Pages

Saturday, March 6, 2010

ఒక చిన్నమాట... మీకు చెప్పాలని.. (అసలు సంగతి)

  
Part 1: ఒక చిన్నమాట... మీకు చెప్పాలని… (ముందో చిన్న కధ)


......... నామీద నాకు ఒక తప్పు అభిప్రాయం ఉండేది; సమయం, మూడ్ రెండూ ఉంటే నేను రాయగలనని.. కానీ ఈ కవితలపై కసరత్తు చేస్తున్నప్పుడు అర్ధమైంది ఆ రెండూ ఉన్నా నేను రాయలేనని!! ఒకసారి వెనక్కి వెళ్ళి పాతవన్నీ చదువుకుంటూ అవి రాసినప్పటి మనఃపరిస్థితిని గుర్తు చేసుకుంటుంటే తెలిసింది వాటిలో ఎక్కువభాగం జ్ఞాపకాలకీ, పొందిన అనుభవాలకీ, చూసిన సంఘటనలకీ మనసు ఉన్నట్టుండి మరల స్పందించడంవల్ల రాసినవే కానీ రాయాలన్న తపనతో శ్రమించి రాసినవి కావని!!


మొన్నొకరోజు "ఫ్రీక్వెంట్ గా రాయడానికికి నాకు కుదరడం లేదండీ!" అని నా మీద నేనే జాలిపడిపోతూ ఒక సన్నిహితుని దగ్గర వాపోతే ఆయన "గంగిగోవు పాలు సామెత గుర్తు తెచ్చుకోండి" అన్నారు... "ఏంటో ఆయన అభిమానం!" అనుకుంటూ నాపని నేను చేసుకోబోతుండగా ఒక్కసారిగా ఆయనలానే అభిమానంగా నా రాతల్ని పలుకరించే పాఠకులందరూ గుర్తొచ్చారు!

నేను రెండు నెల్లకో, నాలుగు నెల్లకో నా సమయమూ, మూడ్, స్పందన ఇత్యాది గ్రహాల కలయికకి అణుగుణంగా ఒక పదిలైన్లు రాసి 'ఇదుగోండహో' అని అందించగానే ఎంతో అభిమానంగా స్పందించే పాఠకులందరికీ అంటే మీ అందరికీ నేనెంతో ఋణపడిఉన్నాను.. నాకు పదివేలు, నాకు ఏభై అని మళ్ళీ మీరందరూ రెడీ అయిపోతారేమో అందుకే ముందే చెప్తున్నాను, "ఈ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనిది!" నిజ్జంగా!!

ఉద్యోగినిగా, గృహిణిగా ఏదో నాపని నేను చేసుకుంటూ గుంపులో కొట్టుకుపోతున్న నన్ను మీ అభిమానపూర్వక స్పందనలు ప్రత్యేకంగా నిలబెట్టాయి.. నాకెంతో ఇష్టమైన పుస్తక/రచనా ప్రపంచంలో నేనూ ఓ భాగమవ్వగలననే ఆత్మవిశ్వాసం కలిగించారు!! పాఠకులు అభిమానులయ్యారు.. అభిమానులు ఆప్తమిత్రులుగా మారితే.. ఆప్తమిత్రులు సన్నిహితులై కుటుంబ సభ్యుల్లా ఒదిగిపోయారు!! ఇలా కుటుంబంలో భాగంలా మారిపోయిన కొందరి గురించి ఇంకోసారి తప్పక రాస్తాను కానీ అసలు ఈ టపా ముఖ్యోద్దేశ్యం, నిషిగంధగా నాకో అస్థిత్వాన్నిచ్చిన మీ అందరినీ పేరుపేరునా తలచుకుని కృతజ్ఞతలు చెప్పడం!

అదే నే చెప్పాలనుకున్న చిన్నమాట...... Thank you! Thank you all very much!!

