Pages

Friday, October 31, 2008

ఊసులాడే ఒక జాబిలట! (సెప్టెంబర్ & అక్టోబర్ 2008)


"....ఇక ఇంటి పనుల విషయాలకొస్తే రాధికని సంప్రదించొచ్చు.. 'భర్తని సాధించడం ఎలా?' అన్న విషయం తోపాటు ఇంకెన్నో అవసరమైనవి చెప్పగలదు నీకు. నాకు తెల్సు, దగ్గర ఉంటే గనక కత్తీ డాలూ తీసుకుని నా మీద యుద్ధానికి వచ్చేదానివని.. అయినా గానీ నీకు పెళ్ళైపోయిందని తల్చుకుంటే భలే గమ్మత్తుగా ఉంది తెలుసా! ఇక నించీ నువ్వు కూడా అందరి లాగా 'ఈపూటకి ఏం వండాలి.. వడియాలు పెట్టుకోవాలి.. బూజులు దులపాలీ అనుకుంటూ ప్రణాళికల మీద ప్రణాళికలు వేసుకుంటావేమో!....."


సెప్టెంబర్ పార్ట్ - పూర్తిగా...


".....చుట్టూ పచ్చదనం, ఎప్పుడు చూశినా ఇప్పుడే ఊడ్చి తుడిచారా అన్నట్లుండే రోడ్లు, ఆకాశ హర్మ్యాలు, ఆ పక్కనే జలపాతాలు అన్నీ కలిసి ఏదో అల్లావుద్దీన్ సృష్టించిన ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగిస్తాయి.. కానీ కార్తీకా, సాయంత్రం ఆరు దాటంగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా అనిపించేది.. అప్పటి వరకూ ఆడుకున్న పిల్లలంతా వెళ్ళిపోగానే మిగిలిన ఖాళీ పార్క్ లా నిస్తేజంగా అనిపించేది.. కారణం రాధికా వాళ్ళు నాతో లేకపోవడమే కాదు అప్పటి వరకూ ఎంతో క్లోజ్ గా పని చేశిన సహాధ్యాయులు ఐదవ్వగానే ఉన్నట్టుండి అపరిచితులుగా మారిపోతారు.. అక్కడ నించి వాళ్ళ జీవితంలో మనకేమాత్రం ప్రాముఖ్యం ఉండదు! పుట్టిన దగ్గర్నించీ మన చుట్టూ ఉన్నవారితో ఎటాచ్ మెంట్స్ పెంచుకుంటే పెరిగే మనలాంటి వారు ఈ డిటాచ్ మెంట్ కి అలవాటు పడటం కష్టమనిపిస్తుంది!....."

అక్టోబర్ పార్ట్ - పూర్తిగా...

17 comments:

ప్రతాప్ said...

ఇద్దరు పెళ్ళి చేసుకోవాలి అని నిర్ణయించుకోవడానికి ఎంత సమయం సరిపోతుంది? (వంశీ ఉత్తరంలో ఒక చోట కార్తీకని ఉద్దేశించి అంటాడు, ఇంత తొందరగా పెళ్ళి..) కొందరికి జీవితమే పట్టొచ్చు, కొందరికి ఒక నిముషమే పట్టొచ్చు. కానీ చాలా మందికి ఒక రోజుకన్నా తక్కువ సమయమే పడుతుంది. తర్వాత ఆలోచించడాలు, చింతించడాలు.. ఎందుకిలా? ఆ ఉత్తరం చదవగానే నాకు కలిగిన ప్రశ్నలివి..
పెళ్ళి అంటే అదోరకమైన అనుభూతిని ఎందుకు కలిగిస్తుంది? (కార్తీక రాత్రంతా నిద్దుర పోలేదు అని తెలిసినప్పుడు, నా కనుల ముందు, గొలుసుని రెండు పెదాల మధ్య ఇరికించుకొని నిద్దుర పట్టక అటు ఇటు దొర్లే ఒక అమ్మాయి కనిపించింది. కొంపదీసి నేను రాఘవేంద్రరావు సినిమా ప్రభావంలో ఉన్నానా?).
ఇలానే ఒక జంటకి (ఇద్దరు స్నేహితులే లెండి) పెళ్ళి చేసాము, పెద్దవాళ్ళకి వాళ్ళెక్కడున్నారో తెలియక మమ్మల్ని పోలీసులకి అప్పగించారు. ఇక చూడండి నా సామిరంగా. అస్సలు పోలీస్ స్టేషన్ అంటే ఇలా ఉంటుందా? అని నాకు ఒకటే ఆశ్చర్యం. థర్డ్ డిగ్రీ అంటే ఏమిటి? పైకి కనిపించకుండా దెబ్బలు కొట్టడం ఎలా? ఇలా చాలానే నేర్పించారు.
"అప్పుడప్పుడు" ఇదే పేరుతొ నేనో కవిత రాసినట్లు గుర్తు. కాకపొతే ఈ కవితలో వినిపించిన భావాలు, నా కవితలో నేను పలికించిన భావాలు వేర్వేరు. అదేమిటో మీ ఈ నవల చదువుతుంటే అదోరకమైన అనుభూతి మనస్సునులో చేరి ఎంత హాయినిన్స్తుందో. కోనేటిలో తామరాకు మీద నిలిచిన నీటిబొట్టులా ఎంత స్వచ్చంగా ఉందో ఈ నవల. (మరి కాపీరైట్స్ నాకిస్తారా?).
P.S: ఇంకా అక్టోబర్ భాగం చదవలేదు. సమయం చూసి చదివి మరలా టపాలాంటి కామెంటు రాస్తాను.

