Pages

Sunday, November 22, 2009

అదే వాన...


జోరుగా మొదలైన వాన
ఆగకుండా..నిలకడగా పడుతూనే ఉంది..
మన పరిచయంలానే!

రోడ్డు చివరి ఒంటరి పాకలో
తగిలీ తగలకుండా...

హడావిడి పడుతున్న చీకటిలో
నింపాదిగా తడుస్తున్న కొండని చూస్తూ..

ఒకరికొకరమని తెలుస్తున్న తొలినాళ్ళవి..

ఉరుము ఉలికిపాటుకి
తగులుతున్న భుజం
సంకోచపు సరిహద్దుని
చెరిపి వేస్తుంటే..

అవసరమైన సందేశమేదో అందినట్టు
గాలితెర దీపం కళ్ళు మూసింది..
ఉన్నట్టుండి వంద పారిజాతాల
వత్తిడి.. పెదవులపైన!

హృదయాన్ని వెలిగించి
శరీరాన్ని మండించిన ఒక జ్వాల!
అప్రయత్నంగా ఇద్దరం వాన కింద..

జీవితానికి కొత్తచిరునామా నిర్ణయమైన క్షణాలవి!

ఇప్పుడూ అదే వాన.. కిటికీ అవతల..

పుస్తకం చదువుకుంటూ..
కాలివేళ్ళతో నా చేతిగాజులు లెక్కబెడుతూ..
పక్కనే నీ వెచ్చటి ఉనికి!

అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!


(తొలి ప్రచురణ ఆవకాయలో...)

58 comments:

చిన్ని said...

ఆ వానలో తడిచిన అనుభూతి .......చాల బాగుందండి .

hanu said...

అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!
chala bagumdi anDi, nice one, nd mee lines kuaDa chala bagunnayi

వేణూ శ్రీకాంత్ said...
This comment has been removed by the author.
వేణూ శ్రీకాంత్ said...

జడివానలో నిండా తడిపేసారు నిషీ.. కానీ..
అదేంటో మరి నా ఒంటిపై ఓ నీటిబింధువైనా కనపడటం లేదు... కానీ..
గిలిగింతలు పెట్టే ఆ స్పర్శ మాత్రం స్ఫుటంగా తెలుస్తుంది...
నే నిజంగా తడిసానా! ఏమో!! తడిసింది నీటిలోకాదేమో!!!

భైరవభట్ల కామేశ్వర రావు said...

చాన్నాళ్ళకి మళ్ళీ మీ మానసవీణ పలికిందే! మోహనరాగంలా సమ్మోహనంగా ఉంది.

కత్తి మహేష్ కుమార్ said...

ఆఖరి మూడులైన్లతో కవితకు అద్వితీయమైన అందాన్ని చేకూర్చారు. అద్భుతం!

భావన said...

హడావుడి గా తలపుకొచ్చిన చెదురు మదురు చినుకులు, తళుక్కుమన్న గత జ్నాపకాల విసురులు... వుండుండి అదరగొడుతున్న అనుభవాల వురుములతో తీరాన్ని ’కల’వర పరచటం చేత మనసును కల్లోల ప్రాతం గా ప్రకటించి ఒకటి అరా జ్నాపకాలను కూడా అటు ఇటూ రాకుండా మూసేసి కట్టు దిట్టం చేసి ప్రస్తుతానికి గత సముద్రపు అలలను పర్యవేక్షించటం తప్ప తదుపరి చర్యలేమి ప్రకటించలేక పోవటం వల్ల ప్రత్యేకం గా కామెంట్ రూపం లో ఇలా వుంది అని ప్రత్యేకం గా చెప్పలేక పోతున్నందుకు చింతిస్తూ కల్లోలం తగ్గే క తప్పక మరిన్ని వివరాలతో మీ ముందుకు... అంత వరకు జ్నాపకాల కోన నుంచి ప్రసారం కట్..

జాన్‌హైడ్ కనుమూరి said...

చివరి ఆరు పాదాలు చదవగానే చాలారాయాలనే వుద్వేగం కలిగింది

"ఇప్పుడూ అదే వాన.. కిటికీ అవతల.."

నిఘూడమైన పదచిత్రాలను కళ్ళముందుంచుతున్నాయి

తీరికగా వివరించడానికి ప్రయత్నించాలి

"అనుభవం మళ్ళీ కావనిపిస్తుంది" ఎవరో కవయత్రి అన్నట్లు గుర్తు

ఇప్పుడు వానలో మళ్ళీ మళ్ళీ తడవాలనిపిస్తుంది

జాన్‌హైడ్ కనుమూరి said...

