Pages

Wednesday, November 16, 2011

One hell of a ‘Raa…’ party! -- II


అవ్విధంబుగా ముగ్గురం మొదలుపెట్టిన ఈవెంట్‌లో ఇద్దరమే మిగిలినా చకచకా ప్లానింగ్ చేస్తూ వస్తున్నామే కానీ చివరికి వచ్చేసరికి రాత్రిపూట నిద్ర పట్టని పరిస్థితి.. దానికి కారణం, కనబడ్డ ప్రతివాళ్ళూ "we can't wait for your event" అని రెస్ట్‌రూం లో కూడా వదలకుండా చెప్పడం! ఆ పైన అబ్బాయిలు వచ్చి "ఏం చేస్తారో ఏమిటో, టికెట్లు మాత్రం బోల్డన్ని అమ్మేశారు!" అని ఒకటే ఆటపట్టించడం!!
ఆఖరి వారంలో నాకో ఆలోచన వచ్చి నా పార్ట్‌నర్, డార్లీన్ కి చెప్పాను.. తనకి కూడా ఆ ఆలోచన నచ్చి తలూపడంతో ఆ అరేంజ్‌మెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టాం.. అదేమిటంటే మొత్తం దృష్టంతా ఫుడ్ మీద కేంద్రీకరించకుండా ఇంకా ఏమన్నా సరదా అంశాలు పెట్టాలని! అందులో భాగంగా..

·         ఇండియన్ డ్రెస్‌లు వేసుకోవడానికి ఎంకరేజ్ చేయడం
·         ఆర్ట్ పీసెస్, వస్తువుల్లాంటివి డిస్ప్లే చేయడం
·         ప్రొజెక్టర్ తో స్క్రీన్ మీద మన బాలీవుడ్ (నాట్ ఐటెమ్) సాంగ్స్ ప్లే చేస్తూ మధ్య మధ్య trivia quiz  పెట్టడం
·         చివర్లో, raffle ప్లే చేసి డోర్ ప్రైజెస్ ఇవ్వడం
వీటికి తర్వాత అనుకోకుండా చేరిన అంశాలు --
      ·        మా పెద్ద బాసిణి saree draping demonstration కి అంగీకరించడం
        ·         ఒక లోకల్ ఇండియన్ షెఫ్ వచ్చి ఇండియన్ కుకింగ్ మీద చిన్న లెక్చర్ ఇవ్వడం

ఇక ఈవెంట్ రోజునైతే ఇద్దరమల్లా ఇరవైమందిమయ్యాం!! అందరూ తలా ఒక చెయ్యీ వేయడం మొదలుపెట్టి రూం డెకరేట్ చేశారు.. అసలైన సందడి ఏమిటంటే, అమ్మాయిలందరూ చుడీదార్లు వేసుకుని మ్యాచింగ్ బొట్లు, గాజులు, చున్నీల కోసం ఒక ఆఫీసు నించి ఇంకో ఆఫీసు రూంకి పరుగులు పెడుతుంటే అచ్చు మన పెళ్ళి ఇల్లే గుర్తుకువచ్చింది!! వాళ్ళని చూస్తూ అబ్బాయిల చెణుకులూ.. అసలు ఎంత కళకళలాడిపోయారో! కాకుంటే అబ్బాయిల్లో ఒకరికే మన కుర్తా పైజమా సెట్ అయింది.. అయినా గోపికల మధ్య కన్నయ్యలా తను కూడా పొద్దున్నించీ సాయంత్రం వరకూ చక్కగా వెలిగిపోయాడు :-)

Italian guy with a Columbian girl... serving Indian Mango Lassi :-)


ఫుడ్ సర్వ్ చేయడం, క్విజ్, raffle నిర్వహించడం ఇలాంటి పనులన్నీ అడగకుండానే అలా చేతుల్లోకి తీసుకుని నిర్వహించారు! మామూలుగా అయితే ఈ ఈవెంట్స్ లో టికెట్ చూపించి తమకి రావాల్సిన ఫుడ్ ప్లేట్ తీసేసుకుని వెళ్ళిపోతారు.. కానీ ఇక్కడ మాత్రం వచ్చినవాళ్ళెవరూ బయటకి అడుగుపెట్టలేదు.. ఫుడ్ గురించి వివరంగా తెల్సుకుంటూ, డిస్ప్లేలో ఉన్న వస్తువుల్ని పరీక్షగా, ఆసక్తిగా చూస్తూ, స్క్రీన్ మీద వస్తున్న పాటలకి డ్యాన్స్ చేస్తూ (చాలామందికి షారుఖ్ బాగా నచ్చేశాడు, వింటున్నారా మంచు గారూ? :-) ) అసలు కదల్లేదు..

Mixing Bhel Puri chat...



Awesome models.... :-)



మేము సరిగ్గా అంచనా వేయక చిన్న రూం బుక్ చేయడంతో చాలా మంది కాసేపు వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు :-) చాలా డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు మేము ప్రతి ఫ్లోర్‌లో పెట్టిన ఫ్లైయర్స్‌ని పెద్దగా పట్టించుకోకున్నా, మా చుడీదార్ భామలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్‌కి తమ డ్రెస్ చూపించడానికి అన్ని ఫ్లోర్స్ చుట్టేస్తుండటంతో వాళ్ళకీ ఉత్సాహం కలిగి అప్పటికప్పుడు వచ్చి టికెట్స్ కొనడం మొదలుపెట్టారు.. టికెట్స్ ప్రింట్ చేయడం మన చేతుల్లో ఉన్న పని కాబట్టి బోల్డన్ని ఎక్స్‌ట్రా ఉన్నాయి.. సమస్య అది కాదుగా! మేము 100 మందికి అనుకుని, ఎందుకైనా మంచిదని 120మందికని చేసుకొచ్చిన స్నాక్స్ సరిపోయేట్లు లేవు! ఏదైతే అది అయిందని వచ్చినవాళ్ళకి వచ్చినట్లు సర్వ్ చేస్తూనే ఉన్నాం :-)
డిస్ప్లే లో పెట్టిన కొన్ని బొమ్మలు...


