Pages

Friday, January 23, 2009

'ఊసులాడే ఒక జాబిలట!' పూర్తి నవలా రూపంలో..

కౌముది వారు విన్నూత్నంగా ప్రవేశపెట్టిన 'ఇంటింటా కౌముది ఉచిత గ్రంధాలయం' అనే అంశంలో భాగంగా 'ఊసులాడే ఒక జాబిలట!' లోని అన్ని భాగాలు కలిపి, చక్కని ముఖచిత్రంతో ఒకే పి.డి.ఎఫ్ ఫైలుగా మార్చి, పుస్తక రూపంలో అందిస్తున్నారు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.


31 comments:

మధురవాణి said...

నిషి గంధ గారూ..
ఇటీవలే మీ నవలని చదివాను. ఒక రోజు అనుకోకుండా రాత్రి పన్నెండు దాటాక మీ నవల కళ్ళబడింది. మొదలు పెట్టి మూడు నాలుగు గంటల్లో ఆపకుండా పూర్తిగా చదివేసాను. కనీసం మంచి నీళ్ళు తాగడానికి కూడా లేవలేదు. అంటే అలా కదలకుండా కూర్చోబెట్టింది మీరు రాసిన కథ. అసలైతే నేను చాలా ఫాస్ట్ గా చదివే టైపు. కానీ.. మీ నవల మొత్తం ఉత్తరాలవడం మూలానా.. ప్రతీ లైనునీ మీరు ఎంత పొందికగా రాసారో..! మీరు నమ్ముతారో లేదో.. నిజంగా ఒక్కో లైనునీ ఆస్వాదిస్తూ చదివాను :) మీ రచనా శైలి నవలలో పాత్రలందరినీ పక్కనే ఉంది చూస్తున్నట్లు భ్రమింపచేసింది. చాలా నవలల్లో ఒక భాగం బావుందనో.. సన్నివేశం బాగా రాశారనో అనిపిస్తుంది. కానీ.. మీ నవలలో ప్రతీ లైనూ చాలా అందంగా, అర్ధవంతంగా.. మనసుకి హత్తుకోనేట్లుగా ఉన్నాయి. అసలు మీరెంత ఆలోచించి రాశారో అంత అద్భుతంగా రావడానికి అని నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాను.
మొత్తానికి నేను మీకు పేద్ద విశనకర్ర, ఫాను, ఏసీ, హీటింగ్ సిస్టమ్ వగైరాలాంటివన్నీ అయిపోయాను. నిజ్జంగా నిజమండీ.. అసలు ఇంకా బోలెడంత చెప్పాలని ఉంది గానీ.. ఏమని చెప్పాలో తెలిట్లేదు. ఈ వ్యాఖ్య చూసి.. మీరు రాసింది నాకెంత బాగా నచ్చింది అని మీకు తెలియచెప్పాలనే నా ఆరాటం మీకు అర్ధం అవుతుందని భావిస్తాను. ఎందుకంటే.. ఇలాంటి ఫానులు, ఏసీలు ఇప్పటికే బోలెడు మంది చెప్పీ చెప్పీ మిమ్మల్ని ఊదరగొట్టేసి ఉంటారు కదా.. :)

కథ గురించి మరో మాట..! మొత్తం అయిపోగానే నా కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. ఒకవేళ ఇది నిజంగా జరిగిన కథ కాకపోయినా నాకు అలాగే అనిపించేదనుకుంటా.. ఎందుకంటే మీ రచనా శైలి వల్ల.. నిజంగా జరిగినట్టే నేను కథలో లీనమైపోయాను. మీరు నమ్మరేమోగానీ.. కార్తీక కథలోంచి బయటికి రావడానికి నాకు రెండు వారాలు పట్టింది. ఏదో ఒక పని చేస్తూ ఉన్న.. ఏవేవో ఆలోచించేదాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి. వినడానికి కాస్త సిల్లీగా ఉందేమో కానీ.. నిజంగా చదివిన కథ కి ఇంత స్పందించడం నాకైతే ఇదే మొదటిసారి.

