Pages

Tuesday, July 29, 2008

ఊసులాడే ఒక జాబిలట! (June 2008)


.....ఆ సంచుల్లోంచి ఏవో రంగు కాగితాలు, టోపీ, ప్లాస్టిక్ పూల గుత్తులు లాంటివి తీసి బయట పెట్టి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టాడు.. రెండు నిమిషాల్లో అర్ధం అయింది అతను మ్యాజిక్ షో చేయబోతున్నాడని.. లోపల కోపం లావాలా పొంగుతున్నా 'అబ్బో ఇతనికి చాలా కళలే తెలుసే!' అనుకున్నా.. అతనికి కావాల్సినవన్నీ అందిస్తూ చూస్తుండగానే నేనూ పిల్లల కంటే ఎక్కువగా ఆ ప్రదర్శనని ఎంజాయ్ చేయసాగాను.. పిల్లలైతే ఒకటే అరుపులు, చప్పట్లూను!! మొత్తానికి చాలా బాగా జరిగింది అనుకుంటూ అతను తెచ్చిన వస్తువులన్నీ మళ్ళీ లోపల పెట్టేస్తుంటే చూశాను అతని షర్ట్ వెనక ఉన్న రక్తపు మరకల్ని!! కాస్త భయం వేసింది, ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగి దెబ్బలేమైనా తగిలాయేమో అని!! మెల్లగా అక్కడ నించి జారుకుని ఆ విషయం సులోచన మేడం కి చెప్పాను.. ఆవిడ "అవునా కనుక్కుంటాను" అన్నారు కానీ నాకే మనసాగక అతని దగ్గరకెళ్ళి "మీకేమన్నా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే చెప్పండి" అన్నా.....


పూర్తిగా..

9 comments:

ఏకాంతపు దిలీప్ said...

వచ్చే నెలకి నా దగ్గర ఎనిమిది బాగాలు ఉంటాయి :-) పోగు చేసుకుంటున్నాను...

Purnima said...

అసలు ఎవరి టపాలైనా ఓపికగా చదివే నాకు.. మీ టపాలెప్పుడూ నేను ప్రత్యేకించి ప్రయత్నం చేస్తే గాని కుదరని "సమయం" లో వస్తాయి. అలా వచ్చిన ప్రతీ సారి.. నాకు నేను నాకై ప్రత్యేకంగా ఇచ్చుకునే స్వీట్ గిఫ్ట్ మీ రచనలు!! :-)

వేణూ శ్రీకాంత్ said...

ఏవిటో నిషి గారు చదువుతున్నంత సేపు ప్రతి పేరా కి మిమ్మల్ని మెచ్చుకుంటూనే వుంటాను కానీ కామెంట్ వ్రాయడానికి వచ్చేప్పటికి ఏం వ్రాయాలో అర్ధం కాదు. ఓ మధురమైన భావన మనసంతా నింపేస్తున్నారు మీ లేఖలతో.

సుజాత said...

నాకైతే ఏదో 70'sలోని మంచి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నట్టుంది నిషి!
ఈ సంచికలో నచ్చిన వాక్యాలు..
1.అన్నీ తెలిసిన భార్య కంటే అర్థం చేసుకునే భార్య దొరకడం అసలైన అదృష్టం..పచ్చి నిజం!

2.జీవితమంటే అంత చులకనా?

కల said...

నిషిగారు,
లేఖలతోనే అంతా జరిపించేస్తున్నారు. మొదలుపెట్టేతప్పుడు మాత్రమే అది లేఖ అని గుర్తు ఉంటుందండీ. కాని తర్వాత మన పక్కనే జరుగుతున్నట్లు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. చాలా మంచి narration.

నిషిగంధ said...

దీపూ, ఒకేసారి డెసెంబర్ లో వెళ్ళు.. అప్పుడు చక్కగా అన్ని భాగాలు ఉంటాయి :)

నెనరులు పూర్ణిమా, వేణు గారు, సుజాత, కల గారు :-)

ఏమాత్రమన్నా రాస్తున్నాను అంటే ఆ ఘనతంతా కార్తీకదే! మీకు తెలిసే ఉంటుంది కదా ఇది రియల్ స్టోరీ అని.. తను రాసిన అసలు ఉత్తరం ఒకే ఒక్కటి చదివాను.. ఆ ప్రభావమే నాతో ఇన్ని లేఖలు రాయిస్తోంది :-)

satya said...
This comment has been removed by the author.
SRI said...

Ee madhya kalamlo nannu inthaga kadilinchinadi emi ledu..Adi chaduvuthunte idi ani cheppaleni anubhuthi ki lonu avuthanu...Manaspoorthi ga na subhakankshalu theluputhunnanu,intati swachhamaina bhavalani vyakteekaristhunnanduku..

నిషిగంధ said...

Thank you so much Sri gaaru!