ఈవెంట్ మొదలైన గంటన్నరకి బయటనించి వచ్చిన ఇండియన్ షెఫ్ మన భారతీయ ఆహారపు అలవాట్లూ, ఉత్తర దక్షిణాల్లో ఉండే వివిధ రకాల ఆహారదినుసుల వాడకం గురించి చాలా బాగా చెప్పారు.. ఆవిడ మనం వాడే పోపులపెట్టె, కరివేపాకు, పసుపు కొమ్ముల్లాంటివి కూడా వెంట తెచ్చి, అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడతారో చక్కగా వివరించారు! తను వివరిస్తున్నంతసేపూ అందరూ నిశ్శబ్దంగా భలే విన్నారు!

Chef Ayesha.....


ఆ తర్వాత అసలైన్ ఫన్ పార్ట్ -- చీరకట్టు గురించి చెప్పి, ఎలా కట్టుకుంటారో చూపించడం.. చాలామందికి 'శారీ' అంటే ఏదో కొద్దిగా అవగాహన ఉంది కానీ అది ఎంత పొడవు ఉంటుంది అనేది నేను చీరని పూర్తిగా మడతలు విప్పి చూపించగానే నిజంగానే అవాక్కయ్యారు :-) ఇంత పొడవున్న ఫ్యాబ్రిక్ ని ఎలా కట్టుకుంటారు, కట్టుకున్నాక ఎలా నడుస్తారు అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యార్ధకంగా అనిపించింది! కట్టుకుని నడవడమేమిటి, మా దేశంలో పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ సర్వకాల వ్యవస్థల్లోనూ చీరనే ధరిస్తారు అని చెప్పి వాళ్ళ నోళ్ళు ఇంకాస్త తెరిచేలా చేసి, మా బాసిణి గారికి మొత్తానికి చీరకట్టి, చక్కగా పూలూ, బొట్టూ, నగలూ.. అన్నిటితో అలంకరింపజేశాం.. నిజం చెప్పాలంటే ఆవిడతో మాట్లాడాలంటేనే మాకు భయం... ఆవిడ అడిగిన ప్రశ్నకి 'యెస్ ' అన్నా 'నో' అన్నా అందులోనే తప్పు చూపించే రకం.. చాలా స్త్రిక్ట్ AVP (associate vice president) అని పేరు.. అలాంటిది ఆవిడ ఆరోజు చాలా సరదాగా మామధ్య తిరిగారు :-)
గోపాల కృష్ణుడు, బాసిణి....



ఈ ఫొటో తీస్తున్నప్పుడే అనుకోకుండా మా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి పూర్తిగా సర్‌ప్రైజ్ చేశారు.. ఆయన ఆఫీస్ మా ఫ్లోర్‌లోనే అయినా ఎప్పుడూ ఉండరు.. అలాంటిది అనుకోకుండా వచ్చి అందర్నీ అభినందించి వెళ్ళారు! ఇక తర్వాత నించీ ఫుడ్ ట్రేలన్నీ ఖాళీ అయ్యేవరకూ అందరూ చాలా ఎంజాయ్ చేశారు.. చివర గంటలో టికెట్ కొన్నవాళ్ళకి పాపం అన్ని ఐటెంస్ లేకపోయినా "నో ప్రోబ్లెం.. నో ప్రోబ్లెం" అని పెద్దమనసు చేశేసుకుని పెట్టినవాటినే ఆరగించారు!
మా గ్యాంగ్ ఈవెంట్ అంతా అయిపోయాక సర్దడంలో కూడా బోల్డంత హెల్ప్ చేసి, అలసిపోయి గుంపుగా కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టారు -- వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా చేయాలో, ఇంకా ఏమేమి సరదా సంగతులు కలపొచ్చో అని నన్నూ, డార్లీన్ నీ అడుగుతూ -- "ఈసారి అందరం చీరలు కట్టుకుందాం" అని డిక్లేర్ చేశేశారు.. మా ఇద్దరికీ నవ్వూ, సంతోషం రెండూ ఆగలేదు :))
ఆ రోజు పొద్దుటినించీ రెండు కప్పుల కాఫీ తప్ప ఇంకో పదార్ధం లోపలికి వెళ్ళకపోయినా చివరికి అంతా పూర్తయ్యి డెస్క్ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఉత్తేజభరితంగా అనిపించిందో! 6:30 దాటింది, ఇక ఇంటికి బయలుదేరుదామని ఎందుకో ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేశేసరికి వరుసగా 20కి పైగా ఈమెయిల్స్, ఈవెంట్ సక్సెఫుల్ గా జరిగినందుకు అభినందిస్తూ!! ఎక్కువగా ఆశ్చ్ర్యమూ ఆనందమూ కలిగించింది మా VP రాసిన ఈమెయిల్.. అందులో 'రా ' అని చూడగానే నాకు నవ్వు పొంగుకొచ్చింది.. యా.. యా.. మీకు చెప్తానన్న పిట్టకధ విషయం గుర్తుంది.. :-)

ముందు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పొగిడేశారో మీకు వినిపించేసీ... JJ
--------------------
It was one hell of a Raa party. Great job, you both! ------ from our VP
 
Congratulations and thank you for a great event for United Way! ---- -- from our AVP (బాసిణి)

It was a classy, interesting, dynamic and fun party.  Good food, too.  Really good. I know that you got some help from folks, but you two were the engines. ----- from my boss
Your Diwali celebration was awesome!  The food, music and decorations… WOW! I was thrilled to see you had such a great turnout.  Hopefully it’s the start of a new UM tradition! ----- from an employee outside our dept.

---------------------------------

యునైటెడ్ వే ఫండ్ రైజింగ్లో మా యూనివర్సిటీ వరుసగా నాలుగు సంవత్సరాల నించి $1 మిలియన్ (cash wise)మార్క్ దాటుతూ వస్తోంది.. అందులో మేము పోగుచేసినవి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే! అయినా, 'మేము సైతం' అన్న సంతృప్తి అణువణువునా నిండిపోయింది.. భావన ఇచ్చే/ఇస్తున్న ecstasy ని వర్ణించడానికి నాకు సరైన పదాలు దొరకడంలేదు.. just feeling great!
ఇంతకీ మేము ఎన్నుకున్న అంశం -- Healthcare for kids. J
వడ్డించిన పదార్ధాలు -----
       ·         సమోసా
       ·         వెజ్ పకోడీలు
       ·         భేల్ పూరీ
       ·         గులాబ్ జామూన్
       ·         బాదుషా
       ·         మ్యాంగో లస్సీ

