Pages

Thursday, January 28, 2010

ఒట్టేసి చెప్పవా!

      
నువ్వు ముందా? రాత్రి ముందా?
సాయంసంధ్యతో నా రహస్య పందెం...

ఫలితం ముందే తెలిసినట్టు
మరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది!

ఆకాశదీపాలన్నీ వెలిగాక
నీ ఆనవాలేదో
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది..

కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది...
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..

మెడ వంపులోనో నడుము మడతపైనో
నడిరేయిన వేలికొసల పలకరింపులు..
నిర్లిప్తత వాగు దాటాలంటే
శరీరాలు మాట్లాడుకోక తప్పదనుకుంటా!

స్పర్శ ఇచ్చిన భరోసానేమో
హఠాత్తుగా నా హృదయమంతా నీ ఊపిరి!

నిద్రదుప్పటి కప్పుతున్న నీ పరిమళం సాక్షిగా
ఒక్కమాట తీసుకోనీ..

చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!


(తొలి ప్రచురణ ఆవకాయలో...)

39 comments:

మురళి said...

"చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!"

నాకు చాలా చాలా నచ్చిన వాక్యం ఇదండీ..

సుజ్జి said...

:) Beautiful..

మోహన said...

Beautiful

Vasu said...

ఏదో మాధుర్యం ఉంది మీ కవితలో కానీ (నాకు ఏదో) స్పష్టంగా తెలియట్లేదు :)

Subrahmanyam Mula said...

ముగింపు అద్భుతం.. ముందులో చాలా వరకూ అనవసరం.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుందండీ...

పరిమళం said...

Very nice!

చైతన్య said...

FANTASTIC!!

నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి...

"చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!"
ఈ లైన్స్ నాక్కూడా బాగా నచ్చాయి.

నేస్తం said...

అబ్బబ్బా ప్రతి వాక్యం చాలా బాగా రాసారు ..అందుకోండి అభినందనలు :)

ప్రణీత స్వాతి said...

చాలా బాగుందండీ..చివరి వాక్యం ఇంకా చాలా బాగుంది.

Kavitha said...

Chala bagundandi,

Koumudi lo mee chinnari siri,oosuladey jabilata chadivi konnalluga mee blog follow avutunna, ee roju eenadu lo mee blog gurinchina sheerishaka choosina,
abhinandanalu

Unknown said...

Nishigandha...
peru lone teeyani mattu tarangam..
nee kavithala loni madhutyam..
rasa hrudayula manasaveena pai kadale bhava raga makarandam..
nee ooha lokapu soundrayam..
takaleni aakasapu anchulalo nilachina prema brundavanam......

HimaRagaVeda

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండి.

"చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!"

ఎంత బాగా చెప్పారు.

పరిమళం said...

నిషిగంధగారు అభినందనలు ..ఈరోజు ఈనాడులో మీ బ్లాగ్ గురించి చదివాను .

saleem said...

Chala bagundi

మరువం ఉష said...

మాటలు చాలవులే అని మరలిపోలేక అలాగే ఇంతకన్నా చెప్పలేనని మన్నించమంటూ.. అనుభూతి సాగరంలో పలుమార్లు వేసిన మునకలివి.

Unknown said...

nice

శేఖర్ పెద్దగోపు said...

ఈ రోజు ఈనాడులో మీ బ్లాగు గురించి వేశారండీ...సరిగ్గా నాకు మీ బ్లాగులో తెగ నచ్చే టపాలలో కొన్నింటిని అందులో ప్రస్తావించారు...అందుకోండి అభినందనల మందార మాల...
@పరిమళం గారు, థాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫో...

ప్రణీత స్వాతి said...

ఇవాళ్ళ ఈనాడు ఈతరం లో మీ బ్లాగ్ గురించి వేశారు.చక్కని మీ కవితల గురించి ప్రస్తావించారు. అభినందనలు..నిషిగంధగారూ!

వేణూశ్రీకాంత్ said...

నా తరపున కూడా అభినందనలు నిషిగంధా. ఈనాడు లో ఆర్టికల్ చూశాను.

రాధిక said...

నిషీ రోజు వారీ జీవితాలో కొత్త కోణాల్ని చూపిస్తావు గా.ఆర్ట్ ఆఫ్ లివింగ్ నీదగ్గర నేర్చుకోవాలి.పేపరుకెక్కారని తెలిసింది.హృదయపూర్వక అభినందనలు.

