Pages

Monday, July 16, 2007

స్నేహ మాధురి


సాయంత్రాన్ని సముద్రంలో రంగరించి
వెన్నెల పర్వతం మీద నుండి గంధాన్ని మోసుకొస్తూ..
ఆహ్లాదమైన పిల్లగాలి అమాయకంగా అడిగింది..
ఎందుకు నేస్తం నీకింత సంతోషం అని!?

వెండికిరణం పెదవి అంచున చెదరినట్టు..
కొండచివరన సంధ్య నీడ పాకినట్టు
ఒక అమృత హృదయంతో స్నేహం దొరికినప్పుడు...

అక్షరాల బరువుతో అలసిన పుస్తకానికి
అరక్షణం విశ్రాంతినిచ్చి..
కళ్ళు వొళ్ళు విరుచుకునే సమయాన--
ఎండుటాకుల వెనుక చిరుగాలి కదలికలా
ఒక జ్ణ్జాపకం...
నిలువెల్లా పాకి వ్యాపిస్తుంటే..
సంతోషం కాక మరేమిటమ్మా అన్నాను...

వెన్నెల విస్తుపోయింది..
కన్నెలా సిగ్గుపడి నన్నిలా వదిలి వెళ్ళిపోయింది...
చీకటి కూడా అలసి నిద్రపోయాక
రాస్తున్న ఈ కవిత్వం..
నా ఒంటరితనాన్ని ఓదార్చే నీ స్నేహం...

(తొలి ప్రచురణ)

12 comments:

రాధిక said...

ఎవరు మీరు?కౌముదిలో రాసే నిషిగంధ నా?లేక తెలుగుపీపుల్ డాట్ కాం లో రాసే నిషిగంధానా?లేక వేరే ఎవరన్నానా?

నిషిగంధ said...

రాధిక గారూ, టిపి, కౌముది, ఇప్పుడు మానస వీణ.. అన్నిటిలో ఒకటే నిషిగంధ అండి :-)

Niranjan Pulipati said...

హే నిషి.. బ్లాగు బాగుంది.. నా బ్లాగు కుడా మళ్ళీ యాక్టివ్ అయ్యింది చూడు.. :)

కొత్త పాళీ said...

cool stuff. so, that's where I read your poems before. okay.

Bhanu Chowdary said...

Hi andi bagundi me blog, update chestu undadi, chinnari siri link petandi baguntundi :)

Anonymous said...

fentastic... mee kavitha niluvella nannu tadumutundi...chala chala bagundi... simply touching...

నిషిగంధ said...

Thank you Anonymous! :-)

శరత్ కాలమ్ said...

హాయ్ నిషిగంధ,

నాకు కవిత్వం మీద అంత టేస్ట్ లేదు. ఎందుకో నాకే అర్ధం కాదు కానీ మీ పదాల అల్లిక చూస్తోంటె ఆసక్తి కలుగుతోంది. మీ పేరు బాగా నచ్చింది. మీ పేరు/ మీ వ్యాఖ్యలు చూస్తున్నప్పుడల్లా ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తూవుంటుంది. మీ కవితల్లాగే మీ వ్యాఖ్యలూ సరళంగా, సున్నితంగా, వినసొంపుగా వుంటాయి. మీ పేరు గురించి కాస్త గూగుల్ చేసాను కూడా. మహారాష్ట్ర అమ్మాయిల పేరు అది ఎక్కువగా. అర్ధం ఏమిటి? నేనో చిన్న రచయితను. ఈ సారి మళ్ళీ నవల రాస్తే కథానాయకకి ఆ పేరు పెడతాను. ఆ నాయకకి భావుకత అబ్బించి మీ కవితలు దొంగిలించి ఆపాదిస్తాను :) మీకేమయినా అభ్యంతరమా?

మీ నవల కొద్దిగా చదివాను. మీ శైలి నచ్చినా సాంఘిక నవల కాబట్టి కొనసాగించలేదు. ఆ జెనెర్ పెద్దగా నచ్చదు నాకు.

నిషిగంధ said...

ధన్యవాదాలు శరత్ గారు! ఇప్పుడనిపిస్తుంది 'నిషిగంధ ' మీద నాకు కాపీరైట్స్ ఉంటే బావుండేదని.. చక్కగా మీకు అరువిచ్చేదాన్ని :)) నాకలాంటి హక్కులేమీ లేవు కాబట్టి మీకు నా పర్మిషన్ అవసరం లేదు.. Thanks for asking though :-)

మీరు కనుక్కుంది నిజమే, ఈ పేరు కి మూలం మరాఠీ.. జస్ట్ పేరుకి అర్ధం అయితే Sweet Intoxication.. కానీ అసలు నిషిగంధ అంటే white fragrant flower (tuberose)! దీన్నే రజనీగంధ అని కూడా అంటారు!

Anonymous said...

Hi NISHI GANDHA! What an attractive name it is...........Nishi Gandha .......fragrant vapour making " Nisha" ( state of mind filled with sweet thoughts). Its ...its...( the name, the powerful name) attracting. How sweet name u have , i see this name for the first time...i enjoy the beauty of the telugu words for the first time. I understood that people can be made happy JUST by the art of arranging the words. How artistic it is.................words after words...conveying ..........giving sweet meanings.......... taking the mind towards a calm,quiet, stable thoughtless oceans......amazing.......THANKU YOU "NISHI GANDHA ". chandra sekhar.

నిషిగంధ said...

Thank you Chandra Sekhar gaaru :-)

Anonymous said...

Hi Nishigandha garu,
My name is Sakunthala. Naaku mee Rachanalu chala natchayi. I love them a lot. Meeru raase aa feelings chadivithe naaku nenu alochinchinatlu anipistundi kani nenu meela writer ni kanu. But naa feelings kuda nenu express cheyaleka potunna. Really you are great.