Tuesday, December 2, 2008
ఊసులాడే ఒక జాబిలట! (నవంబర్ & డిసెంబర్ 2008)
"......మా కార్తీకకి మీ అంతటి ఆప్తులైన స్నేహితులు లేరు.. మీమధ్య ఏర్పడిన ఆత్మీయత కేవలం ఉత్తరాల ద్వారానే అంటే నమ్మశక్యం కాదసలు! తనకి మీరంటే వల్లమాలిన గౌరవం, అభిమానం.. ఎప్పుడూ చెప్తుంది, 'నేను దిగులుగా ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు కేవలం స్నేహితుడిగానే కాకుండా ఒక గైడ్ గా నాకు సహకరించిన మాస్టారు మా కవిగారూ అని! మరి మీ సహకారం ఇప్పుడు కొంచెం కావాలి మాస్టారూ.. ఈసారి మాఇద్దరికీ!!...
..... నాకు అది కావాలి, ఇది కావాలి అని ప్రత్యేకంగా దేవుడికి మొక్కుకున్న సందర్భం లేదు. లేని దాని గురించెప్పుడూ ఆలోచించకుండా అవసరంలో ఉన్నవాళ్ళకి నాకు వీలైనంత సాయం చేయడమే నాకు తెల్సిన పూజైనా, పునస్కారమైనా. కానీ ఈరోజు కార్తీక బాధని చూస్తూ నిస్సహాయంగా నిల్చోవడం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాను....."
నవంబర్ పార్ట్ - పూర్తిగా...
".... ఈ ఆనందం మనసుని చేరి పారవశ్యంగా మారేలోపే మళ్ళీ సన్నగా నొప్పి మొదలవుతుంది.. హర్షని పట్టుకున్న చేతివేళ్ళ బిగువు సడలిపోతుంది.. కళ్ళు బాధతో అరమూతలవుతుంటాయి.. అంతలో "నొప్పిగా ఉందా?" అంటూ తల మీద అతి మృదువుగా వికాస్ నిమురుతుంటారు.. నా కంటినీళ్ళని తుడుస్తూ తన కళ్ళు చెమరుస్తున్న సంగతే తలంపుకి రాదు.. ఇంతకన్నా నరకం కూడదనిపిస్తుంది.. ఒక అందమైన బంధాన్ని పరిచయం చేస్తూ జీవితంలో మలిపొద్దు మొన్ననేగా మొదలైంది.. ఎన్నెన్ని కొత్త ఆశయాలు.. ఆలోచనలు.. చేతనైనంతగా అసహాయులకి కొత్తదారి చూపించాలనే తాపత్రయం.. బోల్డన్ని కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటుండగానే ఇలా మంచానికి అతుక్కుపోవడంతో అప్పుడే ఆఖరిపొద్దు వచ్చేసిందా అనే ఆందోళనొకటి మనసుని పట్టి ఊపేస్తోంది....."
డిసెంబర్ పార్ట్ - పూర్తిగా...
Subscribe to:
Post Comments (Atom)
39 comments:
ఏంటి నాదేనా మొదటి కామ్మెంట్? అంతా ఏమయ్యిపోయారు? :O
సర్లే.. అందమైన కమ్మెంట్లుంటాయని ఆశగా వచ్చా. నేనేదైనా చెప్పాలి ఈ రచన గురించి అంటే.. ఈ కమ్మెంటు డబ్బా సరిపోదు. హమ్మ్..
Beauty of a relation lies in the beauty of hearts involved in the it అన్న నా నమ్మకాన్ని బలపరిచినందుకు ఏదో ఆనందం. :-)
కార్తీక,వంశీ ల స్నేహాన్ని అందంగా అక్షర రూపంలో శాశ్వతం చేసిన మీ ప్రయత్నం అభినందనీయం! మీ సాహిత్య గురువు గారి సలహానూ బాగుంది.
వంశీ గారికి హర్ష ఎప్పటికయినా కలిస్తే ఎలా ఉంటుందా అనే అలోచనలో ఉన్నా ప్రస్తుతం...కలిశాక sequel రాయండి :)
నిషిగంధ గారు కధ పూర్తీ అయ్యాక నా ప్రశ్నలకి సమాధానం ఇస్తా అన్నారు ఇంతకూ ముందు.అల గే కొన్నింటికి దొరికాయి,ఫోన్ లో కూడా ఎందుకు మాట్లాడుకోలేదు , ఎందుకు కలిసే ప్రయత్నం చెయ్యలేదు అంటే kiranprabha గారు మొదటి దానికి సమాధానం చెప్పారు గాని రెండో దానికి ఇద్దమిద్దాం గా తనకే తెలిదన్నారు. ఇక కధ ముగింపు వుహించిందే కాబట్టి(బహుశా నా టపా లోనే మొదటి సారిగా కొంపతీసి వెన్నెల్లో ఆడపిల్లని చేసేస్తారా కార్తికని అనడం ద్వార )ఆశ్చర్యానికి లోనుకాలేదు గాని, ఎంతొ నిబ్బరం గా ,వున్నతం గా వుండే కార్తిక ,వంశి ని చూడకుండానే ఆత్మహత్య చేసుకోవడం ఆమె క్యారెక్టర్ కే అవమానం. జబ్బు వల్ల చనిపోయినట్టు గా ముగిస్తే ఆమె క్యారెక్టర్ ఆసాంతం ఆదర్శ ప్రాయం గా వుండేది.ఆత్మా హత్య కి పాల్పడడం వల్ల మసక బారింది.అలాగే వంశి కూడా చని పోయే లోపు తనని ఎలాగన్నా చూడాలన్న ద్రుడసంకల్పం లేనట్టుగా కనిపించింది,బహుశా కిరణ్ గారి మిద అప్పట్లో సంచలం రేపిన వెన్నెల్లో ఆడపిల్ల నవల ప్రభావం అంతర్లినం గా ప్రభావితం చుపిందేమో వేళ్ళ నియకుండా తను ఎలాగు చనిపోబోతోన్డి కదా తను ఉహించుకున్న కార్తికని తన మదిలో అలాగే నిక్షిప్తం అయి పోనీ అని.లేకపోతె కనీసం ఆమె అంతిమ సంస్కరానికన్న వెళ్లి వుండాలి గా?కధ పూర్తవగానే నా మదిలో మెలిగిన పాట నీ స్నేహం ఇక రాదు అని మనసంతా నువ్వే .ఈ కధ కి కన్న తల్లి కిరణ్ అయితే ప్రసవ వేదన అనుభవించిన తల్లి మీరే అందుకోండి అభినందనలు.