నేను said...

చదవగానే wooow..!! అనిపించింది..వెంటనే వానర వారసత్వం రంగప్రవేశం చేసి, "చీకటిని కలిసి ఆహ్వానించలేని వారు రెపలదుప్పటి తొలగించేసరికీ మధ్యానం కదా అయ్యేది.." అంటే...logic వచ్చి పో వోయ్ కలిసి ఉండటం కదా ముఖ్యం అనేసింది...

నిషిగంధ said...

మురళి గారు, సుజ్జి గారు, మోహన, వాసు గారు, సుబ్రమణ్యం గారు, శేఖర్ గారు, పరిమళం గారు, నేస్తం, ప్రణీత స్వాతి గారు, కవిత గారు, లక్ష్మి గారు, వేణూ గారు, ఉష గారు, ఆలం గారు, బబ్లు గారు, రాధిక, నేను గారు......ప్రతి ఒక్కరికీ... పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు...

ఏమాత్రం ఆలోచన లేకుండా అలవోకగా జారిన చివరి రెండు లైన్లే అందరికీ నచ్చినట్లున్నాయి.. నిరీక్షణని కొత్తగా ఎలా చెప్పాలా అని బోల్డంతసేపు తల కీబోర్డ్ కి కొట్టుకున్న తర్వాత తట్టిన మొదటి నాలుగు లైన్లూ నాకు ఇష్టమైనవి :-)

ఏకాంతపు దిలీప్ said...

ఆహా!

భావకుడన్ said...

చాలా బావుంది నిషిగందా,

మూల సుభ్రమణ్యం గారితో నేను విభేదించక తప్పదు. ఈ కవితల్లో క్లుప్తత (ఇదే కారణం వారు ముందు వాటిలో చాలావరకు అనవసరం అనటానికి అని assume చేసుకుంటున్నాను) గురించిన కొన్ని నా అనుమానాలు, అభిప్రాయాలు అడగటానికి చెప్పటానికి ఇది సరైన సందర్భమే అనుకుంటున్నాను.....

ముందుగా ఈ కవిత గురించే తీసుకుందాము.....ఇక్కడ మొదటి మూడు లైన్లు నిరీక్షణను పరోక్షంగా చెప్పారు తనడైన శైలిలో ప్రకృతిని
తోడూ తెచ్చుకుని...symbolism

తరవాతి మూడు పంక్తులు కవయిత్రి ఎ ఉద్దేశ్యంతో రాసారో నాకు తెలీదు కాని నా అన్వయమేమిటంటే...ఆతను (భౌతికంగా) తలుపు తీసుకు వచ్చినా తనకు కావాల్సిన/నచ్చిన ఆతను (మానసికంగా) రాలేదు కాబట్టి అతని "ఆనవాలేదో ...." "నే" వచ్చింది , ఆతను కాదు.....ఇదీ అనవసరం అనిపించలేదు. ఇక్కడ నాకు "జ్ఞాపకం" లేదా "గాలిని" simbolicgaa చెప్పారు కవయిత్రి అని అన్వయిన్చుకోతానికి కుదరకపోతానికి కారణం తరువాతి పంక్తులు.

ఈ అయిదు పంక్తుల్లో అలసి బలవంతపు/అసంన్పూర్ణ (మళ్ళీ నాకు ఆ పక్షం రోజుల చంద్రుడు, అతని అసంపూర్ణ కళలు గుర్తు తెప్పిస్తూ)నవ్వును, మంచి మాటలను త్రుంచె అసహనాన్ని జతచేసుకోచ్చిన జతగాడు పరిచయమయ్యాడు రెండవ పేరాలోని "అనవాలేదోని" బలపరుస్తూ.

తరువాతి రెండు పేరాల్లో నిరీక్షణ నింపిన నిర్లిప్త మృత హృదయం ఎలా జీవం పోసుకుందో తెలిపారు. ఆ ప్రసవం ఎలా నిద్రాదేవి ఒడిలో జార్చిందో చెప్పేవి తరువాయి రెండు పంక్తులు....చివరి రెండు పంక్తులు....అదే "ఆశావాహకమైన ముగింపు"....ఒక విధంగా నిషిగారి కవితాముద్రిక అనుకోవచ్చు.

