Monday, September 29, 2008
ఊసులాడే ఒక జాబిలట! (August 2008)
".... తెల్లరువాఝాము ఐదుగంటలైంది.. తెల్లవారబోతుందనడానికి సూచనగా వెలుగురేఖొకటి తూర్పు నించి దూసుకొస్తోంది.. నిద్ర లేస్తున్న పక్షుల కిలకిలలు మంద్రంగా.. ఇంటిముందు మా సుబ్బులు చల్లుతున్న కళ్ళాపి చప్పుడు.. ఉండుండి వినబడుతున్న గుడిలో గంటలు.. ఇవన్నీ కలిసి వింటుంటే ఎవరో నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు పలికిస్తున్న రాగంలా వినిపిస్తోంది.. చెట్లన్నీ ఆకులు రాల్చేసి కొత్త చిగురు కోసం ఆయత్తమౌతున్నాయి.. శిశిరంలో ప్రకృతి వసంతం కోసం ఎదురుచూస్తున్న విరహణిలా అనిపిస్తోంది.. ఇది స్థబ్ధత కాదు, అద్భుతం కోసం ఎదురు చూస్తున్న నిశ్శబ్దత!...
....అతను కాఫీ తాగుతూ "అబ్బా, ప్రాణం లేచొచ్చిందండీ" అని ఆహ్లాదంగా నవ్వాడు.. ఉన్నట్టుండి చుట్టూ రాత్రి చల్లదనం ఇంకాస్త పెరిగినట్లనిపించింది.. "పాపం పట్టుచీర, నగలతో చాలా ఇబ్బంది పడినట్లున్నారు.. ఏ అలంకరణ లేకుండా ఇలానే చక్కగా ఉన్నారు" గుండె ఒక క్షణం ఆగి కొట్టుకోవడం మొదలుపెట్టింది.. నా అవస్థో, ఆనందమో అతను గమనిస్తున్నాడన్న ఆలోచన ఎందుకో చాలా సంతోషాన్నిచ్చింది.. ఎవ్వరికీ కనబడని వెన్నెల కిరణమొకటి నిశ్శబ్దంగా మనసులో చోటు చేసుకోవడం అర్ధమౌతూనే ఉంది! అప్పుడు నెమ్మదిగా నవ్వేసి అక్కడనించి వచ్చేసినా మా ఇద్దరి మధ్య జరిగిన ఆ కాస్త సంభాషణ తాలూకు భావతరంగాలు నెమ్మదించడానికి కాస్త సమయం పట్టింది....."
పూర్తిగా...
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
చివరి ఉత్తరం మనస్సును కదిలించేసింది. ఎటువంటి సందర్భానికైనా మాటల కోసం తడుముకోని నేను ఇప్పుడు నిజంగా మాటలకోసం వెతుక్కొంటున్నాను.
"అసలే ఆనదు చూపు, ఆ పై ఈ కన్నీరు, తీరా దయ చేయగ, నీ రూపు తోచదయ్యయ్యో".....ఈ వాక్యాలు చదివి "కార్తీక"లో పరకాయ ప్రవేశం చెయ్యని అమ్మాయి ఎవరైనా ఉంటుందా నిషి!
ఇలా ఇంస్టాల్ మెంట్లలో అందాల్ని ఆస్వాదించడం నా తరహాకి చాలా విరుద్ధమండీ బాబూ!
ఎప్పటికి పూర్తవుతుందో చెబితే అప్పటివరకూ ఈ కొసరివడ్డింపుల సేవకు దూరంగా ఉండి, ఏకంగా కుంభాన్ని లాగించడానికి వేచిచూస్తాను.నాలాంటవాళ్ళని హింసకు గురిచెయ్యటం భావ్యమంటారా?
బావుంది, కాదు కాదు చాలా బావుంది.
చివరి ఉత్తరంలో ప్రతాప్ మాటే నా మాట కూడా, ఇంకా చెప్పాలంటే వెన్నెల్లో ఆడపిల్ల నవలలోని చివరి ఉత్తరం రేంజులో ఉంది అది.
Thank you so much Pratap, Sujatha, Mahesh, kala :-)
మహేష్, మీలాంటి 'రొమాంటిక్ ప్రేమికులకి ' ఈ హింస భావ్యమే :))
కల, ఇప్పుడర్జంటుగా ఆ లెటర్ చదవాలి.. చాలా రోజులైపోయింది.. గుర్తుచేసినందుకు థాంక్స్ :-)
నిషిగంధ గారు, నేను వీటన్నింటినీ ప్రింటౌట్ తీసి ఓ పుస్తకంగా బైండ్ చేయించుకోనా? మీ అనుమతి ఉంటేనే.