ఇక నేనెవరెవర్ని తల్చుకున్నాను అనేది చూడాలంటే కాఫీ/టీ లేదా మీకిష్టమైన పానీయం తెచ్చుకుని ఈ ఇమేజెస్ క్లిక్కండి :-)




నా జ్ఞాపకశక్తి మీద నాకున్న ప్రగాఢ నమ్మకంతో చెప్తున్నాను, తప్పకుండా కొన్నిపేర్లు మర్చిపోయి ఉంటాను.. వారికి నా ముందస్తు క్షమాపణలు... కానీ అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది అస్సలు కాదనీ, ఈమధ్య వదలకుండా నా కొంగుపట్టుకు తిరుగుతున్న మతిమరుపు కారణంగా అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ చెప్తున్నాను..

అలా మర్చిపోయినవారందరికీ మా పండు గాడితో నా స్పెషల్ థాంక్స్ పంపుతున్నాను..





అందరినీ ఒకసారి తలుచుకుని కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఈ Thanksgiving టపా రాయడం వెనుక వేరే కారణమేమీ లేదని నొక్కి వక్కాణిస్తూ.. సెలవు...
:-)
  
   

48 comments:

Anonymous said...

నిషిజీ "రవి గారు" కి మాత్రం రెండు గార్లు పెట్టారు. మా అందరికి కలిపి కామన్ 'గారు'.

ఏమైనా మీ "చిన్నారి సిరి" మరియు "ఊసులాడే .." లు చాలా బాగున్నాయి అండి. రాస్తునే ఉండండి.

మురళి said...

చిన్నమాట ఏమిటో అనుకున్నానండీ.. నిజానికి మేము చెప్పాలి కదా మీ కవితలకి.. కొంచం తరచూ రాస్తూ ఉండండి..

సవ్వడి said...

నిషిగంధ గారు! చాలా థాంక్స్. రెండు సార్లో.. మూడు సార్లో కామెంట్ చేసిన నన్ను గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది.

మీ " అదే వాన" నాకు బాగా నచ్చిన కవిత. అటువంటివి రాస్తుండండి. కవితలే కాదు.. అన్నీ రాస్తుండండి.

Anonymous said...

వావ్. ఆశ్చర్యం. నా పేరు(ఇండిపెండెంట్) మీరు అక్కడ రాస్తారనీ, అసలు గుర్తుంచుకుంటారనీ అనుకోలేదు.

నిరుడా కథ చదివిన తర్వాత టెండర్ మూమెంట్స్ ఇంకా గుర్తున్నయి, నాకు.

థాంక్స్.

కానీ, మీలాంటి రచయితలంటే నాకు చాలా కోపం నిషిగంధా..ఏదో బిజీగానో, so-called succesful జీవితం గడిపేస్తున్నాము అన్న ఇమేజ్ సమాజానికి ఇస్తూ, మనకీ కష్టం మీద కలగ చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు, ఏదొ రాసి, దాంతో, ఉన్న పాటున, అదాట్టుగా, అల్లంత దూరం లోకి విసిరి వేస్తారు. అక్కడికెళ్ళి నన్ను కలిసేసరికి, నాకు ఎక్కడ లేని దుఖం వచ్చేస్తుంది. అది ఎంత బాధో మీకు తెలీదు. దాంట్లోంచి బయటకు రావడానికి అష్ట కష్టలు పడాలి. ఒకవేళ వచ్చినా కూడా కొద్ది రోజుల వరకూ, ఇక్కడున్న నాలో డొల్ల తనం తొలుస్తూనే ఉంటుంది. గుండెను నలిపేసుకుంటూ కొద్ది రోజులు బ్రతకాలి. అసలిదంతా ఎందుకవుతుంది అంటే మీలాంటి వల్లే(కల్ హారా స్వాతి గారు కూడా ఏదొ రాసారో సారి. I hate you అని కామెంట్ పెట్టా అక్కడ. అవిడ నన్ను తిట్టకుండా, అర్ధం చేసుకుని, ఐ ఆండర్స్టాండ్ అని ఓ one-line పర్సనల్ ఈ మెయిల్ పంపించారు. ఎంత ఆశ్చర్యమేసిందో).

