Pages

Wednesday, October 31, 2007

ఏకాంత యామిని


నీ తాలూకు జ్ణ్జాపకాల మూటను
కొండవతలకి విసిరేయబోయాను..

చుట్టూ ఆవరించిన
హిమసమీరం ఒకటి
అల్లరిగా నవ్వబోతూ..

కనుకొనల్లో ఏం కనిపించిందో
తలదించుకుని దారి మళ్ళింది..

ఏం లాభం !?
ముడి విడిపడి అన్నీ జారిపడ్డాయి!!

పర్వాలేదు...

మళ్ళీ ఒక్కొక్కటిగా
ఏరుకుంటూ పోగుచేయడమే నాకిష్టం!!


(తొలి ప్రచురణ)

5 comments:

సుజ్జి said...

నీ తాలూకు జ్ణ్జాపకాల మూటను
కొండవతలకి విసిరేయబోయాను
fentastic opening....

మళ్ళీ ఒక్కొక్కటిగా
ఏరుకుంటూ పోగుచేయడమే నాకిష్టం!!

touching ending...

aela raasaru enta baaga.. acchamga manasulo baavalu xerox teesinattuga..????

నిషిగంధ said...

నిజ్జంగా మీకు బోల్డన్ని థాంక్సులు సుజ్జి గారు.. నిజంగానే కొండవతలకి విసిరేసినట్లు మర్చిపోయిన నా కవితల్ని మళ్ళీ చదివించి, 'ఇవి రాసింది నేనేనా!' అనుకునేట్లు చేస్తున్నారు!!

Anonymous said...

Really heart touching....chaala chaala adbutam ga vrasaru.....

Anonymous said...

నిషిగంధ గారూ ,
అప్పుడు స్వాతి గారు తామసవిరోధి గూగుల్ గ్రూపు వారి తరఫున, ప్రొద్దు పత్రిక వారి ఆధ్వర్యంలొ నిర్వహించిన వుగాది కవిసమ్మేళనంలొ .....నేనూ వున్నా . చాలా రోజుల తరువాత.
యిప్పటి వరకు మీ బ్లాగు ను వీక్షించ లేక పొయినందుకు ఎంతో మిస్సయ్యాననిపించింది.
ఇంత గొప్ప కవి భావనలను ఆస్వాదిస్తూ అభినందించకుండా వుండలేకపొతున్నా
మీ 'ఏకాంత యామినిలో మూట ముడిని విప్పి కవి భావనా మందిరాన్ని అధ్భుతంగా ఆవిష్కరించారు. అభినందనలతో ....నూతక్కి రాఘవేంద్ర రావు.

Bolloju Baba said...

చాలా బాగుందండీ. గుడ్ టేక్ ఆఫ్ అన్డ్ లాండింగ్.
పెర్ఫెక్ట్ కంపొసిషన్

బొల్లోజు బాబా