Pages

Thursday, March 4, 2010

ఒక చిన్నమాట... మీకు చెప్పాలని.. (ముందో చిన్న కధ)

   
  
ఆ మధ్య ఓ వారాంతం సాయంత్రం సమయమేంటో ఎటూ జారిపోకుండా నాపక్కనే బుద్దిగా కూర్చుంది.. నీక్కావాల్సినంతసేపు ఉంటానని కూడా మాటిచ్చేసరికి నా పాదపూజ చేసుకునే అవకాశం కాఫీటేబుల్ కి ఇచ్చేసి, తీరిగ్గా వెనక్కి జారగిలబడి, ఎన్నాళ్ళకో చేతికి చిక్కిన టివి రిమోట్ ని అపురూపంగా చూసుకుంటూ ఆన్ చేశాను.. సౌండ్ మొదలయ్యి, బొమ్మ కోసం నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుని వేచి చూస్తుంటే ఉన్నట్టుండి టిక్ టిక్ టిక్ అని ఎవరో స్విచ్ ఆన్ ఆఫ్ చేసిన శబ్దం మొదలయ్యింది.. Mr.India లా ఎవరన్నా కనబడకుండా టివి పవర్ బటన్ ని నొక్కుతూ నన్ను ఆటపట్టిస్తున్నారేమోనన్న ఆశతో గాల్లో చేతులు ఆనందంగా ఆడించాను.. ఏం తగల్లేదు! పోనీ నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళముందుంటాడేమో అని గుడ్డిదానిలా తడుముకుంటుంటే కాఫీ టేబుల్ అంచుకి మోకాలు తగిలి నేను బాధతో 'అమ్మా!' అని అరిస్తే, పక్కింటి కుక్కపిల్ల సానుభూతిగా భౌమంది.. ఇంతలో ఆ టిక్కు టిక్కు శబ్దం కూడా ఆగిపోయింది.. అప్పుడు పక్కకి తిరిగి పడుకున్న బుర్రని తట్టి లేపి ఆలోచిస్తే అసలు విషయం అర్ధమైంది! మావారు ఇంట్లో లేనప్పుడల్లా ఎలక్ట్రానిక్ వస్తువులు వంతుల వారీగా పెద్దగా చిటికెలు వేసుకుని, ఆవులించి మరీ గాఢనిద్రలోకి జారుకుంటాయని, ఇప్పుడు జరిగింది కూడా ఆ కుట్రలో కూడా భాగమేననీ!!

'నువ్వు పనిచేస్తే ఎంత లేకపోతే ఎంత.. నీ అమ్మమ్మ లాంటి టివి తెచ్చుకుని నీ కళ్ళముందే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాను' అని నిరశనగా చూసి గరాజ్ లో మావారి టివిని అక్కడి కనెక్షన్లన్నీ ఊడబెరికి లివింగ్ రూంలోకి మోసుకొచ్చాను.. అది నిజంగా అమ్మమ్మ లాంటి టివినే!! మావారు యుఎస్ కి వచ్చాక కొనుక్కున్న మొట్టమొదటి టివి.. అది కూడా స్టోర్ లో తళాతళలాడేది కాదు, ఎవరో వృద్ధ దంపతులు పెట్టిన గరాజ్ సేల్లో కొన్నది!!

సో, ఇక్కడి వైర్లన్నీ మళ్ళీ దీనికి రీకనెక్ట్ చేసి, ఆయాసపడుతూ ఆన్ చేస్తే నల్లగచ్చు మీద ఎవరో ముగ్గు పిండి పారబోసినట్లు స్క్రీన్ అంతా తెలుపు చుక్కల మయం.. పక్కనున్న కుర్ర టివి నిద్రలో కూడా కిసుక్కున నవ్విన అనుమానం వచ్చి ఇంకాస్త పట్టుదలతో ఆ వైర్లన్నిటినీ సరిచూడటం మొదలుపెట్టాను.. నాకెందుకో టివి/ఎంటర్టైన్ మెంట్ సెంటర్ వెనకాల ఉండే వైర్లని చూస్తే వారాల తరబడి స్నానపానాదులు లేకుండా దుమ్ము కొట్టుకుపోయి ఉండే ఇక్కడ నల్లవాళ్ళు వేసుకునే జడలు గుర్తొస్తాయి!!