ఈ కార్యక్రమంలో చాలానే లోటుపాట్లు దొర్లాయి -- రూమ్ చిన్నది కావడం, ఫుడ్ చివర్లో అందరికీ సమానంగా అందకపోవడం, డెకరేషన్ సంతృప్తికరంగా చేయలేకపోవడం.. etc.. etc.. ఇవి మేము సమీక్షించుకుంటే అనిపించిన లోపాలు కానీ ఎవ్వరూ కనీసం మాటమాత్రమైనా ప్రస్తావించలేదు.. అలానే అంతా ముగిసాక, ఆ మరుసటి 2,3 రోజులూ కనిపించినవాళ్ళల్లా నన్నూ, డార్లీన్ ని పొగిడారు కానీ, it was such a team work! అందరూ ఉత్సాహం పాల్గొనడంవల్ల దివాలీ అనే విదేశీ అంశానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది.. ఇక్కడ చాలా ఊళ్ళల్లో భారతీయ జనాభా ఎక్కువ ఉండటం వల్ల వేరే సంస్కృతుల వారికి మన పండగలు, అలవాట్ల మీద చాలానే అవగాహన ఉంటుంది!

కానీ మా వర్క్ ప్లేస్‌లో మన వాళ్ళు బహుతక్కువ ఉండటంవల్ల భారతీయత అంటే పూర్తిగా విదేశీ సంస్కృతే! కాబట్టి, అమ్మాయిలు పెట్టుకునే బొట్టుబిళ్ళల దగ్గర్నుంచీ, మనం అన్నం చేత్తో తినే విషయం వరకూ అన్నీ వింతలే.. ఆసక్తి కలిగించేవే! అందుకే ఒక కొత్త కాన్సెప్ట్ కావడంవల్ల ఈ ఈవెంట్ కి రావాల్సినదానికన్నా ఎక్కువ గుర్తింపు వచ్చిందనిపించింది!

ఆ రోజు నాకు బజ్‌లో, ఈమెయిల్లోనూ విషెస్ చెప్పిన స్నేహితులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.. 

అలానే మీ అందరి నించీ చిన్న సహాయం కావాలి.. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ ఈవెంట్ నిర్వహించడానికి మా కోవర్కర్స్ అందరూ ఇప్పటినించే సిద్ధమైపోతున్నారని చెప్పాను కదా.. కాబట్టి ఈసారి మన సంస్కృతి తగ్గ సరదా ఐటెమ్‌స్ ఏమైనా మీకు తోస్తే షేర్ చేసుకోండి, ప్లీజ్ :-)
ఆల్రెడీ మా వాళ్ళనించే వచ్చిన ఒక సూచన, సమోసాలు ఎలా చేయాలో demonstrate చేయడం..
ఇంకొక సూచన, అబ్బాయిలు ఒక షారుఖ్ పాటకి డ్యాన్స్ చేయడం...
ఆపైన, నిన్న కుమార్ గారి బజ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ చూశాక నాకొచ్చిన ఆలోచన Koffee with Kumar అనే ఆక్షన్ నిర్వహించడం.. ఇందులో మా వర్క్ ఫ్రెండ్సే కాదు మన బ్లాగరు/బజ్జ్ ఫ్రెండ్స్ కూడా పాల్గొనవచ్చు :)))))


ఒక చిన్న ఈవెంట్ గురించి ఇంత సుదీర్ఘంగా ప్రసంగించాక, అందర్నీ ఇక వదిలేద్దామని బలంగా అనిపిస్తున్నా, నేను మొదట్లోనే మీకు గట్టిగా ఒట్టు పెట్టి చెప్తానన్న పిట్టకధ గురించి చెప్పకపోతే మళ్ళీ నా మనసు చిన్నబుచ్చుకుంటుంది.. సో, ఆ కధ క్లుప్తంగా....

నేను వర్క్‌లో ఉన్నప్పుడు, కొలీగ్స్ మధ్య ఉన్నప్పుడు ఫోన్ మోగుతుంది... పిక్ చేసి నేను "ఆ చెప్పరా.. లేదు రా.. అబ్బా, అలా కాదురా.. నిజం చెప్తున్నాను రా.. నమ్మ రా.. బై రా" ఈ లెవల్లో మాట్లాడి పెట్టేస్తాను.. కొన్ని రోజులు వదిలేసినా ఒక 3 ఇయర్స్ నించి మాత్రం నా ఫోన్ మోగడం ఆలశ్యం నా డెస్క్ చుట్టుపక్కలనించి "హా.....య్ రా...." అని ఒక 3,4 గొంతులు వినబడతాయి.. ఆ పైన "బ్లా బ్లా బ్లా రా".. అనో లేకపోతే "యాడ యాడ యాడ రా" అనో ఇంకొక్కళ్ళు కంటిన్యూ చేస్తారు (మా బాస్ తో సహా!).. దాంతో నేను నా ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టేసుకున్నాను.. ఆ సమస్య అలా సాల్వ్ అయిపోయినా ఎప్పుడన్నా బయటకి లంచ్ కో ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు ఎవరన్నా మన ఇండియన్ ఫీచర్స్ తో కనిపిస్తే చాలు టక్కున నా పక్కకొచ్చి "Is he/she a Raa?" అని అడుగుతారు.. అప్పటికి వాళ్ళందరికీ చిలక్కి చెప్పిన్నట్టు చెప్పాను, 'రా అనేది జస్ట్ ఒక స్లాంగ్ లాంటిదని.. ఇండియాలో అందరూ వాడరని ' అయినా అబ్బే! అబ్బాయిలు కదా పట్టిన కుందేలు కాళ్ళ లెక్క తప్పనివ్వరు కదా.. అలా అలా మా వాళ్ళసలు ఇండియన్ అనే పదాన్ని 'రా..' అనే పదంతో రిప్లేస్ చేశేశారు... మా బాస్ తను వెళ్ళిన మీటింగ్స్ అన్నిట్లో మా ఈవెంట్ గురించ్ చెప్పాడని అన్నాను కదా, అలా మా VP కి కూడా చెప్పాడు.. ఆయన కూడా ఇదో 'రా' పార్టీ అనేసుకున్నారు.. మరి ఆయనకి 'రా ఏంటి.. రా కీ దివాలీకీ సంబంధం ఏంటీ..' అని అడిగే తీరికా ఓపికా రెండూ లేవయ్యే!! So, ఆయన ఈమెయిల్ కూడా one hell of a Raa party అని ఇచ్చారు..:)))

(ఇక్కడ పెట్టిన ఫోటోలు కేవలం అనుమతి ఇచ్చినవాళ్ళవే!)

