Pages

Thursday, April 17, 2008

ఊసులాడే ఒక జాబిలట (Mar 2008)


..... అదేం విచిత్రమో.. నాన్న పోయాక అమ్మ ధోరణిలో విపరీతమైన మార్పు వచ్చింది.. చాలా పరధ్యానంగా ఉండేది.. నాన్న విలువ ఆయన పోయాక తెలుస్తుందేమో అనుకున్నా.. కానీ విచిత్రంగా, తనకీ పెళ్ళి చేసి తన జీవితాన్ని నాశనం చేశారని అమ్మమ్మ తాతయ్యలతో ఒకరోజు అనడం విని నాకు బాధ కంటే చాలా ఆశ్చర్యం వేసింది! అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధమేమిటో నాకప్పుడు అర్ధం అయింది.. ఏమీ లేదు! యజమానికి పనిచేశేవాడికీ, అమ్మాయికి అబ్బాయికీ, గురువుకి శిష్యుడికీ ఇలా ఏదో ఒకటన్నా లేదు.. అస్సలంటే అస్సలు లేదు!! పెద్దవాళ్ళు ఇద్దర్నీ ఒకే కప్పు కింద ఉండమన్నారు.. ఉన్నారు.. అంతే! వాళ్ళిద్దరి మధ్యా ఎప్పుడూ దగ్గరతనం లేదు.. ఉండటానికి వాళ్ళే మాత్రంకూడా ప్రయత్నించలేదు! ........

పూర్తిగా...

6 comments:

ఆదిత్య said...

థాంక్స్ నిషిగంధ గారు. మీ బ్లాగ్ చాలా కేక! మీకు లింక్ చెయ్యొచ్చా?

నిషిగంధ said...

థాంక్సండీ @ చాలా కేక :)
నో ప్రాబ్లెం @ లింక్ చెయ్యొచ్చా?

sujatha said...

నిషిగంధ గారు,

బాగుంది! మనకు తెలియదు గాని పాతకాలం పెళ్ళిళ్ళలో చాలా వరకు ఇలా ఏమీ తేలకుండా ముగుస్తాయేమో కదూ! ఏదో పాత పుస్తకంలో కథ చదువుతున్నట్టు హాయిగా ఉంది. రెండో భాగం కోసం ఎదురు చూస్తాను. మీరు మంచి భావుకులు

నిషిగంధ said...

నెనర్లు సుజాత గారూ! మీవంటివారి నించి వ్యాఖ్య అందుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.. ఇది మూడో (మార్చి నెల) భాగమండి.. ఈ బ్లాగ్ లోనే 'ఊసులాడే ఒక జాబిలట ' లేబుల్ కింద మొదటి రెండూ ఉన్నాయి.. వీలున్నప్పుడు చదవండి.. నెలె నెలా కౌముది.నెట్ లో వస్తుంది.

sujatha said...

తప్పకుండానండి! ఇప్పుడే చదువుతాను.

దైవానిక said...

చాలా చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తుంటాను. ఆపకుండా చదివించ గలిగారు.
నాకు ఇంకా ఏమి వ్రాయాలో తెలియట్లా .. ఎంత బాగుందో చెప్పడానికి మాటలు చాలవేమో