సో, ముందు వాటన్నిటినీ క్లోరాక్స్ వైప్స్ తో క్లీన్ చేశేసి (మనలో మన మాట, ఈ పని కానీ మాఆయన చూసుంటే stand up on the bench అని నన్ను డైనింగ్ టేబుల్ ఎక్కించేసేవారు!! వైర్లకి తడి తగిలించడం అంత మహాపాపం వేరేది లేదు ఆయన దృష్టిలో!), అతి జాగ్రత్తగా మళ్ళీ కనెక్ట్ చేసి పవర్ బటన్ నొక్కాను.. అది మళ్ళీ ఫ్రెష్ గా పిండి పారబోసుకుంది తప్ప వేరే ప్రోగ్రెస్ కనిపించలేదు!

ఇక తప్పక ఆయనకి కాల్ చేశాను.. 'దాని మేల్ కనెక్షన్ దీని ఫిమేల్ కనెక్షన్కి ఇచ్చావా? ఆ యెల్లో ఎండ్ ఈ బ్లూ ఎండ్ పక్కనే ఉందా?' లాంటి ప్రశ్నలన్నిటికీ స్లిప్పులు రాసుకుని, పరీక్షకి సిద్ధమై ఆయన 'హలో' అనగానే సమస్య చెప్పాను.. ఏ ఉపోద్ఘాతమూ, భగవద్గీత శ్లోకాలూ వినిపించకుండా 'గరాజ్ లోంచి టివి మోసుకొచ్చావా? ఎందుకూ, బెడ్ రూం లో చూసుకోవచ్చుగా?!' అన్నారు!! ఆ క్షణాన ఎవడు కొడితే మైండ్ బ్లాకై ఎట్సెట్రా ఎట్సెట్రా జరుగుతుందోలాంటి పోకిరిలు నాకు ఆయనలో కనిపించారు!! నాకు ఖచ్చితంగా తెలుసు, నాలో ఆయనకి ఇలియానా కాదు, బహ్మి కనిపించి ఉంటాడని!! ఆ వేదనతో మారుమాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను...

ఇంత పెద్ద ఎత్తున ఉపోద్ఘాతం ఇచ్చింది మా ఇంట్లో ఎన్ని టివిలు, ఏ ఏ గదుల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి ఎంత మాత్రమూ కాదనీ, ఎప్పుడూ 'టైం లేదు మొర్రో' అని గింజుకునే నాకు ఉన్నట్టుండి బోల్డంత టైం దొరికితే ఎలా వృధా చేస్తానో చెప్పడానికి!! నాకు టైం మేనేజ్మెంట్ బానే తెలుసు.. కానీ అస్సలు తెలీందల్లా తీరిక మేనేజ్మెంట్!!

అర్ధరాత్రుల వరకూ ఆఫీసుకి కనెక్ట్ అయ్యి పని చేస్తున్నప్పుడూ, ఎక్కడైనా ఒక మంచి రచన చదవగానే నాకూ ఏదో ఒకటి రాయాలన్న ఆవేశం వచ్చినప్పుడూ ఇలాంటి తీరిక కోసమే నేను కలవరించేది! అంతెందుకూ, నన్నెవరన్నా 'ఏంటమ్మాయ్, నీ తర్వాత రచన ఎప్పుడూ?' అని అడగడం పాపం వెంటనే నాకు లేని తీరిక గురించీ తద్వారా నా దరికి రాని మూడ్ గురించీ సోదాహరణంగా వివరిస్తాను.. కానీ ఆ తీరికే అధాటున వచ్చి నా వళ్ళో వాలితే ఇదిగో ఇలా సావిత్రమ్మని (మా తమ్ముడంటాడు ఇప్పటి టివిలు కత్రినా కైఫ్ లా స్లిమ్ముగా గ్లామరస్ గా ఉంటే ఆనాటి టివిలు 'దేవత'లో సావిత్రిలా ముద్దుగా బొద్దుగా ఉంటాయని!) ఇంట్లో ఆ మూల నించి ఈ మూలకి మోసుకు తిరగడం, వైర్లన్నిటికీ తలస్నానాలు చేయించడం లాంటి పనులతో కాలం గడిపేస్తాను!!

