Pages

Monday, February 25, 2008

అడుగులో అడుగునై...


నువ్వు వస్తూనే
వెన్నెలకి వింత మెరుపొచ్చింది!

సరుగుడుచెట్ల మధ్య మట్టిరోడ్డొకటి
నిన్నటి వర్షం కబుర్లేవో
చెప్పాలంటుంది
కాస్సేపలా వెళ్ళొద్దామా?

అదిగో.. అలా విసుగ్గా చూడకు
నువ్వేమీ మాట్లాడక్కర్లేదు!

నిద్రపోతున్న గువ్వలజంటనీ
గుడి గూట్లోని సాంధ్యదీపాన్నీ
విచ్చుకోబోతున్న రాధామనోహరాల్నీ
ఇవ్వాళైనా నీతో కలిసి చూడాలనుంది..

రేపొద్దున్న మళ్ళీ బ్రతకడం
మొదలుపెట్టేలోపు
కాస్సేపు జీవించనీ!
కాస్త దూరమే.. నడిచొద్దామా?

నాకు తెల్సు..
వచ్చేప్పుడైనా
నీకూ అర్ధమౌతుంది..

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!!

(తొలి ప్రచురణ)

English Translation by NS Murty gaaru..

 

 

25 comments:

Manipravalam said...

Beautiful!!!

Anonymous said...

చదివి కాసేపు కళ్ళు మూసుకుని అస్వాదించేలా ఉంది.
"కొంచం సేపు స్వప్నం లోకి గోర్వంకల రెక్కలతో ఎగిరిపోదామన్నీ మరచి" అన్న తిలక్ కవిత గుర్తొచ్చింది.

నిషిగంధ said...

ధన్యవాదాలు వెన్నెల గారు, స్వాతి గారు :)

ఏకాంతపు దిలీప్ said...

Woww.... adbhutam...

ee kavitalo annee unnaayi... andarikee cherutundi...

indulo prati aksharm muddhochesaayi...

meeru koodaa telugu greeting cards kosam enduku pani cheyyakoodadu... greeting cards ki manam oohinchalEni sakti undi... bhaasha ni crazygaa janalloki teesukelle sakthi...

okkasaari aalochinchandi.. please... like english archies,hallmark... anta kannaa andamaina telugu cards unTE enta baaguntundi....


Ide kavita oka manchi card meeda unte... antagaa bhaava prakatana cheyyaleni, aa avasaram lo unna ammaayiki kaanee abbaayiki kaanee chikkite, vaallaki kalige aanandam antubattalenidi kadaaa....

oka greeting card kunna scope gurinchi meeku telise untundi...

please okkasaari aalochinchi, blogllo unnaa chaalaa mandi navataram rachayitalu,rachayitrulu aalochana chesi daaniki poonukovaalani naa manavi...

Anonymous said...

నిదురపోయే మనసుని, తట్టి లేపే విధంగా ఉంది మీ కవిత్వం. మీ పదాల ఎంపిక చాలా బాగుంది.

jags said...

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని

awesome lines Nishigandha gaaru, a walk to remember movie ni chaalaa saarlu chaalaa ishtumgaa chusina prati saari first time chustunnaa ane feeling to ne chusaanu. may be aa perulone oka andamayina anubhooti daagundani anipinchedi... alaa nadichoddaam ani meeru mammalni kudaa meeto paatu nadipinchesaaru...:)

Niranjan Pulipati said...

Just too good. :)

పద్మ said...

"ఊపిరి తాకినంత మాత్రాన సామీప్యం సాన్నిహిత్యమవదని" హేట్సాఫ్. :)

ఆ ఒక్క లైన్‌లో ఎంత అర్థం ఉందో. చాలామందికి అర్థం కాని విషయం ఇదేనేమో. సమీపంలో ఉంటే అదే సన్నిహితం అనుకుంటారు. కానీ మనుషులు పావుమీటర్ పక్కనే ఉన్నా మనసులు మైళ్ళదూరంలో ఉండొచ్చు. అలానే మనసులు కలిస్తే సప్త సముద్రాలు తమ మధ్యలో ఉన్నా పక్కనే ఉన్నట్టు ఉంటుందేమో. ఈ మనసుని ఏం చేద్దాం :)

రాధిక said...

ఏమని చెప్పమంటారు?అద్భుతమన్న మాట చిన్నదయిపోతుంది.మాటలు మనసుని తాకి అక్కడే నిలచిపోయాయి.ఎన్ని ఆలోచనలో కవిత చదవడం అయిపోయాకా...

Anonymous said...

"నువ్వు వస్తూనే
వెన్నెలకి వింత మెరుపొచ్చింది!"
- మంచి ప్రారంభం, ఆశావహ ధోరణి తో మొదలయ్యింది

"సరుగుడుచెట్ల మధ్య మట్టిరోడ్డొకటి
నిన్నటి వర్షం కబుర్లేవో
చెప్పాలంటుంది"
-- మంచి అభివ్యక్తి - నీకు బురదగా అనిపించవచ్చు కాని - నాకు అది ప్రకృతిలో భాగమే అని చెప్పటం

అదిగో.. అలా విసుగ్గా చూడకు
నువ్వేమీ మాట్లాడక్కర్లేదు!
- Obvious ఎత్తిపొడుపు.