నిషిగంధ గారు మీరు చెప్పినది నిజమే కేవలం ముగింపు వలన పుస్తకాన్ని అంతటినీ దూషించలేం నవల అంతా పరచుకొన్న వ్యక్తిత్వాలని, స్నేహాన్నీ, సంఘటనలు అందించిన inspiration నీ మర్చిపోలేం. కానీ ముగింపు వదిలే impression కి ఘాడతా మరియూ longevity ఎక్కువ. కధ అంతా మంచి విషయాలు ఉన్నా ఇంకా కధలోనే లీనమై ముందుకు వెళుతుండటం వలన తాత్కాలికం గా మరుగున పడుతూ ఉంటాయి. కానీ ముగింపు తర్వాత ఆగిపోతాం కదా దాంతో Last in first out పద్దతిలో చివరి అభిప్రాయమే నిలచిపోతుంది. అలా కాకుండా ఓ నిముషం ఆలోచిస్తే మధ్యలో సంఘటనలు వదిలిన శాశ్వత ముద్రలు పైకి కనిపిస్తాయి.
ఒక చక్కని స్నేహ భంధాన్ని మీరు అందంగా అక్షర బద్దం చేసి శాశ్వతం చేసారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కార్తీక ఆత్మ హత్య నిర్ణయం తీసుకోడం చాలా బాధ అనిపించింది. ఒక వైపు అటువంటి వ్యక్తిత్వమున్న అమ్మాయి ఆ నిర్ణయం తీసుకుంది అంటే ఆ నొప్పి తనని ఎంత గా బాదించి ఉంటుందో అని అనిపించినా... తనది Terminal illness అని తెలియకుండా కేవలం నొప్పి భరించ లేక అటువంటి నిర్ణయం తీసుకుంది అంటే నమ్మలేనట్లు గా ఉంది కానీ ఇది యదార్ధమన్నారు కనుక Truth is stranger than fiction అని మరో మారు అనుకోడం తప్ప ఏమీ చేయలేకున్నాను.
ఏదేమైనా వంశీ రాధిక కార్తీక వికాస్ లు నాకు నిజ జీవితం లో నిజం గా పరిచయమైన స్నేహితులలా ఎప్పటికీ గుర్తుండి పోతారు అనడం లో ఏమాత్రం సందేహం లేదు. అంత చక్కగా రాసారు సీరియల్. మీ next subject ఏంటా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాను.
అన్నట్లు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇంత మంచి స్నేహాన్ని మీ ద్వారా మా అందరితో పంచుకున్న కిరణ్ ప్రభ గారికి, కాంతి కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
మళ్ళి మొదటి నుండి అన్ని భాగాలు చదివా.. ఏ సీరియల్ అయినా, నవల్ అయిన అలా ఒక్కసారిగా చదవటం నాకు ఇష్టం. మరీ ఇటువంటి అందమైన వి , అణువణువూ భావుకతతో నిండినవి అంటే మరీ ఇష్టం. ముగింపు బాధ అనిపించినా యదార్థం కాబట్టి ముందే ఊహించబట్టి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. మొత్తానికి చాలా రోజుల తరువాత ఒక మంచి నవల చదివే అవకాశం కల్పించావు.. స్వచ్చమైన స్నేహాని హృద్యంగా మలచి దానిని అందమైన కవితలతో అలంకరించి మమ్ములని అలరించావు.
ఇంకా కిరణ్ గారికి, కౌముది పత్రిక వారికి, ఇంత మంచి నవల ని అందించినందుకు ధన్యవాదాలు.
నేను చెప్పడం మొదలుపెడితే, పైన అందరు చెప్పిందే మళ్ళీ చెప్పాలి.. కాబట్టి, ఏమీ చెప్పడం లేదు..
అయితే, ఒక చిన్న మాట.. ఈ సీరియల్ కోసమే నేను ఒకటో తారీఖు గురించి ఎదురు చూస్తూ ఉంటా.....
