Pages

Friday, October 5, 2007

ఏకాంతవేళ


నువ్వటు వెళ్ళగానే
నీ ఆలోచనలన్నీ
నా ముందు కుప్పగా..
అప్పుడే విచ్చుకుంటున్న
మల్లెమొగ్గల్లా..

నువ్వొచ్చేలోగా
ఒక్కొక్కటిగా విడదీసి..
మాల కట్టాలని
మనసు చేసే
విశ్వప్రయత్నం..

నా జాడనే మరచిన
ఏకాగ్రతలో
చిన్న తొట్రుపాటు..
ఎగిరే నా ముంగురుల్ని
తడుముతున్న నీ
చిరునవ్వు..


(తొలి ప్రచురణ)

5 comments:

పద్మ said...

:) ఇంత చిన్న పదాలలో అంత గొప్ప భావం ఎలా చెప్పగలుగుతావు?

jags said...

"aalochanalani kuppagaa posi maala kattatam" chakkati aalochana...

Anonymous said...

చాలా బాగా రాసారు... మీరింకా రాయాలని ఆశిస్తున్నాను...

నిషిగంధ said...

Jags gaaru and anonymous gaaru, thank you so much for your feedback ..

నిషిగంధ said...

పద్మా, అది మన భాష గొప్పతనం :-)