Pages

Monday, December 17, 2007

కౌముది

చుక్కల నవ్వుల్ని తోడిచ్చి
జాబిలి దోసిలి నించి
జారవిడిచింది..
హిమసమీరాన్ని వెంటేసుకుని
విహారం మొదలుపెట్టాను..

మల్లెపందిరిని తడిమిన చేత్తోనే
ముళ్ళచెట్టునీ పలుకరిస్తే..

ఆమె ఆనందంగా నవ్వింది..
అతడామెను మురిపెంగా చూశాడు..

వాళ్ళిద్దరి మధ్యా
ఇక చోటు దొరక్క
ఏటి వైపుకి మళ్ళి
అలలపై రవ్వల్నిఆరబోస్తుంటే..

నిశీధి మలుపులో
చేతులు చాచి
ఆహ్వానిస్తున్న వేకువ!

సరిహద్దుల్ని దాటేస్తూ
ఆలింగనంలోకి చేరుకుంటుంటే
అప్పుడే నిద్ర లేచిన పావురమొకటి
వీడ్కోలు పలికింది..

(తొలి ప్రచురణ)

15 comments:

jags said...

malle pandirini tadimina chetitone mulla chettuni palakariste....ee alochana baagundi....

Anonymous said...

Chala bavundi.. Meeru drushyanni chala andamga avishkaristaru.. Eee kavitha chadivina varrevaraina gatham loki jaripoyi alanti rathri ni vediki pattukovalani prayatnichkunda undaleeru.

నిషిగంధ said...

ధన్యవాదాలు జాగ్స్ మరియు శరత్ చంద్ర గారూ..
వెన్నెల్లో మన అనుభవం రాయడం మామూలే.. ఒకనాటి రాత్రి అసలు వెన్నెలేమనుకుంటుందో రాయాలనిపించింది :-)

రాధిక said...

adbhutamamdi.

నిషిగంధ said...

Thanks so much Radhika gaaru :-)

శ్రీనివాసమౌళి said...

భలేగా ఉంది....మీ కవిత...
మల్లెపందిరిని తడిమిన చేత్తోనే
ముళ్ళచెట్టునీ పలుకరిస్తే.. ఈ భావం చాలా బావుంది....
నిషిగంధ....అంటే! ఏంటి...

నిషిగంధ said...

ధన్యవాదాలు శ్రీనివాసమౌళి గారూ :-)ఇప్పుడే మీ 'స్నేహలేఖ ' చూశాను.. చాలా బావుంది!!

నిషిగంధ (మరాఠీ మూలం) అంటే "the fragrance of the night" అనే పువ్వు.. దీన్నే హిందీ/బెంగాలీలలో 'రజనీగంధ ' అని అంటారు.. తెలుగులో అయితే 'నేలసంపెంగి ' అంటారని విన్నాను, కానీ ఎప్పుడూ చూడలేదు.. దాని బొటానికల్ పేరు Polianthes tuberosa.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

వావ్

Radhika said...

niSigandha gaaruu,
chaalaa baavundanDii mee blOg :-)

రాధిక said...

నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.

నిషిగంధ said...

Thanks Radhika! meeru 'mangaLa' kaduu!?!?

mee 'snEham' lO sthAnam istAnanTE vaddanTAnA! No problem at all Radhika gaaru :-)

Anonymous said...

నమస్తే, ఇదే మొదటిసారి మీ బ్లాగు చూట్టం. మీ కవితలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా నిన్నటి స్వప్నం. ఇలానే రాస్తూ ఉండండి

teresa said...

B-E-A-U-T-I-F-U-L expression!

Anonymous said...

Nishigandha garu,
Fantastic job. Could you write kindly write about భానోదయం in a beach. I am sure your pen capture it very beautifully.
One of the things I like to do is to drive to the beach and watch the sun come up in the morning while having a sip of coffee.
Thank you so much.
Raghu

నిషిగంధ said...

మంచి కవితా వస్తువుని సూచించినందుకు ధన్యవాదాలు రఘు గారు.. ప్రయత్నం చేస్తాను.. మీ morning coffee కోరిక చాలా బావుంది.. కానీ ఆ సమయంలో అస్సలు జనాలెవరూ ఉండకూడదు, మనము, ఆ సముద్రము తప్ప :-)