"నిద్రపోతున్న గువ్వలజంటనీ
గుడి గూట్లోని సాంధ్యదీపాన్నీ
విచ్చుకోబోతున్న రాధామనోహరాల్నీ
ఇవ్వాళైనా నీతో కలిసి చూడాలనుంది.."
- మళ్లి ప్రకృతిని ఆరాధించాలనే కోరిక, మంచి అభివ్యక్తి .
"రేపొద్దున్న మళ్ళీ బ్రతకడం
మొదలుపెట్టేలోపు
కాస్సేపు జీవించనీ!"
-ఛర్నాకోలు దెబ్బ .
కాస్త దూరమే.. నడిచొద్దామా?
----
కవితని ఇక్కడ ముగించి ఉంటే ఇంకా బాగుండేదేమో అని నాకనిపించింది.ఇక్కడ వరుకు ఒక ఆశవహ దృక్పధంతో, విరుద్ధ మస్థవం ఉన్నవాడితో సాహచర్యం గురించి చెప్పారు..

దీనికి
"నాకు తెల్సు..
వచ్చేప్పుడైనా
నీకూ అర్ధమౌతుంది..

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని"

జతచేయగానే
ఇంత వేడుకోలు, ఇంత మొత్తుకోలు, వాడికి సామీప్యానికి, సాన్నిహిత్యానికి తేడా చెప్పాటానికే అన్నట్టుంది.
"నీకు అర్ధమౌతుంది" అంటే చాలేమో.

"ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని"


పాఠకులు చెప్పినట్టు చాలా "పౌఎర్ఫుల్" వాక్యాలు, వాటిని ఇక్కడ దుబారా చేశారెమో అనిపించింది. నేను కవినీ కాదు, విమర్శకుడనూ కాదు, తోచింది చెప్పానంతే.

Anonymous said...

"ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని"

మిగతా పాఠకులు కూడా చెప్పినట్టు చాలా "powerful lines".

నిషిగంధ said...

ధన్యవాదాలు దీపు గారు, నువ్వుశెట్టి బ్రదర్స్ గారు, జాగ్స్, నిరంజన్, పద్మ, రాధిక, మరియు ఊకదంపుడు గారు :-)

@జాగ్స్, 'A walk to remember' is a nice romantic movie. ఏదో టీన్ మూవీ చూస్తున్నట్లు అస్సలు అనిపించదు.. చాలా డెప్త్ ఉంది..

@పద్మ, 'మనసు మాట వినదు ' అని ఊరికే అనలేదు కదా.. అది చెప్పినట్టల్లా మనం చేయలేము.. అలా అని 'ష్ష్ ఊరుకో ' అన్నా అది తన అల్లరి మానదు. :-)

@రాధిక, అంతా మీ అభిమానమంటాను :)

@ఊకదంపుడు గారు, మీ విశ్లేషణ చాలా బావుందండి.. అంత చక్కగా, సమయం వెచ్చించి రాసినందుకు ధన్యవాదాలు.. నా కళ్ళ ఎదురుగా జరిగిన ఒక సన్నివేశం ఆధారంగా ఈ కవిత రాశాను.. సామీప్యానికి, సాన్నిహిత్యానికి తేడా ఉందని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం..

'వచ్చేప్పుడైనా నీకూ అర్ధమౌతుంది ' - తనకు తెలీని ఆమె చాలా ఉందనే భావన మొదటిసారిగా కలుగుతుంది.. అప్పుడే అసలైన దగ్గరతనం అంటే తెలిసేది.

Kathi Mahesh Kumar said...

ఏదో నాకు తెలిసిన ప్రపంచాన్ని, మళ్ళీ నాకే కొత్తగా పరిచయం చేసినట్టయింది.
బాగుంది...కాదు కాదు!...చాలా బాగుంది.

Srinivas said...

బావుంది. ముఖ్యంగా సరుగుడు చెట్ల మధ్య మట్టిరోడ్డు చెప్పే వర్షం సంగతి.

కానీ చివరి నాలుగు లైన్లూ అతికినట్టున్నాయి. ఇమడలేదు.

Bolloju Baba said...

నిషి గంధ గారికి,

బ్లాగు పేరుకు తగ్గట్టు మానస వీణా నాద తరంగాలనే అక్షరాలుగా చేసి వ్రాస్తున్నారా అనిపించింది.

బ్రతకటానికి, జీవించటానికి ఉన్న తేడాని చాలా లలితంగా, రమణీయంగా, సరస కల్లాపంలా, మొదలెట్టి , పంచుకోవాలనే ఆర్తిని ఆవిష్కరించి, సాన్నిహిత్యానికి నిర్వచనాన్ని చెప్పిన మీ కవిత అద్భుతం.

