Tuesday, May 26, 2009
మనోనేత్రం
తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కవిత...
రెండేళ్ళ చిట్టి నవ్వినప్పుడల్లా
తెల్లదనం తెరలు తెరలుగా విచ్చుకుంటుంది
కొసరి తినిపించే
అమ్మ చేతివేళ్ళ మీదుగా
పసుపు పవిత్రంగా అతుక్కుంటుంటే
కాలికి గుచ్చుకున్న ముల్లు నొప్పి
గుండెకి చేరనివ్వని నేస్తం స్పర్శ
హరితమై ప్రవహిస్తుంది..
తుంటరి చినుకుల చక్కిలిగింతలకి
తుళ్ళిపడుతున్న సెలయేరు
నీలాలు రువ్వుతోంది..
గ్రీష్మ కిరణాల
గాఢ చుంబనమే కదా ఎరుపంటే!
అపజయం పరిహసించినప్పుడల్లా
కాషాయం అభిమానంగా చుట్టుకుంటుంది..
సన్నజాజి సందెగాలుల ప్రణయావేశం
తలత్ గజల్ తో కలిసినప్పుడేగా
ఊదారంగు వింతహొయలేమిటో తెలిసేది!
ఇక..అన్ని రంగులూ కలిసిన నలుపు
కళ్ళెదురుగా కావాల్సినంత!!
మనోఫలకం పై చెక్కుకున్న
ఈ వర్ణమాలికని తాకినవారెవరనగలరు
నాకు చూపులేదని!?
Subscribe to:
Post Comments (Atom)
34 comments:
చాలా చాలా బాగుందండి.. 'నేస్తమా..ఇద్దరిలోకం ఒకటే లేవమ్మా.. అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా..' పాట గుర్తొచ్చింది, అప్రయత్నంగా..
వాహ్ వా..
"సన్నజాజి సందెగాలుల ప్రణయావేశం
తలత్ గజల్ తో కలిసినప్పుడేగా
ఊదారంగు వింతహొయలేమిటో తెలిసేది!"
ఈ ఇంద్రధనుస్సు ఎంత బాగుందో! చూపులేనివారికెవరికైనా చదివి వినిపించి "ఇది నిజమే కదూ" అని అడగాలనిపిస్తోంది నిషి!
రంగుల హరివిల్లు బాగుంది.
చాలా బాగుంది నిషిగంధా, చక్కగా పోల్చారు.. ఓ క్షణం కనులు మూసుకుని ఆయా వర్ణాలకి ఆయా అనుభూతులను పోల్చి చూసుకుని మరీ చెబుతున్నాను ఈ మాట.
" తుంటరి చినుకుల చక్కిలిగింతలకి
తుళ్ళిపడుతున్న సెలయేరు
నీలాలు రువ్వుతోంది.. "
చాలా బాగుంది నిషి.. చదువుతుంటే ఆ దృశ్యాలు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి..
నిషిగంధ గారు ,ఇంద్ర ధనుస్సును మా కళ్ళముందు ఉంచారు బావుందండీ !
చాలా బావుంది....అప్రయత్నంగా సిరివెన్నెలలో నాయకుడికి ప్రకృతిని పరిచయం చేసే రెండో నాయిక (అసలు నా ప్రకరాం మొదటి నాయిక ఆమె) గుర్తుకు తెచ్చారు.
అవునూ చిన్న అనుమానం....వర్ణాలన్నీ కలిస్తే తెలుపు కదా వచ్చేవి....నలుపంటారేమిటి? :-)
గొప్పగా ఉందండీ వర్ణచిత్రం. భలే మేళవింపు. తెలుగుజ్యోతిలో కూడా చూసాను. అభినందనలు
మురళి గారు, దీపు, సుజాత, మహేష్ గారు, వేణు గారు, నిరంజన్, పరిమళం గారు, భావకుడన్ గారు, మాలతి గారు... అందరికీ ధన్యవాదాలు..
భావకుడన్ గారు, మీరు చెప్పింది నిజమే.. లిటరల్ గా అయితే తెలుపులోనే అన్ని రంగులూ కలిసి ఉంటాయి..
ఈ కవితలో నే చెప్పాలనుకుకున్న భావం..
ఒక తెల్లని కిరణం మనసనే ప్రిజం ద్వారా ఏడు రంగులుగా విడిపోతూ కళ్ళు తెరవగానే గాఢాంధకారంలో కలిసిపోతున్నాయి (Black absorbs all colors of light) అని...
చాలా బావుందండీ.
అన్ని రంగులూ నలుపులో లీనమవుతాయని స్వయంగా కవియైన భావకుడన్ గారికి మనం వేరే వివరించనక్కర్లేదేమో!
మనోనేత్రం కాంచనిదేదైనా వుందా? కవితకందని స్పందనేమైనావుందా. చాలా బాగా వ్రాసారు.
ధన్యవాదాలు కొత్తపాళీ గారు, ఉష గారు :-)
"సన్నజాజి సందెగాలుల ప్రణయావేశం
తలత్ గజల్ తో కలిసినప్పుడేగా
ఊదారంగు వింతహొయలేమిటో తెలిసేది!"
వహ్వా!
కవితలోని క్రియాపదాలు జాగ్రత్తగా ఎన్నుకున్నారు, రంగులకి మరింత వన్నెలద్దేట్టుగా!
చివరి పాదం "మనోఫలకం పై చెక్కుకున్న..." అనవసరమేమో అనిపించింది.
