Pages

Monday, October 29, 2007

మనిద్దరం

ఇంత మార్పు ఎప్పుడు వచ్చిందంటావ్!?

నా అలకలు.. నీ బుజ్జగింపులు
నీ అల్లర్లు.. నా మందలింపులు
వెన్నెల్లో గోరుముద్దలు.. దిండు పక్కన సంపెంగలు
ఒకరి చుట్టూ ఒకరం ..

ఇదే కదా నేనెరిగిన
మన ప్రపంచం!!

మరి ఇప్పుడు..

నీ చివాట్లు.. నా సంజాయిషీలు
నా కోపాలు.. నీ నిరాసక్తతలు
అది నీ పని.. ఇది నాకే తెల్సు
ఒకరి పక్కన ఒకరం ..

రైలుపట్టాల్లా
సమాంతరంగా ఎపుడయ్యామో
నీకైనా గుర్తుందా!?

నాకేం బాధేయటం లేదు.. చిత్రంగా!
ప్రతి మలుపులో నాపక్కనే నువ్వు..
మజిలీలన్నీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ!!


(తొలి ప్రచురణ)

4 comments:

రాధిక said...

ఓ...తెలుగుపీపుల్ లో,కౌముదిలో,ఈ బ్లాగులో...అన్నింటిలోనూ కనిపించేది ఒక్కరేనా?ఇన్నాళ్ళూ తెలియలేదు.ఈ కవితని తెలుగుపీపుల్ లో చదివినప్పటినుండి పెద్ద ఫాన్ అయిపోయా మీకు.ఆతరువాత మీ పాత పోస్టులన్ని తిరగేసి పిచ్చ ఫేన్ ని అయిపోయా. మీకు గుర్తుందో లేదో ఈ కవిత మీద ఆ సైటులో పెద్ద చర్చ జరిగి చాలా మార్పులు చెప్పారు.అప్పుడు నేను మీకు పెర్సనల్ మైల్ కూడా పెట్టాను.ఏమీ మార్చవద్దు ఎలా వుందో అలానే బాగుందని.మీకు గుర్తుండివుండదులెండి.ఏమయితేనే నాకు ఈ రోజు చాలా ఆనందంగా వుంది.

నిషిగంధ said...

ఓ ఆ కామెంట్ పెట్టింది మీరేనా!! how can I forget that discussion :)) believe it or not, your mail was the main reason that I haven't changed it!!! I'm sooo glad I meet you here in the blog world! కానీ మీ బ్లాగ్ కి I mean, మీకు నేను ఫాన్ ని.. అసలు రహస్యం చెప్పాలంటే నాకు నా కవితలన్నీ ఒకచోటకు చేర్చాలన్న ఆలోచన వచ్చింది మీ 'స్నేహమా' ఇంకా 'కల్హార ' చూసిన తర్వాతే!
I'm happier than you now :-))

Rajendra Devarapalli said...

నిషిగంధ గారూ,మీ కవితలకోసం ఒకరోజు కనీసం వందవాక్యాల వ్యాసం రాస్తాను అంత డిస్టర్బ్ చేశారు నాలాంటి వాడిని కూడా
అసూయతో,

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

Anonymous said...

ఒకరి చుట్టూ ఒకరు..
ఒకరి పక్కన ఒకరు...
తేడా ని బాగా వ్యక్తం చేశారు!