాయిల చెణుకులూ.. అసలు ఎంత కళకళలాడిపోయారో! కాకుంటే అబ్బాయిల్లో ఒకరికే మన కుర్తా పైజమా సెట్ అయింది.. అయినా గోపికల మధ్య కన్నయ్యలా తను కూడా పొద్దున్నించీ సాయంత్రం వరకూ చక్కగా వెలిగిపోయాడు :-)
Italian guy with a Columbian girl... serving Indian Mango Lassi :-)
Mixing Bhel Puri chat...
Awesome models.... :-)
మేము సరిగ్గా అంచనా వేయక చిన్న రూం బుక్ చేయడంతో చాలా మంది కాసేపు వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు :-) చాలా డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు మేము ప్రతి ఫ్లోర్‌లో పెట్టిన ఫ్లైయర్స్‌ని పెద్దగా పట్టించుకోకున్నా, మా చుడీదార్ భామలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్‌కి తమ డ్రెస్ చూపించడానికి అన్ని ఫ్లోర్స్ చుట్టేస్తుండటంతో వాళ్ళకీ ఉత్సాహం కలిగి అప్పటికప్పుడు వచ్చి టికెట్స్ కొనడం మొదలుపెట్టారు.. టికెట్స్ ప్రింట్ చేయడం మన చేతుల్లో ఉన్న పని కాబట్టి బోల్డన్ని ఎక్స్‌ట్రా ఉన్నాయి.. సమస్య అది కాదుగా! మేము 100 మందికి అనుకుని, ఎందుకైనా మంచిదని 120మందికని చేసుకొచ్చిన స్నాక్స్ సరిపోయేట్లు లేవు! ఏదైతే అది అయిందని వచ్చినవాళ్ళకి వచ్చినట్లు సర్వ్ చేస్తూనే ఉన్నాం :-)
డిస్ప్లే లో పెట్టిన కొన్ని బొమ్మలు...ఈవెంట్ మొదలైన గంటన్నరకి బయటనించి వచ్చిన ఇండియన్ షెఫ్ మన భారతీయ ఆహారపు అలవాట్లూ, ఉత్తర దక్షిణాల్లో ఉండే వివిధ రకాల ఆహారదినుసుల వాడకం గురించి చాలా బాగా చెప్పారు.. ఆవిడ మనం వాడే పోపులపెట్టె, కరివేపాకు, పసుపు కొమ్ముల్లాంటివి కూడా వెంట తెచ్చి, అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడతారో చక్కగా వివరించారు! తను వివరిస్తున్నంతసేపూ అందరూ నిశ్శబ్దంగా భలే విన్నారు!
ఆ తర్వాత అసలైన్ ఫన్ పార్ట్ -- చీరకట్టు గురించి చెప్పి, ఎలా కట్టుకుంటారో చూపించడం.. చాలామందికి 'శారీ' అంటే ఏదో కొద్దిగా అవగాహన ఉంది కానీ అది ఎంత పొడవు ఉంటుంది అనేది నేను చీరని పూర్తిగా మడతలు విప్పి చూపించగానే నిజంగానే అవాక్కయ్యారు :-) ఇంత పొడవున్న ఫ్యాబ్రిక్ ని ఎలా కట్టుకుంటారు, కట్టుకున్నాక ఎలా నడుస్తారు అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యార్ధకంగా అనిపించింది! కట్టుకుని నడవడమేమిటి, మా దేశంలో పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ సర్వకాల వ్యవస్థల్లోనూ చీరనే ధరిస్తారు అని చెప్పి వాళ్ళ నోళ్ళు ఇంకాస్త తెరిచేలా చేసి, మా బాసిణి గారికి మొత్తానికి చీరకట్టి, చక్కగా పూలూ, బొట్టూ, నగలూ.. అన్నిటితో అలంకరింపజేశాం.. నిజం చెప్పాలంటే ఆవిడతో మాట్లాడాలంటేనే మాకు భయం... ఆవిడ అడిగిన ప్రశ్నకి 'యెస్ ' అన్నా 'నో' అన్నా అందులోనే తప్పు చూపించే రకం.. చాలా స్త్రిక్ట్ AVP (associate vice president) అని పేరు.. అలాంటిది ఆవిడ ఆరోజు చాలా సరదాగా మామధ్య తిరిగారు :-)
గోపాల కృష్ణుడు, బాసిణి....ఈ ఫొటో తీస్తున్నప్పుడే అనుకోకుండా మా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి పూర్తిగా సర్‌ప్రైజ్ చేశారు.. ఆయన ఆఫీస్ మా ఫ్లోర్‌లోనే అయినా ఎప్పుడూ ఉండరు.. అలాంటిది అనుకోకుండా వచ్చి అందర్నీ అభినందించి వెళ్ళారు! ఇక తర్వాత నించీ ఫుడ్ ట్రేలన్నీ ఖాళీ అయ్యేవరకూ అందరూ చాలా ఎంజాయ్ చేశారు.. చివర గంటలో టికెట్ కొన్నవాళ్ళకి పాపం అన్ని ఐటెంస్ లేకపోయినా "నో ప్రోబ్లెం.. నో ప్రోబ్లెం" అని పెద్దమనసు చేశేసుకుని పెట్టినవాటినే ఆరగించారు!