చెప్పడం మరిచా.. ఇంత మంచి కధ వ్రాసినందుకు మీకు, దాన్ని మాకు అందించినందుకు కౌముది పత్రిక వారికి నెనర్లు..
పూర్ణిమ, తెరెసక్క, రవిగారు, వేణు గారు, నిరంజన్, మేధ గారు.... thank you all for your nice comments and feedback!
పూర్ణీ, విడివిడిగా ఎంత మంచి వ్యక్తులైనా కొన్ని రిలేషన్ షిప్స్ లో బంధింపబడగానే కొంతమంది స్వభావాలు మార్చేస్తారు కదా!! Thanks for reminding me a nice quote!
మొన్న పంపిన నీ అక్షరాలు నన్నింక వదలడంలేదు.. :-)
తెరెసక్కా, నీ సీక్వెల్ ఐడియా భలే ఉంది :-) నిజంగానే వికాస్, హర్షలు మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తే ఎంత బావుంటుందో!
రవిగారు, nice to see you here again! మీ కామెంట్ కాస్త ఆలోచింపచేసేదిగా ఉంది..
వంశీని కలుసుకోవడం కార్తీక జీవితధ్యేయం కాదు.. తనకేదో అయిపోతోందని, ప్రియ మిత్రుడిని కనీసం ఒక్కసారైనా చూడాలనే ఆశాభావంతో పదే పదే అడుగుతుంది.. ఆ కోరిక తీరకుండానే తను ఆత్మహత్య చేసుకున్నందువల్ల ఆ పాత్ర ఆదర్శవంతంగా ప్రవర్తించలేదనడం సరి కాదేమో!! నిజమే, మీరన్నట్లు తను వ్యాధితో పోరాడి పోరాడి చనిపోవాల్సింది.. కానీ, నాకనిపిస్తుంది.. తను ఆత్మహత్య చేసుకుంది కేవలం నొప్పి భరించలేకే కాదేమో అని! may be తను ఎక్కువ కాలం బ్రతకననే నిజం తనకి తెలిసిపోయి ఉండొచ్చు.. మరణం తప్పని తనకోసం వికాస్ పడుతున్న శ్రమని చూసి తట్టుకోలేకపోయి ఉండొచ్చు.. చికిత్స మొదట్లోనే ఆర్ధిక పరిస్థితి గురించి చింత పడుతుంది.. అందుకే తన జీవితకాలాన్ని తనే తగ్గించేసుకుందేమో.. కానీ కాన్సర్ పేషంట్లు పడే శారీరక బాధని తక్కువ అంచనా వేయలేము!!! అందులో ఇప్పుడున్నంత మెడికల్ కేర్ అప్పట్లో లేదు.. సో, నేను అందులోనే రాసినట్టూ బలహీన క్షణాలు ఒక్కసారిగా చుట్టుముడితే తప్ప తను ఆ పని చేసి ఉండదు..ఇవన్నీ నా ఆలోచనలు..
ఇక వంశీ విషయానికొస్తే, కలవాలి అన్న కోరిక ఉన్నా ఫ్యామిలీ, కెరీర్ లలో మునకలు వేస్తూ ఎప్పటికప్పుడు వాయిదావేస్తూ వచ్చారు తప్ప ఏ నవల ప్రభావం వల్ల కాదు.. ఇది మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.. మీరే ఊహించండి ఇద్దరు చిన్నపిల్లలు, అప్పుడప్పుడే ఊపందుకుంటున్న ఉద్యోగ బాధ్యతలు... వీటిలో పడి సమయమే తెలీదు.. అందులోనూ వాళ్ళిద్దరి మధ్యా ఉన్నది అమలిన స్నేహం.. వెన్నెల్లో ఆడపిల్ల లా టీజింగ్ లవ్ స్టోరీ కాదు.. అలాంటప్పుడు వీలైనంత తొందరగా కలవాలనే ఆత్రుత కలగదు.. సరైన సమయం కోసం చూస్తూ వాయిదా వేస్తూ వచ్చారు.. కార్తీకని వైజాగ్ తీసుకొచ్చాక మాత్రం నిజంగానే ప్రయత్నించారు.. కానీ దురదృష్టవశాత్తూ వాళ్ళ బాబుకి దెబ్బ తగలడం వల్ల కుదరలేదు.. మళ్ళీ వెంటనే వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ it was too late!!
అదన్నమాట సంగతి :-)
వేణూ గారు, ముగింపు గురించి మీరు చెప్పింది చాలా బావుంది.. మరో చరిత్ర, వసంతకోకిల లాంటి సినిమాలని తలచుకున్నప్పుడల్లా ముగింపే సన్నని ముల్లు లా గుచ్చుతుంటుంది!!
నాక్కూడా కార్తీక ఆత్మహత్య ఇంకా మింగుడుపడని విషయం! నాలాగానే ఎవరూ దీని గురించి ఊహించలేదు! కానీ పైన రవిగారికి చెప్పినట్లు, తను కేవలం నొప్పి వలనే అలా చేసుంటుంది అనిపించడం లేదు!
ఇద్దరు మనుషుల మధ్య స్నేహం వారి కుటుంబాలకూ విస్తరించిందంటే ఆ గొప్పదనం మిగతా ఇద్దరిదీనూ! అందుకే మీరు అన్నట్లు రాధిక, వికాస్ లు కూడా చెరగని ముద్ర వేశారు!!
