Pages

Tuesday, June 12, 2012

ఒకానొక సాయంకాలం....



చిరుజల్లులు నింపాదిగా
స్పర్శిస్తుంటే
మల్లెమొగ్గలు కోసుకోవడం...

నీ చేతుల్లో భద్రంగా
ఒదిగి
నా పాటలో తప్పిపోవడం...

అవ్యక్తానుభూతికి
ఏది సరైన
నిర్వచనమంటావ్!?

  

29 comments:

మధురవాణి said...

మల్లెతీగ చెంతన నించున్నప్పుడు మొదటిదంటాను.. 'నీ' చేతుల్లో ఒదిగినప్పుడు రెండోదేనంటాను.. ;-)

Welcome back! :-)

కొత్తావకాయ said...

మధురవాణి గారూ.. అవునవును. :)
నిషిగంధా.. పరిమళం వెదజల్లుతున్నావ్! Welcome back!

మురళి said...

పునస్వాగతం నిషీజీ.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..
కానీ, వస్తూనే ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలు వేస్తె ఎలా చెప్పండీ?? :)

దిలీప్ ఏకాంతపు said...

ఎదురు చూసి ఎదురు చూసి... అలసి పోయి... అనుకోకుండా ఒక సాయంకాలం... మీ కవిత చదవడం..

శ్రీలలిత said...

మల్లెల జల్లుల్లో తడుస్తూ, పాటల ఒడిలో ఒదిగిపోతే....!

tree said...

ee samvathsrapu moodati post,
chaalaa chakkaga undandi,
keep writing.

వేణూశ్రీకాంత్ said...

పునఃస్వాగతం నిషీ...
నాలుగే లైన్లలో ఎంత చక్కని అనుభూతిని ఇచ్చారో..
మీ కవితే అనుకుంటే కామెంట్స్ కూడా ధీటుగా ఉన్నాయ్... ముందు మధుర కామెంట్ కి డిటో అందాం అనుకున్నాను.. తర్వాత కొత్తావకాయ గారి కామెంట్ కి.. ఆ తర్వాత మురళిగారి కామెంట్ కి డిటో అనడం బెటర్ అనుకున్నా కానీ దిలీప్ కామెంట్ చదివాక ఇక తన కామెంట్ కే ఫైనల్ గా సెటిల్ అవుతున్నా.. నిజంగా తను చెప్పినట్లు ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయి అనుకోకుండా ఓ సాయంకాలం మీ కవిత చదవడం అవ్యక్తానుభూతికి చక్కని నిర్వచనం :)

హరే కృష్ణ said...

Awesome
Welcome Back :)

Kottapali said...

వస్తూనే మల్లెల గుబాళింపు. దానికి తోడు చిరుజల్లుల చిలకరింపు .. Shows Nishi is unique! We missed you. Welcome back

రాజ్ కుమార్ said...

మీ పోస్ట్ అంటాను ;)
సింపులుగా సూపరుగా ఉందండీ..

sunita said...

welcome back:)))

పద్మవల్లి said...

Welcome back Nishi!

ప్రసూన said...

wow beautiful

శ్రీనివాస్ పప్పు said...

మళ్ళీ మొదలయిందన్నమాట మా"నస" వీణా తంత్రులు,సుస్వాగతం

సవ్వడి said...

simple and sweet...

waiting for your posts.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఎవరుచెప్పగలరు?

Krishna said...

ennallakennallaku....epatilage baundi ane maata chinadaipotundi:)

Krishna

Anonymous said...

నాకైతే మొదటిదే... :)

నిషిగంధ said...

మిత్రులందరి ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు! :-)

ఇంత చక్కగా స్వాగతిస్తారనుకుంటే రెండు నెల్లకోసారి జంప్ అవ్వాలనిపిస్తుంది మరి :))))

నిషిగంధ said...

మధుర - అయితే రెండూ రెండేనంటావ్ :-) థాంక్యూ...
కొత్తావకాయ - ఈ పరిమళంలో కాస్త నీకూ భాగముంది, తెలుసుగా ;-) థాంక్యూ..
మురళి - ధన్యవాదాలండీ.. క్లిష్టప్రశ్నలకోసమే ఎదురుచూసే మీలాంటివారు ఉంటారని తెలుసండీ.. :))
దీపు - నీ కామెంట్ చదివాక, కాసేపు ముందుకెళ్లలేకపోయాను.. ఇంత చక్కని అభిమానానానికి ధన్యవాదాలు సరిపోవు మరి! :-)
శ్రీలలిత గారు - మీరు చెప్పిన కాంబినేషన్ ఇంకా బావుందండీ! ధన్యవాదాలు :-)
tree - మీ ప్రశంసకి మనఃపుర్వక ధన్యవాదాలు :-)

నిషిగంధ said...

వేణు - అవును కదా, వేణూ! ఇంత చక్కని కామెంట్స్ రాయడానికి ఎంత అందమైన మనసుండాలంటారు! థాంక్యూ సో మచ్! :-)
హరేకృష్ణ - థాంక్యూ.. థాంక్యూ.. మీకూ నచ్చేసిందన్నమాట :))
నారాయణస్వామి గారు - మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు :-)
రాజ్ - అంతేనా? ష్యూరా? నా పోస్టేనంటారా? :)))) థాంక్యూ సో మచ్!
సునీత - మీకు మొదట హగ్స్.. ఆ తర్వాతే థాంక్యూలు :-)
పద్మవల్లి - థాంక్యూ సో మచ్.. :-)

నిషిగంధ said...