మా గ్యాంగ్ ఈవెంట్ అంతా అయిపోయాక సర్దడంలో కూడా బోల్డంత హెల్ప్ చేసి, అలసిపోయి గుంపుగా కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టారు -- వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా చేయాలో, ఇంకా ఏమేమి సరదా సంగతులు కలపొచ్చో అని నన్నూ, డార్లీన్ నీ అడుగుతూ -- "ఈసారి అందరం చీరలు కట్టుకుందాం" అని డిక్లేర్ చేశేశారు.. మా ఇద్దరికీ నవ్వూ, సంతోషం రెండూ ఆగలేదు :))
ఆ రోజు పొద్దుటినించీ రెండు కప్పుల కాఫీ తప్ప ఇంకో పదార్ధం లోపలికి వెళ్ళకపోయినా చివరికి అంతా పూర్తయ్యి డెస్క్ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఉత్తేజభరితంగా అనిపించిందో! 6:30 దాటింది, ఇక ఇంటికి బయలుదేరుదామని ఎందుకో ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేశేసరికి వరుసగా 20కి పైగా ఈమెయిల్స్, ఈవెంట్ సక్సెఫుల్ గా జరిగినందుకు అభినందిస్తూ!! ఎక్కువగా ఆశ్చ్ర్యమూ ఆనందమూ కలిగించింది మా VP రాసిన ఈమెయిల్.. అందులో 'రా ' అని చూడగానే నాకు నవ్వు పొంగుకొచ్చింది.. యా.. యా.. మీకు చెప్తానన్న పిట్టకధ విషయం గుర్తుంది.. :-)ముందు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పొగిడేశారో మీకు వినిపించేసీ... JJ
--------------------
It was one hell of a Raa party. Great job, you both! ------ from our VP
Congratulations and thank you for a great event for United Way! ---- -- from our AVP (బాసిణి)
It was a classy, interesting, dynamic and fun party. Good food, too. Really good. I know that you got some help from folks, but you two were the engines. ----- from my boss
Your Diwali celebration was awesome! The food, music and decorations… WOW! I was thrilled to see you had such a great turnout. Hopefully it’s the start of a new UM tradition! ----- from an employee outside our dept.---------------------------------
ఈ యునైటెడ్ వే ఫండ్ రైజింగ్లో మా యూనివర్సిటీ వరుసగా నాలుగు సంవత్సరాల నించి $1 మిలియన్ (cash wise)మార్క్ దాటుతూ వస్తోంది.. అందులో మేము పోగుచేసినవి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే! అయినా, 'మేము సైతం' అన్న సంతృప్తి అణువణువునా నిండిపోయింది.. ఆ భావన ఇచ్చే/ఇస్తున్న ecstasy ని వర్ణించడానికి నాకు సరైన పదాలు దొరకడంలేదు.. just feeling great!
ఇంతకీ మేము ఎన్నుకున్న అంశం -- Healthcare for kids. Jవడ్డించిన పదార్ధాలు -----
· సమోసా
· వెజ్ పకోడీలు
· భేల్ పూరీ
· గులాబ్ జామూన్
· బాదుషా
· మ్యాంగో లస్సీ
ఈ కార్యక్రమంలో చాలానే లోటుపాట్లు దొర్లాయి -- రూమ్ చిన్నది కావడం, ఫుడ్ చివర్లో అందరికీ సమానంగా అందకపోవడం, డెకరేషన్ సంతృప్తికరంగా చేయలేకపోవడం.. etc.. etc.. ఇవి మేము సమీక్షించుకుంటే అనిపించిన లోపాలు కానీ ఎవ్వరూ కనీసం మాటమాత్రమైనా ప్రస్తావించలేదు.. అలానే అంతా ముగిసాక, ఆ మరుసటి 2,3 రోజులూ కనిపించినవాళ్ళల్లా నన్నూ, డార్లీన్ ని పొగిడారు కానీ, it was such a team work! అందరూ ఉత్సాహం పాల్గొనడంవల్ల దివాలీ అనే విదేశీ అంశానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది.. ఇక్కడ చాలా ఊళ్ళల్లో భారతీయ జనాభా ఎక్కువ ఉండటం వల్ల వేరే సంస్కృతుల వారికి మన పండగలు, అలవాట్ల మీద చాలానే అవగాహన ఉంటుంది!
కానీ మా వర్క్ ప్లేస్‌లో మన వాళ్ళు బహుతక్కువ ఉండటంవల్ల భారతీయత అంటే పూర్తిగా విదేశీ సంస్కృతే! కాబట్టి, అమ్మాయిలు పెట్టుకునే బొట్టుబిళ్ళల దగ్గర్నుంచీ, మనం అన్నం చేత్తో తినే విషయం వరకూ అన్నీ వింతలే.. ఆసక్తి కలిగించేవే! అందుకే ఒక కొత్త కాన్సెప్ట్ కావడంవల్ల ఈ ఈవెంట్ కి రావాల్సినదానికన్నా ఎక్కువ గుర్తింపు వచ్చిందనిపించింది!