నా నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రస్తుతానికి బ్లాంక్! :-)
నిరంజన్, నేను కూడా ఒకసారి మొదటినించీ చదవాలి.. మొదలు పెట్టాక అసలు వెనక్కి తిరిగి చూడలేదు :-)
మేధ గారు, 'ఒకటో తారీఖు కోసం ఎదురుచూస్తుంటా' అనడంతోనే బోల్డంత చెప్పేశారు.. థాంక్యూ :-)
చివరగా....
అమూల్యమైన అభిప్రాయాలు చెప్పినందుకు కిరణ్ ప్రభ గారు, కాంతి కిరణ్ గారు 'కౌముది ' తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయమన్నారు..
నిషిగంధ గారు నచ్చిన వాళ్ళు ఏంచెప్పినా మెచ్చుకోవాలనే వుంటుంది.మీరు చెప్పిన దాంతో నేను పూర్తీ గా ఏకీభవిస్తూ భారంగా నిట్టుర్చా,బతుకు సమరం లో పడిన బాటసారి తన మనసులో ఉన్న ప్రాధమ్యాల కన్నా ,జీవితం లో ముడిపడిన ప్రాధమ్యాల కే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వంశి కార్తికని ఎప్పటికి కలుసుకోలేక పోయాడని సరి పెట్టుకోవచ్చు.నాదో చిన్న వినపం ఇన్నాళ్ళు ప్రతి నెల ఉత్తర రూపం లో పలకరిస్తూ కార్తిక మా అందరి ఆప్తు రాలు ఐ పోయింది కనక kiranprabha గారి దగ్గర ఆమె ఫోటో వుంటే వారి అనుమతి తో మీ బ్లాగ్ లో పెడితే కనీసం నిజ జీవితం లో చూడలేక పోయినా అంతరంగాల్లో పదిలంగా భద్ర పరుచుకోడానికి ఒక రూపం మెదిలింది అనుకోడానికి ఆస్ఖారమిస్తారని ఆశిస్తూ......
నవల రాయడం అంటే సామాన్యమైన పని కాదు. ఐడియా అందుబాటులో ఉన్నా, ప్రేరణ కూడా ఉన్నా, బద్ధకాన్ని అధిగమించి కథని అక్షరబద్ధం చెయ్యడం ఆషామాషీ పని కాదు. నా కంప్యూటర్లో వేర్వేరు స్థ్తితుల్లో అసంపూర్తిగా ఉన్న డజను పైన కథలే దానికి సాక్షి. పాఠక జన మనోరంజకంగా ఈ నవలని పూర్తి చేసినందుకు అనేక అభినందనలు.
ఇటువంటి కథల్తో ఒక ఇబ్బంది ఉంది. ఇది కథ కాదు జీవితం. జీవితంలో కొన్ని కొన్ని ఎందుకు జరుగుతాయో చెప్పలేం. మామూలుగా ఒక కథనో పాత్రనో విశ్లేషిస్తున్నప్పుడు అప్పటిదాకా రచయిత ద్వారా మనకి పరిచయం చెయ్యబడిన పాత్ర లక్షణాల ద్వారానే మనం ఆ పాత్రని చూస్తాం. కార్తీకని కూడా అలాగే చూస్తున్నాం. అందుకే కార్తీక అటువంటి పని ఎలా చేసిందో మన ఊహకి అందదు. ఛ, ఇలాంటి పని చేసిందేంటి అనుకుంటాం, రచయితని నిష్ఠూరమాడుతాం. కానీ కార్తీక అనే వ్యక్తి నిజాయితీని మనం నమ్మం. కార్తీక ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని అమలు పరిచింది అంటే, తెలివైన, పట్టుదల కలిగిన అమ్మాయి కాబట్టి ఆమె నిర్ణయం సమంజసమైనదే అయ్యుంటుంది అనే సూక్ష్మం మాత్రం మనకి తట్టదు.
ఇంకో మాట. కార్తీక వంశీ కలుసుకుని ఉంటే ఈ కథే ఉండేది కాదు.
అవును నిషిగంధ గారు సరిగ్గా అందుకే నేను నలుగురి పేర్లు చెప్పాను రాధిక వికాస్ ల పాత్ర విస్మరించలేం, ఇక కార్తీక విషయానికి వస్తే మీరు చెప్పిన కారణాలు అన్నీ ఆమెని ఆ నిర్ణయం వైపు నడిపించి ఉండచ్చు నిజమే.
