Pages

Monday, June 30, 2008

ఊసులాడే ఒక జాబిలట! (May 2008)



..... అసలు ఇది ఏం చూసి ప్రేమించింది!?!? " అతను మన వాళ్ళే తెలుసా.. సిగరెట్, తాగుడు లాంటి చెడు లక్షణాలేమీ లేవు.. ఆఖరికి వక్కపొడి కూడా వేసుకోడు" ఇందాక మాధురి అన్న మాటలు గుర్తొచ్చాయి.. ఒకే కులం అవ్వడమే అసలైన అర్హతా!? చెడు అలవాట్లు లేనంత మాత్రాన మనిషి మంచివాడైపోతాడా!? ఆలోచిస్తున్నకొద్దీ ఆవేశం అమాంతంగా పెరిగిపోయి దాన్ని అమాంతంగా నిద్ర లేపి ఆ చెంపా ఈ చెంపా వాయించి "ఇలాంటి పిచ్చివేషాలు వెయొద్దని" చెప్పాలన్న కోరికని పళ్ళ బిగువున ఆపుకున్నాను.....

పూర్తిగా..

25 comments:

ramya said...

లేఖలతో నడిచే కథ అద్భుతంగా రాస్తున్నారు(నాదో సందేహం దీని రచనా కాలం? ఇప్పుడు మీరు రాస్తున్నారా? లేక ముందే రాసి పెట్టుకున్న నవల ఇప్పుడు ధారావాHika గా వస్తోందా?)
ఇలాంటివి తెర పై కంటే పేపర్ పై చదవటం నాకిష్టం అన్నీ ప్రింట్ తీసుకుని మూడ్ బావున్నప్పుడు హాయిగా చదుకుంటా.

సుజాత వేల్పూరి said...

రాజారావు ప్రేమ లేఖ చూసి జాలేసింది నిషిగంధా! ఇలాంటి లేఖలకే కదూ ముగ్ధల్లాంటి ఆడపిల్లలు పడిపోయేది! రమ్య గారు చెప్పినట్టు యాంత్రికంగా సిస్టం ముందు కూచుని కాదు, హాయిగా చెట్టుకిందో(వీధిలో చెట్టు కాదు, ఇంట్లోదే),బాల్కనీ లోనో కూచుని చదూకోవాల్సిన కథే ఇది!ప్రింటు తీస్కోవాల్సిందే!

నిషిగంధ said...

నెనరులు రమ్య గారు.. ఉత్తరాల్లో రాసినట్టు కధాకాలం 80s లోదే.. కానీ రాస్తుంది మాత్రం ఇప్పుడే :-)

సుజాతా, నిజంగానే ప్రేమలేఖలు చాలా డేంజరస్ వెపన్స్! అందులో మనసంతా నువ్వే, నిను చూడక నేనుండలేను లాంటి నాలుగైదు సినిమా పేర్లు రాసి ఇస్తే 'నిజమే కాబోలు ' అనుకునే అమ్మాయిలు ఉన్నారు.. ప్రేమలేఖ అంటే నాకో చిన్న ప్రహసనం గుర్తొస్తుంది..
నేను ఢిల్లీ లో వర్క్ చేసేరోజుల్లో నా కొలీగ్ ఒకమ్మాయిని వేరే డివిజన్ అతను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు.. వన్ ఫైన్ మార్నింగ్ ఓ ప్రేమలేఖ కూడా ఇచ్చాడు.. ఆ అమ్మాయి ఎక్కడా తగ్గకుండా అలా తీసుకుని ఇలా అతని కళ్ళముందే చింపేసి గిరుక్కున తిరిగి మాతో "let's go yaar" అంది.. మళ్ళీ మరుసటి రోజు ఇంకో ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చాడు.. ఈమె గారు కూడా అంతే యధాలాపంగా తీసుకుని చింపబోతూ ఠక్కున ఆగిపోయింది.. ఏంటంటే అది నిన్న చింపిన ఉత్తరమే!! అతికించి మళ్ళీ తెచ్చాడు!!! అంతేకాదు, దీనంగా ఫేస్ పెట్టి "ముక్కలైన నా హృదయం ఏమంటుందో ఒక్కసారి చదువు.. ఆ తర్వాత ఇంకెన్ని ముక్కలు చేసినా పర్వాలేదు" అన్నాడు.. మళ్ళీ మావైపు గిరుక్కున తిరిగి "I will join you later yaar" అని మమ్మల్ని పొమ్మని మర్యాదగా చెప్పింది.. అంతే! ఆ ముక్కల్లో ఏం రాసుందో, ఈమెకేమి అర్ధమైందో తెలీదు కానీ అతని ప్రేమలో ఢామ్మని పడిపోయింది.. నాకు ఇప్పటికీ అర్ధం కాదు, అతనన్న మాటల్లో అంత డెప్త్ ఏముందా మమ్మల్ని వెళ్ళిపొమ్మని మరీ ఉత్తరం చదివింది అని!!