అసలు ఊసుపోక రాసుకోవడం వేరు.. రెండు వాక్యాలు రాసి అలిసిపోయిన ఫీలింగ్ తెచ్చేసుకుని రెండు గంటలు కునుకు తీయొచ్చు.. కానీ ఎవరైనా మనమీద ఒకపాటి నమ్మకం/గౌరవం లాంటి ఉన్నతభావం ఉంచుకుని "మా ఫలానా కార్యక్రమానికీ/సంపుటికీ మీరో కవిత రాస్తే బావుంటుంది" అని అడిగినప్పుడు ఆ విషయాన్ని ఎంత బాధ్యతగా తీసుకోవాలి!! మళ్ళీ అలా అడిగింది ఏమాత్రం పరిచయంలేని వాళ్ళు కాదు.. నేనెంతో అభిమానించేవాళ్ళే! ఒకరు నాకిష్టమైన అంతర్జాల పత్రికైతే, ఇంకొకరు నాకు ఎంతో నచ్చే కవిగారు.. నాకు ఆయనంటే ఉన్న అభిమానానికీ, గౌరవానికీ అసలు ఆయన అడగడం అదృష్టంగా భావించి, ఆ రాత్రికి రాత్రి ఒక అందమైన కవితని సృష్టించి, భక్తిగా ఆయనకి సమర్పించుకోవాలి! ఆ రాత్రి కాదు కదా కనీసం రెండుమూడు రాత్రులవరకూ ఒక్క లైను కూడా రాయలేకపోయాను!!

సమయాభావం వల్ల కుదరలేదని మనసుకి సర్ది చెప్పుకున్నా వీలున్నప్పుడల్లా దేనిమీద రాద్దామా అని కవితావస్తువు కోసం వెదుక్కుంటూనే ఉన్నా! రెండు మూడు తోచాయి.. ఇది పత్రిక వారి కార్యక్రమానికి బావుంటుంది, అది కవిగారివ్వడానికి బావుంటుంది అని అంపకాలు కూడా విజయవంతంగా ముగిసాయి.. ఆ తర్వాత ఒకరాత్రి కూర్చుని ఒకదానిమీద కవిత పూర్తి చేశాను.. సంతోషంగా ఒకసారి ఒళ్ళు విరుచుకుని ఆ కవిత మొత్తంగా అలా చదివాను.. ఏం చెప్పమంటారు? నేను ఐదోతరగతిలో రాసిన "నీమీదొట్టు, నిన్ను మర్చిపోలేదు" కవిత దీనికంటే వెయ్యిరెట్లు నయం! 'ఐదోతరగతిలోనే అలాంటి కవితా!' అని మీరు నన్ను అదోలా చూడకండి మరి! వర్షాలు పడి చాన్నాళ్ళైందని మా అమ్మా, అమ్మమ్మ మాట్లాడుకుంటుంటే విని నాకు వాన మీద అకస్మాత్తుగా పుట్టిన బెంగతో అలా రాసానన్నమాట!

సరే, అసలు విషయంలోకి వస్తే.. ఆ రెండూ కవితా వస్తువుల్నీ మార్చి మార్చి మనసులో ఊహించుకుని, సరికొత్తగా అనుభూతి చెందడానికి ప్రయత్నించి, ఆ భావాల్ని ఎన్ని వర్షన్స్ లో రాసినా నాకస్సలు నచ్చడంలేదు.. అంతే! ఇంక వాటి గురించి ఆలోచించడం మానేశాను.. ఎక్కడో చదివాను, ఒక కవి/రచయిత మనసులోని భావావేశం కమనీయ కల్పనగా రూపుదిద్దుకోవడానికి ఒకసారి ఆరునిమిషాల్లో జరిగిపోతే ఇంకోసారి ఆరునెల్లు కూడా పట్టొచ్చంట!!