ఆ రోజు నాకు బజ్‌లో, ఈమెయిల్లోనూ విషెస్ చెప్పిన స్నేహితులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు..
అలానే మీ అందరి నించీ చిన్న సహాయం కావాలి.. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ ఈవెంట్ నిర్వహించడానికి మా కోవర్కర్స్ అందరూ ఇప్పటినించే సిద్ధమైపోతున్నారని చెప్పాను కదా.. కాబట్టి ఈసారి మన సంస్కృతి తగ్గ సరదా ఐటెమ్‌స్ ఏమైనా మీకు తోస్తే షేర్ చేసుకోండి, ప్లీజ్ :-)
ఆల్రెడీ మా వాళ్ళనించే వచ్చిన ఒక సూచన, సమోసాలు ఎలా చేయాలో demonstrate చేయడం..
ఇంకొక సూచన, అబ్బాయిలు ఒక షారుఖ్ పాటకి డ్యాన్స్ చేయడం...
ఆపైన, నిన్న కుమార్ గారి బజ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ చూశాక నాకొచ్చిన ఆలోచన Koffee with Kumar అనే ఆక్షన్ నిర్వహించడం.. ఇందులో మా వర్క్ ఫ్రెండ్సే కాదు మన బ్లాగరు/బజ్జ్ ఫ్రెండ్స్ కూడా పాల్గొనవచ్చు :)))))
ఒక చిన్న ఈవెంట్ గురించి ఇంత సుదీర్ఘంగా ప్రసంగించాక, అందర్నీ ఇక వదిలేద్దామని బలంగా అనిపిస్తున్నా, నేను మొదట్లోనే మీకు గట్టిగా ఒట్టు పెట్టి చెప్తానన్న పిట్టకధ గురించి చెప్పకపోతే మళ్ళీ నా మనసు చిన్నబుచ్చుకుంటుంది.. సో, ఆ కధ క్లుప్తంగా....
నేను వర్క్‌లో ఉన్నప్పుడు, కొలీగ్స్ మధ్య ఉన్నప్పుడు ఫోన్ మోగుతుంది... పిక్ చేసి నేను "ఆ చెప్పరా.. లేదు రా.. అబ్బా, అలా కాదురా.. నిజం చెప్తున్నాను రా.. నమ్మ రా.. బై రా" ఈ లెవల్లో మాట్లాడి పెట్టేస్తాను.. కొన్ని రోజులు వదిలేసినా ఒక 3 ఇయర్స్ నించి మాత్రం నా ఫోన్ మోగడం ఆలశ్యం నా డెస్క్ చుట్టుపక్కలనించి "హా.....య్ రా...." అని ఒక 3,4 గొంతులు వినబడతాయి.. ఆ పైన "బ్లా బ్లా బ్లా రా".. అనో లేకపోతే "యాడ యాడ యాడ రా" అనో ఇంకొక్కళ్ళు కంటిన్యూ చేస్తారు (మా బాస్ తో సహా!).. దాంతో నేను నా ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టేసుకున్నాను.. ఆ సమస్య అలా సాల్వ్ అయిపోయినా ఎప్పుడన్నా బయటకి లంచ్ కో ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు ఎవరన్నా మన ఇండియన్ ఫీచర్స్ తో కనిపిస్తే చాలు టక్కున నా పక్కకొచ్చి "Is he/she a Raa?" అని అడుగుతారు.. అప్పటికి వాళ్ళందరికీ చిలక్కి చెప్పిన్నట్టు చెప్పాను, 'రా అనేది జస్ట్ ఒక స్లాంగ్ లాంటిదని.. ఇండియాలో అందరూ వాడరని ' అయినా అబ్బే! అబ్బాయిలు కదా పట్టిన కుందేలు కాళ్ళ లెక్క తప్పనివ్వరు కదా.. అలా అలా మా వాళ్ళసలు ఇండియన్ అనే పదాన్ని 'రా..' అనే పదంతో రిప్లేస్ చేశేశారు... మా బాస్ తను వెళ్ళిన మీటింగ్స్ అన్నిట్లో మా ఈవెంట్ గురించ్ చెప్పాడని అన్నాను కదా, అలా మా VP కి కూడా చెప్పాడు.. ఆయన కూడా ఇదో 'రా' పార్టీ అనేసుకున్నారు.. మరి ఆయనకి 'రా ఏంటి.. రా కీ దివాలీకీ సంబంధం ఏంటీ..' అని అడిగే తీరికా ఓపికా రెండూ లేవయ్యే!! So, ఆయన ఈమెయిల్ కూడా one hell of a Raa party అని ఇచ్చారు..:)))
(ఇక్కడ పెట్టిన ఫోటోలు కేవలం అనుమతి ఇచ్చినవాళ్ళవే!)