Pages

Friday, August 8, 2008

ఆశాకుసుమం


రేపటి ఉదయానికి
రంగులద్దాలనుకుంటున్న
చిట్టి ఆశని
చినుకు తర్వాత చినుకు
బలంగా అదిమేస్తున్నాయి..

రాత్రంతా పరిహసించిన
పెనుగాలిని లెక్కచేయని
ఆత్మవిశ్వాసం
ఆకుల మధ్య మెల్లగా
విచ్చుకుంటుంటే

సన్నని పరిమళం
మనసుని మెత్తగా
హత్తుకుంది!


(తొలిప్రచురణ)

37 comments:

Anonymous said...

Nishi gAru,
Awesome.. manchi varNana.. can you pl. explain what the context is?

Cheers,
Srini Chimata
www.ChimataMusic.com

శ్రీవిద్య said...

Wow.. Beautiful....
పదాల్లో అందం, మంచి అర్ధం కూర్చి చాలా బాగా అల్లారు.

Purnima said...

Awesome!!

sujata said...

Excellent Nishigandha

teresa said...

పొద్దున్నే లేచి తడితడిగా విచ్చుకుంటున్న నందివర్ధనాన్ని చూస్తున్న అనుభూతి! చాలా బావుంది.

కొత్త పాళీ said...

very nice

మాలతి said...

సుతారంగా చిరుగాలులు వీచినట్టు మధురమైన తలపులు.

ఏకాంతపు దిలీప్ said...

నా రచనల్లో రాత్రి,చందమామ,చుక్క,వెన్నెల లాగా మీ కవితల్లో ఉదయం,చిరు గాలి,రాత్రి తరచుగా కనిపిస్తాయి.. :-)

మాలతి గారు అన్నట్టు... సుతారం చిరు గాలి నను హత్తుకుంటున్నట్టు!

radhika said...

నిషి మీకు అర్జ0టుగా హగ్గు ఇచ్చేయాలను0ది.ముద్దు ముద్దు గా లేత లేతగా వు0ది.ఇ0కా ఏవో చెప్పాలనివు0ది...కానీ చెప్పలేకపోతున్నాను.అర్ధ0చేసుకోరూ...

ramya said...

మనసుని మెత్తగా
హత్తుకుంది!

నిషిగంధ said...

నెనరులు శ్రీని గారు, శ్రీవిద్య, పూర్ణిమ, సుజాత గారు, తెరెసాక్క, కొత్తపాళీ గారు, మాలతి గారు, దీపు, రాధిక, రమ్య గారు..

@శ్రీని గారు - very nice to see your comment.. you made my day :-) context అర్ధం కావాలంటే తెరెసా గారి కామెంట్ చూడండి.. ఇట్టే తెలిసిపోతుంది :-)

@ దీపూ :)) అంతేనంటావా !

@రాధిక, నాకిష్టమైనవి ఇస్తానంటే ఒద్దంటానా.. అంతా అర్ధం చేసుకున్నా ;-)

ప్రతాప్ said...
This comment has been removed by the author.
ప్రతాప్ said...