One hell of a ‘Raa…’ party! -- I


(చిన్న విన్నపం - మానసవీణ బ్లాగు.. ఆపైన శతాబ్దాల తర్వాత రాసిన టపా! కాబట్టి ఇందులో మేఘాలూ.. మైదానాలూ.. హృదయపు లోతులూ... గుండె గాధలూ లాంటి పదార్ధాలేమైనా ఆశించివస్తే మీకు తీవ్రమైన ఆశాభంగం తప్పదు.. మన 'స్నేహమా' రాధి నాకోసారి చెప్పినట్లు స్వప్న జగత్తులోనే కాదు అప్పుడప్పుడూ దైనందిన జీవితంలోకూడా జీవిస్తూ ఉండాలి! :)) )
లేచిన దగ్గర్నించీ ఒకటే పరుగు.. ఒక నెమ్మది లేదు.. ఒక ప్రశాంతత లేదు.. ఎంతో పగడ్బందీగా అల్లిన వ్యూహాల్లాంటి ట్రాఫిక్ జామ్స్ ని అధిగమించి అఫీసుకి చేరుకోవడం, లాంగ్ మీటింగ్స్, షార్ట్ డెడ్ లైన్స్ ఇలా మొనాటనీతో సాగిపోతున్న వర్క్ లైఫ్ లో పోయినవారం (9th నవంబరు) మేము చేసిన ఒక చిన్న, సహాయ కార్యక్రమ విశేషాలు మీరిప్పుడు చదవబోతున్నారు.. ఎప్పటిలానే నా కధలన్నీ/స్వగతాలన్నీ చైనా గోడలా దరీదాపూ కనిపించకుండా ఉంటాయి కాబట్టి, కాస్త ఓపిక చేసుకుని 'వినుడు వినుడు ఈ సరదా గాధా.. వినుడీ మహజనులారా......'

ఏ హంగులూ లేని అదోలాంటి నిరాడంబరత్వంతో వేసవీ వర్షా కాలాల కలయికతో మూడునాలుగు నెలలు గడిచి, అక్టోబర్ రాగానే మా ఊళ్ళో కొత్త ఉత్సాహమేదో అందరి మనసుల్లోకి పుట్టినట్లుంటుంది.. అందుకు కారణం అప్పుడప్పుడే తగ్గుముఖం పడుతున్న ఎండలు కాగా, ఇంకో ముఖ్యమైన విషయం మేము మా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరమూ చేసే United Way Fundraising! ఈ యునైటేడ్ వే అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్... హెల్త్, ఎడ్యుకేషన్ అవసరాల మీద వాళ్ళ సహాయకార్యక్రమాలు ఉంటాయి.. ప్రతి సంవత్సరమూ అక్టోబరు నించీ నవంబరు రెండో వారం వరకూ అన్ని డిపార్ట్‌మెంట్ల వాళ్ళూ ఏదో ఒక రీతిలో సేల్స్ ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బుల్ని స్కాలర్షిప్ ఫండ్‌కో లేక మెడికల్ రీసెర్చ్‌కో డొనేట్ చేస్తారు..

అక్టోబరు వస్తుందంటేనే ఒక్కొక్క డెపార్ట్మెంట్ వాళ్ళూ ఒక్కో ఐడియాతో రెడీగా ఉంటారు.. బేక్ సేల్, క్యూబన్ కాఫీ & టోస్ట్ సేల్, ఐస్‌క్రీం ఫియెస్టా, గ్రాబ్ యువర్ వింగ్ (లంచ్)... ఇలాంటి తిండికి సంబంధించిన సేల్సే కాకుండా; వేర్ యువర్ హెయిర్ (మనకిష్టమైన విగ్గుతో వర్క్ కి రావచ్చు), వేర్ యువర్ ఫేవరెట్ జీన్స్.. అంటూ వస్త్రధారణకి సంబంధించి కూడా సరదా ఈవెంట్స్ ఉంటాయి.. అంటే ఆ టికెట్ కొంటే ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎనౌన్స్ చేసిన రోజు అలా తయారై రావొచ్చన్నమాట!
ఇవే కాకుండా పెన్నీ వార్ అని ఇంకో యుద్ధం సైడ్లో జరుగుతూ ఉంటుంది.. ప్రతి డిపార్ట్‌మెంట్ రిసెప్షన్ ఏరియాలో  ఓ పేద్ద ప్లాస్టిక్ డబ్బా పెడతారు (మామూలుగా ఖాళీ వాటర్ కేన్స్ వాడతారు).. ఇక్కడ ఉన్నవాళ్ళు పెన్నీలని అంత పట్టించుకోరు కనుక అవి ఆ డబ్బాలోకి వేసేస్తారన్నమాట.. ఈ కాంపెయిన్ చివర్లో ఎవరి డిపార్ట్‌మెంట్ ఎక్కువ పెన్నీలని కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్ అయినట్లు.. అంటే విన్నర్స్ కి పేద్ద బహుమతేదీ ఇవ్వకపోయినా అసలు ఆ 'విన్నర్ ' పదంలో ఉన్న కిక్ తెలియనిదెవరికీ!! అందుకే ఆ డబ్బాలు త్వరత్వరగా ఫిల్ అయిపోతాయి :-)