కొత్తపాళీ గారు, నిజాయితీని నమ్మక పోడం కాదండీ... ఎంత తెలివైన పట్టుదల గల అమ్మాయి అయినా ఒక బలహీనమైన క్షణం లో తడబడ వచ్చు కదా, అందుకని తన మీద మనకెంత నమ్మకమున్నా తను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సబబే అయి ఉంటుంది అని సమర్ధించలేము, అదీ ఇటువంటి నిర్ణయం విషయం లో అయితే మరీ కష్టం. మన ప్రతినిర్ణయానికి తలాడించే స్నేహం కన్నా, సద్విమర్శలు చేసే స్నేహమే సరైనది, కాదంటారా... కార్తిక పాత్రతో అలాంటి స్నేహం చేయడం వల్లే చాలా మందికి ఇలా అనిపించి ఉంటుంది అని నా అభిప్రాయం. అలాగే మీ చివరి లైన్ లో చెప్పిన విషయం, వారిద్దరూ కలుసుకోడం వల్ల కధకు వచ్చే నష్టం ఏవిటో నా మట్టి బుర్రకి అర్ధం కాలేదు :-)
Nenu chaduvukune rojullo oosulade oka jabilata ane dubbing song modatisari vinagane aa line thega nacchesindi.Idi mee novel title ga choodagane oka manchi feeling...meeru raasinde Chaala baagundi..Bhesh Bhesh...1st thareeku kosam inthala yeppudu wait cheyyaledu...appude ayipovadam baadha..Malli thondaraga rayandee...
Padma
నిషీ, చివరి భాగం చదివాక ఒక్కసారి మనసంతా శూన్యం అయిపోయింది. జరిగిన కథే అయినా దాన్ని మీరు అక్షరబద్దం చేసిన తీరు ఆ కథని పాఠకుల మనస్సులోకి తీసుకువెళ్లింది. చదవటం అవగానే చ కార్తీక ఇంత భేలగా చేసిందేంటి అనిపించింది, కానీ ఆలోచిస్తే తను చేసిన దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అనిపించింది. శారీరక బాధ, ఆర్థిక సమస్యలు, వికాస్ పడే ఆరాటం, తన జబ్బు ఏంటో తెలియకపోయినా అది తగ్గేది కాదన్న నిజం...అన్నీ కలిసి తనని ఆ పనికి ప్రేరేపించి ఉంటాయి. ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి..వంశీ ని కలిసినాక ఆ పని చేసి ఉంటే ఓ తృప్తితో పోయి ఉండేది కదా అనిపించింది.
కొత్తపాళీ గారు, కార్తీక వంశీ కలుసుకుని ఉంటే ఈ కథే ఉండేది కాదు---నాకు అర్థం కాలేదు
truly marvellous story, hats off maam
మొదటిగా కథ ఎండింగ్ నాకు బాగా నచ్చింది. తరువాత, సినిమాలలో కనిపించే మెలోడ్రామా లేదు. ఆసక్తిగా, చక్కటి కవితలతో, ఇంకా చక్కటి కథనంతో సాగింది. కేవలం ఉత్తరాలతోనే సాగిన కథనం గురించి తలుచుకుంటేనే, అసలు ఇలా కూడా వ్రాయొచ్చా అన్న ఆశ్చర్యం కలిగింది.
కాని ఒక్కటే నిరాశ, చివర కాస్త త్వరత్వరగా నడిచినట్టనిపించింది. కాని ఇది అయిపోయిందే అన్న బాదిదాన్ని మింగేసిందనుకుంటాను
అబ్బ, నిషీ, మీరెంత కౄరులో! ఇంత నిర్దయగా ఉండాల్సిందేనా? ఇలాంటిదేదొ జరుగుతుందని ఊహిస్తూనే ఉన్నా, "ఏం జరక్కపోతే, ఇలాగే జరగాలా ఏంటి" అనుకుంటూ చివరి భాగాల కోసం చూస్తుంటే నిజంగానే ఇలా చేసేశారు. ఇహ ఏం చెప్పాలో తెలీట్లేదు. ఒక పక్క కార్తీక మీద జాలిగానూ,మీ మీద కోపంగానూ ఉంది. అందమైన స్నేహాన్ని అంతకంటే రమణీయంగా మలచి, చివరికి ముంగిట్లో వెలిగిన కార్తీక దీపాన్ని "ఉఫ్" మని ఊదేసినట్లు చేసారు. కానీ అంతకంటే ఏం చేస్తారు మరి, యదార్థ కథ అని ముందే చెప్పారుగా! ఇప్పుడేమీ రాయలేను. మళ్ళీ తీరిగ్గా రాయాలి.
అసలు నేను ఇప్పుడు ప్రపంచ నిషిగంధ అభిమాన సంఘం అధ్యక్షుడి పదవి నుండి వైదొలగిపోవాలని నిర్ణయించుకున్నాను... లేకపోతే ఏంటండీ? మా కార్తీక ని అలా చంపేసారు?!! మీదేమీ పోయింది చివరి లైన్లో అయినా బతకనిస్తే... ఎలానో కార్తీక కష్టాలు చూసి చూసి మేమూ కష్టపడుతూ ఏదో మహిమ జరుగుతుంది చివరలో బతికేస్తుంది అనుకుని చివరి దాకా చదివితే, మీ ఇష్టమొచ్చినట్టు మాతో ఆడుకున్నారు... అబ్బా! ఇప్పుడైమంది అనకండి... ఇప్పుడు కార్తీకని అలా పంపించకపోతే మీ రాతలని మేము చదవకుండా పోతామా?
మీరు ముందు ముందు రాసుకునే వాటిల్లో కార్తిక లాంటి వ్యక్తిత్వాలని పెట్టకండి.. ఎక్కడ అంతమైపోతుందో అని చదవలేక మేము చావాలి... అంతగా కావాలనుకుంటే హీరోలని చంపెయ్యండి... కార్తీక లాంటి హీరోయిన్ని చంపకండి...