ఎనీ వే, రాస్తూండండి. అప్పుడప్పుడైనా కళ్ళల్లోకి నీళ్ళు రావాలి గా, జీవితమన్నాక!

శేఖర్ పెద్దగోపు said...

>>>ఒకసారి వెనక్కి వెళ్ళి పాతవన్నీ చదువుకుంటూ అవి రాసినప్పటి మనఃపరిస్థితిని గుర్తు చేసుకుంటుంటే తెలిసింది వాటిలో ఎక్కువభాగం జ్ఞాపకాలకీ, పొందిన అనుభవాలకీ, చూసిన సంఘటనలకీ మనసు ఉన్నట్టుండి మరల స్పందించడంవల్ల రాసినవే కానీ రాయాలన్న తపనతో శ్రమించి రాసినవి కావని!!<<<<

అందుకే మీరు రాసిన కవితలు ఒక్కో లైను చదువుతుంటే సులభంగా ఫీల్ గుడ్ కలిగిస్తాయి అనుకుంటా....వ్యక్తపరిచిన భావాలు కూడా అత్యంత సహజంగా అందుకేనేమో ఉంటాయి...

కొండముది సాయికిరణ్ కుమార్ said...

చదివిన వెంటనే, నాకు గుర్తుకొచ్చిన నా కవిత "వానలాగ"...

ఏళ్ళు మారినా
ఊళ్ళు మారినా
మట్టిలో కలిసే
మబ్బు వాసన మాత్రం
మారలేదు
ఎన్నెన్ని అనుభూతులు
వెదజల్లి
గుండెలోతుల్లో
జ్ఞాపకాలువెలికితీస్తుందో!

ఒక్కసారి
మబ్బుల్లో పుట్టి
మట్టిలో పొర్లాలనుంది
వానలాగ
===
It was a touching post from you. May god bless you @ Nishigandha gaaru.
===

సుజ్జి said...

Cheers! :D

కొత్త పాళీ said...

ఉగాది పండక్కి థేంక్స్గివింగ్ .. బాగుంది :)
సీరియస్లీ, మనలో నమ్మకముంచి, ఆదరించిన సహృదయుల్ని అప్పుడqప్పుడూ ఇలా కృతజ్ఞతతో గుర్తుచేసుకోవడం మంచిదే.

రాధిక said...

పాఠకురాలిని కాస్తా నీ కవితలతో అభిమానిగా మార్చేసుకున్నావు.అభిమానిని నీ స్నేహం తో మిత్రురాలిగా మార్చేసావు.అన్నీ నువ్వే చేసావు.అవును అన్నీ నువ్వే చేసి మమ్మల్ని అంటావెందుకు నిషీ? ఇండిపెండెంట్ గారి కామెంటు కాపీ పేస్టు.నువ్విలాగే రాస్తూవుండాలి...మాలోనూ సున్నితత్వం,భావుకత్వం వున్నాయని గుర్తుచేస్తూవుండాలి.

Unknown said...

నిషీ,

నీ మెయిల్ చూసి ఇటువచ్చాను, మానసవీణాగానం విందామని .మొత్తానికి అతిరధ మహారధుల తో పాటు నన్ను కూడా తలచుకున్నావు.
అది కేవలం నీ సహృదయత మాత్రమే !
కృతజ్ఞతలు.

అరుదైన భావుకత నీ సొంతం.
ఎన్నో ఉజ్జ్వలమైన కవితలతో నీ కవితా ప్రస్థానం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

స్నేహంతో
వైదేహి
అన్నట్లు,తెలుగుజ్యోతికి కొత్త కవిత పంపేది ఎప్పుడు ?