“మీరు కేకులతో కొడతారా! మేం చూడు లంచ్ సాండ్విచ్ లతో వచ్చాం!!” అని ఒక డిపార్ట్మెంట్ అంటే “అసలు ఐస్క్రీం కి నో అనగలిగే ప్రాణి ఈ బిల్డింగ్ లో ఉందా!?” అని ఇంకొకరు సవాలు విసురుతారు.. రోజూ ఇలా ప్రచ్చన్న యుద్దాల మీద యుద్దాలు జరుగుతుండగా ఒకరోజు లంచ్ రూంలో కూర్చుని యధావిధిగా ఆకులు అలములూ నములుతూ, కొన్ని రోజుల్లో మా ఇంట్లో జరగబోయే దీపావళి పార్టీ గురించి మా కోవర్కర్స్ కి చెప్తుంటే వేంఠనే డార్లీన్ అనే అమ్మాయి "దివాలి పేరుతో యునైటెడ్ వే కి ఏదన్నా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఎలా ఉంటుందీ" అని అన్నది! ఆ ఆలోచన వినగానే ఉత్సాహం వేసి 'వై నాట్.. ష్యూర్.. ష్యూర్ ' అనేసినా ఆ తర్వాత నిమిషం నించీ మనసులో సందేహాల మీద సందేహాలు.. ఆ తర్వాత 'ఇది సాధ్యమయ్యే పని కాదులే' అనిపించింది!
అలా మొదట్లో వెనుకంజ వేయడానికి కారణాలు --- మొదటిది, మా డిపార్ట్‌మెంట్లో ఉన్నది ఒక పూర్తి ఇండియన్ అయిన నేనూ, జీన్‌స్లో మాత్రమే భారతత్వం ఉన్న ఆధా ఇండియన్స్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు (అందులో డార్లీన్ ఒకరు)..  రెండో ముఖ్య కారణం మాకున్న వర్క్ లోడ్.. ఫండ్‌రైజింగ్ చేస్తున్నాం కదాని మా పెద్దాయన పనేమీ తగ్గించడు సరి కదా, ప్రతిరోజూ మీటింగ్లో ప్రోజెక్ట్ డెడ్ లైన్లు కొంచెం ముందుకు జరిపి, "మన వాళ్ళ సేల్ పనులు ఎలా సాగుతున్నాయి?" అని అడిగే రకం.. కానీ ఆది సందేహాలు ఎలా ఉన్నా 'చేసేద్దాం' అని ముగ్గురం నిర్ణయించేసుకున్నాం.

ఇక ఫ్లైయర్స్, టికెట్స్ డిజైన్ చేసి ప్రింట్ చేసి వాటిని అమ్మడం మొదలుపెట్టాక గానీ అసలు కష్టం కళ్ళముందు నిల్చోలేదు!! వంద టికెట్లు కనీసం అమ్మాలి! మేం ముగ్గురమూ ఒకటి కొనమంటే మూడు కొనే రకాలం కానీ అమ్మమంటే 'పరుల సొమ్ము పాము వంటిది ' అని పక్కకి తప్పుకుని బిత్తరచూపులు చూసేవాళ్ళమే! కాకపోతే మా బాసులు (ముగ్గురం వేరే వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తాం) పాపం వాళ్ళు వెళ్ళిన మీటింగ్స్ లో మా తరుపున ప్రచారం చేశారు.. మా పెద్దాయన అయితే కనబడిన ప్రతివాళ్ళకీ "there is a 'raa' party on so and so date.. make
sure to buy a ticket" అని అందర్నీ ఊదరగొట్టేశారు! (ఈ 'రా' వెనక చిన్న పిట్ట కధ.. చివర్లో :-) )


అలా ఏవో తంటాలు పడి టికెట్లయితే అమ్మేస్తున్నాం గానీ అసలు అరేంజ్‌మెంట్స్ దగ్గరికొచ్చేస్రికి మళ్ళీ టెన్షన్ -- అంతమందికి ఫుడ్ సరిగ్గా ఏర్పాటు చేయగలమా లేదా అని కొంతా, సరైన రూం దొరక్క మరి కొంతాను.. ముగ్గురం ఏమేం చేసుకురావాలో నిర్ణయించుకున్నాక మాలో ఒకమ్మాయికి కాస్త అర్జెంట్ పని వచ్చి తను పూర్తిగా దొరక్కుండా పోయింది.. ఇక మిగిలింది ఇద్దరమే!

మరి మేమిద్దరమే ఈ పనిని పూర్తి చేయగలిగామా!?!? లేదా.. వేచి చూడండి, వివరాల కోసం.. ఒక్కరోజు మాత్రమే!
:-)
 
  

Wednesday, January 26, 2011

అనగనగా ఒకరోజు..

(మొదటి ప్రచురణ మాలిక పత్రికలో )

