Pages

Monday, June 18, 2012

ఆత్మీయ స్పర్శలు...


మొన్నటి వాన సాయంకాలపు
ఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..
రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి!

అనుభవాల అల్మరా
అప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లా
దాగిన స్పర్శల మొగలిరేకులు
గరుకుగా తగుల్తూనే గుభాళిస్తాయి..

కాలం క్రమబద్దంగా ఎండగట్టిన
గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండో
ఆత్మీయపు వేసవివాన
ఆసాంతం కురిసిపోతుంది..

ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..
గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే అరచేతిగీతలూ..
నిశ్శబ్దానికి రాగాలు నేర్పే చల్లని గాలీ..

స్నేహాలేవైనా సరే
అదృశ్యంగానో.. అంతర్లీనమయ్యో…

జీవితపు రహదారిలో
పరిహాసంగా పలకరించే
ముళ్ళూ రాళ్ళ మీద
మెత్తటి ముఖమల్ దుప్పటి కప్పుతూనే ఉంటాయి!


-- to ALL my wonderful friends and to 'bujjamma'!


(మొదటి ప్రచురణ ఆవకాయలో...)


17 comments:

Bujjamma said...

ఈ బుజ్జమ్మకి ఇంతందమైన కానుకా!!! ఆత్మీయ స్పర్శంటే ఇదే మరి! :-)
You made my day! Thank you so much, my dear!

సాయి said...

చాలా బాగుంది మీ కవిత..

Padmarpita said...

wow nice to see you...

భావకుడన్ said...

ఇది.....నీ మార్కు

హరే కృష్ణ said...

బావుంది
కాల క్రమేనా మీ కవితలు పేరాలు పెరగడం
ఈ బ్లాగురాసులు చేసుకున్న అదృష్టం
ఆవకాయ గారికి ధన్యవాదాలతో
మాగాయి,గోంగూర పచ్చడి ప్రేమికుడు :P

కొత్తావకాయ said...

"జీవితపు రహదారిలో
పరిహాసంగా పలకరించే
ముళ్ళూ రాళ్ళ మీద
మెత్తటి ముఖమల్ దుప్పటి కప్పుతూనే ఉంటాయి!"

వాహ్! నచ్చేసింది. :)

వేణూశ్రీకాంత్ said...

ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..
గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే అరచేతిగీతలూ..
నిశ్శబ్దానికి రాగాలు నేర్పే చల్లని గాలీ..

స్నేహానికి ఎన్ని చక్కని గురుతులో కదా.. భలే చెప్పారు.. ఆ చివరిలైన్లు చాలా అద్భుతంగా ఉన్నాయ్. ఆ ముఖమల్ దుప్పటే లేకుంటే ఆ రహదారిలో నడక ఎంత నరకమో ఊహించడానికి కూడా భయమేస్తుంది.

వేణూశ్రీకాంత్ said...

పైకామెంట్ లో
"స్నేహానికి ఎన్ని చక్కని గురుతులో కదా.."
లైన్ ని
"స్నేహానికి ఎంత చక్కని ఉపమానాలో కదా.." అని చదువుకోండి..

మధురవాణి said...

చాలా బావుంది నిషీ..
<< గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే అరచేతిగీతలూ..
ఈ వాక్యం అలా మనసులో నిలిచిపోయింది.. ఎంతందంగా పోల్చావో!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

Excellent

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

Beautiful! అన్ని పంక్తులూ నచ్చేశాయ్!

నిషిగంధ said...

బుజ్జమ్మ - you are welcome, Dear :-)

సాయి గారు - ధన్యవాదాలండీ :-)

పద్మార్పిత గారు - వెరీ నైస్ టు సీ యూ టూ... మీ అభిమానానికి కృతజ్ఞతలు :-)

భావకుడన్ - :-) థాంక్యూ..

హరేకృష్ణ - మీరీలెక్కన ఊరగాయల మీద కవితలు రాసేయొచ్చనిపిస్తోంది నాకు.. థాంక్యూ.. థాంక్యూ.. :-)

కొత్తావకాయ - సేమ్ పించ్.. నాకూ ఆ లైన్సే చాలా బా..... నచ్చేశాయ్ :)) థాంక్యూ..

వేణు - ధన్యవాదాలు, వేణూ.. ఎందుకో ఇంకా మంచివి, ఇంకాస్త అర్ధవంతమైనవి చెప్తే బావుండేదనిపిస్తుందిప్పుడు!

మధురవాణి - థాంక్యూ సో మచ్ :-)

లోకేష్ శ్రీకాంత్ గారు - ధన్యవాదాలండీ! :-)

అవినేని భాస్కర్ - అయితే మీకు లైనుకొక్క థాంక్యూ :-)

Anonymous said...

నిషిలూ, భలే బాగా రాసావోయ్ :-)
స్నేహం గురించీ యెన్త బాగా చెప్పావో!

-రాధీ.

Korivi Deyyam said...

Simply Superrrr... సఖీ :D

the tree said...

good friendship poem, for true friends, nice, keep writing.

Meraj Fathima said...

mettati sunnitha bhaavaalu ilaa untaayi ani parichayam chesaaru kavitha manoharamgaa undi.

నిషిగంధ said...

రాధీ, సఖీ -- ఇద్దరికీ చెరో రెండు బుట్టల థాంక్యూలు :-)

the tree - థాంక్సండీ :-)

meraj fathima - మీ చక్కని పొగడ్తకి ధన్యవాదాలు :-)