Mohanatulasi said...

గుండెల్లో పూసిన పువ్వొకటి పెదవులపై విరిసింది

నీ అక్షర పుటల్లో నా పేరు కనిపించడం నా అదృష్టం
కృతజ్ఞతలు సఖీ

సమయం, మూడ్ గురించి నువు చెప్పిన వాటితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను

సున్నితంగా చెబుతూనే సూటిగా హత్తుకునేట్టు వ్రాయడం నీ సొంతం ...

GoodLuck Dear

Subrahmanyam Mula said...

:) ALL THE BEST.

Subrahmanyam Mula said...

గుండెల్లో పూసిన పువ్వొకటి పెదవులపై విరిసింది!!

అద్భుతమైన వ్యక్తీకరణ తులసి గారు.

పరిమళం said...

నిషిగంధ గారు , ఇంతమందిని గుర్తుపెట్టుకొని థాంక్స్ చెప్పాలన్న ఆలోచన బావుందండీ ...మీ టపాలో నాక్కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు .మీ మొదటి పేరాలోని "ఒకసారి వెనక్కి వెళ్ళి పాతవన్నీ చదువుకుంటూ అవి రాసినప్పటి మనఃపరిస్థితిని గుర్తు చేసుకుంటుంటే తెలిసింది వాటిలో ఎక్కువభాగం జ్ఞాపకాలకీ, పొందిన అనుభవాలకీ, చూసిన సంఘటనలకీ మనసు ఉన్నట్టుండి మరల స్పందించడంవల్ల రాసినవే " అన్న వాక్యాలు నన్ను నేను చూసుకున్నట్టుందండీ .

మేధ said...

ఇంత సడెన్ గా, ఈ Thanks Giving టపా ఏంటీ..?! బ్లాగు మూసే ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా..?!

Kathi Mahesh Kumar said...

అసలు బ్లాగుల్లోకొచ్చాకే కూసింత కవిత్వం ఒంటబట్టింది నాకు. మీరు, బాబా గారు, రాధికగారూ లేకపోతో సాహిత్యంలో ఒక పార్శ్వాన్ని మిస్సయ్యేవాడ్నే. Thank you indeed.

ప్రణీత స్వాతి said...

చిన్న మాట అంటే ఏంటో అనుకున్నానండీ..మీ స్నేహితుల జాబితాలో నన్నూ చేర్చుకున్నందుకు నేను చెప్పాలి మీకు ధన్యవాదాలు.
చక్కటి మీ కవితల కోసం అందరిలాగే..కాదు కాదు..రవ్వంత ఎక్కువగానే ఎదురుచూసే


ప్రణీత.

నిషిగంధ said...

పులిగోరు గారు, ఆయన పూర్తి పేరే 'రవిగారు ' అనుకున్నానండి.. మళ్ళీ ఒట్టి 'రవి ' అని రాస్తే ఫీలౌతారని రాయలేదు :))

మురళి గారు, నా మనసు 'తరచూ రాయడం' అన్నమాట వినగానే ఢామ్మని పడకేస్తుందండి! :-)

సవ్వడి గారు, గుర్తున్నారండి.. మీపేరు చేసే సవ్వడి ఎలా మర్చిపోగలను :-)

Independent గారు, మీరు 'పయనమయే ప్రియతమా ' కి రాసిన వ్యాఖ్య మర్చిపోతే నేనా కధని మర్చిపోయినట్లే! పూర్తిగా యాంత్రికంగా మారిపోతున్న జీవితంలో మీరన్న టెండర్ మూమెంట్స్ ఉన్నట్టుండి మనల్ని పూర్తిగా ఆఫ్ ట్రాక్ చేశేసి, బాధ పెట్టి, దిగాలుగా మార్చేస్తాయి.. కానీ ఆ వలయం నించి బయాటపడినప్పుడు నాకేదో కొత్త ఎనర్జీ వచ్చినట్లనిపిస్తుందండి! జీవితం కాస్త కొత్తగా కనబడుతుంది.. కొన్నాళ్ళు నాకు లభించిన అవకాశాల్ని/సుఖాల్ని appreciate చేస్తాను.. అఫ్కోర్స్, ఇదంతా రొటీన్ చట్రం మళ్ళీ తనలోకి లాక్కునే వరకే అనుకోండి! btw, త్వరలో ఆ కధకి సీక్వెల్ (లాంటిది) చదవొచ్చు :-)

