నిరీక్షణ
జ్ఞ్జాపకాల రాపిడికి
తృణపత్రంలా శుష్కిస్తూ
అనిమేషనై నేను..
చీకటి దుప్పటిలో
అసహనంగా కదులుతున్న రాత్రి..
ప్రేమ అనేది ఉత్త నీహారిక కాదు కదా!?
కోనేట్లో స్నానమాడిన పిల్లగాలి
గుడిమెట్లు ఎక్కివచ్చి
కుతూహులం గా చూస్తుంటే
ఇంకా ప్రభుదర్శనం కాలేదని
ఎలా చెప్పను!?
జారే భాష్పబిందువును
కొనగోట ఆపడానికో
చిటికనవేలు..
పొరలే దుఃఖానికి
చెలియలికట్టలా
ఓదార్చే ఓ స్పర్శా..
నన్ను చేరేదెప్పుడో!?
కంటి చివర
హిమాలయం కరుగుతున్నవేళ
ప్రాణసఖుని జ్ఞ్జాపకం నాలో...
పైకిమాత్రం
పెదవి నించి చిరునవ్వు
రేపొచ్చే ఉదయం మీద కొత్త ఆశతో... (తొలి ప్రచురణ)
4 comments:
Goodone.. :)
మీ బ్లాగు ఇంతకు ముందు చూశానా? గుర్తు లేదు - ఈ పద్యంలోని పదచిత్రాలు, భావాలు బాగున్నాయి. "తృణపత్రం" "శుష్కించడం" లాంటి కఠిన పదాల్ని ఒదిలేసి లలితమైన తెలుగు పదాల్తో రాయండి - ఇంకా బాగా నప్పుతుంది.
చాలా బావుంది అనేది చాలా చిన్న పదం. మనసుని తాకిన మరో కవిత. :)
its very nice
Post a Comment