"అనుభవం మళ్ళీ కావాలనిపిస్తుంది" ఎవరో కవయత్రి అన్నట్లు గుర్తు

నిషిగంధ said...

చిన్ని గారు, హను గారు, వేణు, కామేశ్వరరావు గారు, మహేష్, భావన, జాన్ హైడ్ గారు... అందరికీ ధన్యవాదాలు :-)

వేణూ, మీరు కూడా కవిత్వం మొదలుపెట్టేయొచ్చు :-)

కామేశ్వరరావు గారు, అవునండి వీణకి కొన్ని నెలలు విరామం ఇచ్చాను :-)

భావన, "అనుభవాల వురుములతో తీరాన్ని ’కల’వర పరచటం చేత మనసును కల్లోల ప్రాతం గా ప్రకటించి ఒకటి అరా జ్నాపకాలను కూడా అటు ఇటూ రాకుండా మూసేసి కట్టు దిట్టం చేసి"
వావ్!! మీ వ్యాఖ్యతోనే ఇంకో కవిత రాసేయొచ్చు! భావన భావుకత ఇక్కడ కురవడం చాలా సంతోషంగా ఉంది :-)

జాన్ హైడ్ గారు, అవునండి మీరు చెప్పిన లైన్ లోనే నిగూఢత ఉంది.. అంతకుముందు వాన కురిసేప్పుడు ఉన్న ఉద్విగ్నత, అలజడి ఇప్పుడు కిటికీ బయటే జ్ఞాపకాల్లా తొంగి చూస్తున్నాయి.. మీరు చెప్పిన ఆ కవయిత్రి ఎవరో, అది ఏ కవితలోదో మీకు గుర్తుకు వస్తే కొంచెం మాతో పంచుకోండి :-)

ప్రణీత స్వాతి said...

సింప్లీ సూపర్బ్..!!

మురళి said...

Beautiful.. too romantic :):)

అపరంజి Aparanji said...

అప్పటి ఆక్షణాలు - ఇప్పటి ఈక్షణాలు - ఎప్పటికి మధురక్షణాలు

Raju Idury (Singer) said...
This comment has been removed by the author.
ChimataMusic said...

Awesome Kavita.. I eagerly await more and more such beautiful pieces from your pen.

Best regards,
Srini
www.ChimataMusic.com

hemanth said...

vaana chinukulalage chala romanticga vundi

రాధిక said...

నిషీ నీ కవిత బాగుందని చెప్పడానికి నీ కవితలంత అందమైన పదాలను నువ్వే కనిపెట్టి చెప్పవా. "అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!".....నీ ప్రతి కవితా చదివినప్పుడు మాకూ అదే భావన.

నిషిగంధ said...

థాంక్యూ ప్రణీత స్వాతిగారు, మురళి, అపరంజిగారు, శ్రీనిగారు, హేమంత్ గారు, రాధిక :-)

రాధికా, అంతా నీ అభిమానం :-)

జాన్‌హైడ్ కనుమూరి said...

నిషిగంద గారు
"అనుభవం మళ్ళీ కావనిపిస్తుంది" ఎవరో కవయత్రి అన్నట్లు గుర్తు
అది బహుశ జయప్రభ అనుకుంట
పుస్తకంకోసం వెదికాను, కానీ ఈ మద్య ఇల్లుమారటంవల్ల కన్పడకుండా పోయింది

బొల్లోజు బాబా said...

i always wonder how could women writers express such minutest subtilities of life in a glorified manner.

గాలితెర దీపం కళ్ళు మూసింది..
ఉన్నట్టుండి వంద పారిజాతాల
వత్తిడి.. పెదవులపైన!

it could be a kiss/ shivering lips/ pedavi daaTaleni maaTala othidi/....... etc

i astonish the way the feel is expressed with full throat at the same time with some maarmikata.

that is awesome. really really wonderful.

excuse me for english

bollojubaba

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగా రాసారు...నాకొక డౌటు..ఇలాంటి భావాలను వాక్యాలు చక్కగా Express చేయగలవా లేక తెర మీద ఒక దృశ్యం ఆ పని సమర్దవంతంగా చేయగలదా? నాకైతే వాక్యాలే అని ఇలాంటివి చదివినప్పుడు అనిపిస్తుంటుంది.

