Pages

Wednesday, February 13, 2008

శ్రీవారికి ప్రేమలేఖ


... అయినా ఇప్పటికీ ఒకరికొకరు కోపం తెప్పించే పనులు చేయడం మానలేదుగా! బయటకెళ్దామని చెప్పిన టైం కి నేనెప్పుడూ రెడీ కాకపోవడం , ఫోన్ లో మాట్లాడేటప్పుడు బిగ్గరగా మాట్లాడటం మీకు కోపం తెప్పిస్తే..

స్నానం చేసి తడి టవల్ మంచం మీద గిరాటు వేసేసి వెళ్ళి పోవడం , వీకెండ్స్ లో టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఒక గంటసేపు పళ్ళు తోముకోవడం నాకు అసహనం కలిగించే విషయాలు!!

కానీ పర్లేదు.. ఇవి భరించడం ఏమంత కష్టం కాదు.. అయినా ఒకరి గురించి ఒకళ్ళు మన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవడానికి ఈ మాత్రం చిన్న చిన్న లోపాలు లేకపోతే బావోదు...

పూర్తిలేఖ


(తొలిప్రచురణ)

34 comments:

కొత్త పాళీ said...

W O W !!!

Anonymous said...

ఈ మధ్య కాలంలో చదివిన మంచి ఉత్తరం (కథ)!

అభినందనలతో,
సిరి

Durga said...

WOW chala manchi vuttram chdivanu chaala roju la taruvaatha.

Anonymous said...

అధ్బుతమైన లేఖ! ఎంత బావుందంటే, ....ఒక్కోసారి చెప్పడానికి మాటలు లేకపొవడమే సరిగ్గ చెప్పడమేమో.

ప్రసాదం

Kolluri Soma Sankar said...

బహు చక్కటి ఉత్తరం (ప్రేమ లేఖ). మీరు రాసిన దాంట్లో కొన్ని సంఘటనలు మాకూ వర్తిస్తాయి. కాపీ చేసుకున్నా మా భానుతో చదివిద్దామని. ధన్యవాదలు మా పాత రోజులను గుర్తు చేసినందుకు.
సోమ శంకర్

రమ్య said...

అధ్బుతంగా ఉంది.
Happy Valentines day to you

ఏకాంతపు దిలీప్ said...

అందరు మీ అభిమానులు అయిపోతుంటే, నేనేంటా అవ్వలేకపోతున్నాను అనిపించింది... బహుశా మీ ఇంతకుముందు
రాతలు నాకు పూర్తిగా అర్ధం అయి ఉందకపోవచు...

నేను ఇప్పటివరకు చదివిన ఉత్తరాలన్నిటిలోకి ఇదే అత్యుత్తమం...
పెళ్ళిని అసహ్యించుకునే/అర్ధం చేసుకోని/భయపడే అమ్మాయిలకి, అబ్బాయిలకి(ఎలాగు ఓపిక ఉండదనుకోండి
అలాంటి వాళ్ళకి) మీ ఈ ఉత్తరం అతి చిన్న reference book గా ఉపయోగపదుతుండి అని నా నమ్మకం...

పెళ్ళి అయి అయోమయంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది తప్పకుండా చదవాల్సినదే...

మీ మంచి ఉత్తరానికి నా ధన్యవాదాలు...

మీ కొత్త అభిమాని.. :-)

ఏకాంతపు దిలీప్ said...

Nishigandha gaaru..

Happy Married Life :-)
Deepu

సిరిసిరిమువ్వ said...

అద్భుతంగా రాసారు.అభినందనలు.
"స్నానం చేసి తడి టవల్ మంచం మీద గిరాటు వేసేసి వెళ్ళి పోవడం" చాలామందికి ఇది అనుభవమే అన్నమాట :-)

Anonymous said...

అఫ్ కోర్స్ - వాన్న కడిల్!

Unknown said...

నమ్మలేకపోతున్నా ఇంత మంచి లేఖ ఎవరయినా రాయగలరా అని.
పెళ్ళి అయిన తరవాత కూడా రొమాన్సు కొనసాగాల్సిందే అని ఈ బాచిలర్ నమ్మకం.
మీకు హాట్సాఫ్.