ఈ కవితకు నాకు తోచిన అన్వయం ఇది. ఇందులో అవసరం లేనివి ఏమిటా అని ఆలోచించా....

మొదటి నాలుగు పంక్తులూ, చివరి రెండూ పెట్టేస్తే సరిపోతుందిగా అనిపించింది....కాని, నా భావుకతకు అది నచ్చలేదు.

స్ఫందన conception అయి కవిత ఆ స్ఫందన ఫలమైన శిశువు అయితే, ఆ స్పందన దరిని ఈ ప్రసవతీరానికి చేర్చి నూత్న ప్రాణదానం చేసే సేతువే కవి/కవయిత్రి అనుభవించే భావ పరంపర...... ఆ రెంటినీ జతపరిచే ఆ నవమాసాల వేదనను తెలిపే సూచికలే ఈ భావ వర్ణనలు, స్వేచ్చా విహారాలు. let us not begrudge the poet/ess this small pleasure. this is my first argument why too much kluptata is not as aggreable to me as it is to some others.

ఇక రెండవ కారణమేమిటంటే ..... తాము కవితలు ఎందుకు రాస్తున్నాము, ఎలా రాస్తున్నాము, ఎలా రాయదలచుకున్నాము అన్న వాటిపై ఆ ఆ కవయిత్రి/కవులకు ఉన్న అవగాహన. కొంతమంది తమ భావాలను వ్యక్తపరచాతంలోనే సమస్త అనుభూతి పొందుతారు....కొంతమంది ఆ వ్యక్తపరచటం ఇతరులు మెచ్చే విధంగా చేయ్యాలనుకుంటారు....ఎప్పుడైతే "ఇతరులు మెచ్చే" అన్నది అక్కడ వస్తుందో ఆ భావనకు కళ్ళెం వెయ్యకపోతే ఆ కవయిత్రి/కవి నిజ స్వరూపం మనకు మృగ్యం అయిపోతుంది అని నా భావన.......భావకవితలో కవి నిజస్వరూపం అదృశ్యం అస్పృశ్యాం అయితే అది త్యజమే....నా దృష్టిలో.

ఈ రెండు కారణాల వాళ్ళ బలవంతపు క్లుప్తత కొంచం మింగుడుపడదు నాకు.

ఈ సోదంతా నాకు సుభ్రమణ్యంగారు క్లుప్తత పేరుతొ అలా అన్నారేమో అని అనిపించినందుకు. వారు ఇంకేదన్నా ఉద్దేశ్యంతో అలా అని ఉంటె వినాలని ఉంది.

ఇంకో చిన్న అభ్యర్థన....పట్టున్న విమర్శకులు ఉట్టి వ్యాఖ్య చేసి ఊరుకోక ఎందుకు ఒక వ్యాఖ్య చేస్తున్నాము అన్న దానికి వివరణ ఇస్తే నేర్చుకోవాలి అన్న తపన ఉన్న మాలాటి ఔత్సాహికులకు ఎంతో మేలు జరుగుతుంది....ఒక ప్రక్రియ పట్ల అవగాహన్ పెరగటానికి ఇవే కదా సోపానాలు. అలా చర్చించటానికి మన బ్లాగ్లోకంలోని ప్రతి బ్లాగరి ఒప్పుకున్తారనే నా అభిప్రాయం.

నిషిగారు
keep it up.

నిషిగంధ said...

దీపూ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి!!

నిషిగంధ said...

భావకుడన్ గారు, మీ విశ్లేషణ నన్నెప్పుడూ మౌనిగా చేసేస్తుందండి.. ఇక చెప్పడానికేమీ మిగిలి ఉండని స్థితి.. తను అనుభవించిన అనుభూతిని కొన్ని అక్షరాల ఆసరాతో పాఠకులు కూడా పొందగలగడం కంటే కవికి కావాల్సిన సంతృప్తి వేరే లేదేమో! ముఖ్యంగా రెండ చరణం గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం!
మనకి కావాల్సిన వ్యక్తి గురించి వారి పరోక్షంలో ఆలోచించేప్పుడు మనకి ఎంతో దగ్గరగా అనిపిస్తారు.. కానీ నిజంగా ఎదురుగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన వలన, అంటే కావాలని చేయకపోయినా, మన ఎక్స్పెకెటేషన్స్ కి తగినట్టు ఉండకపోవడం వలన అనుకోకుండా దూరం పెరిగినట్లు ఉంటుంది..