శేఖర్ పెద్దగోపు said...

@వేణు గారు...మీ Expression simply superb....

భావకుడన్ said...

పుస్తకం చదువుకుంటూ..
కాలివేళ్ళతో నా చేతిగాజులు లెక్కబెడుతూ..
పక్కనే నీ వెచ్చటి ఉనికి!


Simply superb.

కాలిగోటి స్పర్శ తగిలితేనే ముఖం మాడ్చుకునే స్త్రీలున్న ఈ కాలంలో ఇంత మంచి భావం అన్వయించుకున్న మీకు, అంత నమ్మకాన్నిచ్చిన ఆ వ్యక్తిత్వానికీ, ఆ సాంగత్యానికి "మీ"పై నిజంగా అసూయేస్తొంది :-)

నిషిగంధ said...

ధన్యవాదాలు జాన్ హైడ్ గారు, బాబాగారు, శేఖర్ గారు, భావకుడన్ గారు :-)

జాన్ హైడ్ గారు, పర్వాలేదండీ.. ఆ పుస్తకం కనబడటం తటస్థిస్తే మాత్రం పంచుకోవడం మరచిపోవద్దని మనవి :-)

బాబా గారు, చాలా రోజుల తర్వాత మీ అక్షరముత్యాలు చూడటం సంతోషంగా ఉందండి.. అనుభూతి ఏదైనా సరే అది - పుర్తిగా తెరిచిన కిటికీలోంచి వచ్చిన గాలిలా ఉంటే అది రచయిత చెప్పింది అయి ఉంటుంది... లేక సగం మూసిఉన్న కిటికీలోంచి ఉండుండి తాకే చిరుగాలిలా ఉంటే రచయిత్రి పంచుకుంది అయిఉంటుందని మనకు తెలిసే కదండి :-)

శేఖర్ గారు, మీరు చెప్పింది నిజమే.. కొన్ని దృశ్యాలను/అనుభూతులను అక్షరాలు ఆవిష్కతించినంత అందంగా తెర చూపించలేదు.. అందుకే నవలలు సినిమాలుగా తీసినప్పుడు అవి అంత సంతృప్తినివ్వవు..
అవునండీ, వేణు వ్యాఖ్య చదువుతుంటే తను కూడా కవితలు రాయడం మొదలు పెట్టొచ్చుననిపిస్తుంది :-)

భావకుడన్, welcome back :-) అసూయ పడాల్సినంత విషయమేమీ లేదండి.. ఈ ఫాస్ట్ యుగంలో దైనందిన చర్యలలోనే దగ్గరతనం అనుభవించడానికి చేసే ప్రయత్నమండి.. అయినా మీరు పొరపాటు పడుతున్నారండీ! ఇష్టమైనవాడి కాలిగోరు తగిలితేనే చాలు ఏ కాలం అమ్మాయిలైనా మైమరచిపోతారు :))

రాకేశ్వర రావు said...

చాలా బాగుంది. ఆడవారు ఇలాంటి పద్యాలు వ్రాయడం ఎప్పుడూ చూడక, ఇలాంటివి వ్రాయలేరేమోననుకున్నాను.

మొన్నెవరితోనో మీ పరిచయం లేదంటే, ఆహ్ నిషిగంధ కూడా తెలియదా అని అజ్ఞానిని చూసినట్టు చూసారు. అందుకు, పనిగట్టుకుని ఇలావచ్చాను.

కవితలో ఇంకాస్త క్రమశిక్షణ (నేను చెప్పేది ఉత్త లైన్ల విషయంలోనే) పాటిస్తే బాగుండేదేమో. అంటే - మూడు లైన్లు, రెండు, రెండు, ఒకటి, నాల్గు, నాల్గు అన్నట్టుగా వున్నాయిగా, అలా వుంచేస్తే పర్వాలేదనుకుంటారా? లేదంటే, తిలక్ లా అంతా ఒకటే ముక్కలా వ్రాసేయవచ్చు.

నేను చెప్పదలచుకున్నది ఏంటంటే,
మీ పద్యవిభజన (paragraph division) నాకు పద్యాన్ని తేలికగా అర్థం చేసుకోవడంలో సహాయపడలేదని. ellipsis వాడకం వలన కావచ్చును.

