Thursday, May 29, 2008
ఊసులాడే ఒక జాబిలట! (Apr 2008)
...... స్కూల్లో ఎంత ఎక్కువ సమయం గడిపినా ఇంటిదారి పట్టక తప్పదు కదా.. అప్పటివరకూ దగ్గరకు రావడానికి తటపటాయించిన దిగులు మేఘం నేను మా ఊరి బస్ ఎక్కగానే దర్జాగా నన్ను ఆవరించేస్తుంది.. 'నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమి నైనా' మేఘసందేశంలో పాట అప్రయత్నంగా గుర్తొస్తుంది.. ఇందాక మీ కవితలన్నీ మళ్ళీ మళ్ళీ చదివాక, ఇంకా ఏదో చదవాలనిపించి మీ ఉత్తరాలన్నీ చదివాను.. దక్షిణపు గాలి వెళ్తూ వెళ్తూ మంచి గంధాన్ని నా చుట్టూ చల్లిన అనుభూతి.. ఒకదాంట్లో 'పంతులమ్మ ' అని మీరు సంబోధించడం ఇప్పుడింకా నవ్వు తెప్పించింది.. అందులోనే మీరడిగారు నాకు పాటలంటే ఇష్టమేనా అని.. ఎందుకో నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు.. అంతలోనే ఒక అనుమానం, ఒకవేళ నేను మీరడిగిన వాటన్నిటికీ జవాబులు చెప్పట్లేదని మీకు వెంట వెంటనే రిప్లై రాయాలన్న ఆసక్తి పోయిందేమోనని.. పిచ్చి ఆలోచనని తెలుస్తూనే ఉంది.. మరి కారణం తెలీనప్పుడు మనసు ఇలానే ఆలోచిస్తుందిగా!..........
పూర్తిగా..
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
nishgandha garu
mee poems etc. complete ga chadava lekapotunna nandi, purthiga anna chota click chesthe complete ga kanipinchadam ledu.. mari 1/4 matrame vasthundi.
aruna
అరుణ గారూ, ఇంకోసారి లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడే రీలింక్ చేసి టపాని పోస్ట్ చేశాను.. Thank you.
నువ్వు చెప్పినట్టుగానే ఆరు సంచికలు ఒక్కసారి ఇదిగో ఇప్పుడే ఏకబిగిన చదివేశాను. నాకు నిఝంగా నచ్చిన విషయం ఏంటో చెప్పనా? అమ్మాయి, అబ్బాయి మధ్య అంత స్వచ్చమైన స్నేహం. ఏ విషయం గురించైనా నిర్భయంగా, నిర్మలంగా మాట్లాడుకోగల చక్కటి స్నేహబంధాన్ని చూపిస్తున్నావు. నాకు చాలా నచ్చింది. ఉత్తరాలు రాసుకోవటం, తర్వాత్తర్వాత ప్రేమించుకోవటం ఇలాంటి రొటీన్ అండ్ అన్‌రియలిస్టిక్ (నా దృష్టిలో అన్‌రియలిస్టికే) కథ కాకుండా అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహమనే శాశ్వత ఆకర్షణ కూడా ఉంటుంది అని చూపిస్తున్నావు. చాలా బావుంది.
Excellent nishi.. chala baga rastunnavu..
padma garu , 4 parts e kada vundi. 6 sanchikalu antunnru ??
ఏప్రిల్ వరకు నాలుగు నిరంజన్ గారూ, మే, జూన్ సంచికలు చూడండి. నిషి ఇక్కడ అప్డేట్ చెయ్యలేదు. కౌముదిలో చూడండి. మళ్ళీ ప్రతీనెల ఫస్ట్ కోసం ఎదురు చూసి, రాగానే కౌముది ఓపెన్ చేసేలా చేస్తోంది ఈ నిషి. :(
నెనరులు పద్మా, నిరంజన్..
పద్మా! ఏం చేయను చెప్పు, ఎప్పటికప్పుడు update చేయడానికి బిబి సిస్టర్స్ (బిజీ & బద్దకం) అడ్డు పడుతూ ఉంటారు..
hello. ee post compleat ga ravatam ledu.. check the link again plz...
సుజ్జీ గారు, లింక్ సరిచేశాను.. Thank you so much for finding it out!
Post a Comment