అసలు ముందు నేను అక్కడ రాయాలనుకుంది,
"ఏకాంతంలో ఎంతో దగ్గరగా ఉన్న నువ్వు
హఠాత్తుగా గుమ్మం బయట!"

కానీ మరీ నిష్కర్షగా చెప్పినట్లుందని "నీ ఆనవాలేదో.." కి మార్చాను :-)

ఇక, సుబ్రమణ్యం గారు చెప్పిన క్లుపతతకి సంబంధించి కొంతకాలం కిందట బొల్లోజు బాబా గారి కవితపై చాలా మంచి చర్చ జరిగింది.. లంకె ఇస్తున్నాను.. మీరు ఆశిస్తున్న సమాధానాలు అందులో తప్పక దొరుకుతాయని అనుకుంటున్నాను..

http://sahitheeyanam.blogspot.com/2009/11/blog-post_17.html#comments

మీ విలువైన సమయం వెచ్చించి ఇంత మంచి విశ్లేషణ రాసినందుకు, మనఃపూర్వక ధన్యవాదాలు :-)

Unknown said...

nee kavithalu chaala baagunnaayi mari konni nrml

srini chimata said...
This comment has been removed by the author.
srini chimata said...

Awesome kavita... Congrats for being written in eenADu..

Regards,
Srini Chimata
www.ChimataMusic.com

Mohanatulasi said...

hmmn...em cheppamantavuraa...ne kavitalanni okeroju okesaari chadivaane anuko ...chala kashtam aa teevratalo nundi bayataki ravadam!! alaa ani anni kanipistunte kallu aatrangaa parigettadam maanataayaa!!??...anduke appudappudu vasuntaa...kaanee kramam tappakundane sumaa...appudu suddengaa naaku boldanni surpriselu...chinna pillaki boldu chocolatlu dorikinattu sambaram....!!

mugimpu adaraho!!

VinnieG said...

wowoww
simply grt one...i'm inspired even more....to write more...after seeing ur beautiful blog....

cheers
vinnie

నిషిగంధ said...

తులసీ, నీలాంటి స్నేహితుల ప్రోత్సాహమే అనుకుంటా 'ఆ ఇంకేం రాస్తానులే' అనుకున్నప్పుడల్లా కొత్త ఉత్సాహం నింపుతుంది!! అప్పుడప్పుడూ ఇటువైపు తొంగి చూసి వెళ్తుంటవనైనా నీకోసం చాకొలెట్లు రెడీ చేస్తాను... థాంక్స్ ఎగైన్ రా :-)

Thank you so much Vinnie gaaru :-)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

నిషిగంధ గారు,

చాలా బావుంది మీ కవిత.

ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నాను.ఛందస్సు నియమాల గురించి కానీ,ఎక్కడ పదాలు,వాక్యాలు విరచాలో వివరంగా తెలిపే పుస్తకం ఏదైనా వుంటే చెప్పండి.చదివి తెలుసుకుంటాను.

annmacharya keerthanas said...

super

Telugu songs Free Download said...

Its Fabulous

sarigamalu said...

nishigandha garu this is pavani from warangal in AP. Mi kathalu, kavitalu chadavadam nakoka vyasanam aindi.nenu patalu padutuntanu. pataki ragamento bhavamanta imp ani na uddesyam.enta madhurima mee padallo undo, teepi kuda tanato polchukolekapotundi. pavani

జ్యోతిర్మయి said...

నిషి గారూ

మీ బ్లాగులోకి వస్తే కాలమే తెలియదండీ. కవిత, కాని కబుర్లే కాని మనసుని కట్టి పడేసి ఏదో లోకం లోకి తీసుకు పోతాయి. ఏదో వైవిధ్యం మీ కలంలో.. రాబోయే మీ కవిత కోసం చాలా ఎదురు చూస్తూ వున్నాను. కొంచం త్వరగా వ్రాయండి, Please....

Unknown said...

నిద్రదుప్పటి కప్పుతున్న నీ పరిమళం సాక్షిగా
ఒక్కమాట తీసుకోనీ..

చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!

మాటలు లేవండి.