గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనాఎంచుకోలేదు!
ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..
రంగో.. రూపమో.. లోపమెక్కడుందో!
అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..
తల్లిపొదనే తనువు చాలించే
స్వేచ్ఛ ఇపుడు నా సొంతమనే
కోయిల సందేశం చేరుతుండగానే
తుమ్మెద తొలిముద్దు పెట్టింది!
(పొద్దు వారి ఉగాది వచన కవి సమ్మేళనం 'తామస విరోధి' కొరకు వ్రాసిన కవిత.. చిన్న మార్పుతో)
25 comments:
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది......
చదువుతుంటే ఇదే ఫీలింగ్ కల్గింది.
ఆహా.. ఎంత బావుందీ..!
సుకుమారమైన పూవుల్లాగే మృదుమనోహరంగా ఉంది మీ కవిత..!
beautiful!
చాలా బాగుందండి.. నేను పొరపాటున 'పుష్ప విలాపం' అని చదివి, కవిత పూర్తిచేసి మళ్ళీ చూశా.. విలాపం కాదు, విలాసం.. అర్ధవంతంగా...
చాలా బాగుంది నిషిగంధ గారు. సుజాత గారు చెప్పినట్లు ఓ పిల్ల తెమ్మెర బుగ్గ తడిమి వెళ్ళిన అనుభూతి కలిగించింది.
ధన్యవాదాలు సుజాత, మధురవాణి గారు, పరిమళం గారు, మురళి గారు, వేణు గారు :-)
Verry nice kavita.. mee kavitalu nannu eppuDU abbura parustU unTAyi.
Srini
www.ChimataMusic.com
చాలా బాగుందండి...
'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది' పాట గుర్తొచ్చింది!
>>అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే లా
కవితకి శీర్షిక విలాపం అని పెట్టారేంటా అనుకుంటూ..
>>కోయిల సందేశం చేరుతుండగానే లా
కామెంట్స్ చదివిన తరువాత అర్ధమైంది..
చివరికి,
వెచ్చగా హత్తుకుంది.. తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది.. :)
Nice.
గడ్డి పువ్వు అనో లేక అలాంటి టైటిలే మరొకటో కరుణశ్రీ గారి (పుష్పవిలాపం రాసినాయన) పద్యం ఉంది సుమారు ఇదే టైపులో.
Hi nishigandha. nice to c u. I was wondering where were u.
థాంక్యూ శ్రీని గారు, చైతన్య గారు, మేధ గారు, కొత్తపాళీ గారు, సంఘర్షణ గారు..
@ మేధ, మీ ప్రయోగం భలే ఉంది :-)
@ కొత్తపాళీ, అవునా! అయితే వెతికి పట్టుకోవాలి.. ఎంత దగ్గరగా ఉందో చూడాలి :-)
@ సంఘర్షణ, very nice to see you too :-)
తమ్మెర అంటె ఎమిటి ??
తమ్మెర కాదు తెమ్మెర, అంటే చిరుగాలి, breeze
@కొత్త పాళీ
అనుకున్నా అనుకున్నా.. షుక్రియా
ఆ పువ్వు నేనై వుంటే ఎంత బాగుండేది.జడ,గుడి కన్నా అమ్మ ఒడే బాగుందనిపిస్తుంది.[ఇప్పుడే ఇండియా నుండి దిగానేమో అందుకే ఇలా అనిపిస్తుంది.తరువాత అభిప్రాయం మారిపోవచ్చు :) ] నిషీ కవిత అద్భుతం గా వుందమ్మాయ్.ఇంతకన్నా ఏమి చెప్పినా ఆఖరునొచ్చి నువ్వు చెప్పేదేమిటి అంటారు.అదన్న మాట.
చాలా బాగుందండి ..హాయిగా ఉంది చదువుతుంటే ..చాలా మంచి అర్ధం :)
బాగుంది నిషిగంధ గారు.
భగవంతుడి శృష్టి చూడండి ఎంత విచిత్రమో..
అందంతో విర్రవీగే వాటి పీక త్రుంచి, సూదులు గుచ్చి, జడలోకో గుడిరేడి మెడలోకో, కాలమందిన వాడి కడసారి నడకలోకో చేరతాయి.
ఇలా చిన్నబుచ్చుకున్నవే కాయగా పండుగా.. మరో మొక్కగా రూపాంతరం చెందుతాయి. ఆలోచిస్తే ఇవే గొప్పవనిపిస్తుంది ఒకోసారి.
'విలాసము ' అంటే ఇల్లు, గూడు, చిరునామా అని కూడా అర్ధాలు ఉన్నాయి. కవితని తుమ్మెద ముద్దుతో ఆపేసి.. అది మరో చెట్టుకు నాంది అనీ.. ఈ పువ్వు ఇలాంటివే తరతరాలుగా అక్షయం అవుతాయన్న ఆలోచనతో అలా 'విలాసం' అని కవిత శీర్షికలో చేర్చారా ?
విలాసమంటే ఆనందం కాబట్టి.. తుమ్మెద ముద్దుతో ఆనందపడ్డాయి ఈ పువ్వులు అని రాశారా ?
ఏమైనా .. మరోసారి మీకవిత చాలా బాగుంది.
థాంక్యూ కొత్తపాళీ గారు :-)
రాధిక, నిజంగానే ఏదో ఊరు, ఇంకేదో దేశంలో కాకుండా చక్కగా అమ్మ ఉన్న చోటే ఉంటే ఎంత బావుంటుందో కదా!
నేస్తం, ధన్యవాదాలు :-)
ఆత్రేయ గారు, మీరు ఇచ్చిన 'చిరునామా' విశ్లేషణ చాలా బావుంది.. ఒక పువ్వు తను అందంగా లేకపోతేనేం వేరొక ఉపయోగవంతమైన కాయకో పండుకో నెలవు అవ్వగలదు.. మనం వ్యక్తుల అంతఃసౌందర్యం-బాహ్యసౌందర్యం గురించి చెప్పుకునే విశ్లేషణే ఇక్కడ వర్తిస్తుంది.. ఈ కవితలో ఇంకో కోణాన్ని పరిచయం చేసినందుకు థాంక్స్ ఎ లాట్!
నేను రాసింది 'ఆనందం' అనే భావం మీదనేనండీ! ఎవరికీ పట్టని ఒంటరిని అనుకునే పువ్వుని కిరణం, తెమ్మెర, తుమ్మెదలు పలుకరిస్తే కలిగిన ఆనందం గురించి!
very nice one.. chala chala bagundi mi kavita.. gundenu hattukundi..
nicest one...
ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారు, చరణ్ గారు :-)
excelent
ఎలా రాస్తారండి కవిత్వం ఇలా?
Post a Comment