నిషిగంధ said...

నెనరులు ప్రతాప్ గారు..
ఇద్దరు వ్యక్తులు పెళ్ళి వరకూ ఎంత త్వరలో రావచ్చనేది వాళ్ళిద్దరిమధ్యా ఉండే మానసిక సామీప్యం మీద ఆధారపడుతుందనుకుంటున్నాను.. మీరన్నట్లు అది సంభవించదానికి ఎంత కాలమైనా పట్టొచ్చు.. నిజమే, 'ఇంత తక్కువ సమయంలో' ఎలా జరిగిందని వంశీ ఆశ్చర్యపడటానికి కారణం కార్తీకకి పెళ్ళిపెట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత తెలియడంవల్ల.

మీ సాహసకృత్యం గురించి వింటుంటే పవన్ కళ్యాణ్, రాం లాంటి హీరోలందరూ మీలో కలిసి ఉన్నట్లనిపిస్తోంది :-)
ఇంతకీ మీరు పెళ్ళి చేసిన జంట ఇప్పుడు క్షేమమే కదా!!

ప్రతాప్ said...

మరి నేనూ చెప్పుకోవచ్చా? ఒక పెద్ద ఫారిన్ కవయిత్రిగారు మా ఫ్రెండు అని? మీ నుంచి కవిత వచ్చి చాలా రోజులు అయింది. కథలోనే కవితలు కూడా రాసేస్తూ ఆ లోటు తెలియనివ్వకుండా చేసేస్తున్నారు. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా అని చెప్పడమే కాదు, ఆ సంఘటనలు కూడా అంతే సహజంగా ఉన్నాయి కూడా.

ఇక మేము చేసిన పెళ్లి గురించి అయితే, అదేదో అలా ఉడుకురక్తంలో చేసేసాం. ఇప్పుడు తలుచుకొంటే నిజంగా నేనేనా అన్న ఆశ్చర్యం నాక్కలుగుతుంది. ఆశ్చర్యం అని నేనెందుకన్నానంటే, ప్రేమకి-స్నేహానికి-ఆకర్షణకి ఉన్న సంభంధం కొద్దో గొప్పో తెలుసుకొన్నాను కాబట్టి.

ప్రేమపెళ్ళి విజయవంతమైన జంట ఏది అని నన్నెవరన్నా అడిగితే, టక్కున నా వేలు వాళ్ళిద్దరి వైపుకే పోతుంది (ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయే, నాకు చెల్లెలు అవుతుంది). మీరు నన్ను పొగుడుతున్నారో, తిడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. హీరోలకి నాకూ పోలిక ఎక్కడండీ?

yaji said...

నవటాకు అంటే తమల (లేత) ఆకు అని చిన్నప్పుడు మా ఇంట విన్నట్టు గుర్తు. I could be way off here. I thought I would answer you on your blog instead on kottapali gaari blog:-)

teresa said...