Korivi Deyyam said...

nee anta baagaa vaakyaalanu pondu parachalenu chelee :) naaku vachinattugaa naaku telisinattugaa chebutaa...

maata raani mounamidee...bhaashaleni bhaavamidee...paata vesuko :)

as always adurssss :)

నిషిగంధ said...

శేఖర్ గారు, మనందరం ఒకేలా ఆలోచించడం వల్లనేమో అవి అంత సహజంగా అనిపిస్తాయి! మీ టపాలు చదివినప్పుడూ నాదీ అదే భావన్!!

సాయికిరణ్ గారూ, ఎంత చక్కని కవిత! గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.. మీ సద్విమర్శల ప్రభావం నామీద చాలా ఉందండీ!

సుజ్జి, మీ చిరునవ్వులు ఇలానే నా బ్లాగులో ఎప్పుడూ చిందించాలి మరి :-)

కొత్తపాళీ గారు, మీరు చెప్పేవరకూ గమనించలేదు @ ఉగాదికి థాంక్స్ గివింగ్ :-) తరచుగా రాస్తూండమని మీరిచ్చే స్ఫూర్తికి మరొక్కసారి ధన్యవాదాలు..

రాధిక, మీరందరూ నా partners in crime, అందుకే మిమ్మల్ని అన్నాను :)) బ్లాగ్లోకంలో మొదటగా నన్ను పలుకరిస్తూ నువ్వు రాసిన వ్యాఖ్యలు మర్చిపోలేను!

నిషిగంధ said...

వైదేహీ, నేను తలచుకున్నవారందరూ అతిరధ మహారధులే, and, you are definitely one of them! నువ్వన్న hopeless romantic కామెంట్ మర్చిపోలేను.. ఇంతా చదివాక మళ్ళీ కవితా? :)))

తులసీ, "గుండెల్లో పూసిన పువ్వొకటి పెదవులపై విరిసింది" ఏమి ఎక్స్ప్రెషన్ చెలీ!!
వింటర్ వెళ్ళిపోతోంది.. మరి 'వసంత రాగాలు ' వినిపించడానికి సిద్ధమవుతున్నావా లేదా? :-)

సుబ్రమణ్యం, thanks again! :-)

పరిమళం గారు, మీ బ్లాగుకి నేనొక అభిమానినండీ.. టపాలన్నీ చదువుతాను.. 'మరి కామెంటేది?' అనడగకండి.. మళ్ళీ 'టపాలు చదివేసి మళ్ళీ వచ్చి కామెంటుదాం' అనే నా పాలసీ గురించి ఇంకో స్వగతం రాయాల్సివస్తుంది :))

మేధ, లేదండీ.. ఇదిగో ఇలా మిమ్మల్ని మళ్ళీ కలిసి పలకరించడమే ఈ టపాకి ఉద్దేశ్యం :-)

నిషిగంధ said...

మహేష్, మీది కూసింత కవిత్వమా!! నాకనుమానమే మీరు వేరే కలం పేరుతో కవితలు రాస్తుంటారని! :-) మూలకవితలో ఉండే భావం మీ అనువాదాలలో ఎక్కడా చెదిరినట్టు అనిపించదు!

