Pages

Monday, November 12, 2007

నిన్నటి స్వప్నం


'ఇంత సుగంధం నీకెలా అబ్బింది?'

మునిమాపు వేళ మెచ్చుకోలు
నడుము చుట్టూ నీ చెయ్యి
మనసు దాయలేక
విచ్చుకున్న పెదాలు..

అలాంటి రాత్రే.. ఇంకాస్త సుగంధం..

తల కూడా తిప్పని నిర్లిప్తత
మెత్తగా చేస్తున్న గాయం
గుండె పట్టక
నిండుతున్న కళ్ళు..

ఆకాశమంత ఆనందం..
సముద్రమంత విషాదం..
సాంగత్యం మాత్రం నీదే!

దేని బరువెక్కువో
తలదించుకుని తప్పుకుంటున్న
ఈ ఘడియలకేమైనా తెలుసా!?


(తొలి ప్రచురణ)

English Translation by NS Murty gaaru

9 comments:

Anonymous said...

"నిండుకున్న కళ్ళు.."కాదేమో!


"నిండిన కళ్ళు" అవునా?

jags said...

baagundi...:)

Rajendra Devarapalli said...

వామ్మో, మెత్తటి కత్తితొ ఎక్కడో గాయం చేసారు,ఇది కేవలం ప్రేమ కాదు,విరహమూ కాదు.మరేదో,
ఎందుకంటే ప్రియ వలపుల తలంపే ఒక రకమైన,మైకంలోకి నెట్టి,మనసు భారం చేసి,తనువు తేలిపొయేలా చేయగలిగిన చేయగలిగే మహొన్నత,పరవశత్వపు పరిభాష, పలవరింత లేక పులకరింత.


సెబ్బాసు, వదలొద్దు కుమ్మండి,ప్రేమ లేక లోకం బీడై పోతుంది
అందుకోండి వందనాలు


రాజేంద్ర

http://visakhateeraana.blogspot.com/

Anonymous said...

Awesome language and superb expression. Ee madhya kalamlo neenu chadivina oka manchi kavitha meede.. Mee bhasha, mee bhava vyakteekarana chala bavunnayi. Ide pantha nu konasaginchandi!

అనిర్విన్ said...

చాలా బాగుందండీ. ఇంతకాలం ఎలా మిస్ అయిపోయానో మీ బ్లాగు, ఈరోజే కనబడింది. మొత్తం చదువుతున్నాను.

@శ్రవణ్ గారు,
"నిండుకున్న కళ్ళు.." నాకు కనిపించలేదు. నిండుతున్న కళ్ళు అని కనిపించింది మరి.

పద్మ said...

చాలా బావుంది.

"మనసు దాయలేక విచ్చుకున్న పెదాలు", "గుండె పట్టక నిండుతున్న కళ్ళు" చాలా బాగా చెప్పావు.

పాపం మనసు. సంతోషం ఎక్కువైతే చిరునవ్వుతో, బాధ కలిగితే కన్నీళ్ళతో వ్యక్తం చేస్తుంది. ఏదీ దాచుకోలేదు.

ఆనందం ఎక్కువైతే తేలిపోతాము అని దు:ఖం ఎక్కువైతే కుంగిపోతామని అంటూంటారుగా కాబట్టి విషాదం బరువే ఎక్కువేమో, న్యూటన్ లా ప్రకారం. :|

రాధిక said...

ఇలాంటి వ్యక్తీకరణలు చదివితే ఇంకేమి మాట్లాడగలము?మీరే అర్ధం చేసుకోవాలి ఈ క్షణం నా మనోభావనని.

సుజ్జి said...

chakkaga express chesaru...

దేని బరువెక్కువో
తలదించుకుని తప్పుకుంటున్న
ఈ ఘడియలకేమైనా తెలుసా!?

nice...:)

నిషిగంధ said...

Thank you :-)