.........................................

చిన్నమాట అని రెండుపేజీలు చదివించింది ఇంతకీ ఆ మాటేమిటీ? ఎక్కడుంది అని వెతుక్కుంటున్నారేమో.. ఆ మాటేదో, అసలు స్వగతాల జోలికి పోని నేను రాసిన ఈ టపా ముఖ్యోద్దేశ్యమేమిటో తరువాతి భాగంలో చెప్తాను.. ఎంత.. జస్ట్ ఒకటీ రెండు రోజులు ఓపిక పట్టండి, ప్లీజ్ :-)






సశేషం......


17 comments:

మురళి said...

కొత్త కవిత అనుకుని వస్తే స్వగతం తో ఆశ్చర్య పరిచారు.. బుర్రతో పాటు కళ్ళకీ పని పెట్టారండీ.. ఫాంట్ సైజు కొంచం పెంచడానికి వీలవుతుందేమో చూడండి..
అన్నట్టు.. టీవీ వైర్లు ఇబ్బంది పెడితే బొమ్మ వచ్చే వరకూ వైర్లని మారుస్తూ ఉండడమే :)

శ్రీకర్ బాబు said...

బాగుందండీ మీ స్వగతం...... చాలా బాగా రాసారు.....

జయ said...

ఎంతమాత్రం మధ్యలో ఆపలేక పోయానండి. చివరికంటా, మీ రచన నా చేయి పట్టుకొని నడిపించి మరీ చదివించింది. చాలా బాగుంది. ఇప్పుడు వెంటనే నేను కళ్ళడాక్టర్ దగ్గరికి పరిగెత్తక మాత్రం తప్పదు. ఎంత లావు సోడాబుడ్డీ కళ్ళద్దాలు ఇస్తాడో ఏవిటో. లోక మంతా చిన్న చిన్న చీమలే కనిపిస్తున్నాయి నాకు. మంచి రచనలు చదవాలాంటే ఎంత కష్ట పడాలో, నా కిప్పుడు బాగా అర్ధమయ్యిందండి.

teresa said...

నల్లవాళ్ళ జడలా? నువ్వక్కడ పెట్టింది
శుబ్బరమైన తెల్ల బ్లాండ్‌ పిల్ల తలే. జాగ్రత్త, ఎవరో వచ్చి హత్తేరీ, ఇంత మాటంటావా అని విరుచుకుపడతారేమో! :)

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది నిషిగంధ గారు :-) మరే ఇంతకీ ఏమిటీ ఆ చిన్నమాట అని అనుకుంటుండగా మీరే చెప్పారు ఎదురు చూపులు తప్పవని :-) సరే ఏం చేస్తాం ఎదురు చూస్తాం. అన్నట్లు టపా ఫాంట్ సైజ్ పెంచాలండి. ఇప్పుడు చాలా జూమ్ చేసుకుని చదవాల్సి వస్తుంది.

Mohanatulasi said...

అమ్మకుట్టీ ...మొత్తానికీ నన్ను కూడా నీ పక్కన కూచోపెట్టుకున్నావు ... బాగుంది
కమ్మగా మన బెంజ్ సర్కిల్ దగ్గర దొరికే వేడి వేడి పునుకుల్లా వున్నాయి కబుర్లు

రాధిక(నాని ) said...

నిషిగంధగారు , మీబ్లాగ్ గురించి ఒకరోజు ఈనాడులో రాశారు. కానీ నేను చూద్దామనుకొని చూడలేదు . ఈరోజే మొదటిసారి చూసాను. చాలా బాగారాశారు .ఏమిటా చిన్నమాట అనుకొని చదవడం మొదలుపెడితే నవ్విస్తూ ఆపకుండాచదివించి, చివరికి రెండురోజులాగమని అన్నారు. సస్పెన్స్ లోపెట్టారు .సరేలే మిగిలినవి అన్నీ ఈలోపు చదవచ్చులే అనుకున్నను .

సుజ్జి said...

:D

శేఖర్ పెద్దగోపు said...