ప్రసూన - నువ్వు కితాబు ఇచ్చేశావ్.. ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు.. థాంక్యూ :-)
పప్పు సార్ - అవునండీ.. కేవలం మీకు మాత్రమే వినబడుతాయి ఆ మా'నస ' వీణా గానాలు :))) థాంక్సండీ!
సవ్వడి గారు - వావ్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి.. అంతా కుశలమే కదా! ధన్యవాదాలండీ :-)
లక్ష్మీదేవి గారు - నిజమేనండీ.. నేనైతే చెప్పలేను.. పైన మధురకి చెప్పినట్లు రెండూ రెండే కదా! ధన్యవాదాలండీ. :-)
కృష్ణ గారు - అవునండీ, చాన్నాళ్ళే తీసుకున్నాను ఈసారి.. బావున్నారు కదా? ధన్యవాదాలు :-)
puranapandaphani గారు - అంతేనంటారా? :-) నిన్న మా ఫ్రెండొకరు గ్యారంటీగా రెండోదే అని చెప్పారు.. నేనైతే ఇదీ అని ఇంకా చెప్పలేకపోతున్నా :))) ధన్యవాదాలండీ.

మంచు said...

చిరుజల్లుల్లో తడిచిన మల్లెపూలతో సహా ఇష్టంగా చేతుల్లోకి వచ్చి భద్రంగా ఒదిగిపోతుంటే .. అవ్యక్తానుభూతి ఎవరిదంటారు?

ఏంటో ఫీలింగ్స్ ఒకవైపు నుండే చూస్తే ఎలా :-)

భావకుడన్ said...
This comment has been removed by the author.
భావకుడన్ said...

ఏమో నిషీ..ఇంతమందికి నీ మార్కే అనిపిస్తే నాకే నీ శైలి మారింది అనిపించడానికి కారణం ఏమిటో?

నీ జావళి వింటే నాకు గుర్తొచ్చే సినీ డైలాగ్ "వీడేంట్రా కొట్టటం కూడా ఇంత శ్రద్దగా, మొక్కకు అంటు కట్టీనట్టుగా ఎంతో నింపాదిగా ఖొట్టాడు......" అంటున్న తనికెళ్ళ భరనేఅ గుర్తొస్తాడు.. ప్రతీ కవితలోనూ స్ఫష్టమయ్యే జాగ్రత్త శ్రధ్ధ ఇందులో కనపడలేదు.......బాలేదు కాదు...సింపుల్గా ఉంది..కొండపల్లి బొమ్మలా.

క్షణంలో మెరిసి మాయమయ్యే భావాలను నువ్వు జావళిలో కూర్చినట్టు ఎప్పుడూ అనిపించలేదు కాని ఇవాళ అనిపిస్తోంది. క్షణకాలపు భావాల పునాది కనపడకుండా నువ్వు అమర్చే బొమ్మరిల్లు ప్రస్ఫుటంగా ఉండేది అన్నిట్లో.

తటిల్లతలను "అప్పటికప్పుడు" బంధించే ఆనందం అలవాటవుతోందా లేక "రాయాలి" అనిపించి రాసినదా?

ఇలా అన్నానని "ఇలా" రాయకూడదు, "ఇది" నా శైలి కాదు అని అమరిపోకేం?

ChimataMusic said...

Welcome back Nishi..

In my ChimataMusic series of concerts, all singers appreciate your lyrics that you wrote for the web site almost five years ago.. Even the singers in the Paadutaa Teeyagaa program also print out lyrics.. I would like to express my cordial, gratitude-filled, thankful note (too many adjectives, uh?).. Also to Budugu as well. You both made ChimataMusic.com a special web site with your contribution in the lyrics department!!!

Coming to the point, I am very happy that you are back, but a bit disappointed that the kavita is too short. Pl. keep writing the kavitalu on a regular basis and kindly come back to ChimataMusic's Lyrics department!! vEla mandi site ku bAgundi ani kaburlu cheppi veLLEvALLE gaani, mee laagaa dedication tO kashTasAdhamaina panini bhujaskandAla meeda vEsukonE vAru bahu arudu!!

Thanks,
Srini
www.ChimataaMusic.com

నిషిగంధ said...

మంచు గారూ - భలే! రెండు సన్నివేశాల్ని కలిపేసి మొత్తం అనుభూతిని 'వారికి సొంతం చేశేశారుగా! :)) ధన్యవాదాలు..

భావకుడన్ - మీ విశ్లేషణకి బోల్డన్ని ధన్యవాదాలు.. 'తటిల్లతని బంధించడం' - యా, ఇది నాకు చాలా అరుదుగా సాధ్యమౌతుంది.. 'నందివర్ధనాలు ' ఇదే కోవకి వస్తుంది.. అయినా శైలి అలానే ఉంది కదా!?

చిమట శ్రీని గారు - థాంక్యూ... థాంక్యూ.. అవునండీ, కాస్త ఎక్కువగానే పొగిడేశారు.. అదీ, ఎప్పుడో చేసిన ఉడుతా సహాయానికి! :-) చాలా బిజీగా ఉంటూ కూడా నా రచనలపై మీ అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నందుకు, ధన్యవాదాలు :-)

రాధిక(నాని ) said...

మీ కవితల్లో బావాలు ఉహించుకుంటూ చదువుతే మీ లోకంలోకి వచ్చేసినట్టుంటుంది . ఎంతెంతో చెప్పాలని ఉంటుంది కానీ అందరిలా చెప్పలేను కానీ చాలా నచ్చుతాయి .ధన్యవాదాలు నిషిజీ...

నిషిగంధ said...

ధన్యవాదాలు, రాధిక గారు..
ఈ లోకం అప్పుడప్పుడూ తొంగి చూడ్డానికే బావుంటుందండీ.. నేనైనా అంతే... అలా చూసి పోతుంటాను! :))