నీవు లేని క్షణాన...
ఇదిగో.. ఇప్పుడే..
నువ్వటు వెళ్ళావో లేదో..
మనస్సంతా ఏదో చెప్పలేని వెలితి
అంతా శూన్యం.. భరించలేని శూన్యం
ఇప్పటివరకూ నువ్వెదురుగానే వున్నావుగా!
అయినా చూడు ఇంతలోనే…
నరాల్లో ప్రవహించే రక్తంలా..
మనసు అట్టడుగు పొరల్లోకి
నువ్వసలుఇంతలా ఒదిగొదిగి పోయావని..
ప్చ్ ! ఈ క్షణం వరకు తెలీనే తెలీదు!!
నువ్వెదురుగా వున్నపుడు
ఊరికూరికే నీ మీద కోపం..
ఆపైన కొంచెం విసుగు..
మరి కాస్త దబాయింపు కదూ!!
ఓహ్ ! తలచుకుంటేనే మనసుని
మెలిపెట్టినట్లు బాధ..
నీ సాహచర్యాన్ని.. క్షణ క్షణం గుండెల నిండా
అనుభవించలేదేమోనన్న బాధ...
అయినా నీ మాట.. నీ చూపు..నీ స్పర్శ కోసం
మనసెందుకిలా కొట్టుకుపోతోంది!
మరోక్షణం కూడా ఉండలేనంటోంది!?!? (తొలి ప్రచురణ)
4 comments:
హ్మ్మ్మ్. మనసుకి దగ్గరైన మనిషితో ఇదే బాధ,కదూ. దగ్గర ఉన్నప్పుడు పట్టలేము. దూరమైతే భరించలేము. :p
అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది. :)
baagundi...:)first time mee blog ki raavatam jarigindi...keep up the good work
chana baga rasaru
idi nijam
Thank you Kshanada gaaru :-)
Post a Comment