Pages

Friday, October 12, 2007

నందివర్ధనాలు


తెలిమంచులో
పవిత్రస్నానాలు చేసేసి
ఇంట్లోకి ఆత్రంగా
చూస్తున్నాయి..
పూజకి వేళైంది కాబోలు!

రంగవల్లిని
కుశలప్రశ్నలు అడుగుతూనే
చిరుగాలితో సమాలోచనలు..
ఆ వర్ణాల్ని తమకికాస్త అద్దమని!

కిరణాలతో
ఎడతెగని ఊసులనుకుంటా..
అలసటతో తలలు వంచి
ఆఖరి మజిలీకిసిద్ధమౌతున్నాయి!


(తొలి ప్రచురణ)

2 comments:

Anonymous said...

చాలా బావుందండి.. నాకు బాగా నచ్చిన వాటిలో నందివర్ధనాలు ఒకటి. :)

shiva said...

it is very nice. i like it very much