నిషి గారు, బావుంది అని సింపుల్ గా చెప్పలేక నాకు అనిపించిన భావాలని ఇక్కడ రాస్తున్నా.
మీ మొదటి చరణం చదవగానే ఎక్కడో చిరు తడి మనస్సు మూలల్లో, ఏదో చిన్న కంట తడి కనుకొనకుల్లో. ("అస్సలే చూపు ఆనదు ఆపై కన్నీరొకటి కళ్ళలో" అనే శబరి మీకు గుర్తొచ్చిందా కొంపదీసి?)
చివరి చరణం చదవగానే ఎదలో ఏదో హాయి, సంతోషం కనులలో వాలిందోయి అంటూ మనస్సు ఎంతగా నాట్యం చేసిందో.
నిజమే కదా? ఒక పువ్వు విచ్చుకోవాలంటే ఎన్ని నిద్రలేని రాత్రులని భరించాలి? ఎన్ని నిశీధి నీరవాలని ఎదుర్కోవాలి? ఎన్ని వడగండ్లని, ఎన్ని కడగండ్లని మోయాలి? ఇంతా చేస్తే మనం వాటిని నిర్దాక్షిణ్యంగా కోసి సూదులు గుచ్చి, మాలలుగా చేసి మన అలంకారం కోసం ధరిస్తాం. ఇక్కడ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుర్తుకు రాలేదు కదా? ఎప్పుడైనా రాలిపోయే పువ్వే కదా, వాటికి కాస్త అదృష్టాన్ని ప్రసాదిస్తున్నామంటూ హోయలోలికే తోయ్యలులని చూస్తే కొద్దిగా ఈర్ష్యా, కొద్దిగా కోపము కూడా కలుగుతాయిలెండి.

ఏంటో ఏదో రాయబోయి, ఏదేదో రాసేస్తున్నా. మనస్సులో పెట్టుకోకుండా మీరు, మీ పని కానిచ్చెయ్యండి మరి.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఆమధ్య నేను రాసిన కామెంటొకటి మళ్ళీ గుర్తుచేసుకోండి,మళ్ళీ రాసే ఓపికలేదుకానీ :)

నిషిగంధ said...

ప్రతాప్ గారూ, కవిత చెప్పాలనుకున్న విషయాలను చాలా చక్కగా విడమరిచారు!! నెనరులు..
btw, "అస్సలే చూపు ఆనదు ఆపై కన్నీరొకటి కళ్ళలో" నా కిష్టమైన లైన్ :-)

రాజేంద్ర గారు, ఆ కామెంటేదో రాయొద్దు కానీ జస్ట్ గుర్తు చేయండి :-))

చంద్ర మోహన్ said...

చాలా బాగుంది. చిన్న కవితలో ఎంత ఆర్ద్రతను నింపారు!
"సన్నని పరిమళం
మనసుని మెత్తగా
హత్తుకుంది!" - భావుకతలో తిలక్ ను మరిపించేలా ఉన్నారు.

Anonymous said...

chaala baundi.....

నిషిగంధ said...

ధన్యవాదాలు చంద్రమోహన్ గారు, ఎనానిమస్ గారు..

చంద్రమోహన్ గారు, తిలక్ ని మరిపించేంత లేదు గానీ ఆయన ప్రభావం మాత్రం చాలా ఉంది.. Thanks again for your nice comment!

జాన్‌హైడ్ కనుమూరి said...

ఏదో రాద్దామని మొదలుపెట్టాను కానీ మద్యలో పవర్ కట్ ల వల్ల అప్పుడు ఏమిరాయాలనుకున్నానో మర్చిపోయాను. గుర్తుకొస్తే మళ్ళీ రాస్తాను.

అభినందనలు

కల said...

ఈ అద్భుతమైన కవితని నేను సెలవుల్లో ఉన్న కారణంగా దాదాపు కోల్పోయాను. కాని కూడలి పుణ్యమా అని మళ్ళీ చదవగలుగుతున్నా.
అస్సలు చిన్న చిన్న పదాలతో అంత లోతైన భావాలని ఎలా పలికించగలరు మీరు? భావుకత ఉండటం వేరు, దాన్ని పలికించడం వేరు, ఒలికించడం వేరు. ఎప్పుడో ఒకసారి అర్రే ఈ నిషిగంధగారు మాకు తెలుసు అని అభిమానంగా (అంటే నేను మీకు తెలియకపోయినా ) అని చెప్పుకొనే స్థితికి వస్తారు.

Cinevalley said...

nice feeling captured in beutiful words. second stanza reminds me seetharama sastry's: kerataaniki talavanchite taragadu trova!

--Cine Valley

అశ్విన్ బూదరాజు said...