బాగుంది నిషి.. సప్త వర్ణాల ఆవిష్కరణ గుండెలో చేసేరు.. వేణు శ్రీకాంత్ గారన్నట్లు కళ్ళు మూసుకుని వర్ణావిష్కరణ చేసుకున్నా నేను కూడా. స్నేహం లో పాట గుర్తు వచ్చింది.. "నీవుంటే వేరే కనులెందుకు నా పాట లోని పదములు నీవే " అన్నట్లు ఆ పదాల రంగుల రాగాలు వినిపించేరు...
ధన్యవాదాలు కామేశ్వర రావు గారు, భావన గారు..
కామేశ్వరరావు గారు, ఆ చరణం లేకుండా నా సన్నిహితులిద్దరికి కవితని చూపిస్తే (కవిత్వమంటే మంచి అవగాహన ఉన్నవాళ్ళే) క్లారిటీ లేదన్నారు.. మరీ అయోమయంగా ఉంటుందేమోనని జతచేశాను :-)
భావన గారు, పైన ఉష గారు చెప్పినట్లు మనోనేత్రం కాంచనిదేదీ లేదేమో! కాకపోతే మనం అసలు నేత్రాలు చూపించే మాయలో పడి ఈ నేత్రానికి అస్సలు పని చెప్పము..
i took a look at this from kottapali gaari link some time back.
i just passed on. sorry
now i again reread it. its awesome. brilliant.
now i dissect myself why i could not enjoy it first time.
1. the lead to the content is not proper.
2. the punch line (నాకు చూపులేదని!?) was overshadowed by complex lines ( మనోఫలకం పై చెక్కుకున్న)ఈ వర్ణమాలికని తాకినవారెవరనగలరు
3. there is no other clue left in the poem regarding the blindness of the sayer.
after reading the comments now i went back the entire poem and found it spendidly written.
congrats.
if my comment makes you hurt, i am only responsible not your poem. take light pl.
bollojubaba
నాదగ్గర మాటలు లేవు మౌనం గా మీ కవితను ఆశ్వాదించడం తప్ప
బాగుంది మీ కవిత.. మనోనేత్రం ..నిజంగానే మనసుకు హత్తుకుంది ..
ధన్యవాదాలు బాబా గారు, నేస్తం గారు, కధా సాగర్ గారు :-)
బాబాగారు, కవితని మొదట మీరు విశ్లేషించిన తీరు నాకు కొన్ని సూచనలు ఇచ్చింది.. ఇలాంటి కవితలు (మనకు స్వయంగా అనుభవంలో లేని విషయాలు) రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకాస్త తెలుసుకోవాల్సి ఉంది.. ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లా చివర్లో నే కాకుండా మధ్యలో కూడా చెప్పాలనుకున్న విషయం మీద అవగాహన కలిగిస్తే బావుంటుందనిపిస్తుంది.. మీకు మరొక్కసారి ధన్యవాదాలు :-)
Awesome Nishi..
monnanE mA pillalaku AkASamlO chUpinchina indra dhanussu gurtocchindi mee kavitanu chUstunTE.
Cheers,
Srini
www.ChimataMusic.com
wonderful.....
Thank you Srini gaaru, Pradeep gaaru :-)
చాలా బావుందండీ...
Hi,
We came across your web portal "http://nishigandha-poetry.blogspot.com/" & found it to be very interesting and i think it would be a useful resources for our visitors. I feel great to add your site in the links page of my site http://www.telugulyrics.net/links.php section. Please visit my site at your convinience and let me know if you are interested in adding my site.
Looking forward for a positive and early reply.
Feel free to contact me for any further issues.
Thanks,
Shilpa
Telugulyrics.net team
shilpa@telugulyrics.net
Hi,
We came across your web portal "" & found it to be very interesting and i think it would be a useful resources for our visitors. I feel great to add your site in the links page of my site http://www.telugulyrics.net/links.php section. Please visit my site at your convinience and let me know if you are interested in adding my site.
Looking forward for a positive and early reply.
Feel free to contact me for any further issues.
Thanks,
Shilpa
Telugulyrics.net team
hi nishigandha
eppodo chala chala (long long ago)rojula kritham paper lo chusinatlu gurutu me blog gurinchina article.e roju chusanu me blog kani chadava ledu.a paper lone oka posting kuda vesaru ,bagundi.inni rojula taruvatha guruthochindi enduko.that article is hearthed.enti ante cheppalenu coz gurutuledu.ika nunchi chaduvutau.
దొంగలు పడ్డ ఆర్నెల్లకి.....
చాలా అద్భుతంగా ఉందండి కవిత..!
ధన్యవాదాలు Bongu గారు :-)
ధన్యవాదాలు తృష్ణ! మీ పుణ్యమా అని నేను ఇప్పుడే అడుగు పెట్టాను నా బ్లాగ్ లోకి.. అందుకు రెట్టింపు కృతజ్ఞతలు :-)
నిషిగంధ గారు, ఎలాగు అడుగుపెట్టారు కనుక ఒక మంచి అమృత గుళిక ఒకటి ఇటు వదలచ్చు కదండీ... దదాపు ఆరునెలలైపోయింది మేమా అదృష్టానికి నోచుకుని :-)
అదే పని మీద ఉన్నాను వేణూ :-)
hai your blog is very good
see my blog: chiluverunaga.blogspot.com
Nice blog Nishi!
చాలా బాగుందండి.
Post a Comment