ఇది చాలా చిన్న విషయం, కానీ ఎప్పటికైనా అచ్చు పుస్తకం స్థాయికి ఎదగబోయే నైపుణ్యం గలవారు కాబట్టి, ఆ స్థాయిలో ఆలోచించడానికి నా వ్యాఖ్య ఉపయోగపడగలదని ఆశ. అంతే!

కెక్యూబ్ వర్మ said...

వాన తడిలోని వెచ్చదనాన్ని చూపారు. థాంక్స్.

కార్తీక్ said...

నిషిగండి గారు మీ బ్లాగులో నా తొలి కమెంట్...

కవిత చాలా బాగుంది అని చెప్పేసి సరిపెట్టుకోలేను

"ఇప్పుడూ అదే వాన.. కిటికీ అవతల..

పుస్తకం చదువుకుంటూ..
కాలివేళ్ళతో నా చేతిగాజులు లెక్కబెడుతూ..
పక్కనే నీ వెచ్చటి ఉనికి!

అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను! "

ఇక్కడి నుండి కవితను మంచి మలుపు తిప్పారు
పాతకులకు ఈ లైన్స్ పంచిన అనుభూతి అద్భుతం అవును అధ్బుతం...
www.tholiadugu.blogspot.com

raja said...

కొన్ని అనుభూతులు మాటల్లో చెప్పలేమేమో. మీ కవిత చదివాక అలానే ఉంది నా పరిస్థితి.
రాజన్
http://naagola.wordpress.com/

నిషిగంధ said...

ధన్యవాదాలు రాకేశ్వర రావుగారు, కెక్యూబ్ వర్మగారు, కార్తీక్ గారు, రాజన్ గారు :-)

రాకేశ్వర రావుగారు, నాకేమో వీకెండ్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అయినంత సంతోషంగా ఉందండి మీ వ్యాఖ్య చూశేసరికి :-) మానసవీణకు స్వాగతం.. అతి చక్కని సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.. మీరు చెప్పాక మళ్ళీ ఒకసారి కవితనంతా తేరిపార చూస్తే మీరన్నట్లే విభజన్ చేయడం రెండుచోట్ల అనవసరమనిపించింది..

కెక్యూబ్ వర్మగారు, 'వానతడిలోని వెచ్చదనం' ఇదేదో నా తరువాతి కవితలో వాడుకోవచ్చంటారా? :-)

కార్తీక్ గారు, మానసవీణకు సుస్వాగతం... నిజమే కదా, ప్రియమైన వ్యక్తి పక్కనుంటే అనుభవం ఏదైనా సరే ఆ ఆనందమే వేరు :-)

రాజన్ గారు, మాటల్లో వ్యక్తపరచలేని అతికొద్ది అనుభూతులలో ఈ కవితని కూడా చేర్చినందుకు మీకు నా కృతజ్ఞతలు :-)

కెక్యూబ్ వర్మ said...

తప్పకుండా, మీ కలం కుంచెలో మరింత అందంగా రూపుదిద్దుకుంటుంది.

వేణూ శ్రీకాంత్ said...

నిషిగంధ గారు.. ఆహా నాకీరోజుఇక నిద్ర పట్టదండీ భలే పొగిడేశారు మీరు శేఖర్ గారు కలిసి. అయినా నాలాటి పామరుడిచేత కూడా అంతబాగా పలికించగలిగిన మీ కవిత గొప్పదనమే అదంతా... నాదేమీలేదు.

సవ్వడి said...

నిషిగంధ గారు మీ కవిత అమోఘం... చాలా భావాలు బాగున్నయి.

ముఖ్యంగా " అవసరమైన సందేశమేదో అందినట్టు... " ఈ వాఖ్యం చదవగానే ఒక రకంగా ఊహించుకుంటాం. మీరు మరో విధంగా రాసి ఆశ్చర్యపరిచారు.. సూపర్ అనుకోండి.

సవ్వడి said...

మరిచిపోయానండి.. మీరు బాబు గారికిచ్చిన కామెంట్ సూపర్..

జాన్‌హైడ్ కనుమూరి said...

pls. mail me john000in@gmail.com

i can send little note
best wishes

నిషిగంధ said...

మీక్కూడా సూపర్ ధన్యవాదాలు సవ్వడి గారు :-)

కొత్త పాళీ said...

Very nice.

nani said...

Dear Nishigandha!