Kathi Mahesh Kumar said...

@నిషిగంధ, మీరు చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది. "మైండ్ గేమ్ - ఇక ప్రేమ కథ" అని నేనొక కాన్సెప్ట్ 2004 లో రాసుకున్నా. కాలేజిలో నా మిత్రులకి ప్రేమలేఖలూ, గ్రీటింగ్ కార్డులూ రాసిచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక రఫ్ డ్రాఫ్ట్ రాసుకున్నా. మీరు చెప్పిన ఉదాహరణతో అది గుర్తొచ్చింది.

ఏక్కడున్నా దాన్ని దుమ్ముదులిపి, కనీసం ఓ కథగా రాసేస్తాను.

Unknown said...

చాలా బాగుంది. ఏమిటో ఇలాంటి లేఖలు లేకుండానే కాలం గడిచిపోతుంది.. ప్చ్ :-)

"రాత్రి స్వామివారు, దేవేరి జలకాలాడుతూ...."
ఓహ్.. అద్భుతం.

వేణూశ్రీకాంత్ said...

నిషిగంధ గారు మీ ఊసులాడే జాబిలి ఇప్పటి వరకు ఉన్న భాగాలు అన్నీ చదవడానికి నాకు ఇన్ని రోజులు పట్టిందండీ. స్నేహాన్ని చాలా అద్భుతం గా చూపిస్తున్నారు. పూర్తి గా లేఖలతో కధని నడిపిస్తున్న తీరు చాలా బావుంది. రమ్య గారు సుజాత గారు చెప్పినట్లు ప్రింట్ తీసుకుని ఆహ్లాదకరమైన వాతావరణం లో చదువుకుంటే ఇంకా బాగుంటుందేమో.

నిషిగంధ said...

మహేష్ గారు, ప్రవీణ్ గారు, వేణు గారు నెనరులు :-)

మహేష్ - మీ మైండ్ గేం డ్రాఫ్ట్ దొరకగానే ఏమాత్రం జాగు చేయక కధ రాసేయండి.. ఎదురుచూస్తుంటాము..

ప్రవీణ్ - ఇప్పుడు గుళ్ళలో కోనేరుల పరిస్థితి చూస్తే మాత్రం బాధేస్తుంది.. పగిలిపోయిన మెట్లు, పిచ్చిమొక్కలు, నాచు.. :((

వేణు - నాకూ ఏ కధైనా అలా పేపర్ మీద చదువుతేనే సంతృప్తి.. స్క్రీన్ మీద కంటే పేపర్ మీదే అక్షరాలు మరింత అర్ధవంతంగా అనిపిస్తాయి :)

తెలుగు'వాడి'ని said...

నిషిగంధ గారు : ఈ దిగువన ఇచ్చిన లంకెలోని టెంప్లేట్ బాగుంటుందేమో చూడండి.

Notepad Template 4 Blogger

ఒకవేళ మీకు నచ్చితే దిగువన ఉన్న లంకె నుండి డౌన్-లోడ్ చేసుకోండి.

Download Blogger version

వేణూశ్రీకాంత్ said...

wow new template చాలా బావుంది నిషిగంధ గారు

ప్రతాప్ said...