"రేపు బోల్డంత పని ఉంది.. తలచుకుంటేనే నీరసం వస్తుంది!"
"ఇప్పుడేగా చేపల పులుసు బావుందంటూ అన్నం తిన్నారు! నీరసమై ఉండదు.. భుక్తాయాసమేమో?! మీరసలే తెలుగులో వీక్."
"నా తెలుగుకొచ్చిన ప్రోబ్లెమేమీ లేదు కానీ రేపు నేను గరాజ్ క్లీనింగ్ చేసుకోవాలి."
"దాందేముంది.. నేను హెల్ప్ చేస్తాను.. మీరు కూడా క్లీనింగ్ లో ఓ చెయ్యేయండి.. మీరే అంటారుగా టీం వర్క్ టీం వర్క్ అని."
"అమ్మో, నువ్వు మాత్రం నా పనిలో చేయి పెట్టకు.. అంతకుముందు నేను ఊర్లో లేనప్పుడు చూసి నా టూల్స్ అన్నిటినీ సర్దేశావ్.. ఆ తర్వాత ఏది ఎక్కడుందో వెతుక్కోలేక నేనైపోయాను.. నా పని నేను చేసుకుంటాను కానీ రేపొక్కరోజు మాత్రం you have to manage all the cleaning and mopping!"
"వెతుక్కోలేక మీ పని అయిపోయిందా? ట్రాన్స్పరెంట్ బాక్స్ లు తెచ్చి అన్నిటిని ఆర్గనైజ్డ్ గా సర్ది బయట లేబుల్స్ కూడా అతికించాగా?"
"అదే, ఆర్గనైజ్డ్ గా అని నువ్వనుకుంటావు.. నీకసలు టూల్స్ గురించేమీ తెలీదు.. ఒకేలా కనిపించాయి కదా అని ఒక బాక్స్ లో పెట్టేస్తావు."
"ఓ! ఒకేలా కనబడితే వాటిని వేరే వేరే బాక్సుల్లో పెట్టి, కొన్ని వంటిట్లో నా పోపుల డబ్బా పక్కన, ఇంకొన్ని బాత్రూం లో మీ షేవింగ్ కిట్ కింద పెట్టాలి కాబోలు!"
"ఛ నీకంతా వేళాకోళమే.. అయినా ఆ బండ పనులు నీకు చెప్పడం నాకిష్టంలేదు."
"అవును! జీడిపప్పు, బాదాం పప్పు వేరుచేసినట్లు ఒక చోట కూర్చుని ఆ నట్లూ బోల్ట్లూ వేరు చేయడం బండ పని.. ఇల్లంతా వాక్యూం చేసి, మాప్ చేయడం.. తళతళాలాడేలా బాత్రూం లు తోమడం నాజూకు పని!"
"నట్లూ, బోల్ట్లూ నా! అసలు వాటి విలువ తెలుసా నీకు!"
"విలువేమో కానీ వయసు మాత్రం బాగా తెలుసు! మా అమ్మమ్మ బారసాలప్పుడు తయారు చేసినవేమో అవి!"
"వాటినే యాంటీక్స్ అంటారే పిచ్చిమొహమా!"
"ఓ యాంటీక్ స్క్రూ డ్రైవర్, రెంచ్ లూ కూడా ఉంటాయన్నమాట.. ఎప్పుడో మీరు లేని రోజు చూసి వేలం వేసి పడేస్తా!"
"ఓయ్ అంతపని చేశేవు.. మళ్ళీ తర్వాతెప్పుడో నా మీద కోపమొచ్చి నువ్వు తట్టాబుట్టా సర్దుకునెళ్ళిపోతే నీకు రావాల్సిన భరణం నువ్వే పోగొట్టుకున్నట్లుంటుంది!"
"ఛ అదేం కాదు."
"నాకు తెల్సమ్మా.. ఎప్పటికీ నీ తోడూ నీడా నేనే అనుకుంటావని.. నన్నొదిలి వెళ్ళవనీ."
"గాడిద గుడ్డేం కాదూ!ఆ పాత ఇనప సామాను ఇస్తారా నాకు భరణం కింద!"
"నువ్వు చాలా ఎదిగిపోతున్నావే!"
"బాబూ, ఈ గొడవంతా ఎందుకుగానీ మీ పని మీరు చేసుకోండి.. ఏవో తంటాలు పడి ఇంట్లో పనంతా నేను చేసుకుంటాను.. ఏదో మన గెస్ట్ లు వచ్చేది ఎల్లుండే కదా, రేపొక్కరోజు తప్ప పనంతా చేయడం కుదరదని మీమీద ఆశ పెట్టుకున్నాను."
"వాళ్ళు గెస్ట్ లేంటి.. మన ఇంట్లో వాళ్ళే కదా.. వాళ్ళొస్తుంటే కూడా సర్దడం అవసరమా? అయినా పోయిన శనివారమే కదా క్లీన్ చేశాము!"
"నిజమే మరీ ప్రతీ వారం ఎందుకులేండీ ఇల్లు తుడుచుకోవడం.. సీజన్ కోసారి చేసుకుంటే సరిపోతుంది.. సర్లే నాకు నిద్రొస్తోంది.. పడుకుందామా?"
"నువ్వెళ్ళు నేను కాసేపు క్రికెట్ చూసొస్తాను."



                                                            ********

"గుడ్ మార్నింగ్ హనీ, బ్రేక్ ఫాస్ట్ బయటనించి తీసుకురానా?"
"అక్కర్లేదు, దోసెలు పిండి ఉంది."
"ఆ మళ్ళీ అంతసేపు నించుని ఏం వేస్తావులే.. అసలే మనకి చాలా పనుంది ఈ రోజు."
"ఆమాటేదో నిన్న రాత్రి టూల్సూ వాటి విశిష్టత గురించి మాట్లాడుతునప్పుడే చెప్పొచ్చు కదా.. పొద్దున్నే లేచి ఆ కొబ్బరి పచ్చడి చేసిన టైంని వేరేదానికి వాడుకునేదాన్ని!"
"ఎలా అయినా టైం మేనేజ్మెంట్ నీదగ్గర నించే నేర్చుకోవాలి.. అవునూ, అదేం వర్డ్ హనీ, 'విశిష్టతా'.. భలే ఉందే!అర్ధం ఏమిటంటావ్?"
"ఓవర్ యాక్షన్ తో పొద్దున్నే వికారం తెప్పించకండి.. మీరు మీ గరాజ్ లోకి కదిలితే నేను దోసెల పని కానిస్తాను."
"సరే సరే.. ఓ కప్పు కాఫీ తీసుకుని I'll be out of your way."


                                                         ********


“ఇదేంటీ, నానారాకాల టూల్సూ, వాటికి సంబంధించిన డబ్బాలూ నేలంతా పరిచేశారు? నాకైతే సర్దుతున్నట్లనిపించడం లేదు.. ప్లే ఏరియాలో ఆడుకుంటున్నట్లుంది!"
"చూశావా! ఎంత పని ఉందో చూడు.. చెప్తే అర్ధం చేసుకోవు."
"అదేంటీ, ఎందుకలా వాటన్నిటినీ అలా మూలకి తోస్తున్నారు?"
"కింద డర్టీగా ఉంది.. ఒకసారి గబగబా ఊడ్చేసి అప్పుడు సర్దడం మొదలుపెడతాను."
"ఓ అవన్నీ కింద పరిచాకగానీ మీకర్ధం కాలేదా నేలంతా దుమ్ము ఉందని?!"
"అబ్బా! నా పని నన్ను చేసుకోనీ.. మధ్యలో నీ నసేంటి.. నేనెలాగో చేసుకుంటాను కానీ నీ పని నువ్వు చేసుకో వెళ్ళి."
"....చేసేదేం లేదు కానీ మళ్ళీ ఆ కోపమొకటి!"