మీ రచన పట్ల నా అనుభూతిని నేరుగా మీకే తెలియచేయగలిగే అవకాశం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఫ్రెండ్స్ అందరికీ మీ కథ link పంపించాను. అర్జెంటుగా చదివెయ్యమని.. :)
ఓపికగా నా చాంతాడంత వ్యాఖ్యని చదివినందుకు ధన్యవాదాలు.

నిషిగంధ said...

మధుర వాణి గారు, ఎంతో అభిమానంగా మీరు రాసిన సుదీర్ఘమైన వ్యాఖ్యకి నెనరులు.. అయినా ఎవరైనా పొగుడుతుంటే వ్యాఖ్య చాంతాడంత ఏమిటి చైనా గోడంత ఉన్నా చాలా బావుంటుంది నాకు :)) *j/k*
ప్రస్తుతానికి నాకు పేద్ద విశనకర్ర, ఫాను, ఏసీ, హీటింగ్ సిస్టమ్ ఇవేమీ అక్కర్లేదు కానీ ఇంకో స్నేహితురాలు కావాలి.. ఆలోచించుకోండి మరి :-)
కార్తీక కధ మీ మనసుని కూడా టచ్ చేసినందుకు ఈ రచనపై నాకున్న అంచనా ఇంకాస్త పెరిగింది!
Thanks again for your nice feedback!

Niranjan Pulipati said...
This comment has been removed by the author.
Niranjan Pulipati said...

Thanks to koumudi and you Nishi for providing in single PDF.. :)

సుజాత వేల్పూరి said...

కల నిజమాయెగా,
కోరిక తీరెగా,
సాటి లేని రీతిగా,
మదినెంతో హాయిగా......

అదిసరే..నిషిగంధా, ఈ పాట ఎందులోదో చెప్పగలరా?

నిషిగంధ said...

Sujata :-)
old old Samsaram??

మురళి said...
This comment has been removed by a blog administrator.
మురళీ కృష్ణ said...

నిషి గంధ గారికి..


'ఊసులాడే ఒక జాబిలట!' ద్వారా స్వచ్ఛమైన స్నేహాన్ని, అందమైన కుటుంబాలను పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Complete Novel PDF లో వుండటం వల్ల, మొత్తంగా ప్రింట్ తీసి, ఇంట్లో వాళ్ళతో కూడా చదివించటానికి వీలయింది. కౌముది వారికి కూడా నా కృతజ్ఞతలు.

నిషిగంధ said...

Thanks so much for your feedback Murali Krishna gaaru :-)

Unknown said...

Nishagandhi gaaru mee novel ippudE chusaanu, chadivaanu SUPER, ee madhya asalu kudaratledu .Late gaa chusunaa asalu chusaanani aanamdangaa undi.

GREAT WORK

Gopavaram said...

Nishigandhi Garu...

Meru Rasina usulade jabilata Novel chadivanu, Nenu adi chadivi chala feel ayanu andi, nijamgaaa kiran prabha garu, kranti garu ela tatukunaro naku ardamkavatamledu, Aaa Novel anta baga rasinaduku meku ela abhinadana chepalo kuda teliyatam ledu, eee rojulo kuda novel chadivi abinandana chepay vidamgaa novels rastunaru ankuntaynay chala anandam gaaa vundi, andulo inta baga novel rasutuntay inka anandamgaa vundi andi, Nenu Naa life lo first time office ki leave tesukoni mee novel chadivanu andi,
Great Nishigandi garu, Naku deniki emi Birudu evalo kuda teliyatamledu andi, naalaga abhimanichay vallu meku chala mandi vuntuanukunta, valalo nenu kuda okadini, meru inka elanti manchi(chepalenta) Novels rasutaru ani eduruchustu mee abimani........Abhilash Muthineni

నిషిగంధ said...

