ప్రియమైన శత్రువు
సెలయేరు చేతులు జాచిందో
లేక
చందమామే ముందుకు వంగాడో!
వేలికొసల చిరుస్పర్శలు..
ఎటుమళ్ళాలో తెలీక
పిల్లగాలి తత్తరపాటు..
కిటికీ అవతల
కొబ్బరాకుల దొంగచూపులు..
మందహాసంతో జారిపోతున్న క్షణాలు..
వెన్నెలెప్పుడు నిద్రపోయిందో
తెలీని అచేతనస్థితి!!
మంచం పక్కనే
వదిలేశాననుకున్న నిమిషాలన్నీ
మనసు పొరల్లోకి
ఎలా చేరాయసలు!?
నువ్వు వాకిలి దాటగానే
ఖాళీ చేయాలనుకుంటే
చుట్టూ నీ ఆలోచనల పహారా!
గేటు దగ్గర నిశ్చింతగా
నాట్యమాడుతున్న మాలతీతీవె
నీ నిష్క్రమణ నిజం కాదని
అభయమిస్తూ!!
(తొలిప్రచురణ)
7 comments:
cool
ఎట్లుందీ...! అదిరిందీ....................
అబ్బబ్బబ్బబ్బా......అసలు మాటలు రావట్లే...
చాలా బాగుంది....
వెన్నెలెప్పుడు నిద్రపోయిందో తెలియని అచేతన్ స్థితి...
మంచం పక్కనే వదిలేసాననుకున్న నిమిషాలు మనసు పొరల్లోకి చేరటం ...
అసలు ప్రతీ లైన్లో ఎన్నెన్ని భావాలు...నేను చదివిన అధ్బుతమైన కవితల్లో ఇదొకటి.
జాగ్స్... నిషిగంధ గారి ఏ కవిత చదివినా అబ్బా...ఇంత కన్నా అద్భుతమయిన కవిత ఇంకోటి వుండదేమో అనిపిస్తూ వుంటుంది...అనిపిస్తూనే వుంటుంది.
నిషిగంధ గారూ ఆటోగ్రాఫ్ ప్లీజ్జ్జ్జ్జ్జ్జ్జ్
ఆకాశాన్ని దోసిళ్ళ్ల్లలోకి తీసుకోవాలనీ,నీటిమీద ఎగిరే కుండపెంకులా కప్పగంతులేయాలనీ,ఎటునుంచో ఎగిరివచ్చి మీద వాలిన పట్టుకుచ్చు లాంటి పక్షి రెక్క పుట్టుకెక్క్డడో తెలుసుకొవాలనీ,అమ్మ చేతి అన్నమే రోజూ తినాలనీ,చివరిదాకా ఎలి మెంటరీ స్కూల్లోనే పలక మీద బలపం తో దిద్దుతూ ఉండిపోవాలనీ,ఇంకా ఎన్నెన్నో మధురోహల సమాహారం అందరికీ విందులు చేస్తున్న నిషిగంధానికి ఏమివ్వనూ,చదివిన ప్రతిసారీ చెమరుస్తున్న కళ్ళేమి చూడ నిస్తున్నాయి గనుక,కానుక వెదికేందుకు?
Thanks Kalhara gaaru..
జాగ్స్, రాధిక, రాజేంద్ర గారూ... మీ కామెంట్స్ చదువుతుంటే అసలు నా కవితల గురించేనా మీరు రాసింది అని అనిపిస్తుంది!! మీ అభిమానానికి ధన్యవాదాలు, మనస్పూర్తిగా!!
అందరి అభిప్రాయమే నాదీ
నిషిగంధ; కవితల కి వాఖ్య రాయాలంటే, నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మాటలకైతే కవిత లాంటి కామెంట్ రాయొచ్చు, కాని హృదయాన్ని కదిలించే కవితలకి మామూలు మాటల్లో వాఖ్య రాయాలంటే మనసొప్పదు. ఏదో రాయాలనిపించినా ఏమీ రాయకుండానే వెళుతుంటా.రాధిక గారి బ్లాగ్ కెళ్ళినప్పుడూ అంతే.
priyamaina satruvu :)
Post a Comment