Sunday, August 31, 2008
ఊసులాడే ఒక జాబిలట! (July 2008)
"... ఇక ఊరుకోలేక నాకు రాజారావు పట్ల ఉన్న అయిష్టాన్ని చెప్పి "నీ పెళ్ళంటే నాకెందుకు సంతోషంగా ఉండదు చెప్పు.. కానీ ఆ రాజారావుతో అంటేనే ఎందుకో మనసు ఒప్పుకోవడంలేదు" అన్నాను. "కానీ అతనికి నేనంటే విపరీతమైన ఇష్టమే! నన్ను చూడందే ఉండలేడు.. నాక్కూడా నా చుట్టూ, కేవలం నా చుట్టూ తిరిగే భర్త కావాలి.. నా జీవితాన్ని మా అమ్మలా వేరొకరితో పంచుకునే దురదృష్టాన్ని కల్లోనైనా ఊహించలేను" అని తనవైపు వాదనని చెప్తుంటే నేను ఆవేశంగా "మీ అమ్మ జీవితంలో ఏం జరిగిందో అదే నీ జీవితంలోనూ జరుగుతుందా?" అని ప్రశ్నించాను.తను చిన్నగా నవ్వుతూ "ఆ ప్రశ్న ముందు నీకు నువ్వే వేసుకోవాలని కార్తీకా" అంది.. అప్పుడుకానీ నాకర్ధం కాలేదు నేను ఏ వాదనని నా మనసుకి బలంగా వస్తున్నానో దాన్ని నేనే ప్రశ్నించానని!!.... "
పూర్తిగా...
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
నిజమే , బాగుంది
నెల గిర్రున తిరగాలని, అంతా జీతాల కోసం ప్రార్ధిస్తుంటారు. ఇప్పుడు నీ నవలలో భాగం కోసం నేనూ అలానే పాట్లు పడుతున్నాను. మరో నెల వచ్చేది ఎప్పుడు? అందాకా ఆగేదెట్టా?
Looking forward for rest of the posts.
నెనరులు భరత్ గారు..
పూర్ణీ, నిన్ను నెలదాకా వేచి ఉండేలా చేస్తానా చెప్పు.. ఈ బ్లాగ్ డోర్ కాకపోతే ఇంకో బాక్ డోర్ తెరుస్తాను.. వచ్చి గబగబా చదివేసుకో :))
నాకు బాగా నచ్చిన కారక్టర్ వికాస్, నేనెలా ఉండాలో అని కలలు(కొన్ని నిజాలు కూడా) కంటుంటానో (కలలే కాదు లెండి, కొన్ని అల్లర్లలో తలదూర్చి దెబ్బలు కొట్టి కొట్టించుకొన్న రోజులు ఉన్నాయి) అలానే ఉంది అతని పాత్ర చిత్రీకరణ.
పూర్ణిమగారికేనా బాక్ డోర్ ఎంట్రీ, మరి మాకులేదా?
ప్రతాప్ గారూ, నిజమే కదా.. అబ్బాయంటే వికాస్ లా ఉండాలనిపిస్తుంది.. అయితే మీరు కూడా షర్ట్ హాండ్స్ పైపైకి తోసుకుంటూ ముందుకి దూసుకెళ్ళే టైపన్నమాట :-)
ఎంట్రీ ఇవ్వాలంటే మీ ఈమెయిల్ నాకు తెలీదు కదండీ..
నిషీ నాకు కూడా కావాలి.పదవతరగతి వరకు ఇలా సశేషం నవలలు చదివాను.ఆతరువాత చిరాకు వహ్చేది అంతకాలం ఆగాలంటే.కౌముదిలో టైటిల్ బాగుంది కదా అని ఒక్క భాగం చదివాను.తరువాత అలా అలా కంటిన్యూ అయిపోతున్నాను.అంతకాలం ఆగడం బాధగానే వుంటుంది.మీరు ఇలా బేక్ డోర్లు అది అంటే థాంక్స్ గివింగ్ కి ముందు రోజే వెళ్ళి బెస్ట్ బై డోరుదగ్గర నిల్చున్నట్టు నీ బేక్ డోర్ దగ్గర ఈజీ చైర్ తో సెటిల్ అయిపోతా.
నిషి,
మీ పెరటి తలుపు దగ్గర నేను కూడా ఉన్నా క్యూలో!
సుజాత గారు : మీరు 'ప్రజారాజ్యం' media coverage కొంచెం ఎక్కువగా చూస్తున్నట్టున్నారు :-)
నిషిగంధ గారు : పార్టీ పెట్టెయ్యండి ఒక పని అయిపోతుంది. ప్రస్తుతానికి ఎవరంతట వారే ఏర్పాటుచేసుకున్న విభాగాలు (నేను ఏర్పాటుచేసినవి నా సౌలభ్యం కోసం) ..