                                                              *********


(ఒక ఇరవై నిమిషాలయ్యాక..)
"బంగారాలూ, ఏం చేస్తున్నావూ?"
“ ……”
"నిన్నే హనీ."
"విషయం చెప్పండి!"
"డిన్నర్ ఇటాలియన్ ఆర్డర్ చేసుకుందామా?"
"పొద్దున్నే పదకొండింటికి డిన్నర్ సంగతెందుకుగానీ అసలు విషయం చెప్పండి.. నాకు పని ఉంది."
"అదేదో నీ బాక్స్ అనుకుంటా, ఫ్లవర్ వేజ్ లా ఉంది."
"అవును, మా కోవర్కర్ బర్త్ డే గిఫ్ట్ అది.. ఉండండి కార్లో పెట్టేసుకుంటాను."
"అది కాదు బంగారాలూ.. బాక్స్ పైన బొమ్మ చూస్తే యాష్ ట్రే లా కనిపించింది."
"ఫ్లవర్ వాజ్ మీకు యాష్ ట్రే లా అనిపించిందా?!?!"
"అంటే కరెక్ట్ గా అలానే కాదనుకో.. కానీ తీసి చూస్తే పోలా అనిపించి బయటకి తీసి చూశాను."
"అప్పుడైనా మీ సందేహం తీరిందా? ముందది కార్లో పెట్టేయండి మహానుభావా!"
"అక్కడికే వస్తున్నా.. చూసి పక్కన పెట్టి మళ్ళీ నా పనిలో పడిపోయాను.. అంతలో చేయి తగిలి పడింది.."
"ఏంటీ!! పడిందా? పగిలిందా??"
"పూర్తిగా పగల్లేదనుకో.. జస్ట్ గ్లాస్ క్రాక్ అయింది."
"జస్ట్ క్రాక్ అయిందా! ఇంక అదెందుకు పనికి వస్తుంది.. అసలు మీ పని మీరు చూసుకోక నా వస్తువుల జోలికి ఎందుకు వెళ్ళారు??"
"ఎందుకలా అరుస్తావ్? ఏదో అక్కడుంది కదాని తీసి చూశాను.. నువ్వు ఎక్కడబడితే అక్కడ పడేసి 'ఎందుకు తీశావ్.. ఎందుకు చూశావ్' అంటే ఎలా? అయినా ఇల్లంతా సరిపోలేదా? ఈ వేజ్ లూ బొచ్చెలూ తెచ్చి తెచ్చి గరాజ్ లో పెట్టడానికీ?"
"అంటే గరాజ్ లో మీ వస్తువులొక్కటే ఉండాలా?"
"అలా అన్నానా? అదేదో జాగ్రత్తగా పక్కన పెట్టుకోవచ్చుగా?"
"నిజమే, మా ఇంట్లో మూడు పదులు దాటేసిన ముక్కుపచ్చలారని పసిపిల్లాడు ఉన్నాడు, వస్తువులన్నీ అందకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్న విషయం నేనే మర్చిపోయాను."
"అదిగో ఇప్పుడు నేనేమన్నాననీ అంత కోపం?"
"మీతో నాకు వాదనలొద్దుగానీ నేను కాసేపు బయటికెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుంటాను."
"సరే.. ఎదో ఒకటి చెయ్యి.. నా పని ఎక్కడిదక్కడే ఉంది."


                                                                    *********

"హల్లో హనీ! ఇంకా రాలేదే! మిస్సింగ్ యు, యూ నో!"
"మళ్ళీ ఏం కావాలీ?"
"అసలు సిసలు బెటర్ హాప్ఫ్ నువ్వే హనీ,నా అవసరాలన్నీ టక్కున పట్టేస్తావ్."
"సుత్తాపి విషయం చెప్పండీ."
"ఏం లేదు, ఇంకా స్టొర్ లోనే ఉన్నావా?"
"అవును.. ఏం?"
"నీ లంచ్ సాలడ్స్, అలానే ఫ్రూట్స్ తెచ్చుకోవడం మర్చిపోకు.. ఇప్పుడు ఫ్రెష్ గా పైనాపిల్స్ వస్తున్నాయి."
"అదే చేత్తో మీకోసం ఓ పనసకాయ కూడా తెస్తున్నా!"
"పనసకాయా? ఎందుకూ? పప్పులో వేస్తావా?"
"లేదు ఊరగాయ పెడతాను.. ఇంతకీ అసలు సంగతి చెప్తారా?"
"ఏం లేదు, కాస్త నా బీర్ తీసుకు రా ప్లీజ్"
"బీరా! ఐ కాంట్.. నా ఐడీ ఇంట్లోనే వదిలేసొచ్చాను"
"సో.... నిన్నెందుకు ఐడి అడుగుతారు?"
"అంటే?"
"చిన్నపిల్లలా కనిపిస్తే డౌటొచ్చి ఐడి అడుగుతారు హనీ!"
"అదే, మీ ఉద్దేశ్యం ఏంటీ అని?!"
"అంటే నువ్వు... ఓ.. ఓ.. మై! ఛ నా ఉద్దేశ్యం అస్సలది కానే కాదు.. ప్లీజ్."
"హ్మ్మ్.. బీరొక్కటేనా? ఇంకో ఐదునిమిషాలాగి 'అగ్గిపెట్టె హనీ' అని మళ్ళీ కాల్ చేస్తారా?"
"నాకింకేమీ అక్కర్లేదు కానీ నువ్వు ఐస్క్రీం కూడా తెచ్చుకో.. చాలారోజులైంది తిని పాపం."
"నేను ఏమేమి ఎన్నెన్ని రోజులు తింటున్నానో గమనిస్తున్నారన్నమాట! గుడ్ టు నో! ఇంక ఉంటా!"

                                                              *********

"ఇంకా సర్దడం అవ్వలేదా?"
"ఇంకెంతసేపు.. ఇదిగో అలా sort చేసి ఇలా సర్దేస్తాను."
"నేను బయటకెళ్ళినంత సేపూ ఏం చేశారు?!"
"జేన్ ఏదో హెల్ప్ కావాలంటేనూ వాళ్ళింటికెళ్ళి చేసొచ్చాను."
"ఆవిడొచ్చి అడిగిందా?"
"లేదే పాపం ఆవిడెందుకు అడుగుతుంది? డాగ్ ని వాక్ కి తీసుకెళ్తుంటే చూసి నేనే పలకరించి అడిగాను, ఏమన్నా పనుంటే చెప్పమని."
"మీరే అడిగారా????"
"అవునే, పాపం ఈసారి మనకి క్రిస్మస్ గిఫ్ట్ అందరికంటే ముందే ఇచ్చేసింది కదా! అందులో పెద్దావిడ కూడా"
"..........."
"అంత కోపమెందుకు? చిన్న పనే.. డెకరేషన్ లైట్లేవో సరిచేయాల్సొచ్చింది."
"వాటెవర్.. ఇంకా ఇంట్లో సగం పని అలానే ఉంది.. చివర్లో కాస్తన్నా చెయ్యేస్తారా?"
"నువ్వలా వెళ్ళి చేస్తుండు.. అరగంటలో వచ్చేస్తా."