నాకు మొదట అనిపించింది - రెపొద్దున్న మళ్లీ బ్రతకడం అనే వాక్యం బదులు, రేప్పొద్దున్న మళ్లీ యంత్రం లా మారేలోపు , అని ఉంటే బాగుంటుందేమోనని.

కానీ మీ కవితను రెండు సార్లు చదివిన తరువాత మీ వాక్యమే కరెక్టని తోచింది. ముందు చెప్పినట్లు గా బ్రతకటానికి, జీవించటానికీ ఉన్న సన్నని గీతలాంటి వ్యత్యాసాన్ని ఆవిష్కరించటం ఈ కవిత నేపద్యం గా ఊహించుకొంటే మీరు వాడిన వ్యాక్యమే అద్భుతంగా ఉంటుంది.

నాబ్లాగుకు వచ్చి కామెంటు చేయటం ద్వారా ఒక మంచి బ్లాగులోని మంచి కవితను చదివే అదృష్టం నాకు కల్పించారు. కృతజ్ఞతలు.

బొల్లోజు బాబా

నిషిగంధ said...

నెనరులు శ్రీనివాస్ గారు, మహేష్ గారు, బాబా గారు..

శ్రీనివాస్ గారు, నేను ఈ కవిత రాద్దామని అనుకున్నదే ఆ ఆఖరి లైన్ల కోసం :-)

Srinivas said...

ఇమడలేదు అని ఎందుకు అనిపించిందంటే అన్నీ కలిసి చూశాక, పంచుకున్నాక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అప్పుడు ఊపిరి తాకినంత మాత్రాన సామీప్యం సాన్నిహిత్యమవ్వదని అనుకున్నారంటే అప్పటిదాకా అంత సమీపంగా తిరిగినా సాన్నిహిత్యం ఏర్పడలేదన్న నిరాశ ధ్వనిస్తుంది.
-

మేధ said...

చాలా బావుంది నిషిగంధ గారూ..

@శ్రీనివాస్ గారూ: అది అక్కడ సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది నాకు..
ఎందుకంటే అప్పటివరకూ, దగ్గరగా (భౌతికంగా) ఉంటున్నాం కానీ, మానసికంగా దగ్గరగా లేము..
ఇద్దరూ కలిసి నడిచి తిరిగి వస్తూ ఉంటే, అప్పటికైనా అతను ఇప్పటిదాకా దగ్గరగా ఉన్నానని అనుకుంటున్నాను కానీ ఇప్పుడే అసలు దగ్గరితనమంటే ఏంటో తెలిసింది అని ఫీల్ అవుతాడని ఆశ..

నిషిగంద గారు ఏ అర్ధంలో వ్రాశారో నాకు తెలియదు కానీ, నాకు కలిగిన భావమది...

మేధ said...

చెప్పడం మరిచాను... టెంప్లేట్ చాలా బావుంది..

oremuna said...

టెంప్లేట్ చాలా బావుంది

Unknown said...

నిషిగంధ గారు,
చాలా బాగుంది. ఎన్ని భావాలు ఒలికాయో మీ కవితలో.

నిషిగంధ said...

మేధ గారూ, చాలా కరెక్ట్ గా చెప్పారు.. ఆ ఆఖరి వాక్యాల్లో నేను చెప్పదలచుకున్నది సరిగ్గా అదే, 'కలిసి ఉండటం దగ్గరితనం అనిపించుకోదు ' అని!! నెనరులు, చక్కగా విశదీకరించినందుకు...

ఒరెమునా గారూ, మొదటిసారి నా బ్లాగ్ లో మీ కామెంట్ చూస్తున్నాను.. am so happy and glad that you like the template.

ప్రవీణ్ నెనరులు.. భావాలని అలా ఒకచోట చేరుస్తుంటే చెప్పాపెట్టకుండా ఇక్కడ ఒలికిపోయాయి :))

Anonymous said...

నిషిగంధ గారు,
చాలా బాగా రచించారు. చివరి వాక్యాలు ఎంతో లోతుగా ఆలోచింపచేశాయి.

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని

If this is true in someone's life, they need to work on it. This kind of feeling will make a person very depressed and has the potential to take away few years of his/her life.

If this is not true in someone's life, they are lucky and they should consider that they are blessed by god and MUST make all efforts to keep it going.

Indianblaster said...

Chaala Bagaa Vundi Kaveetha

Anonymous said...

మీ కవిత చాలా సార్లు చదివాను అనే కంటే, అలా చూస్తువుండి పోయాను. ప్రకృతిని తనతో ఆస్వాదించాలని, మీరు వ్రాసిన ఆహ్వానం నేచర్ లవర్స్ కి చక్కటి కనువిందు. ప్రయివసీ కి, ఇంటిమసీ కి మధ్య లైన్ గీశారు. ఆ నువ్వు వచ్చేనా?