పూర్ణిమ/సుజాత : హైదరాబాద్ మహిళా విభాగం .. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ సఖ్యంగానే ఉన్నారు ... అలానే ఉంటారు .. ఎందుకైనా మంచిది అంటారా ... పూర్ణిమ : హై. IT మ.వి, సుజాత*$* : హై. మాజీ. జర్నలిస్ట్. మ. వి
ప్రతాప్ : హై. పు (IT). వి
రాధిక : అ (గో). మ. వి
తెలుగు'వాడి'ని: అ. పు(IT). వి
ఇకపోతే *$* గురించి : సుజాత గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ... ఎక్స్. అమెరికా, ఎక్స్.కర్ణాటక, ప్రో గుంటూర్, ప్రో., ప్రెజెంట్ హైదరాబాద్, ఎక్స్, జర్నలిస్ట్ ... వీటి బదులు ఒక (తిట్టుకోని/గౌరవించే) అల్లు అరవింద్ గారి పోస్ట్ ఇచ్చేయండి ..
@తెలుగువాడినిగారు,
బాగా నవ్వుకొన్నాను మన/మీ విభాగపు అర్ధాలు తెలుసుకొని.
కొంపదీసి తిట్టలేదు కదా?
@నిషి గారు, నా e-mail id: d.prathap@gmail.com
:)) తెలుగూవాడి 'ని గారూ!! అలాగేనండి, నేనూ పెట్టేస్తా 'కవితారాజ్యం'.. మిగతా వివరాలకి వచ్చే సంవత్సరం ఇదే నెలలో ఇవ్వబోయే ప్రకటన కోసం ఎదురుచూడండి..
ప్రతాప్ గారూ, got it :-)
నిషిగంధ గారు నాకు కూడా ముందే పంపించమని అడగాలని ఉంది, కానీ ఇంత అందమైన కధ ని జరిగిన కధ గుర్తు తెచ్చుకుంటూ ముందు ముందు ఏం వ్రాయబోతున్నారా అని ఆలోచించుకుంటూ నెల ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తూ, పత్రిక వెలువడగానే చదివేయడం, వెరసి నెలంతా ఓ మధురానుభూతి ని ఆస్వాదించడం మిస్ అవుతానేమో అనిపిస్తుంది :-)
వేణూ గారు.. గుడ్ డెసిషన్ :-)
mi usulade jabilata ippaty varaku prachurinchina anni baghalu istapadi okesari ippude chadiva.chandama lo machhalla okati rendu kani pinchayi miku teliya cheddamanna alochanato e nisiratri repu office ki vellalanna sruha vunna idi rasi padukundamani .modati bagham lo kartika ni kuda vamsi maga vadika bhavinchinatte ani pistundy yendukante nenu maga ani telisaka disappoint ayi rayadam manesaranukunna anadam dwara. but subsequent kartica ammati ani telisaka stoic ga react kaka podam machhemo?next phone no ichinappudu ventane cheyyaka povadam usuladukune avakasam direct ga vachhina kuda?poni appudu veelu padaledanukunna pelli ayipoi inni rojulai kuda okkasari kuda vamsi ki phone cheyyakunda uttaralalone undi povadam lopamemo?miru kadha rasina nati kala mana paristitulalo kuda land line palletulla llo kuda vundedi plus school ki kuda fone vunde vuntundy vamsi kuda chesi undochhu.yendukante imp visayam aatmeyula to panchukodani ki usulakante minchindy ledu.patakudi ga na lo vachhina sandehanni telupudamane gani mi jabilamma ni vimarsiddamani kadani gamanincha galaru.migata kadhanam adbutam asamanam .oka pellikani ammayi to oka rachayita free ga panchukunna bhavalu pelli ayipoyaka ade ammayi to panchukovadam konta kasta sadyam vall hubby yemanukuntado anna samsayam to idivaraku laga kalam munduku podani na bhavam.mi abhimani ravigaru
రవి గారూ, ప్రశ్నలన్నిటినీ భద్రంగా దాచి ఉంచండి.. కధ మొత్తం అయ్యాక ఒకేసారి నా view చెప్తాను. :-)
విరహము కూడా సుఖమే కదా అని మీ ఉసులాడే జాబిలమ్మ నుంచి ప్రతి నెల నేటిజేన్స్ కి వచ్చే ఈ విరహం ఎన్నాళ్ళో?చూపుల కన్నా ఎదురుచ్జుపులే తియ్యన అని మీ మిగతా కధ కోసం మీ కోణం లోంచి తీరే నా సందేహాల సమాధానం కోసం ఈ నిరీక్షణ తప్పదేమో. మీరు కోరిన విధం గా కష్టపడి తెలుగులో నా అభిప్రాయాన్ని మీ కోసం . మీ అభిమాని.అన్నట్టు ఈ నిరీక్షణ ని కార్తికా మర్నాడు భూషణం దంపతులు తన పెళ్ళికోసం మాట్లాడ డానికి వస్తారని ఆనదం లో ఒక రాత్రి గడవాలంటే ఇన్ని యుగళ అనుకునేట్టు గా వుంటుందని నా అభిప్రాయం .
Publish Post Save NowSave as Draft
Post a Comment