అభి గారు, నవలంతా చదివి ఇంత చక్కని స్పందన రాసినందుకు మీకు నా కృతజ్ఞతలు! ఈ నవలలోని గొప్పతనమంతా కార్తీక కధలోనే ఉందండి.. దానిని మన పాఠకుల ఎదుటకి తీసుకురావడనికి నాకు చేతనైనంత సాయం చేశాను, అంతే! కానీ వర్క్ కి ఆఫ్ తీసుకుని మరీ చదివారు అంటే సంతోషించాలో లేక మీ పనిదినాన్ని వృధా చేసినందుకు బాధ పడాలో అర్ధం కావడంలేదండి! మీ అభిమాన పూర్వక స్పందనకి మరొక్కసారి ధన్యవాదాలు :-)

kiran said...

hello Nishigandha garu...

nenu one week back ii novel chadivanu..asalu office lo 2 page la tho modalu pettanu..ika pani start ayyindi..kani manasantha novel meede undi...intikochi entha exciting ga mottam chadivesano...ii madya nenu chadivina novels lo adbuthamainadi meede...meeru rasina prathi sentence superb andi asalu..kani ending chadivi..edupu aagaledu.. :(...ento mari okokka sari karthika lanti telivaina vallu kuda ila alochinchestu untaru...mottaniki mee novel superb..!! :)

నిషిగంధ said...

థాంక్యూ సో మచ్ కిరణ్ గారు :-)
నిజమే, కార్తీక నిర్ణయం తలచుకున్నప్పుడల్లా నన్ను ఆలోచనలోకి నెట్టేస్తుంది.. నిజంగానే బాధ భరించలేకా, లేక భర్తని ఆందోళన నించి తప్పించడానికా తను ఆ పని చేసింది అనిపిస్తుంది!

Arun Kumar said...
This comment has been removed by the author.
Arun Kumar said...
This comment has been removed by the author.
Arun Kumar said...
This comment has been removed by the author.
Arun Kumar said...

నిషి గంధ గారూ..
ఇటీవలే మీ నవలని చదివాను.ప్రతీ లైనునీ మీరు ఎంత పొందికగా రాసారో..! మీరు నమ్ముతారో లేదో.. నిజంగా ఒక్కో లైనునీ ఆస్వాదిస్తూ చదివాను :) మీ రచనా శైలి నవలలో పాత్రలందరినీ పక్కనే ఉంది చూస్తున్నట్లు భ్రమింపచేసింది. చాలా నవలల్లో ఒక భాగం బావుందనో.. సన్నివేశం బాగా రాశారనో అనిపిస్తుంది. కానీ.. మీ నవలలో ప్రతీ లైనూ చాలా అందంగా, అర్ధవంతంగా.. మనసుకి హత్తుకోనేట్లుగా ఉన్నాయి. అసలు మీరెంత ఆలోచించి రాశారో అంత అద్భుతంగా రావడానికి అని నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాను.మొత్తానికి నేను మీకు అభిమాని అయిపోయాను. అసలు ఇంకా బోలెడంత చెప్పాలని ఉంది గానీ.. ఏమని చెప్పాలో తెలిట్లేదు. ఈ వ్యాఖ్య చూసి.. మీరు రాసింది నాకెంత బాగా నచ్చింది అని మీకు తెలియచెప్పాలనే నా ఆరాటం మీకు అర్ధం అవుతుందని భావిస్తాను.
కథ మొత్తం అయిపోగానే నా కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.
'ఊసులాడే ఒక జాబిలట!' ద్వారా స్వచ్ఛమైన స్నేహాన్ని, అందమైన కుటుంబాలను పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

నిషిగంధ said...

అరుణ్ కుమార్ గారు, ఇలాంటి ప్రశంసలు వచ్చినప్పుడు సమాధానంగా ఏమి చెప్పాలో కూడా తెలీక 'మూగబోవడం' అంటే ఏమిటో అనుభవానికి వస్తుంది.. మీ అభిమానానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు :-)

Arun Kumar said...