ఆనంద్ said...

చక్కటి ఉత్తరం.చిన్ని చిన్ని పదాలు,పెద్ద పెద్ద భావోద్వేగాలు.అందుకోండి ఆనంద్ అభినందనలు.

Niranjan Pulipati said...

నిషి, సూపర్బ్ :) ఈ పదం సరిపోకపోవచ్చు, కానీ అంతకన్నా ఇంకేమి చెప్పాలో తెలియటం లేదు.. నిన్నటి వరకు నాకు నచ్చిన మెచ్చిన వుత్తరం యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల ' లోనిది. ఈ రోజు నుండి ఇది. ఇప్పటికే ఓ పది సార్లు చదివి వుంటా
'ఊసులాడె ఒక జాబిలట ' తరువాయి భాగం కోసం ఆతృత గా ఎదురుచూస్తున్నాము :)

Anonymous said...

వావ్, మీలోని కవితాత్మని బాగా ఆవిష్కృతం చేశారు.

నిషిగంధ said...

కొత్తపాళీ గారు, సిరి గారు, దుర్గ గారు, ప్రసాదం గారు, కొల్లూరి సోమ శేఖర్ గారు, రమ్య గారు, స్వాతి గారు, దీపు గారు, సిరిసిరిమువ్వ గారు, ప్రవీణ్ గారు, ఆనంద్ గారు, నిరంజన్, వికటకవి గారు...
అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. ముఖ్యంగా ఓపికగా అన్ని పేజీలు చదివినందుకు :-)

భార్యాభర్తల మధ్య communication చాలా ముఖ్యమనిపిస్తుంది.. అదీ ఈ ఉరుకుల పరుగుల రోజుల్లో అయితే మరీను! మళ్ళీ communication అంటే మాట్లాడటమే కాదు వినడం కూడా చాలామంది అనుకోరు..

@సిరిసిరి మువ్వ.. తడి టవలే కాదు, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం, డబ్బాల మీద మూతల్ని సాంతం పెట్టకపోవడం, ఒక్క గ్లాసు కడిగి సింక్ చుట్టు ఒక చిన్న చెరువు చేయడం.. ఇలాంటివన్నీ సామాన్యంగా అందరి ఇళ్ళలో జరిగేవే అనుకుంటాను :)

@దీపు గారు, నా రాతలు అర్ధం కాలేదా.. హెంత మాట! అసలే అభిమాని అయ్యారు..ఇక కూర్చోబెట్టి అర్ధమయ్యేవరకూ చదివిస్తాను.. :))
Thanks for your wishes and hope you had a great Valentine's day..

@ప్రవీణ్ గారు, మీ బాచిలర్ నమ్మకాన్ని అలానే కొనసాగించండి :-)

@ నిరంజన్, అంత వుందంటావా ఈ లెటర్ కి!! నెక్స్ట్ 'ఊసులాడే ఒక జాబిలట ' కౌముది లో ఉంది.. ఇంకా బ్లాగ్ లో చేర్చలేదు..

Anonymous said...

చదువుతున్న సేపు , జరిపిన యుద్ధాలు , సంధులు , సం యుక్త తీర్మానాలు గుర్తుకొచ్చాయి. రాబోయే యుద్ధాలకు అనుసరించాల్సిన పద్ధతులకు ప్రేరణ ఇచ్చింది! :))
బాగా రాశారు ...

శరత్

Anonymous said...

:p :))

Anonymous said...

nishi gAru,

Excited to see your popularity and fans here... keep it up. Thanks for all your enthusiastic volunatary contribution to my site (in particular lyrics in Telugu).

Cheers,
Srini
www.ChimataMusic.com

Anonymous said...

నిషిగంధ గారు,

నేను తెలుగు పీపుల్ సభ్యుడిని .విరహవేదన అనే నా ఓ తవిక కి మీ నుండి నాకు ఓ కామెంటు వచ్హింది.మీరు రాసిన ఈ వుత్తరం అద్భుతం.ఇంతకంటే నాకు మాటలు రావడంలేదండి..