ప్రణీత స్వాతి, చాలాసార్లు నాకు అనుమానం వచ్చింది తెలుసా! నేను కవిత రాస్తున్నట్టు మీకు ముందే తెలిసిపోతుందా ఏమిటి అని! మీ వ్యాఖ్య వెంటనే ఉంటుంది మరి! :-)

సఖీ, నువ్వు వాక్యాలను పొందుపరచలేవు అన్న మాట ఎవరిదగ్గరైనా చెప్పు, నా దగ్గర కాదు.. నీ స్పాంటేనిటీకి మొదటి ఫ్యాన్ ని నేనేనని మరువకుమా :)) నువ్వు గుర్తు చేసిన పాట కూడా అదుర్స్!!

Rajendra Devarapalli said...

యేమిటిదంతా?అసలేమి జరుగుతుందిక్కడ??
ఈ Thanksgiving టపా రాయడం వెనుక వేరే కారణమేమీ లేదని నొక్కి వక్కాణిస్తూ..అంటూ...

:)

శరత్ కాలమ్ said...

:)

Malakpet Rowdy said...

Wow, I'm the privileged one too. Thank you.

మధురవాణి said...

నిషిగంధ గారూ,
ఎవరికైనా అభిమాన రచయిత్రులూ, కవయిత్రులూ ఎప్పుడూ తలపుల్లోనే ఉంటారు. కానీ, అభిమానుల్ని కూడా పేరుపేరునా గుర్తుంచుకున్న మిమ్మల్ని చూస్తే అబ్బురమనిపిస్తోంది. నన్ను కూడా గుర్తు పెట్టుకున్నందుకయితే ఎంత పొంగిపోయానో చెప్పాలంటే మళ్ళీ ఒక చైనా వాలంత కామెంట్ అవుతుందేమో ;-) మీ ఊసులాడే ఒక జాబిలట చదివిన తరవాత నుంచీ, ఇన్నాళ్ళ తరవాత కూడా మీరెక్కడ కనిపించినా (అంటే మీ పేరూ, వ్యాఖ్య.. అలా అన్న మాట) నాక్కాసేపు 'కార్తీక' గుర్తొస్తుంది :-) ఇంక మీ 'కార్తీక' ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో చిరంజీవి అనుకుంటా! త్వరలో మీ కలం నుంచి మరొక అందమైన నవల జాలువారాలని గట్టిగా కోరుకుంటూ....

నేస్తం said...

అర్రే ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యాను ..నిషీ నేను బ్లాగ్లోకం లో రాక మునుపే మీరు తెలుసు ..ఈ అమ్మాయి చేత ఒక్క కామెంట్ నా బ్లాగ్లో రాయించుకుంటానా లేదా?? అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి .. నన్ను తలుచుకున్నందుకు చాలా చాలా థేంకులు :)

వేణూశ్రీకాంత్ said...

:-) బాగుంది నిషి గారు మాములు గా టపా లో రాసేయకుండా ఇలా లెటర్ ప్యాడ్ పై రాసినట్లు రాయాలనే ఆలోచన మరింత బాగుంది. all i can say is "You are most welcome" :-) మీ రచనలు చాలా బాగుంటాయ్. మురళిగారన్నట్లు ఇంత చక్కని రచనలు మాకు అందిస్తున్నందుకు మేము చెప్పాలి మీకు థ్యాంక్స్ లు.

Vasu said...

థాంక్సండీ. పేరు పేరునా పాఠకులు అందరినీ ఇలా ఓపిగ్గా తలుచుకోవడం గ్రేట్.

Good Luck,
Vasu

Vasu said...

అన్నట్టు రఘోత్తమ రావు గారి పేరు తప్పు పడినట్టుంది. ఆయన బ్లాగ్ తెలిస్తే చెప్పండి. ఆయన కవితలంటే భలే ఇష్టం నాకు. ఆయన సూచనలు,అభిప్రాయాలు (అప్పట్లో రాయడం మొదలెట్టిన ) నాకు బాగా ఉపయోగపడ్డాయి.
తెలుగు పీపుల్ లో కనపడలేదు నాకు.

