Pages

Thursday, June 27, 2013

చిటారుకొమ్మన గాలిపటం...

 
అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి
తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో
మహావృక్షాల ఆకుల చివర్లలో
ఒంటరిగా...
 

రెండు అనంతాల మధ్య
అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!
 
సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి
 
మెత్తని మసకదనంలో
పావురంలా.. లేదంటే పంకజమైపోయీ
రెక్కలు విప్పార్చుకుని
రహస్యంగా తేలిపోవాలి!
 
వరుస వానల తడిలోంఛి
శరత్కాలపు మధ్యాహ్నంలోకి జారిపొవాలి..
 
చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!
 
చిన్నపాటి జీవం కోసం
చిటారుకొమ్మన గాలిపటమై
తపస్సొకటి ఆరంభించాలనిపిస్తుంది!
 
పొందినదీ.. పోగొట్టుకున్నదీ
ఇబ్బందిపెట్టే లెక్కలెన్నో
అస్థిమితంగా ఛాతిని దువ్వుతున్నప్పుడు 
 
నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!

-------

మొదటి ప్రచురణ సారంగలో...

4 comments:

Padmarpita said...

"రెండు అనంతాల మధ్య
అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి"
బ్యూటిఫుల్....

Padmarpita said...
This comment has been removed by the author.
Sravya V said...

:-) మళ్ళీ చదివాను నిషి . నేను ఇలా కవితలు కష్టపడి చదువుతున్నందుకైనా నాకు బాకీ ఉన్న పోస్ట్ రాయాలి :-)

నిషిగంధ said...

Thank you so much, Padmarpita gaaru. :)

Sravya :))))
నీ కష్టానికి ప్రతిఫలం ఏదో ఒకరోజు తీర్చేస్తాను..