మేధ said...

నిషిగంధ గారు, ఈ లేఖ ఇప్పుడే చదివాను.. చాలా బావుంది..(ఇది చాలా చిన్న మాట) మా ఫ్రెండ్ కి ఈ మధ్యే పెళ్ళైంది.. అది అన్నీ ఇలానే చెబుతూ, అసలు life long ఎలా ఉండాలో అంటూ ఉంటుంది... దానికి పంపించాను ఇది చదవగానే.. చూడాలి ఏమి రిప్లై ఇస్తుందో...?!

Kathi Mahesh Kumar said...

just WOW... అంతే...

సుజాత వేల్పూరి said...

నిషిగంధా,
అర్జెంట్ గా ఒక హగ్గిచ్చెయ్యాలనిపిస్తోంది మీకు! సారీ, లేటుగా చదివినందుకు!

ఎంత బాగుందంటే, మా పదేళ్లనాటి పాత ఉత్తరాలన్నీ తీసి చదివేయాలనిపిస్తోంది.

Bolloju Baba said...

చాలా బాగుంది. మంచి ఊహల సమాహారం.
బొల్లోజు బాబా

Purnima said...

నిషీ: (మరోలా భావించరన్న నమ్మకంతో అలా సంబోదించా.. నచ్చక పోతే చెప్పండి).

తెలుగు బ్లాగు పుస్తకంలో నేను ఈ టపాను చదివాను. ఎంత తన్మయత్వం కలిగిందో వ్రాస్తే.. మరో లేఖ అయ్యి కూర్చుంటుంది. మీ లేఖలో ప్రతీ ఒక్క పదం నా మనసైయ్యింది. This is certainly the best telugu blog I've ever read. నాకు కొన్ని పదాలలో చెప్పటం చేత కాదు.. కానీ మీ లేఖలో ఓ మనసును ప్రత్యక్షంగా అనుభవించా. మీ లేఖ చదివాకే.. నేను నా బ్లాగులో చివరి ప్రేమలేఖ పోస్ట్ చెయ్యడానికి సాహసించా. మీరు ఇలాంటివి మరిన్ని రాయాలని కోరుకుంటూ..

పూర్ణిమ.

Anonymous said...

ఈ మధ్య నే పెళ్ళయిన ఒక స్నేహితుడికి ఈ లంకె పంపిద్దామని వెదికితే కనపడల. ఇప్పుడు మళ్ళీ వెలుగు లోకొచ్చింది. ఇప్పుడే ఈ లంకెను పంపిస్తా.
ఈ లేఖ మాత్రం అత్యద్భుతం అన్న మాట చాలా చిన్నదైన మాట.

-- విహారి

నిషిగంధ said...

నెనరులు చంద్ర గారు, మేధ గారు, మహేష్ గారు, సుజాత, బాబా గారు, పూర్ణిమ, విహారి గారు..

ఈ టపా జ్ఞాపకాల పుటల్లో కొంచెం కొంచెం గా వెనక్కి వెళ్తున తరుణంలో మళ్ళీ మీ అందరి స్పందన చూసేసరికి చాలా సంతొషం వేసింది.. అందరూ కత్తిలా (మన రాధిక భాషలో -కెవ్వుమనిపించేలా, కేకపెట్టించేలా) రాసేవాళ్ళే మెచ్చుకుంటుంటే కాస్త అనుమానం.. అసలు ఇది రాసింది నేనేనా అని!

మేధ గారు, విహారి గారు - I really feel honored to know that you have shared this with your friends. నాకూ ఉత్సాహంగా ఉంది మీ స్నేహితూల స్పందన ఏంటో తెలుసుకోవాలని..