నిషి గంధ గారూ..
ఈ ప్రశంసలకి కారణం మీ కలం నుండి జాలువారిన ఈ నవల. ఎంత బాగా రాసారంటే చదువుతుంటే ఏదో తెలియని గొప్ప అనుభూతి, మా కళ్ళ ముందే జరిగినట్టుంది. మొదటి నుండి చదువుతుంటే ఎంతో సరదాగా సాగిపోయింది కానీ చివరికి కార్తిక చనిపోయింది అని చెప్పినప్ప్డు నా కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.
కానీ చాలా బాగా రాసారండి. నేను చదవడమే కాక అచ్చు వేయించి మా స్నేహితులకి కూడా చదవదంకి ఇచ్చాను, ఎందుకంటే ఈ స్వచ్ఛమైన స్నేహాన్ని, వాలకి కూడా పరిచయం చేద్దామని.
మీ రచన పట్ల నా అనుభూతిని నేరుగా మీకే తెలియచేయగలిగే అవకాశం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఫ్రెండ్స్ అందరికీ మీ కథ link పంపించాను. అర్జెంటుగా చదివెయ్యమని.. :)
ఇంకా ముందు ముందు మరెన్నో రచనలు చేయాలనీ అభిలషిష్స్తూ

మీ అభిమాని
అరుణ్ కుమార్

Unknown said...

నిషి గారు! మీ నవలలో ప్రతి వాక్యం నాకు నచ్చింది.
అన్నింటికన్నా బాగా నచ్చింది ఒకటి ఉంది ఎ పాత్ర ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకూ అంటే ఒక పరిధి దాటకుండా ఎంతో చక్కటి వ్యక్తిత్వంతో ప్రవర్తించడం నన్ను చాలా ఆకట్టుకుంది.బహుశా అందువల్లనేనేమో నవల మొత్తం మీరు ఉత్తరాలతో నడిపినా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు.ఇంకోటి...మీ నవల చదివాక ఎవరికీ అయిన మళ్లి మెయిల్స్ అవి మానేసి ఉత్తరాలు మొదలు పెట్టి అక్షరాల పారిజాతాలు , పొగడలు గుచ్చితే బావుండు అని అనిపిస్తుంది.
మరోసారి మీకు ధన్యవాదాలు.

Dhruva said...
This comment has been removed by the author.
Dhruva said...

Antha Bagundandi.. Chivarlo Kartika chanipoindi ane badha kante.. You made her commit suicide is something i couldn't digest.. Karthika is a fighter andi.. Cancer tho poradi chanipoindi ani end chesunte bagundedi.. I still cannot make myself believe that the Karthika in my Mind.. is someone who will Commit suicide and Die.

Dhruva said...
This comment has been removed by the author.
జయ said...

నిషిగంధ గారు,

మధురవాణి గారి లేటెస్ట్ పోస్ట్ చూసిన తరువాత, నాకు మీరు రాసిన 'ఊసులాడే ఒక జాబిలంట!' నవల చదవాలనిపించింది. ఈ నాటి వరకు నేను వెబ్ పత్రికలేవీ చదవలేదు. కాని ఇప్పుడు రెండు రోజులు కౌముదిలో మీ నవల చదివాను. ఉత్తరాల తో కథ అనగానే, ఆ తరువాత కొంచెం చదివినాకా రంగనాయకమ్మ గారి 'కృష్ణవేణి' లాంటి కథేమో అనిపించింది. కాని, కాదని తెలుసుకోటానికి ఎంతో సేపు పట్టలేదు.ఆ తరువాత ఎంతో ఆరాటంగా చదివాను. నిజమైన కథ అని తెలియగానే కార్తీక పట్ల ఎంతో గొప్ప భావం నాలో పెరిగిపోయింది. కాంతి గారు, కిరణ్ ప్రభ గారు మిమ్మల్ని ప్రోత్సహించిన నమ్మకం నిజమని నిరూపించారు. మీ రచనాశైలి, మధ్యలో వచ్చిన చిరు కవితల్లో జీవితం పట్ల ఉన్న అవగాహన అలవోకగా జారిపోయింది. సమకాలీన ఉదాహరణలను చక్కగా ఉపయోగించారు.

