Pages

Thursday, November 1, 2007

క్రికెట్ వీరుడు


...ఇక ఆరోజంతా ఎవరెవరు ఎలా ఆడారో.. రోడ్డు మీదకి పరిగెత్తి మరీ కాచ్ లు ఎలా పట్టుకున్నారో.. లాంటి విషయాలన్నీ చెప్తూనే ఉన్నాడు.. "గ్రౌండ్స్ లో అంత స్తలం ఉంటే రోడ్డు మీదకి వెళ్ళడం ఎందుకు" అని అడిగాను.. "మేమే కాదక్కా ఇంకా అక్కడ చాలా మంది ఆడతారు" అన్నాడు..

ఇంక ఇంట్లో, స్కూల్లో వీడి క్రికెట్ గురించి వినడం చూడడం సరిపోయింది.. బబుల్ గం తో పాటు వచ్చే క్రికెట్ ప్లేయర్ షీట్స్ దాయడం.. బాట్ మీద క్రికెట్ బొమ్మలు అతికించడం.. ఏ పుస్తకం లో అయినా క్రికెట్ బొమ్మలు కనబడితే కట్ చేసి ఒక పుస్తకం లో అతికించడం.. ఇంతే కాక ఈ మధ్య స్కూల్లో లంచ్ టైం లో అన్నం గబగబా తినేసి ఆడటం మొదలుపెట్టారు.. అప్పుడు తెలిసింది శ్రీధర్, నానీ ఏ కాకుండా ఇంకా చాలా మంది కూడా సండే గ్రౌండ్ కెళ్ళి ఆడతారని!....

చిన్నారి సిరి - క్రికెట్ వీరుడు

1 comment:

Niranjan Pulipati said...

ఇది చదువుతుంటే నా చిన్నప్పుడు క్రికెట్ అడటానికి పడ్డ పాట్లన్నీ గుర్తొస్తున్నాయి. గుడ్ వన్ :)