నాకు సంబంధించిన సూర్యుడు
ఇంకెక్కడోఉదయిస్తూ..
బయట చీకట్లో
అనుకోని అతిధుల ఆల్లరి..
నిద్ర పట్టని నా మనసులానే
సతమతమవుతున్న సెలయేరు!
చెంపను తాకిన
తొలి కిరణ స్పర్శతో
కళ్ళెదురుగా
నిజమౌతున్న స్వప్నాలు..
అభిషేకం నచ్చినట్లుంది..
సంతృప్తిగా
రంగులు మార్చుకుంటున్న చెట్టు..
పూలపొద నించి
బయటపడ్డ గువ్వని ఆహ్వానిస్తూ..
కాస్త ఆలస్యమైందేమో
చుక్కల్నివెలుగు దుప్పటి కింద
దాచేయడానికి హడావిడి పడుతున్న
బాలభానుడు..
ఇక్కడా సూర్యోదయం అవుతుంది..
అచ్చు నాక్కావాల్సినట్లే!!
(తొలి ప్రచురణ)
3 comments:
మంచి సన్నివేశం
wht a relief:)
Thanks so much for your comments oremuna gaaru and jags gaaru
మట్టివాసన.. మామ్మ స్పర్శ.. మామిడి చిగురు.. అనిపించడానికి చిన్న విషయాలే! ఇక్కడికి (యు.ఎస్) వచ్చిన చాలా ఏళ్ళ వరకు ఇలాంటి విషయాలనే ఎన్నిటినో మిస్ అవుతుండేదాన్ని.. ముఖ్యంగా సాహిత్యం, సంగీతం.. కానీ ఇంటర్నెట్ పుణ్యమా అని అన్ని సౌరభాలు ఒక్క క్లిక్ దూరంలోనే!! అన్ని చోట్లా మనకి నచ్చేవీ, నచ్చనివీ ఉంటాయి.. స్పందించే మనసు ఉండాలే గానీ మనకు నచ్చే విషయాలని పట్టుకోవడం ఏమంత కష్టం కాదు.. ఒకరకమైన నిరాశా నిస్పృహల నించి బయటపడి మళ్ళీ నాక్కావాల్సిన అందాలకు, విషయాలకు చేరువ కాగలిగాను.. ఆ భావనకు రూపమే ఈ కవిత!!
Post a Comment