ఇంత మంచి కవితలకి ఎటువంటి వాతావరణం లో ఉంటారో, ఎటువంటి ఇన్స్పిరేషనో అనిపిస్తుంది నాకైతే. చుట్టూ అందమైన వాతావరణం లేకపోయినా కళ్ళుమూసుకొని ఊహా లోకంలో మీ కవితల్తో బతికేయొచ్చు.నిశిరాత్రి ప్రశాంతత చాలు మనసు నిమ్మళించటానికి, కలల భాష పెరగటానికి అని ఎంత అందంగా చెప్పారండి.

కార్తీక ముగింపు మనసుకు నచ్చకపోయినా అటువంటి ఉదాహరణలు ఇప్పటికీ ఎన్నో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఒప్పుకోక తప్పదనిపిస్తోంది.చివరి వరకూ స్నేహితులు ఒకరినొకరు చూసుకోలేకపోయారే అన్న బాధ మనసును తీవ్రంగా మెలితిప్పింది. అయ్యో అనిపించింది. ప్రతి వాక్యానికి రెండేసి చుక్కలు పెట్టిన మిమ్మల్ని చూసి కొత్తరకంగా ఉందనుకున్నాను. కాని చివరలో చూపించిన కార్తీక ఉత్తరం లో కూడా అలాగేఉంది. ఇటువంటి ప్రత్యేకత చూపించేవారి వ్యక్తిత్వం చాలా వైవిధ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. కార్తీకని మాకళ్లముందే నిలబెట్టేసారు మీరు. అసలైన ఆ ఉత్తరం మరుగున పడిన కలం స్నేహం గొప్ప తనానికి ఒక గొప్ప సాక్ష్యం.

కార్తీక వాళ్ళ ఊరిని వర్ణించిన విధానం హాయిగా ఉంది. వంశీ, రాధిక గారి స్నేహ మాధుర్యం తనివితీరని తేనెలా ఉంది.అనుకున్నది నిశ్శబ్ధంగా చేసుకుపోయే వికాస్ ఎంతటి ఉన్నత వ్యక్తో చదువుతూ పోతున్నా కొద్ది హిమాలయమంత ఎదిగిపోయిన ఆ సంస్కారం, అబ్బా! ఎంత మంచి స్నేహితుడో, వికాస్ లా ఇంకెవ్వరు ఉండరు, ఇది నిజం అనిపిస్తుంది. మాధురి, వసంతల కథలు కాలం మారినా ఆడదాని జీవితంలో మార్పు శాతం మాత్రం తక్కువే అని నిరూపిస్తున్నాయి. భూషణం, సులోచన గారి ఆదరణ ప్రతి ఆడపిల్లా కోరుకునేట్లు ఉంది. చుట్టూ పరిస్థితులు తమ జీవితం మీద ఎటువంటి ప్రభావాని చూపిస్తాయో, ఎంతటి నిర్ణయాలకు కారణ మవుతాయో, తమ జీవితాలను ఎన్ని మలుపులు ఏ విధంగా తిప్పుతాయో .....ఉత్తరాల్లోనే, ఎంతో లలితంగా ప్రపంచమంతా చూపించేసారు కదండి మీరు.

ముగింపు కాదు కథనం ముఖ్యం అని తెలుసుకున్న మీ అనుభవమే నాకు కూడా పాఠం నేర్పిందండి నిషిగంధ గారు:)

మీ 'కలం స్నేహం' తో పాటే నేను కూడా ప్రయాణించి మీకు పంఖా నైపోయాను. ఇప్పటికే చాలా రాసేసాను. అప్పటికీ కొంచెం తగ్గించాను. ఇంక తగ్గించలేను.

దయచేసి, ఎప్పుడో వచ్చిన నవలకి ఇప్పుడా స్పందన అనకండి. నేను ఇప్పుడైనా చదవగలిగినట్లు చేసిన మధురవాణి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

నిషిగంధ said...