Malakpet Rowdy said...

Raghittamarao quit Telugu people.com long back ( Blame it on me .. hehehe)

He can be seen on www.aavakaaya.com now

Its his own site

mirror said...

అమ్మడు .. గుర్తున్నాం అని మాకు గుర్తు చేయాలని నీకు గుర్తు రావటం మాకెంతో గుర్తుదాయకం .. .....ఎలాగోలా నిన్ను తిట్టడానికి లేకుండా మాకు బంధం వేసావు..
ఆ మాత్రం గుర్తు చేసుకోన్నందుకే ఉబ్బి తబ్బిబ్బయిపోయాం ...నీకు మా ఆశీస్సులు..
నీవడిగిన విషయాలు నీకు మెయిల్ చేస్తా..

వినాయకం చిత్తూర్

నిషిగంధ said...

రాజేంద్ర గారూ, నేనలా టపా రాయకపోతే మీరిలా మళ్ళీ కనిపించేవారా? :)) అంతా కుశలమే కదా..

శరత్ గారు, ధన్యవాదాలు :-)

మలక్ జీ, మీ పేరడీలు లేకపోతే నా కవితలెక్కడివి చెప్పండి :))

మధురవాణి, మీరు ఆ నవలంతా చదివి రాసిన వ్యాఖ్య ఇంకా గుర్తుందండి.. కార్తీకకి అంత చక్కని స్పందన వచ్చాక మళ్ళీ ఏమి రాయాలన్నా భయంగా ఉంది.. ఆ స్థాయికి తగ్గట్టు రాయగలనా లేదా అని.. మీ అభిమానానికి మళ్ళీ మళ్ళీ థాంక్సులు :-)

నేస్తం, నేను ఇది రాసేప్పుడు ఎన్నిసార్లు అనుక్కున్నానో 'నేస్తం, ఎంత చక్కగా తలచుకున్నారో.. నాకలా రావడం లేదు అని!' :-)

నిషిగంధ said...

వేణూ, ఎలానో రాయాలి అనుకుంటూ మొదలుపెడితే అలా లెటర్ ప్యాడ్ లోకి చేరి ఇంకెలాగోలా పూర్తయ్యింది ఈ టపా.. అర్ధవంతంగా, విపులంగా ఉండే మీ స్పందనల కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను :-)

వాసు, ధన్యవాదాలండీ.. రఘుజీ పేరు గురించి చెప్పినందుకు కూడా :-) సరిచేశాను.. మలక్ జీ చెప్పినట్టు ఆయన ఇప్పుడు ఆవకాయ లో కనిపిస్తారు..

వినాయకం గారు, మీ వ్యాఖ్య చూసి నేను సూపర్ హేపీస్ :)) అప్పటి మన గుంపు చేసిన అల్లరి ఎలా మర్చిపోతానండి.. 'ఆనాటి ఆ స్నేహమానందగీతం... ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం' :-)

భావన said...

నిషి, ఎక్కడో మొదలయిన ప్రయాణం లో ఎక్కడిక్కెడి వాళ్ళనో కలుసుకుంటూ, స్నేహాలను పంచుకుంటూ నిజం గా చిత్రమయిన ప్రయాణం... ఈ ప్రయాణం లో కలిసిన స్పందనల ను కలబోసుకున్న నీ ప్రయత్నం బాగుంది ఆ కలఫొతల కలనేత లో నేనొక పోగునయినందుకు ఆందం గా వుంది, సమయమన్నా గుర్తు జ్నాపకాల గుబాళింపుల గంధమై చిమ్మక పోతే.. అనుభవం అలలంటి కలలను కన్నుల వెనుక, కల్హార పువ్వును పెదవుల మీద రప్పించక పోతే రాయటం కష్టమే.. నీ మాట పూర్తి గా అర్ధం అయ్యింది ఐనా మళ్ళీ చెపుతున్నా తరచు రాయాలోయ్.. (హి హి హి నువ్వు నాకు అదే చెప్పక మరి)

నిషిగంధ said...

