Pages

Wednesday, October 31, 2007

ఆనతి నీయరా


ఏ దిగంతాల అవతల
నీ అడుగుల సడి వినబడిందో
పువ్వు నించి పువ్వుకి
ఆనందం వ్యాపిస్తోంది..

పూజాద్రవ్యాలు.. పారిజాతాలు
అవ్యాజమైన అనురాగంతో
సిద్ధంగానే ఉన్నాయి
నీ సేవకోసం..

నువ్వు పీఠం అధిష్టించక ముందే
జీవితం మొదటికంటా వెళ్ళి
కేవలం నీకోసమే
మళ్ళీ బ్రతికి రావాలనుంది...

(తొలి ప్రచురణ)

1 comment:

Anonymous said...

"నువ్వు పీఠం అధిష్టించక ముందే
జీవితం మొదటికంటా వెళ్ళి
కేవలం నీకోసమే
మళ్ళీ బ్రతికి రావాలనుంది..." beautiful.. గీతాంజలి గుర్తొచ్చింది.