Pages

Thursday, December 11, 2008

ఊసులాడే ఒక జాబిలట! - కార్తీక ఉత్తరాలుఅభిమానిగా పరిచయమై.. ఆత్మీయంగా పలుకరించి.. అందమైన స్నేహాన్ని అందించి.. అల్లరి చిందించి.. అంతలోనే అనూహ్యంగా మాయమైన కార్తీక అసలు సిసలైన హృదయాక్షరాలివి!!

అడగగానే మనందరితో తన నేస్తం చెప్పిన కొన్ని ఊసులను పంచుకోవడానికి అంగీకరించిన కిరణ్ ప్రభ గారికి, స్కాన్ చేసి పంపిన కాంతి గారికీ కృతజ్ఞతలు!

నాకెంతో ఇష్టమైన.. ఈ కధకి తగిన టైటిల్ని అందించిన పాట..


9 comments:

ravigaru said...

ఫోటో గిటో జన్త నై అంటూనే కిరణ్ ప్రభ గారు మూడు ఉత్తరాల ఫొటోస్టాట్ కాపీ లు ,ఉప్మా లో జీడి పప్పుల ఇచ్చినందుకు వారికి ధన్య వాదాలు తెలియ చేయ గలరు.కార్తిక లో ఉన్నా హాస్య చతురత నిషి గంధ గారు మీరు మిస్ అయ్యరనుకుంట?ఒక ఉత్తరం లో పెళ్లి కి వాయించే సంగిత మేళం ఎవరి గోల లో వాళ్ళు పెళ్లి హడావిడి లో ఉన్నా గాని తలలు ఉపుకుంటూ వాయించేస్తారని చదువు కుని బలే నవ్వు వచ్చింది. సెన్స్ అఫ్ హుమౌర్ కిరణ్ గారికి కార్తికకి కూడా వునట్టు దాని వల్ల అర్ధం అయ్యింది.అప్పట్లో పల్లకి లో కిరణ్ ప్రభ గారి కవితలు నేను చదివిన వి లీల గా గుర్తు కొస్తున్నాయి.ఇలా 25 ఏళ్ళ తర్వాత ఈ రూపం లో ఆయనకి ధన్యవాదాలు తెలిపే సందర్భం వస్తుందన్నది అప్పట్లో ఉహ కందని విషయం.కానీ కార్తిక చివరి కోరిక అయన తీర్చ లేక పోవడమే బాధాకరం. ఈ న్యూ ఇయర్ ఆరంభం లో ఓ చిన్న కోరిక మిమ్మల్ని మీట్ అవ్వాలని .అందుకే అది మరోచరిత్ర.

నిషిగంధ said...

Radhika's comment-

mi blog lo comment vellatledu enduko?anduke
ikkada

హమ్మయ్య నేనే ఫస్టు నేనే ఫస్టు. :)
నిషీ మీరేమీ ఎక్కువ తక్కువలుగా రాయలేదని తెలుస్తుంది ఇ ఉత్తరాలని చదువుతుంటే.ఉత్తరంలోని భావమే కాదు భాషా,కార్తీక మనసు రెండూ మీరు పట్టుకున్నారు.కిరణ్ ప్రభ గారికి కార్తీక ఎంత ఆప్తురాలో ఇప్పటికీ ఉన్న ఆ ఉత్తరాలే చెపుతున్నాయి.

P L Sekhar said...

నిషిగంధ గారికి,
మీ "ఊసులాడే ఒక జాబిలట" చదివిన తర్వాత మనసంతా స్తబ్దుగా అయిపోయింది. ఈ ఉత్తరాలు చదివిన తర్వాత మీరు కార్తీకని మా కళ్ళ ముందు నిలపటంలో సఫలీకృతులయ్యారు అని అనిపించింది. కార్తీక గారు రాసిన ఉత్తరాలు కావటంతో అక్షరం అక్షరం చాలా అపురూపంగా చదువుకున్నాను. ఉత్తరాలను మాతో పంచుకున్న కిరణ్ ప్రభ గారికి, నవల ద్వారా అద్భుతమైన స్నేహ భందాన్ని మాకు పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలతో సరిపెట్టడం తక్కువే అవుతుంది.

వేణూ శ్రీకాంత్ said...

నిషిగంధ గారు, తను రాసిన ఉత్తరాలు చదవగలగడం ఓ మధురమైన అనుభూతి, ఇంత చక్కని అనుభూతి ని నాకు అందించినందుకు మీకు, కిరణ్ గారికి కాంతి గారికీ మరో సారి ధన్యవాదాలు.

Anonymous said...

ఓ నిజ సంఘటన పై ఆధారపడిన కథ అని అనుకోలేదు. ఏదో మాంచి సెంటిమెంటు వున్న కథ అనుకున్నాను. మీరు ప్రవేశపెట్టిన సాక్షాధారాలు (పాత తాళపత్రాల్లాంటి పేపర్ మీద అందమైన రాతలు) పరిశీలించాక, ఇదో జరిగిన కథ అని తెలిసి పదే పదే మదిలో మెదలడం ద్వారా నవలలు చదివే అలవాటులేని నన్ను అక్కడక్కడ చదివింపచేసి, కాస్త ఆలోచింప చేసింది.

చాలా బాగా రాశారు, అభినందనలు. కీప్ ఇట్ అప్.

ముసుగు చదువరి

నిషిగంధ said...

ధన్యవాదాలు శేఖర్ గారు, వేణు గారు, anonymous గారు :-)

Purnima said...

Wow Nishi.. this is one kind of a feeling that I've been never through! Unable to say anything.

Thanks for sharing, that is all I can put here.

Purni

ఉష said...

ఇది మూడోసారి నేను ఇది చదవటం. ప్రతిసారీ ఇదే భావన, మళ్ళీ చదివి మరింత ఆకళింపుచేసుకుని నా మాట వ్రాద్దామని. అందుకే ఈ ముందు మాట కాదూ అంటే చిరు మనవి.

నిషిగంధ said...

ఉష గారు, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు..
ఇంత ఆలశ్యంగా రెస్పాండ్ అవుతున్నందుకు క్షమించండి..