నవటాకు అంటే పావుశేరులో సగం అని ఎక్కడో చదివాను.

నిషిగంధ said...

థాంక్స్ ప్రతాప్ గారు.. కవితలు రాయాలంటే మనతో మనం గడిపే సమయం కాస్తన్నా ఉండాలి.. అదే కొరత! దొరికే కొంచెం టైం కూడా కార్తీక తీసేసుకుంటుంది :-)
ఖచ్చితంగా అది పొగడ్తేనండి.. మీరు మీ ఫ్రెండ్ పెళ్ళి చేయించటం చెప్పగానే వాళ్ళ సినిమాలు గుర్తొచ్చాయి! :-))

ధన్యవాదాలు యాజి గారు.. ఈసారికి తెరెసా గారు చెప్పిన మీనింగ్ కి ఓటేసాద్దాం :-)

అక్కా, సూపర్! థాంక్యూ.. నీలో విదుషీమణి లక్షణాలు చాలా ఉన్నాయి!! ;-)

ABHIMAANI said...

!...NISHI
asalu 'preema' antenti
aakhari reppa
vesevaraku aame vosthundani
nirikshinchadamena

'ABHIMAANI'

వేణూ శ్రీకాంత్ said...

నిషిగంధ గారు కామెంట్ ఏం రాయాలో అర్ధం కాక ఇన్ని రోజులు ఆగానండీ... వచ్చే సంచికలో ఏదైన అద్భుతం జరుగుతుందేమో అని... ఊహూ!!.. ఏమో కాదు ఖచ్చితం గా ఏదో అద్భుతం జరిగి కార్తీక కోలుకోవాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్నాను....

ఆనంద ధార said...

నిషిగంధ గారు ..బాగా రాస్తున్నారు ....పైగా మీరు మీ బ్లాగు ను అలంకరించిన తీరు ఇంకా బాగుంది..

Anonymous said...

నిషి గారు కార్తీక కి బాగయ్యిపోతుంది కదూ :(:( !!
సూపర్ గా వుంది అండీ మీ ఊసులాడే జాబిలి

నిషిగంధ said...

నెనరులు వేణుగారు, ఆనంద ధార గారు, లచ్చిమి :-)

@ వేణు గారు, లచ్చిమి.. చూద్దాం, వచ్చేనెల ఏమన్నా అద్భుతం చేస్తుందో లేదో :-)

అభిమాని గారు, నాకూ సమాధానం తెలీదండి.. ఏమన్నా అర్ధం అవుతుందేమోనని బోల్డన్ని పుస్తకాలు చదువుతున్నా, ప్రేమలో పడ్డ వాళ్ళని చూస్తున్నా.. అయినా సరిగ్గా అర్ధం కావడంలేదు :(

ABHIMAANI said...

'NISHI...!!
eeroju karthika powrnami...
tela telavaarthondaga 'thanu' vachindi
anthe aramodpu kanulu modpulynai
nammavuuuuu gunde aagi malli
kottukuntunna anubhooti....

pattu parikini onillo 'aame'
edena premante....
'ABHIMAANI'

Niranjan Pulipati said...

నిషి , అన్ని భాగాలు తొందరగా ఫినిష్ చెస్తే అన్ని కలిపి ఒకసారిగా చుదువుకుంటా.. ఇలా నెల నెల వైట్ వైటింగంటే కష్టం. :)
అంతా పూర్తయ్యే వరకు చదవకూడదనుకొని గత రెండు భాగాలు చదవకుండా కొన్ని రోజులు ఆగాను కష్టం మీద, కానీ కథ లో తవాత ఎమైందో అన్న ఆతృత ఆపుకోలేక ఇప్పుడే రెండు భాగాలు చదివేశా.. అక్టోబర్ ది చదివాక తరువాతి భాగం చదవాలని వెంటనే కౌముది కి వెళ్ళీ నవంబర్ కూడా చదివేశా.. అనుకున్నదే అయ్యింది.. :(
నెక్స్ట్ పార్ట్ కోసం వైటింగ్..

Anonymous said...

me peru laage me blog chala bagundhi andi nishi garu

నిషిగంధ said...

Thank you :-)

నిషిగంధ said...

నిరంజన్,
"అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని"

బాగా చెప్పానా? :))

Niranjan Pulipati said...

very well said :)