కొత్తపాళీ గారు, కార్తీక వంశీ కలుసుకుని ఉంటే ఈ కథే ఉండేది కాదు---నాకు అర్థం కాలేదు! :-(
నిషీ: అది స్వభావాలని మార్చేయటం కాదు, మనకి తెలియని మనల్ని పరిచయం చేయటమే!చాలా సందర్భాల్లో, చాలా మందితో మనం ఎలా ఉంటామన్న దాన్ని బట్టి typecast చేయబడతాం. That doesn't mean we are limited only to it. It's just the chord tuned by these special people, that is already there and we never bothered. కాదంటావా?
సుజాత గారు: చివరికి ఏమైనా, they have tread one of the most beautiful paths of friendship and trust! Didn't they?
(మీ ఆవేదనని పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆ బాధ నాది కూడా! :-) )
మీ మీద ఇంకా నాకు కోపం తగ్గలేదు నిషీ.ఇలాంటిదేదో చేస్తారని భయమేసి ఆర్కూట్ లో మెస్సేజ్ కూడా ఇచ్చాను.చిరునవ్వు నవ్వి వూరుకున్నారు.నిజం కధ అయితేనేమిటి?వంశీ,వికాస్ అనుభవిస్తున్న బాధ చాలదా?మాకు కొత్త నేస్తాన్ని ఇచ్చి అలా ఎలా దూరం చేస్తావు?కార్తీక రూపాన్ని మా ఊహాకి వదిలేసి మేము గీసుకున్న గీతలని చెరిపేస్తావా?ఇక్కడ నిన్ను నిందించాలని కాదు నిషీ.ఆ దేవుడిని ఏమీ అనలేక....
అందరి కామెంట్స్ చదువుతుంటే ఆ భగవంతుడి బాధ అర్ధమౌతుంది! ఏదైనా అనుకోని విషాద సంఘటన జరిగినప్పుడు అందరూ ఆయన్నే నిందిస్తారు.. తన చేతుల్లో లేనిదానికి తనని బాధ్యుడిని చేస్తుంటే పాపం ఆయనెంత ఫీల్ అవుతుంటాడో!!!
అబ్బెబ్బే, నన్ను దేవుడితో పోల్చుకోవడంలేదు.. అస్సలంటే అస్సలు లేదు.. జస్ట్ పోలిక చెప్తున్నా :)))
btw, రవిగారు కార్తీక ఫోటో బ్లాగ్ లో పెట్టమని రిక్వెస్ట్ చేశారు.. ఫోటో గీటో జాన్‌తా నై కానీ ఒక రెండు ఉత్తరాలు మాత్రం ఇస్తామని కౌముది పెద్దలు చెప్పారు.. ఈ వీకెండ్ అవి స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తాను..
మిగిలిన కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం కోసం మళ్ళీ వస్తాను..
వేణూశ్రీకాంత్ .. మీరు చెప్పింది సమంజసంగానే ఉంది.
కథ ఉండదు అని నేను రాసిన వాక్యం అర్థం కాలేదన్న అందరికీ .. దేవదాసు పార్వతి పెళ్ళి చేసుకుని ఉంటే దేవదాసు నవల ఉండేదా?
నిషి,,
నేను నీ కథ చదవలేదు కాని ఇక్కడ కామెంట్స్ చదివాక నేను నా అభిప్రాయం చెప్పకుండా ఉండలేకున్నాను.
ఏదైనా మంచి కథ, సినిమా, టివి సీరియల్ చూస్తున్నా, చదువుతున్నా అందులో ఎంత లీనమైపోతారంటే, కళ్లముందు రోజు జరుగుతుంది అని. అందుకే ప్రతి కధ సుఖాంతమవ్వాలి. నాయికా నాయికలు కలవాలి అని అనుకుంటారు. కాని ప్రతి కథ మనం కోరుకున్నట్టుగా ఎలా ఉంటుంది.
కొత్తపాళీగారు అన్నట్టు.. కథలో నాయికానాయికల విరహంలోనే మహాకావ్యాలు, సినిమాలు వచ్చాయి.. దేవదాసు కాక.. లైలామజ్నూ..
హ్మ్మ్మ్. ఏమని రాయను? ముగింపు ఊహించిందే అయినా చదువుతున్న కొద్దీ చాలా బాధ కలిగింది. ఆరునెలలుగానే తెలిసిన కార్తీక నాకు కూడా చాలా ఆప్తురాలు అయిపోయింది. ఈ ముగింపు ఊహించిందే అయినా నీ మీద పిచ్చి కోపం వచ్చింది అనుకున్నట్టే చేశావని. కానీ ఇది యదార్ధ సంఘటన అని తెలిసాక, ఆ రెండు పాత్రలూ నువ్వు సృష్టించినవి కావనీ, వారిద్దరి జీవితాలు నీ అధీనంలో లేవనీ తెలిసాక చాలా బాధ కలిగింది. అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలని కళ్ళకి కట్టినట్టు రాసి ఆ పాత్రలని ఇంతమందికి ఆత్మీయులని చేసిన నీకు నిజంగా హాట్సాఫ్ చెయ్యాలి.