                                                      *********
"హనీ.. హనీ.. "
"Is that you? Where are you?"
"I'm here at Chris's place, can you please pass the flash light I bought the other day?"
"what the !@#$%, అక్కడేం చేస్తున్నారూ?"
"అమ్మో, అదేంటీ అలా బూతులు తిడతావ్? వీడి టివి సౌండ్ పనిచేయడంలేదంట.. కాస్త చూడమని కాల్ చేశాడు."
"అదే మరి! తమరు మన కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ మానేజర్ కదా.. ఒక నిమిషంలో అక్కడ వాలిపోయుంటారు!"
"అది కాదే, పాపం ఇంకాసేపట్లో పేట్రియాట్స్-రెడ్ స్కిన్స్ గేం ఉంది... అందుకే వచ్చాను."
"ఇంకేం తమరు కూడా గేం చూసి, అక్కడే తిని, తొంగోండి."
"అంత విసుగెందుకు చెప్పు.. కాస్త ఆ ఫ్లాష్ లైట్ నా మొహాన పడేస్తే వెళ్ళి ఒక్క నిమిషంలో వాడి పని చూసొస్తాను."
"మీతో ఇక మాటలనవసరం."
"పడెయ్యమమంటే విసిరెయ్యడమే! GOD! you're too much!!”

                                                         *********


"ఇవాళ డిన్నర్ సంగతేంటీ?"
"ఇటాలియన్ అని తమరే సెలవిచ్చారుగా!"
"అబ్బా, ఇప్పుడు ఆ బయట ఫుడ్ మీద అస్సలు మూడ్ లేదు.. చక్కగా ఇంట్లోవే తినేద్దాము.. ఫ్రిజ్ లో ఏమేం కూరలున్నాయి?"
"గుత్తి గుమ్మడికాయ.. బగారా బంగాళదుంప."
"you mean no proteins!!!"
"sorry, మర్చిపోయా.. ఆ డబ్బాలో కిలో కందిపప్పు కూడా ఉంది!"
“పొద్దున్నించీ పనిచేసి అలిసిపోయిన మొగుడికి చక్కని చికెన్ కూరతో తిండి కూడా సరిగ్గా పెట్టలేవన్నమాట!"
"......."
"అదేంటీ, అంత కోపం!! btw, కోపంలో నీ ఫేస్ అస్సలు బాగోదు.. యాక్."
"whaaaat!!!"
"am just being honest. నేను ఏమన్నా నీ మంచి కోసమే హనీ!"
"........"
"ఇంకా కోపమేనా? చెప్పా కదా నేను చేసేవన్నీ నీ మంచి కోసమే అని!"
"ఇంటెడు పని నామీద పడెయ్యడం నా మంచి కోసమా?!?!"
"మరి! నామీద కోపంతోనే కదా అన్ని పనులు.. అవసరమైనవీ, అవసరంలేనివీ టకటకా చేసేసుకున్నావ్.. ఇక నీకు వారం వరకూ ఎక్సర్సైజ్ అవసరం లేదు.. మన గెస్ట్స్ వెళ్ళేవరకూ నీ Curves జిమ్ము మొహం చూడక్కర్లేదు. అసలు నీ curves కి ఏం తక్కువైనాయని మళ్ళీ ఆ జిమ్ముకి పడీ పడీ వెళ్తావ్?"
"తక్కువై కాదు ఎక్కువై వెళ్తున్నా!"
"Seriously honey, you look perfect."
"ఇప్పుడే ఏదో యాక్.. థూ.. ఛీ.. అన్నట్లు గుర్తు?!"
"అబ్బా, అది కాదు కానీ పొద్దున్న నేను మధ్యలో ఏదో పని మీద ఇంట్లోకొచ్చినప్పుడు హగ్ చేసుకోలేదూ?ఎందుకూ, క్యూట్ గా కనిపించావనే కదా?"
"అప్పుడు నేను బాత్రూం సింక్ లు కడుగుతున్నట్టు గుర్తు!"
"మల్లెపూలూ, తెల్లచీరా కట్టుకున్నప్పుడు బావున్నావని లొట్టలేస్తూ అందరూ చెప్తారమ్మా!"
"జిడ్డోడుతున్నప్పుడు చెప్పడమే మీ స్పెషాలిటీ అంటారు!"
"నిజం హనీ, అలా పనులన్నీ చక చక చేసేస్తూ, ఇంటి మహరాణిలా కనబడుతుంటే ఎంత ముద్దొస్తావో తెలుసా?"
"చిన్నప్పుడు చందమామలు చదవని ఎఫెక్ట్ అన్నమాట! లేకపోతే మహారాణి చేత బాత్రూం సింక్ లు
కడిగించేవారా?”
"అప్పుడు చదవకపోతేనేం.. ఇప్పుడు నువ్వు చెప్పు, రోజూ రాత్రి పడుకునేప్పుడు.. నా మహారాణిని ఎంతబాగా చూసుకోవాలో నేర్చుకుంటాను"
"(చిరునవ్వు)"
"wow! ages అయినట్లుంది నీ నవ్వు చూసి!"
"వీటికేం తక్కువలేదు.. పనంతా నాతో చేయించి చివర్లో ఇలా బటర్ పూయడం"
"అది కూడా 'I can't believe it's not Butter' హనీ"
"(నవ్వు)"
"బైదవే, పొద్దున్న జేన్ వాళ్ళ పోర్చ్ మీద లైట్స్ ఫిక్స్ చేస్తుంటే ఆవిడ నీకో కాంప్లిమెంట్ ఇచ్చింది"
"ఏంటంట"
"నువ్వు చాలా లక్కీ అంట"
"ఎందుకో?"
"ఇంకెందుకూ, నాలాంటి అన్ని పనులూ తెల్సిన హజ్బెండ్ దొరకడం వల్ల"
"(!$%#^*(!@#(*$^)"
"అదిగో మళ్ళీ ఆ ఫేసేంటీ.. అలా?!?! సర్లే, ఇప్పుడు ఆవిడ సంగతెందుకు గానీ గుత్తి పనసకాయ కూరేదో ఉందన్నావు కదా, దాంతో తినేద్దాం.. ఇవాళ్టికి ప్రోటీన్స్ వద్దులే.. సరేనా?"
"....................................................................................................................."

                                                                 *************