జయ గారూ, మొన్న మీ బ్లాగ్‌లో మీరు 'ఊసులాడే జాబిలట ' గురించి రాసుకుంటున్నాని అంటే నాకు అర్ధం కాలేదు. :))
నిన్నటి నించీ చాలాసార్లు చదివాను మీ కామెంట్. ఒక్క ధన్యవాదాలు కాకుండా ఇంకెలా నా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడంలేదు. అందరం ఒక్క కార్తీక చుట్టూనే తిరుగుతుంటే మీరు మళ్ళీ పాత్రలన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చారు!! ముఖ్యంగా మాధురి, వసంతల్ని... థాంక్యూ ఫర్ దట్!
ఆ నవల ఆఖరి భాగం రాసినరోజు నాకు బాగా గుర్తుందండీ, అదోలా సన్నని బాధ. కార్తీక నన్ను వదిలివెళ్ళిపోతుంది అని.

ఇక అసలు సిసలు ముఖ్యమైన విషయం -- ఆ కవితలన్నీ కిరణ్‌ప్రభ గారివేనండీ! నావి కాదు.. ఆయన కవితల ద్వారానే ఆ స్నేహం చిగురించింది కదా అని ఆయన అనుమతితో అవే అక్కడ రాశాను. నవల అయిపోయిన తర్వాత మెన్షన్ చేశాను, నా తుది మాటల్లో!
సో, మీ ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయి. :-)

ఇక ఊరంటారా.. దురదృష్టవశాత్తూ నా చిన్ననాళ్ళలో పల్లెటూళ్ళతో అంత అనుబంధం లేదండీ! మా నానమ్మగారి ఊరికి వెళ్ళిన మూణ్ణాలుగు సార్లూ నేను చాలా చిన్నపిల్లని. కానీ, ఆ పరిశరాలన్నీ బాగా గుర్తిండిపోయాయి. అందుకే ఊరిపేరుతో సహా అవే ప్రస్తావించాను.

మీ స్పందన చూసినప్పటినించీ ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. పూర్తిగా చదవడానికి చాలా టైమ్ పడుతుంది.. ఆపైన ఇంత వివరంగా, విశ్లేషిస్తూ వ్యాఖ్య రాయడం!!! హృదయపూర్వక ధన్యవాదాలు మీకు!

అఫ్‌కోర్స్, మీ చేత చదివించిన మధురకి నా తరపున కూడా బోల్డన్ని థాంక్యూలు :-)

జయ said...

నిషిగంధ గారు,
చాలా చాలా థాంక్స్. మీ జవాబు కోసం నా కామెంట్ పబ్లిష్ అయినప్పటినుంచి చూస్తునే ఉన్నాను. ఇదిగో, ఇప్పుడే చూసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది.

కవితలు కిరణ్ ప్రభ గారివని తెలుసు. అందించింది మీరేకదా! మీరు కూడా మామూలు కవయిత్రి కాదుకదా!

కొత్తగా ఏమి రాస్తున్నారు.

నిషిగంధ said...

జయ గారూ, నేను మామూలు కవయిత్రినేనండీ! :))
రాయడం అంటే మాగొప్ప కళండీ.. మీ డ్రాయింగ్స్/పెయింటింగ్స్‌లాగా! నాకు ఆ కళ అంతగా వంటబట్టలేదు కాబట్టి 'మళ్ళీ ఎప్పుడు/ఏమిటి ' అనేది నాకే పెద్ద ప్రశ్నండీ.
ఎన్నో జ్ఞాపకాలని కదిలించిన మీ వ్యాఖ్యకి మళ్ళీ మనస్పూర్తిగా ధన్యవాదాలు!

జయ said...

ఏమోనండి, అవన్నీ నాకు తెలీదు. నా దృష్టిలో మీరు మంచి కవయిత్రి, రచయిత్రి, అంతే. మళ్ళీ ఏమన్నా రాస్తే మాత్రం తప్పకుండా చెప్తారు కదూ. నాలాంటి అభిమానులకోసమన్నా మీరు రాయక తప్పదండి.

sudha kalaga said...

