నానీగాడు
ఒక్కదాన్నే
ఆడుకోవటం చూసిందేమో
వెంటనే నిన్ను
తెచ్చేసింది అమ్మ!
రోడ్డు దాటేటప్పుడు
అప్రయత్నంగా నా చేతిలో
బిగుసుకున్న నీ చేయి..
మంచు దుప్పటిలో
తోడుగా వుండి
నువ్వేయించిన
సంక్రాంతి ముగ్గులు..
వాన నీటిలో మనం
విడిచిన కాగితపు పడవల్లా
ఇంకా కళ్ళ ముందే
గింగిరాలు తిరుగుతున్నాయి!
కలిసి ఎదుగుతూ
నేర్చుకున్న విషయాలు ఎన్నో!
ముఖ్యంగా..
మనసుతో ఆలోచించడం!
స్వప్నాల్ని గెల్చుకోవడం!!
పెళ్ళి మండపంలో
వీడ్కోలు పలికేప్పుడు
నీ కళ్ళలో ఉన్న చెమ్మ
నా కళ్ళలోనూ చేరింది..
జీవితంలో నువ్వింకో
మెట్టు ఎక్కుతున్నావనితెల్సినప్పుడు!
అంతలోనే
చిన్నగా మొట్టి
చెప్పాలనిపిస్తుంది..
ఎన్ని మెట్లెక్కినా
నాకంటే నువ్వెప్పుడూ
చిన్నవాడివేనని!! (తొలి ప్రచురణ)
3 comments:
tammudi meeda premani adbhutamgaa cheppaaru. "chinna motti cheppalanipinchindi, enta peddavaadi vayinaa naakente chinnavadive" really cute....
Thank you so much Jags gaaru :-)
అప్పటివరకూ నా వెనకెనక తిరిగినవాడే అకస్మాత్తుగా ఇంత పెద్దోడెప్పుడైపోయాడా అనిపిస్తుంది!! :)
చాలా బాగుంది! :-)
Post a Comment