కార్తీక ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, ఎలా చేసుకుంది అన్న ప్రశ్నకి అర్థం లేదు. సినిమాలలో ఉన్నట్టు నిజజీవితాల్లో లాజిక్కులకి స్థానం ఉండదు. ఆత్మహత్య చేసుకున్నందువల్ల కార్తీక వ్యక్తిత్వానికి లోటు కలిగిందని అనుకోను. తన జీవితానికి ముగింపు తెలిసినప్పుడు, ఆ ముగింపుని మార్చే అవకాశం తనకేమాత్రం లేనప్పుడు, తనకిష్టమైన వారి గురించి ఆలోచించి, తన గురించి తపన పడేవారికి తను ఇంకా భారం కాకూడదని తీసుకున్న నిర్ణయం ఒకరకంగా అభినందనీయమేనేమో.
కానీ ఇంక ఏ ఒకటో తారీఖుకి కార్తీక నించి ఉత్తరం రాదనుకుంటుంటే చాలా బాధ కలుగుతోంది. చందమామ అల్లంత దూరాన ఉండి అందకుండా కబుర్లు చెప్తుంది. చల్లటి వెన్నెలతో ఆహ్లాదపరుస్తుంది. నీ కార్తీక కూడా అటువంటిదే. కనిపించకుండా ఎక్కడో ఉండి ఇన్నిరోజులు ఎన్నెన్నో ఊసులాడిన ఒక జాబిలి, నీ కార్తీక. ఇంక ఆ ఊసులు దూరమైనా తను కురిపించిన వెన్నెల ఎప్పుడూ అందరినీ అంటిపెట్టుకునే ఉంటుంది.
నెనరులు కొత్తపాళీ గారు, పద్మ గారు, సిరిసిరిమువ్వ గారు, దైవానిక గారు, సుజాత, దీపు, రాధిక, జ్యోతి గారు, పద్దు :-)
కొపాగారు, మీరు చెప్పింది నిజమండి.. బేసిక్ స్కిల్ ఉంటే చాలు, పుంఖానుపుంఖాలుగా రాశేయొచ్చు అనుకునేదాన్ని.. కానీ మీరన్నట్లు సమయం, ఐడియా అన్నీ ఉన్నా చాలాసార్లు రెండులైన్ల కంటే ఎక్కువ రాయలేను! మీ అరకొర కధలు కనీసం కంప్యూటర్ వరకైనా వచ్చాయి.. నావన్నీ మైండ్ లోనే ఉన్నాయి :-))
పద్మగారూ, అవునండి ఈ నవల టైటిల్ 'హృదయం' అనే డబ్బింగ్ సినిమాలోని పాట నించి తీసుకున్నదే! టైటిల్ గా సెలెక్ట్ చేసుకున్నానంటే నాక్కూడా ఈపాటంటే తెగ ఇష్టం అని చెప్పక్కర్లేదు :-)
సిరిసిరిమువ్వ గారు, నాదీ సేమ్ ఫీలింగ్ అండీ.. తన జీవితం అనుకోనిరీతిలో ముగిసినా at least వంశీని, ఇంకా అమ్మమ్మ తాతయ్యలను కూడా ఒకసారి కలుసుకుని వుంటే బావుండేదనిపించింది.
దైవానిక గారు, నేను ఇది రాయడం మొదలుపెట్టినప్పుడు నన్ను ఎక్కువగా భయపెట్టిన అంశం ఉత్తరాలతోనే కధ మొత్తం నడిపించడమన్నది! నేను కొన్ని కధలు ఇలా ఉత్తరాలతోనే సాగినవి చదివాను కానీ మొత్తం నవలంతా అంటే కాస్త తటపటాయించాను.. ఈవిషయంలో కిరణ్ ప్రభ గారు ఒక సలహా ఇచ్చారు.. జస్ట్ అలా ఫ్లోలో రాసుకెళ్ళిపోకుండా ప్లానింగ్ చేసుకోమన్నారు.. అలానే ప్రతి నెలకి ఎన్ని ఉత్తరాలు, అందులో ప్రస్తావించాల్సిన అంశాలు - ఇవి ముందే రాసి పెట్టుకోవడం వలన చాలా సులువనిపించింది.. Thanks again for your feedback!
సుజాత, దీపు, రాధిక - మీ ఆవేదనాగ్రహాల సెగలు ఇక్కడ నడి శీతాకాలాన్ని మండుటెండగా మార్చేశాయి.. ఇప్పుడర్జంటుగా 'కార్తీకనైనా కాకపోతిని మీ ఆదరము పొందగా' అని పాడుకోవాలనిపిస్తుంది :(
పూర్ణీ, నిజమే! చాలా సందర్భాలలో మనకి నచ్చిన, మనసు ఆమోదించిన వ్యక్తులతోనే కాలం గడుపుతాం.. అందుకే మెదడులో దాగిఉన్న ఈ విరుద్ధ స్వభావాల గురించి సమయం వచ్చేవరకూ మనకు తెలీదు!
జ్యోతి గారు, మీరన్నది నిజమే! సుఖాంతాలన్నీ మంచి కధలు కాలేవు.. అలానే కొన్ని దుఃఖాంతాలు మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి!