ఏదో అవ్యక్తానుభూతి మనస్సును సమీరంలా తాకి, తన సువాసనలన్నింటిని అక్కడే వదిలి వెళ్ళిపోయినట్లుగా ఉంది మీ టపా చదువుతుంటే. మీ భావుకత అంతా కనిపిస్తూనే ఉంది దీంట్లో. దాచుకొని చదువుకోవాల్సిన పుస్తకం.

ప్రతాప్ said...

మర్చిపోయాను చెప్పడం టెంప్లేట్ చాలా బావుంది. మీ శైలికి తగ్గట్లే బావుంది.

Kottapali said...

టెంప్లేట్ బావుంది

ఏకాంతపు దిలీప్ said...

టెంప్లేట్ బాగుందహో..!

ఆ అమ్మాయి "ఏ వాక్ టు రెమెంబర్" లో హీరోయినా?

నిషిగంధ said...

వేణూ గారూ, ప్రతాప్ గారూ, కొత్తపాళీ గారూ నెనరులు..కానీ ఆ టెంప్లేట్ మర్చేయాల్సి వచ్చింది :(( అందులో ఫీచర్స్ సున్నా.. వాడిచ్చేదే తీసుకోవాలి.. మనం ఏ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోలేము..

థాంక్స్ దీపూ.. లేదు, అది నేనే! పచ్చదనం తాకగానే అలా అయిపోతాను :))

ఈ మార్పు కి కారణమైన తెలుగు 'వాడి ' ని గారికి, జ్యోతి గారికి బోల్డన్ని కృతజ్ఞతలు..

btw, work in progress.. ఇంకా కలర్స్ మార్చాలి..

Kathi Mahesh Kumar said...

WOW...టెంప్లెట్ అదిరింది.

Purnima said...

Too good a template!! I loved it!! :-)

వేణూశ్రీకాంత్ said...

ఈ టెంప్లేట్ కూడా చాలా బావుంది నిషిగంధ గారు.

నిషిగంధ said...

Thank you Mahesh gaaru, Purnima, and Venu garu :-)

జ్యోతి said...

టెంప్లేట్ చాలా బావుంది నిషి. అందంగా , ఆహ్లాదంగా చూడముచ్చటగా ఉంది. ఇలాగె కంటిన్యూ ఐపో...

సుజాత వేల్పూరి said...

nishi,
templete is really nice.pleasant!

ప్రతాప్ said...

ఆ టెంప్లేట్ లింక్ ఒకసారి నాకిలా పంపించండి. దాని అంతు చూద్దాం. నా టెంప్లేట్ కి page elements లేవు, కానీ నేను నాకిష్టమొచ్చిన చోట్ల add చేసుకొనేట్టు code మార్చాను.

ప్రతాప్ said...

నిషి గారు..
నేను ఇరగదీసి కుమ్మేసానోచ్.
ఇదిగోండి మీ బ్లాగ్ కోసం నేను modify చేసిన template ని "ఇక్కడ" నుంచి దిగుమతి చేసుకోండి.
మీకు ఎలానూ తెలుసు కదా?ఈ template ని ఏదన్నా ఒక కొత్త బ్లాగ్ create చేసి దాని మీద ముందు ప్రయోగించి ఆనక మీకు నచ్చితేనే ఉపయోగించండి. మీకేమన్నా సహాయం కావాలంటే సందేహించకండి.

నిషిగంధ said...

Thank you SO much ప్రతాప్ గారూ!! It was really fast!! ఇవాళ ఈవినింగ్ ఇంటికెళ్ళగానే ట్రై చేస్తాను..

కల said...

నిషిగారు,
ప్రతాప్ modify చేసిన template నాకు బాగా నచ్చింది. మీకు అభ్యతకరం లేకపొతే దీన్ని నేను ఉపయోగించుకోవచ్చా?

నిషిగంధ said...

Sure.. sure.. Kala garu.. I literally have no time to try anything now.. So, it will be nice if you use it..

Sorry Pratap garu, I didn't get a chance to look at your version :(