HI NishiGandha garu,
cannot stop giving you a feedback, chala books chadivanu kani ventaney feedback ivaledu, karanam andulo chalamandi ippudu leru, oka movie ending lo chustey edchinattu kartika inka ledu ani vamsi rasukunna letter chusi nenu edchesa, mi novel lo karthika la.. chala rojulki oka ahladakaramayina novel chadvina feeling vachindi.. I guess madhuravani gari blog lo chusi download chesa, edo time pass ki untundi anukuni start chestey idi emo nannu kadalanivvakunda kurcho bettindi... Bhushanam master and sulochana gari lanti varu inka unnaru, mana life lo eh ammamma garo tathayya gari lagano tarasa padtharu. apatilo kalam sneham gurunchi ma aunty chebtuntey vina, kani oka idharu vyakthulu snehinchadanki mohamohalu akarledu. kiran prabha garu dinini rayataniki miku ichinaapdu, inka karrthika vala hrudayalalo sajeevam ganey undi unnaru annadi prasputham... palleturi acha telugu novel ani chepukunettu undi...Love to read...edo chepdam anukunna, keyboard mida fingers kadalatle... "chirigina chokka ayina thodukko kani oka manchi pusthakam konukko", "books are the best friends" ani ma grand father cheptharu, e book chadvtey novel anukuney valu entha mando naku teliyadu, but oka ammayi veeratvani(Karthika), alochana kadu pranalika tho alochana chesi adi amulupetadamey pani ani chupinchana abayi(Vikas), gadasari ga untey (ammamma) evaru mana dariki cheraru "noru manchidi ayitey ooru manchidi avuthundi" aksharala chupinchana mi saili, pedha varu pedhavariga ela naduchu kovali, manavatha viluvalu, westren culture peruguthuna mana varini babay, mavayyo ani pilstey pondagaligey apyatha ni(bhushnam ,sulachana garla damptulo) ivi anni chustey mana intlo no, urilono katha lla anipinchindi, karanam lekapoledu mi karthika ki nenu chala dhagara vyakthitvam unna amayini mari...Radhika naku baga nachina character, aparthalaki tavu lekunda oka amayi tho sneham ki tanu vanthu krushi chesi avida kuda amayi ni geluchukunna vayinam. intha mandi ni petti chala sunnitham allina mi tiru ni edha lo prasamchinchina miku telapu kovalani okatey akamksha, hence replied... Thanks a lot for giving us an excellent book...keep up this spirit to write some more...(ma swardhamey nandi ikkada kuda)

నిషిగంధ said...

సుధ గారూ, ముందుగా క్షమాపణలు, ఇంతాలశ్యంగా ప్రతిస్పందిస్తున్నందుకు.
నిజానికి మీ సుదీర్ఘ స్పందన చదవగానే నాకు ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు.. ఇంతకుముందు కూడా ఎక్కడో చెప్పానండీ.. ఈ నవల ఇంతగా మనసుకి చేరుకుందీ అంటే ఆ క్రెడిట్
అంతా కార్తీక వ్యక్తిత్వానిదీ, వారిద్దరి స్నేహానిదీ! వింటున్నప్పుడు ఏదో ఒక కలం స్నేహపు మామూలుతనం కనిపించినా, ఆ తర్వాత ఒక్కొక్క అడుగులో ఎంతో మెచ్యూరిటీ, అర్ధవంతమైన దగ్గరతనం కనిపించాయి.. మీరన్నట్టే నాకూ రాధిక అంటేనే చాలా ఇష్టం. తను ఆ బంధానికో ముఖ్యమైన కాటలిస్ట్... అండ్, యెస్.. భూషణం, సులోచన గార్లు ఇప్పటికి ఉన్నారు.. అదృష్టవశాత్తు నాకూ పరిచయమయ్యారు. :-)

ఎంతో సమయం వెచ్చించి రాసిన మీ అభిమానపూర్వక స్పందనకి హృదయపూర్వక ధన్యవాదాలు.