ఇప్పుడు నాకు మీరు అయిదో తరగతిలో రాసినా ఆ వాన కవిత చదవాలనుందండి...ఏలా? :)

ప్రణీత స్వాతి said...

ఏవిటా చాలా రోజులుగా మీరేమి రాయట్లేదూ అనుకున్నా..ఇలా సావిత్రమ్మని మోస్తూ కాలం గడిపేస్తున్నారా :):)
అన్నట్టు నాకూ ఆ కవిత (ఐదో తరగతిలో మీర్రాసింది) చదవాలనుందండీ..ఎలా?

Kottapali said...

కళ్ళు అక్షరాలెమ్మట పరిగెడుతూ ఉంటే, కనుకొలుకుల్లోంచి ఆ బొమ్మ చూసి ఏదన్నా కొత్త టైపు శివలింగమేమో ననుకున్నా! :)

రాధిక said...

అయితే ఐదో తరగతిలో త్రిషావన్న మాట.తరువాత నిషివయ్యావన్న మాట.అబ్బో నాకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి :) ఆ చిన్నమాటకోసం వెయిటింగమ్మా ఇక్కడ.త్వరపడు త్వరపడు :)

కొత్త పాళీ said...

@ రాధిక. మీ బ్లాగులో ఆఖరి కవిత గత సంవత్సరం ఆగస్టులో పోస్టబడినది. ఎవరిప్పుడు త్వరపడాల్సినది??

రాధిక said...

@కొత్తపాళీ గారూ నో కామెంట్ :)

నిషిగంధ said...

అందరికీ ధన్యవాదాలు :-)

@ font size..So sorry for the inconvenience!
నా మానిటర్ నా కళ్ళని మాయ చేసింది! :(

మురళి గారు, కవిత చేతికి చిక్కడంలేదనే నా బాధండీ :( వైర్లు మార్చుకుంటూ పోవడమా! నాకస్సలు ఆ పేషన్స్ లేదండి! :-)

శ్రీకర్ గారు, ధన్యవాదాలు :-)

జయ గారు, మీ కళ్ళ డాక్టర్ బిల్ ఈసారికి నాకు పంపండి :-)

తెరెసక్కా :))) నేనా పిక్చర్ రాత్రి పూట సేవ్ చేశానక్కా, అందుకే పెద్ద తేడా తెలీలేదు.. ముఖ్యంగా జడల చివర ఆ రంగురంగుల రింగ్స్ ఉండేసరికి సరిగ్గా పోలిక సరిపోయినట్లనిపించి ఇంక ఎక్కువ వెతకలేదు..

వేణూ, చిన్నమాటలే బయటకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయండి! నాకూ ఇప్పుడే అనుభవమైంది :-)

తులసీ, మొన్ననే ఆ బెంజ్ సర్కిల్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ వెనక్కి రాలేక రాలేక వచ్చాను, మళ్ళీ తిసుకెళ్ళిపోయావుగా!!

రాధిక(నాని) గారు, నా బ్లాగుకి మీకు సుస్వాగతం.. ఆ చిన్నమాటేంటో చదివారో లేదో కానీ మీకు మా పండుగాడు స్పెషల్ థాంక్స్ తీసుకువస్తాడండీ! :-)

సుజ్జి :-)

శేఖర్, ప్రణీత -- అలనాడు రాసిన కవితలన్నీ antiques అండీ.. భద్రంగా లాకర్లో దాచాను.. :-)

ఛంఛం గారు, శివలింగమా! :)) నేను కూడా మీలానే కనుకొసల్లోంచి చూడటానికి ప్రయత్నించానండి.. కళ్ళు నొప్పెట్టాయి కానీ శివలింగం మాత్రం సాక్షాత్కరించలేదు :-)

రాధిక, త్రిష నా.. నేను ఇంకా రాధననుకుంటున్నానే :))

కొత్తపాళీ :-)

Innereye-spurthi said...

nishigandha garu nenu mee kotha friendni. mee swagatham chala bagundi. na medadu booju vadindi konchem adantha meevalle. thanks for that.

నిషిగంధ said...

కొత్త స్నేహానికి సాదర స్వాగతం :-)