Pages

Monday, July 16, 2012

తడి జ్ఞాపకం...


మారుతున్న మాసాల ఊసు వింటూ
కరుగుతున్న ఆఖరి మంచు జాడల
తడి.. చలి రాత్రిలో
జ్ఞాపకమొకటి చిటికినవేలు పట్టుకు ఆపింది..

రాత్రంటే నీ మాటలు మాయమవడమేగా!

దశాబ్దాల క్రితం వినబడ్డ నీ చివరి పలకరింపుతోనే
ప్రతి పగలునీ వెలిగించుకుంటాను..

మనసుకి పడ్డ నల్లరంధ్రం చుట్టూ
సంధిభావాల పూలపొదలు..
దోశెడు ఆశల నీళ్ళు
ఝాము ఝాముకీ చిలకరించక తప్పదు!
వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు
పరాకుగా వెళ్తున్న పడమటిగాలిని పట్టి ఆపగానే
ఒకప్పటి స్పర్శాక్షణాలన్నీ
చుట్టూ జలజలా రాలతాయి..

గూటిలోని గువ్వ పక్కకి వత్తిగిల్లిన చప్పుడు
నా కనురెప్పలపైన నీ పెదవుల ముద్ర
ఆనవాలుని వెదికి తెచ్చింది.. 
కన్నుల్లో చప్పున కదలాడిన
సెలయేటి కెరటాలు
కదలనంటోన్న కాలాన్ని
తడిపేస్తూ చెప్తున్నాయి....

నీ జాడ లేని ప్రపంచంలో
బ్రతకడం
సాధ్యమే కానీ సులభం మాత్రం కాదు!!


(మొదటి ప్రచురణ జులై-2012 కౌముదిలో )

English Translation by NS Murty gaaru...
 

21 comments:

లక్ష్మీదేవి said...

కన్నుల్లో చప్పున కదలాడిన సెలయేటి కెరటాలు
చాలా బాగుంది. అభినందనలు.
అప్పుడు మిత్రుల వ్యాఖ్య చూసి కౌముది కెళ్తే పేజ్ రానేలేదు.
మీరిక్కడ పెట్టినందుకు ధన్యవాదాలు.

జ్వలిస్తున్న హిమం said...

జ్ఞాపకాల్లో తడి బావుంది

జ్వలిస్తున్న హిమం said...
This comment has been removed by the author.
the tree said...

నీ జాడ లేని ప్రపంచంలో
బ్రతకడం
సాధ్యమే కానీ సులభం మాత్రం కాదు!!
true words, from the bottom of heart. keep writing.

సీత said...

మనసులోతు భావాలు
చాలా బాగున్నాయి...

సుజాత said...

ఎప్పటిలాగే సుతి మెత్తగా, చల్లగా, హాయిగా ఉంది నిషీ

Padmarpita said...

ప్రతిపదంలోను తడి జ్ఞాపకాల పరిమళం...
Nice feel.

Sravya Vattikuti said...

ఇప్పుడు ఏంటంటే ఒక పత్వా జారీ చేయాలి అనుకుంటున్నా . అది
ఇలా కవితలు గట్రా రాసేవాళ్ళు మాలాంటి వాళ్ళ సౌకర్యార్ధం ఒక మామూలు పోస్ట్ చేస్తే కానీ ఇలాంటి పోస్టు పబ్లిష్ చేయకూడదు అని . బావుంది కదూ (జస్ట్ కిడ్డింగ్)

ఇక కవిత ఎలా ఉందొ నేను చెప్పలేక పోయినా మీరు రాసారు కాబట్టి బానే ఉంటుంది !

రాజ్ కుమార్ said...

బాగుందండీ...
>>
కన్నుల్లో చప్పున కదలాడిన
సెలయేటి కెరటాలు>>
ఇది చాలా చాలా బాగుందీ..

రాధి said...

చాలా బాగా రాశావు నిషి :)

ChimataMusic said...

Awesome..

భావకుడన్ said...

My vote goes with Sravyagaru.
What say Nishi?
(Mimmalni maamoolu vaaru ani antam ledu sravyagaru tappugaa anukokandi :)

పూర్వ ఫల్గుణి(poorva phalguni) said...

కవిత చాలా బాగుందండీ నిషి

మధురవాణి said...

చాలా చాలా బావుంది నిషీ.. ఎక్కడో ఎద లోతుల్లో నిదురిస్తున్న తడి జ్ఞాపకాలని మేలుకొలిపేలా! :)

జలతారువెన్నెల said...

lovely poem.

జ్యోతిర్మయి said...

>>ఏ వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు
పరాకుగా వెళ్తున్న పడమటిగాలిని పట్టి ఆపగానే
ఒకప్పటి స్పర్శాక్షణాలన్నీ
చుట్టూ జలజలా రాలతాయి..>>

Ecxcellent Nishi garu..

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

మరో సున్నితమైన కవిత... ఆసం!

నీ కవితలు చదివిన ప్రతిసారీ అనుకుంటాను "నీవి కానీ అనుభవాల్నీ, ఊహకు అందని భావాల్నీ ఎలా ఇంత తద్రూపంగా రాస్తావో" అని. Hats of Dear!

నిషిగంధ said...

లక్ష్మీదేవి గారు, జ్వలిస్తున్న హిమం గారు, భాస్కర్ గారు, సీత గారు, సుజాత, పద్మార్పిత గారు, శ్రావ్య, రాజ్, రాధి, చిమట శ్రీని గారు, భావకుడన్, పూర్వ ఫల్గుణి గారు, మధుర, జలతారు వెన్నెల గారు, జ్యోతిర్మయి గారు, అవినేని భాస్కర్ --- అందరికీ.. పేరు పేరునా --- మీ స్పందనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.. ఆలస్యానికి క్షమాపణలు..

శ్రావ్యా, నీ ఫత్వాని శిరసా వహించి, నా తర్వాతి పోస్ట్ అతిమామూలు భైతిక విషయం మీద రాస్తానని మాటిస్తున్నా :))

Krishna said...

Chaalaa Baundi...Jyothirmaye gariki nachina panktule naku baagaa nachaayi...Krishna

Anu said...

నిషిగంధ గారికి,

సున్నితిమయిన భావాలని మనసుపొరల్లొ, లొతుల్లొ ఉన్న స్మ్రుతులని, మాటల్లొ వ్యక్తపరరచలేని అనుభూతులని మీరు ఎంతొ సునాయసంగ,సుతిమెత్తగా, సులువుగా,అలవోకగ అందిస్తారు. సుమారు మూడేళ్ళుగా మీ బ్లాగుని ఫాలొ అవుతున్నాను.
అలసిన మనసుకు సేదతీర్చె సాహితీ సమీరాలు మీ రచనలు.

మనసుని స్ప్రుశించే మరొ మంచి కవిత.

అను.

the tree said...

వినాయక చవితి శుభాకాంక్షలు!