Excellent nishigandhi gaaru Sooper

నిషిగంధ said...

నెనరులు జాన్ హైడ్ గారు, కల గారు, సినీవాలి గారు, ఆశ్విన్ గారు..

@ జాన్ గారు, మీరు కవిత చదివారు, అది చాలు నాకు..

@ కల గారు, అలా చెప్పకుండా ఊరెళ్ళిపోతే ఎలా చెప్పండి :) అందుకేనా మీ టపాలేమీ కనబడలేదు! ఇప్పటి వరకూ ఒకరికొకరు తెలీకపోతేనేం, ఇక నించి తెలుసుకుందాం.. ఏమంటారు?మీ అభిమానానికి ఇంకోసారి ధన్యవాదాలు..

@ సినీవాలి గారు, యాధృఛ్చికంగా ఇవ్వాళే నేనా సినిమా మళ్ళీ చూశాను.. అంత మంచి పాటతో ఈ కవితని పోల్చినందుకు ధన్యవాదాలు!

@ అశ్విన్ గారు, మీ కామేంట్ చూడటం సంతోషంగా ఉందండి.. వెల్కం టు మై బ్లాగ్! :-)

కత్తి మహేష్ కుమార్ said...

సృష్టి రహస్యం చెప్పినట్లుంది. ఒకవైపు పుష్పించడాన్నీ,ఫలప్రదాయమవడాన్ని సూచిస్తూనే మావన అనుభూతిని అలవోకగా జోడించి, కవితని మరో స్థాయికి తీసుకెళ్ళారు. నా అభినందనలు.

నిషిగంధ said...

నెనరులు మహేష్.. మీ కామెంట్ తో ఇంకో కవిత రాయొచ్చనిపిస్తుంది :-)

Anonymous said...

hi nishigandha garu meeru TP nishi ee na?

-Ratna

నిషిగంధ said...

Yes Ratna :-)
How are you doing?

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నిషిగంధ గారు,కవిత నచ్చక కాదు కామెంటు రాయంది,కుళ్ళు అంతే :)

సుజాత said...

ఇదెల్లా మిస్సయ్యానబ్బా!

చెప్పానా, నిషి,
మీ కవితలు కిటికీ తెరవగానే మొహాన్ని హాయిగా తాకే చిరు తెమ్మెరలా ఉంటాయని. ! చాలా బాగుంది.

నిషిగంధ said...

రాజేంద్ర గారూ మీ కుళ్ళే నాకు ఆశీర్వాదం :-))

నెనరులు సుజాతా.. నేనే మీ కంట పడకుండా దాచిపెట్టాను.. మీ మెచ్చికోళ్ళ తియ్యదనం డోస్ కాస్త ఎక్కువైంది మరి :)

cbrao said...

ఈ కవిత రెండో సారి చదివాక(20 రోజుల తరువాత)రాస్తున్నా ఈ లేఖ.చిన్న కవిత. మనసంతా నిండే పరిమళం.

నిషిగంధ said...

చాలా రోజుల తర్వాత మీ కామెంట్ చూస్తున్నాను.. నెనరులు రావు గారు :-)

వేణూ శ్రీకాంత్ said...

చాలా ఆహ్లాదం గా,చాలా చాలా బాగుంది నిషిగంధ గారు. నా శలవుల కారణం గా ఇన్ని రోజులు మిస్ అయ్యి ఆలస్యం గా చదివాను :-( Better late than never అన్నారు కదా, కనుక ఒకె.

Tulasimohan said...

maro mallemogga....

Tulasimohan said...

naakayite ee roju pandugalaa vundiraa baboiii...innesi okeroju chadivesi manasuki nachestunte....

నిషిగంధ said...

ఎన్నెన్ని రోజులైంది చెలీ! బోల్డన్ని థాంక్యూలు :-)

Telugu songs Free Download said...

katha kante andulo meeru vadina sahithyam naaku baaga nachindi....