సుజాత - మన ఆప్యాయతల హగ్గులకి నేనెప్పుడూ రెడీయే కదా :-) మరి అవన్నీ ఓ వర్షం కురుస్తున్న (ఇప్పుడు అక్కడ వర్షాలని విన్నాను) సాయంత్రం చదివేసి మీరింకో టపా రాసేయండి :))

పూర్ణిమ - నిరభ్యంతరంగా, నిస్సందేహంగా పిలవండి.. ఇంకో విషయం - మీ 'మనసైంది' విన్నప్పుడల్లా (చదివినప్పుడల్లా) నా మనసుకేదో అవుతోంది :)) ఖచ్చితం గా ఇలాంటివి కాదు కానీ ఏదో ఒకటి తప్పకుండా రాస్తాను..

Rajendra Devarapalli said...

మీకులాగా కవితలు,ఉత్తరాలు రాయలేను,ఇక్కడి వాళ్ళలా కామెంట్లూ రాయలేను.ప్చ్ ఏమిటో నా బతుకు పూరీజగన్నాధ్ సినిమాల్లో హీరోయిన్లా తయారయ్యింది.

మేధ said...

నేను మెయిల్ చేసేటప్పుడు, మనసుని ఎక్కడో టచ్ చేసింది అని పంపించాను.. కాసేపటికి తననుండి రిప్లై: కనీసం ఇంకో రెండేళ్ళకైనా మేము ఇద్దరం ఇలా మాట్లాడుకుంటామంటావా అని!!!

వేణూశ్రీకాంత్ said...

నిషిగంధ గారు, ఎంత అద్భుతం గా వ్రాసారండి !! ఇన్ని నెలల లో కొన్ని వేల మంది మెచ్చుకుని ఉంటారు అయినా నా స్పందన కూడా మీకు తెలియచేయాలి అని చెప్తున్నాను. నాకు బ్లాగ్లోకం ఈ మధ్యే పరిచయమయ్యింది. రాత్రి పూర్ణిమ గారి బ్లాగ్ కామెంట్ల లో మీ ప్రేమ లేఖ గురించి చూసి వెతికి పట్టుకున్నాను. అంతా చదివాక ఒక పది నిముషాలు అలానే తన్మయత్వం తో కళ్ళు మూసుకు ఉండి పోయాను. నా మళయాళీ రూమ్మేట్ "హే మ్యాన్ వాట్ హేపెండ్?" అని అడిగితే కాని గమనించ లేదు నా కళ్ళలో నీటిని (నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు కదండీ). ఇన్ని రోజులు చదవకుండా ఎంత మిస్ అయ్యానో అనిపించింది. వెంటనే నా స్నేహితులందరికీ పంపించాను. అల్రెడీ 4 సార్లు చదువుకున్నా తనివి తీరలేదంటే నమ్మండి. చాలా సహజం గా అందం గా అద్భుతం గా వ్రాసారు. మనసైన కన్నీరు లాంటి టపా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తూ మీ మిగిలిన టపా లన్నీ ఒకటొకటి గా చదువుతున్నాను.

నిషిగంధ said...

:))) రాజేంద్ర గారూ..

మేధ గారూ, నాకైతే రెండు సంవత్సరాల కంటే ఎక్కువే పట్టిందండీ :-)

వేణు గారు, మీ హృద్యమైన స్పందనకి ధన్యవాదాలు..

సుజ్జి said...

munduga sorry andi... enta manchi blog ni ennalu aela miss aiyyana ani hacharyamga undi... mee rachanalu chaduvutunte, vaka manchi friend dorikinatlu undi.eppude anni tappalu chadivesa.... chala thanks .. keep writing...

నిషిగంధ said...

నేను కూడా చెప్పాలి మీకు సారీ, ఇప్పుడే చూశాను మీ బ్లాగ్ :-)
Thanks a lot for your comment!

sandhya said...

nishigandha garu, wow adbhutam. mee kavitalu ,sree variki premalekha chadivina tarvatha naku kaligina anubhutini emani varninchali.manasu aduguporallo dakkoni niddarotunna anubhutulanu mallepulanu ruvvi, manchigandham challi, mruduvuga tatti leputunnattanipinchindi . sandhya

నిషిగంధ said...

మీ స్పందనకి హృదయపూర్వక ధన్యవాదాలు సంధ్య గారు :-)