భావనా, నీ వ్యాఖ్య చదవడమే ఎంతో బావుంటుంది.. పలుకరింపులో కూడా భావుకత్వం చిందిస్తావు.. బోల్డన్ని ధన్యవాదాలోయి :-)

జాన్‌హైడ్ కనుమూరి said...

all the best
write more n more

SRRao said...

నిషిగంధ గారూ !

మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

- శిరాకదంబం

పద్మ said...

నిషీ,

నా దగ్గర మాటల్లేవురా. నన్ను తలుచుకున్నందుకు నీకు థాంక్స్ చెప్పటం తప్ప ఇంకేం చెయ్యలేను. అసలు నీకోసం ఒక కవిత అర్జెంట్‌గా రాద్దామనిపించింది కానీ మళ్ళీ భయం వేసింది హనుమంతుడి ముందు కుప్పిగంతులా అని. :|

Vasu said...

"చిన్న మాట " లు సరే. మలి కవిత ఎప్పుడు ??

మురళీ కృష్ణ said...

"మీ అక్షర పుటల్లో నా పేరు కనిపించడం"(very much use to 'copy paste', నా profession యిచ్చిన వరం ;) ) చాలా సంతోషాన్ని... కొంచెం గర్వాన్ని కూడా యిచ్చాయి. అదేంటో... చాలా చెప్పాలని వుంది కానీ మాటలే ఎలా కూర్చాలో తెలియటం లేదు. ('మరో చరిత్ర' లో కమలహాసన్ dialog ఊహించుకోవాలన్నమాట). బొలెడు థ్యాంకులు.

అంటే మీరు కూడా రఘు గారి బ్యాచ్చి అన్నమాట... నన్ను యిటవైపుగా(తెలుగు articles చదవటం) లాక్కువచ్చింది రఘు గారి రచనలే... వీళ్ళ గ్యాంగ్(మూలా సుబ్రమణ్యం, యింకా ఒకాయన దుబాయ్ నుండి, ఇంకొకాయన బాంబే నుండి... ) భలే వుంటుంది.

మరి next Post ఏప్పుడు release చేస్తున్నారు... ఆలస్యమైనా పర్లేదు... minimum వంద కామెంట్లు పడాలి.

Bhanu Chowdary said...

Thanks Nishigandha garu. Malli Chinnari Siri lanti manchi story ni eppudu maa munduku testaro teliyacheyandi

సవ్వడి said...

నిషిగంధ గారు! మీ కవితల కోసం ఎదురుచూస్తున్నాం.

Purnima said...

No. I'm not happy with you still - or at least, before 6 months - remembering me. I just don't like it.

I'd have been grateful to you had you forgotten me. I didn't want to see my name there. But had to.

Whatever made you write this, I wish and hope, it keeps recurring.

Best,
Purnima

తృష్ణ said...

sorry for the very delayed comment...and thakyou verymuch for joining my name too..!I think its needless to say that iam a big fan of ur poetry...:)

అన్నమాచార్య కీర్తనలు తెలుగులో said...

ela raasarandi idantha

krishna said...

ఆత్రేయ గారి కవిత, బాపు గారి బొమ్మ, కోనసీమ కొబ్బరితోట లోని వెన్నెలలో వుండే మత్తు నిషిగంధ కవిత్వంలో కూడా వుండడం గమ్మత్తుగా లేదూ!!!!!!!

krishna said...

ఆత్రేయ గారి కవిత, బాపు గారి బొమ్మ, కోనసీమ కొబ్బరితోట లోని వెన్నెలలో వుండే మత్తు నిషిగంధ కవిత్వంలో కూడా వుండడం గమ్మత్తుగా లేదూ!!!!!!!