I love poetry that erupts like prickly heat, as Kamala Das said. Particularly, the poetry- from the unknown, enigmatic planes of woman (women).
If the poetry has the genesis of talent, how touching it is, I rate it secondary..
So, I confine with left-hand shakehand.
'Nani'
P.S.Could u provide ur personal Mail Id, as I have to share something...

nani said...

Dear Nishigandha!

I love poetry that erupts like prickly heat, as Kamala Das said. Particularly, the poetry- from the unknown, enigmatic planes of woman (women).
If the poetry has the genesis of talent, how touching it is, I rate it secondary..
So, I confine with left-hand shakehand.
'Nani'
P.S.Could u provide ur personal Mail Id, as I have to share something...

నిషిగంధ said...

Thank you Kottapali gaaru, Nani gaaru..

Nani gaaru, it's maanasa.veena@gmail.com

రవిగారు said...

నిషిగారు వానలో మొదటి అనుభవం
మౌనం గా వున్న మీ బ్లాగ్ లో
అభిమానులకి పంచిన సునామి .
కొత్త చిరునామా పాతది అయిపోయాక
అదే వాన అదే చెలి కాని
అతని మస్తకం లో ఇప్పుడు పుస్తకం
చెలికి మాత్రం అనుభూతుల జ్ఞాపకం

నిషిగంధ said...

థాంక్యూ రవిగారు :-)

Vasu said...

బావుంది. ఎందుకో తెలియదు కానీ అక్కడక్కా చలం గారు మైదానం లో వాడిన కవితాత్మక వర్ణనలు గుర్తొచ్చాయి.

నిషిగంధ said...

ధన్యవాదాలు వాసుగారు :-)

వేమన said...

Beautiful !

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

శివ చెరువు said...

కంటిముందే కదులుతున్న చిత్రమా ఇది.. ?
పదాల వరుస ... భావం లోని అందం గొప్పగా ఉన్నాయి ... చాల బాగుంది..

సవ్వడి said...

i am waiting for your poetry.. raayandi.

మురళీ కృష్ణ said...

అభిమాన రచయితకు,
కవిత చాలా చాలా బావుంది. Thanks.
RSS Feed settings for your blog is not working.
http://nishigandha-poetry.blogspot.com/feeds/posts/default - it doesn't return the feed for your posts.

if u see another link like http://kristnapaksham.blogspot.com/feeds/posts/default - it return feed for all posts...

http://kristnapaksham.blogspot.com/feeds/comments/default - it return feed for comments...

so, we can read these posts offline at home or where ever we want we can carry.

So, madam, plz adjust the feed settings.

Thanks

నిషిగంధ said...

ధన్యవాదాలు శివ గారు..

సవ్వడి గారు, ప్రయత్నం జరుగుతోందండి.. అసంపూర్తి రచనలెన్నో సమయం కోసం చూస్తున్నాయి.. ధన్యవాదాళు..

మురళీకృష్ణ గారు.. మీ అభిమానానికి ధన్యవాదాలు.. ఫీడ్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో చెప్పగలరా? అంతకుముందే ఈ సమస్య గురించి తెలిసినా అలక్ష్యం చేశాను.. మరల గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు..

Vasu said...

ఎప్పుడు చూసినా అదే వాన కనపడుతోంది. కొత్త వాన నెప్పుడు కురిపిస్తారు. మానస వీణని మళ్ళీ ఎప్పుడు పలికిస్తారు ?

SANDHYA RAGAM said...

సింప్లీ సూపర్బ్..!!

నిషిగంధ said...

Thank you :-)

Telugu songs Free Download said...

"anubavam edaina nee sangathyam isthunna anubhoothilo malli thadisipothunna.."annare adhi keka...

kallurisailabala said...

నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!
wow...

జాన్‌హైడ్ కనుమూరి said...

బహుశ ఇలా వానలో తడిసిన అనుభవమేమో

ఇప్పుడు వాన/వర్షం సంకలనం చేయాలని
తలపు మదిలో తొందరపెడుతోంది

MURALI said...

అవసరమైన సందేశమేదో అందినట్టు
గాలితెర దీపం కళ్ళు మూసింది..

వాహ్ నిషిగారూ, ఈ ఎక్స్‌ప్రెషన్ నాలుగు అయిదుసార్లు మరలా మరలా చదివాను.

నిషిగంధ said...


థాంక్యూ సో మచ్, మురళీ! :-)