Pages

Thursday, October 18, 2007

తొలి స్పర్శ


చుట్టూ అర్ధం కాని సందడి
ఇవాళ నువ్వొస్తున్నావంట కదా!

మల్లెలా? కనకాంబరాలా??
నిర్ణయాలు తీసుకోవడంకష్టమే సుమా!

ఎక్కడా నిలువని
నా చూపులు
అస్థిరత్వానికి నిర్వచనంలా..

నిన్ను చూస్తూనే
గడపని దాచేసిన చమత్కారం
చీర కుచ్చిళ్ళదా!?

నేల మీదుండాల్సిన
నేను నీ చేతుల్లో..
నీ తాలూకు పరిమళంనా ఊపిరిలో..
నింగి వంగి నుదుటిపై ముద్దు పెట్టినట్లు!!


(తొలి ప్రచురణ)

4 comments:

Anonymous said...

బావుంది నిశిగంధ గారు. చిన్న పదాలతో భావాన్ని వ్యక్తపరచిన తీరు బావుంది. :)

నిషిగంధ said...

Thanks so much for your feedback Rajesh gaaru. :)

సుజ్జి said...

ee kavitha chaduvutunte, vaka pula maala naa vantini rasukuntu meliteriginatlu undi.. chala baagundi..

నిషిగంధ said...

Thanks again :-)