పద్దూ, అల్లెప్పుడో నువ్వు రాసిన కామెంట్ కి జస్ట్ స్మైల్ ఇచ్చి ఊరుకుంది ఇందుకే! కధాగమనాన్ని నిర్దేశించగలగడమేకానీ గమ్యం ఎంచుకునే పరిస్థితి నాదికాదని! ఈపాత్ర ఇంతమందికి దగ్గర కాగలిగిందీ అంటే కారణం ఆ పాత్ర యొక్క వ్యక్తిత్వం! నేను చేసిందేమీ లేదు. నువ్వు చెప్పినట్టు ఆత్మహత్య చేసుకోవడం వలన ఆ వ్యక్తిత్వం ఏమాత్రం తగ్గదు!
ఇక,
కొత్తపాళీ గారు చెప్పిన పాయింట్ గురించి - కార్తీక వంశీలు కలుసుకున్నా కలుసుకోకపోయినా కార్తీక బ్రతికి ఉంటే మాత్రం ఈ కధ ఉండేది కాదు అని నాకనిపిస్తుంది.. ఉండేది కాదు అంటే నా ఉద్దేశ్యం ఆప్తస్నేహితురాలితో తన పరిచయాన్ని కధలా మలచాలనే ఆలోచన కిరణ్ ప్రభ గారికి కలిగిఉండేది కాదని. ఏమంటారు?
కార్తీక పోయిందని దిగులెందుకర్రా, అదేదో అన్నట్టు " ఎందరెందరో మహానుభావులు పోయారు, వారే సిరి మూటగట్టుకుని పోయిరి?". నిషి గారి కలం నుంచి ఏ మార్గశిరో , పుష్యమిలు ఉదయించక మానరు.
ముక్కుచీదడం ఆపి ఈరోజు వేపుడు ఏంచేస్తున్నారో/చేయాలో ఆలోచించుడీ, అటో ఇటో మనమూ పోయేవాళ్ళమే ! :)
చదివినప్పటి నుంచి కామెంటు రాద్దామని అనుకొంటూ ఉంటే, రాయడానికి మనస్సు, చేతులూ రెండూ సహకరించడంలేదు (చేతులు అని ఎందుకన్నానంటే పని వల్ల అస్సలు తీరికే దొరకడం లేదు) . ఒక గొప్ప వ్యక్తిత్వం గల అమ్మాయి అంత భారమైన నిర్ణయం తీసుకొంది అంటే నమ్మడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ జీవితంలో డ్రామా శాతం తక్కువేగా. ఒక అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే స్వచ్చమైన స్నేహాన్ని అంతకంటే స్వచ్చంగా ఉత్తరాల ద్వారా చూపించడం మీకే చెల్లింది.
ఇంత మంచి నవలని మాకు అందించినందుకు (ప్రత్యేకంగా మీకు) అందరికీ కృతజ్ఞతలు.
Anonymous గారు :))
నెనరులు ప్రతాప్ గారు.. Thanks so much for your continuous feedback!
Nishigandha gariki,
Nenu ee blogspot 2 days kritham choosa "Usulaade oka jabilata" peru nachi motham okaroje chadhivaa.chaala baagundhandi ee kadha.last letter after kaarthika's death vamsi raasina letter prathi line kalluthuduchukuntu chadhivaa.Eee antha nijanga jarigindhi ante aa manushulu andharni choodalanipinchindhi.kaarthika character chaala baagundhandi.naku ela cheppalo thelitam ledhu super ga undhandi ee kadha.chaala baaga raasaaru.
Thank you Viswanath gaaru :-)
anni bhagalu oka roju lo chadivaanu.....i am speechless...
Nishigandha garu,
Mee blog chavadatam idhe modati sari, ivala office lo peddaga pani kooda lekapovadam tho, modalupetti varusaga ee dharavahika lo bhagalanni chadiva..
Entho adbhuthamga rasina mimmalni abhinandinchakunda undalekapothunna..
Mugimpu chadivaka office lo unnananna sangathi pattinchukokunda na kallu adhe pani ga varshinchayi.
Chala baga rasaru..
ఎనానిమస్ గారు, హరిత గారు నెనరులు..
Very sorry for the late reply!
HELLO
NISHIGSNDHA......"
'SHUBHODAYAM'
---;-<@
ABHIMAANI
9866889944
శుభొదయం.. బావున్నారా? :-)
hi....eppude me blog chustunna
hello nishigandha garu ippatiki ee navala 5 sarlu chadhivanandi okka aa chivara uttharam kosame eppudu chadhuvuthunna...ee navala cinema la theeyachukadhaandi...
మీ అభిమానానికి ధన్యవాదాలు విశ్వనాధ్ గారు.. you are asking a wrong person to make it as a movie! :-)
ఎప్పుడూ పుస్తకాల పురుగుగా ఉండే నేను ఈ మద్య వచ్చే చెత్త నవలలతో నవలలు చదవడం మానేసాను. ఆనుకోకుండా ఈరోజు కౌముది లొ గ్రథాలయం సెక్షన్లొ మీనవల చూసి యెలా ఉంటుందో చూద్దాం అని ప్రారంభించి ఆపకుండా మొత్తం చదివెసాను. చాలా రొజుల తర్వాత ఒక మంచి పుస్తకం చదివినందుకు చాల త్రుప్తిగా ఉంది. ఇంతమంచి పుస్తకం అందించినందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపొతున్నాను.
రమేష్
Hi nishigandha garu
Mee nunchi Next Navala eppudu expect cheyyachu...
Post a Comment