అద్భుతం
బొల్లోజు బాబా
నిషిగంధ మీ ఉసులాడే జాబిలాట అక్టోబర్ భాగం చదివాకా మీరు వెన్నెల్లో ఆడపిల్ల టైపు లో ముగింపు ఇవ్వ బోతున్నరేమో అని పిస్తోంది . దాంట్లో shades ఇందులో కని పిస్తున్నాయి.కార్తిక కి కడుపులో నొప్పి ఎక్కువ గ వస్తోంది అని రాయడం ద్వార .వికాస్ చేత ఫోన్ లో మాట్లాడించారు గాని కార్తిక చేత మాత్రం మాట్లాడించ కుండ ఉత్తరాలలోనే నడిపిస్తున్నారు. ఆఖరి వుత్తరం యండమూరి కి దీటు గ రాద్దామన?ఏమన్నా ముగింపు అలా ఉండ కూడదనే కోరు కుంటున్నా లేక పొతే ఈ కధలో కొత్తదనం ఏమి వుండదు.మీరు మాత్రం సుందరానికి తొందర ఎక్కువ అనుకోకండే
రమ్య గారూ, అసలు అడగాలంటారా.. తప్పకుండా :-)
ధన్యవాదాలు బాబా గారూ..
రవిగారూ, మీరు ప్రతి భాగం పైన ఉండే 'యదార్ధ సంఘటనలకి నవలా రూపం' అన్న లైన్ చదివారా.. ఈ నవల మొదలుపెట్టినప్పుడే ముగింపు కూడా నిశ్చయమైపోయింది.. అందుకే మీరు ఇంకే ఆడపిల్లతో పోల్చకుండా కార్తీకని కార్తీకలానే చూడండి :-)
నిషిగంధ గారు మీ సమాధానం లో ఇంచుక కోపము dwaninchinady . నా ఉద్దేశం కార్తికా ని కార్తికా ల కలకాలం చుసుకుందమనే ఆమెని చంపోద్దని విన్న విన్చా.మీ ముగింపు త్వరగా తెలుసు కుందామని కుతూహలం.మీరు కొంచెం పెద్ద హృదయం చేసుకుని నా మెయిల్ కి మీ మిగతా బాగాలు పంపిస్తే అ హాలాహలాన్ని నా లోనే ఎవరికీ చెప్పకుండా దాచుకుంటా
నిషిగంధ గారు చాలా బాగుంది, కానీ హింట్ ఇచ్చి భయపెడుతున్నారండీ కార్తిక గురించి బెంగ ఒక వైపు, త్వరలో ముగించేస్తారనమాట అనే ఆలోచన మరో వైపు, కానీ నిజం నిష్టూరం గా ఉన్నా యధార్ధాన్ని భరించక తప్పదు. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ...
అయ్యో కోపమేమీ లేదు రవిగారు.. జస్ట్ ఉన్నది చెప్పాను.. అంతే!
మిగతా భాగాలా!! నేను రాస్తే కదా మీకివ్వడానికి :)) every month hot off the system!
వేణు గారు, బాగా చెప్పారు, యదార్ధం ఏదైనా భరించక తప్పదు! :-)
నిషిగంధ గారు, అక్టోబర్ ది కూడా చదివేసాను. తరువాత భాగం కోసం ఇంకా నెల్రోజులు ఆగలంటే దిగులుగా ఉంది. కాని తప్పదుగా.. హారీపోట్టర్ కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసినవాళ్ళం ఆమాత్రం ఆగలేమా!!
నిషిగంధ గారు మీకు మీ తోటి బ్లాగేర్స్ కు ఇదే న ఆహ్వానం.మీరు కోరిన విధం గ నా బ్లాగ్ ని నా ఆలోచనల తో నింపి రండి రండి దయ చేయండి తమరి రాక నా కెంతో ఆనందముసుమన్డి., అంటూ ఈ దసరా లో సరదా కోసం మీ కందరి కి ఇదే నా ఆహ్వానం. నచ్చి తే పదిమందికి చెప్పండి నచ్చక పొతే నా తో నే చెప్పండి. మీ రాక కోసం నెట్ అంత కనులై ఈ రవి వేచేనులే.ఈ విషయం లో ఇంతకంటే ఏమి చెప్పలేను
నిషి గంధ గారు మీ బ్లాగ్ కి కూడా ఏమన్నా దసరా సెలవులు ఇచ్చారా?ఉలుకు పలుకు లేదు.లేదా తూఫాన్ ముందరి ప్రసాంతత?మీ మౌనం మాకవమానం .వినిపించండి మీ రచన గానం.
నెనరులు దైవానిక గారు.. అయినా హ్యారీ పాటర్ తో జాబిలికి పోలికా..
రవిగారు, సెలవలు అయిపోయాయండి :-)
నిషి, అంద్రజ్యోతిలో మీ శ్రీవారికి ప్రేమలేఖ ప్రచురించబడినందుకు అభినందనలు. మెల్ల మెల్లగా మన బ్లాగర్లు పత్రికలకి ఎక్కేస్తున్నారన్నమాట, శుభం. ఇకనుండి ఈ రచయిత్రి నాకు తెలుసు, ఆ రచయిత్రి నాకు తెలుసు అని చెప్పుకునే రోజొచ్చిందన్నమాట.
Thank you so much Varudhini gaaru! :-)
Title is wonderful.....
Post a Comment